గురుదోషం వల్ల పనులలో ఆటంకాలా.. గురువును ఇలా ప్రసన్నం చేసుకోండి..!

హిందూ మతంలో వారంలోని ఒక్కొక్క రోజును ఒక్కొక్క దేవుడికి ప్రత్యేకంగా పరిగణిస్తారు. అలాగే గురువారం రోజున గురువు స్వరూపాలైన దత్తాత్రేయుడు, రాఘవేంద్రస్వామి లాంటి గురు అవతారాలను పూజిస్తారు. మరీ ముఖ్యంగా దేవతల గురువు అయిన బృహస్పతిని పూజించడం జరుగుతుంది. అయితే గురువారం కేవలం గురువులనే కాకుండా విష్ణుమూర్తిని కూడా పూజిస్తారు. గురువారం లక్ష్మీవారంగా పిలవబడుతుంది. అందుకే ఈ రోజు విష్ణువును కూడా పూజిస్తారు. చాలామంది జాతకంలో గురు గ్రహం బలహీనంగా ఉంటుంది. గురువును ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలి? గురు గ్రహం బలపడి సమస్యలు తొలకాలంటే ఏం చేయాలి? అసలు గురు గ్రహం బలహీనంగా ఉంటే ఏయో సమస్యలు ఎదురవుతాయి? తెలుసుకుంటే..
గురుగ్రహం బలహీనపడితే..
గురు గ్రహం బలహీన పడటం వల్ల పనులలో ఆటంకాలు కలగడం, ఆర్థిక ఇబ్బందులు రావడం వంటివి జరుగుతుంటాయి. అంతేకాదు..కెరీర్ లో ఇబ్బందులు కలుగుతాయి. అలాగే పెళ్లికాని వ్యక్తులకు వివాహం కావడంలో అడ్డంకులు ఎదురవుతాయి. గురు దోష ప్రభావాలను ఎదుర్కునేవారు కొన్ని పరిహారాలు పాటించాలి.
గురువు ప్రాముఖ్యత..
దేవతలకు గురువు బృహస్పతి. జ్ఞానానికి మార్గదర్శిగా బృహస్పతిని పరిగణిస్తారు. ధనుస్సు మీన రాశులకు అధిపతి బృహస్పతి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి బృహస్పతి ఎల్లప్పుడూ శుభ ఫలితాలను ప్రసాదిస్తాడు. సరళంగా చెప్పాలంటే.. కర్కాటక రాశిలో బృహస్పతి ఉచ్ఛస్థితిలో ఉంటాడు. విష్ణువును పూజించడం బృహస్పతిని సంతోషపరుస్తుంది, పూజించే వారికి ఆశీర్వాదం కూడా అందిస్తాడు.
గురు దోష నివారణకు పరిహారాలు..
గురువారం నాడు స్నానం చేసి ధ్యానం చేసిన తర్వాత, విష్ణువుకు కుంకుమపువ్వు కలిపిన పాలతో అభిషేకం చేయాలి. ఇది బృహస్పతి అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని చేకూర్చుతుంది.
దేవతల గురువు అయిన బృహస్పతిని ప్రసన్నం చేసుకోవడానికి గురువారం నాడు విష్ణువును పూజించాలి. అలాగే గురువారం ఉపవాసం కూడా చేయాలి. ఈ ఉపవాసం పాటించడం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయి, బృహస్పతి ఆశీస్సులు వారికి లభిస్తాయి.
గురు దోషం నుండి ఉపశమనం పొందడానికి, ప్రతి గురువారం పసుపు వస్తువులను దానం చేయాలి. పసుపు, శనగ పప్పు, పసుపు గంధం, పసుపు పండ్లు, పువ్వులు వంటి వాటిని దానం చేయాలి.
గురువారం నాడు పాలలో కుంకుమపువ్వు కలిపి త్రాగాలి. పుష్యరాగం ను దరించినా కూడా చాలా మంచిది . ఈ రత్నాన్ని ధరించడం వల్ల బృహస్పతి గ్రహం బలపడుతుంది.
*రూపశ్రీ.


