దైవారాధనలతో జాతకంలో వున్న దోషాలు


పోగొట్టవచ్చా?

 

the most effective being the daily devotional prayer remove for jathaka doshas and myths and misconceptions in astrology.

 

దైవారాధన రెండు విధాలు  :
1. ఏదైనా కామ్యార్ధం చేసేసి ...
2. కేవలం భగవత్ ప్రాప్తి కోసం చేసేది
.

జాతకంలో వుండే దోషాదులు తొలగించుకునే ప్రయత్నంలో భాగంగా దైవారాధన  చేయడం అంటే అది కామ్యార్ధం చేసేదిది. కేవలం భగవత్ ప్రాప్తి కోసం చేసే పూజాపునస్కారాల ద్వారా ఆనందాన్ని మోక్షాన్ని పొందుతారు. అయితే వేదం కూడా "ఆనందోబ్రహ్మే తి వ్యాజానాత్" అనే తెలియ చేసింది. నిష్కామంగా చేసే పూజలలో భగవంతుడే ప్రధాన లక్ష్యం అవుతారు కాబట్టి యిది సాధ్యమే. అయితే కామ్యంతో చేసే పూజలద్వారా మనకు జాతకంలో వుండే దోషాలు పోతాయా అంటే అది మనం చేసే పూజా స్ధాయిని బట్టి వుంటుంది. మార్కండేయుడు శివారాధన ద్వారా జాతకంలో వున్న అతి తక్కువ ఆయుర్దాయాన్ని పెంచుకున్నాడు. అయితే మనం అంతస్ధాయిలో జపం, పూజ వంటివి చేయగలమా? కానీ చేసినస్ధాయికి తగిన ప్రతిఫలం పొందగలం.

 

the most effective being the daily devotional prayer remove for jathaka doshas and myths and misconceptions in astrology.

 

ఉదాహరణకి జాతక రీత్యా ఆరోగ్య సమస్యలు పెరిగే సూచన వున్నది ఆ సమయంలో మనం చేసే పూజా ఫలితం మంచి వైద్యం దొరికి త్వరగా ఉపశమనం పొందే మార్గం చూపడం, వైద్యం ఎంత ఖరీదయినా చేయించుకున్నే ఆర్ధిక సహకారం అందడం, వైద్య సమయంలో మనకు సహకరించే మనుషులు వుండడం, అనారోగ్యాన్ని నిర్భయంగా ఎదుర్కొనే మనోధైర్యం వంటివి మనం పొందగలుగుతాము. ఇవన్నీ దైవారాధన ద్వారా రావాలసినవే. రోగం రావడం మాత్రం ఆగకపోవచ్చు అయితే మార్కండేయుని స్ధాయితో పూజలు చేస్తే రోగము రాకుండా తప్పకోగలం అనేది మనకు పూరాణాల ఆధారంగా తెలుస్తుంది.


More Enduku-Emiti