శివుడికి అభిషేకం చేయడం వల్ల ఏం జరుగుతుంది...


శివుడిని భోళాశంకరుడు అని,  అభిషేక ప్రియుడు అని అంటారు. శివుడికి అభిషేకం చేయడం ఎంతో పుణ్యఫలం అని కూడా చెబుతారు.  అయితే శివుడికి అభిషేకం చేయడం వెనుక చాలా ఆధ్యాత్మికత,  మానసకి,  శారీరక ,  ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయట.  వీటి గురించి పురాణ పండితులు ఏం చెప్తున్నారో తెలుసుకుంటే..

శివుడికి అభిషేకం చేయడం వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలు..

మానసిక శాంతి & ఒత్తిడి  నుండి విముక్తి లభించాలంటే..  జలాభిషేకం  శివుడికి ప్రియమైనది. ఇది మన మైండ్ కూల్ అవ్వడానికి, ఆత్మ విశ్రాంతి పొందడానికి సహాయపడుతుంది. మనలోని కోపం, అహంకారం, అసహనం తగ్గించబడతాయి.

పాప పరిహారానికి మార్గం..

శాస్త్రాలలో “ఓం నమః శివాయ” మంత్రంతో అభిషేకం చేస్తే, గత జన్మలలో చేసిన దోషాలు కూడా తొలగుతాయనే నమ్మకం ఉంది.  కర్మ బంధనలు మెల్లగా విచ్ఛిన్నం అవుతాయి.

సకల ద్రవ్య సంపదలలో..

 పండు, పాలు, తేనె, పంచామృతంతో శివలింగానికి అభిషేకం చేస్తే  ఆర్థికంగా అభివృద్ధి, వృత్తిలో ఎదుగుదల వస్తుంది. ముఖ్యంగా బెల్లంతో అభిషేకం ఆర్థిక కష్టాలు పోవడానికి మంచిదని చెబుతారు.

ఆరోగ్య ప్రాప్తి & నెగటివ్ ఎనర్జీ తొలగింపు..

వేప నీరు, పాలు, తులసి నీరు, తేగ నీరు వంటి శుద్ధ ద్రవాలతో శివలింగానికి అభిషేకం చేస్తే శరీరంలోని రోగశక్తి, మానసిక కలతలు తొలగుతాయని నమ్మకం. ఇంట్లో ఆరోగ్యం సమృద్ధిగా ఉండాలంటే వారానికి ఒకసారి శివాభిషేకం మంచిది.

ఆధ్యాత్మిక ఎదుగుదల..

అభిషేక సమయంలో శివ మంత్రాల జపం చేస్తే మనశ్శుద్ధి, ధ్యాన సామర్థ్యం పెరుగుతుంది. "ఓం త్రయంబకాయ నమః", "ఓం మహేశ్వరాయ నమః" వంటి మంత్రాల వల్ల అంతరాత్మ శాంతించడమే కాదు, బహ్య ప్రపంచాన్ని సమంగా చూడగలగే స్థితి ఏర్పడుతుంది.

ఏ ద్రవాలతో అభిషేకం చేస్తే ఏ ప్రయోజనం..

నీరు.. శాంతి, శుద్ధి, ఒత్తిడి తొలగింపు.

పాలు.. ఆరోగ్యం, దీర్ఘాయుష్షు.

తేనె.. మాటలో తీపి, గౌరవం పొందటం.

పంచామృతం.. సంపూర్ణ శుభఫలాలు.

బెల్లం నీరు.. ఆర్థిక సమస్యలకు పరిష్కారం.

వేపాకులు/నీరు.. దోష నివారణ, శరీర రోగాల తొలగింపు.

ఇంద్రకంటీ నీరు.. నెగటివ్ ఎనర్జీ తొలగింపు.

బిల్వ పత్రం.. శివునికి అత్యంత ప్రియమైనది – కోరికలు తీరేలా చేస్తుంది.
 ఎప్పుడు చేయాలి?

సోమవారం – శివుడి ప్రత్యేక దినం.

మాస శివరాత్రి, మహాశివరాత్రి – శ్రేష్ఠమైన సమయం.

ప్రతిరోజూ ఉదయం (6:00 – 8:00) లేదా సాయంత్రం (5:30 – 7:30 ప్రదోషకాలం) మధ్య మంచి కాలం.

                                     *రూపశ్రీ.


More Shiva