శనిదేవుడిని ఇంట్లో పూజించరు ఎందుకు..  నమ్మకాలు,  కారణాలు ఇవే!

హిందూమతంలో దేవతలను భక్తితో పూజించడమే కాకుండా నియమాలు,  సంప్రదాయాల ప్రకారం పూజించడం చాలా ముఖ్యం. పద్దతులు, నిమయాల ప్రకారం దైవ ఆరాధన చేయడం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. నియమాలను విస్మరిస్తే ప్రతికూల ప్రభావాలు కలుగుతాయని నమ్ముతారు. అందుకే ప్రతి దేవత పూజకు నిర్దిష్ట నియమాలు నిర్దేశించారు. శనిదేవుని పూజకు కూడా అలాగే చాలా నియమాలు ఉన్నాయి.  శనిదేవుడు న్యాయానికి , కర్మ ఫలాలకు అధిపతిగా పరిగణించబడతాడు, కాబట్టి ఆయనను పూజించేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.  శనిదేవుడిని పూజించడంలో ఉన్న ముఖ్యమైన నియమాలలో శనిదేవుడిని ఇంటి లోపల పూజించకూడదు అనే నియమం ఒకటి. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..

శని దేవుడి పూజ నియమాలు..

పురాణ నమ్మకాల ప్రకారం  శనిదేవుడు ఎవరిని చూసినా వారికి తీవ్రమైన హాని కలుగుతుందని అతని భార్య శపించిందట.  అందుకే శని దేవుడి దృష్టి చాలా వక్ర దృష్టి అని చెబుతారు.

శనిదేవుడిని న్యాయానికి, కర్మఫలాలకు అధిపతిగా భావిస్తారు, ఆయన దృష్టి చాలా శక్తివంతమైనదని చెబుతారు.  పూజ సమయంలో భక్తులు దేవతా విగ్రహాలను చూస్తూ పూజిస్తారు, ఇలా చూస్తూ పూజించడం శనిదేవుని "వక్ర దృష్టి"  ఏర్పడటానికి కారణం అవుతుందని చెబుతారు.

శనిదేవుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం వల్ల ప్రతికూల శక్తి ప్రభావం పెరుగుతుందని నమ్ముతారు. దీనివల్ల ఇంట్లో సంతోషం, శాంతి, సానుకూల వాతావరణం దెబ్బతినవచ్చని చెబుతుంటారు.

కుటుంబ సభ్యుల జీవితాల్లో ఎదురయ్యే అడ్డంకులు లేదా ఆటంకాలకు సంబంధించి కూడా ఒక నమ్మకం ఉంది. ఈ కారణంగా, ఇంట్లో కాకుండా ఆలయంలో శనిదేవుడిని పూజించడం మరింత శుభప్రదంగా పరిగణించబడుతుంది.

                                     *రూపశ్రీ.


More Enduku-Emiti