• Prev
  • Next
  • సినీ తారలు కట్టిన చీరలు

    సినీ తారలు కట్టిన చీరలు

    చీరలు కొనడానికి బట్టల షాపుకి వెళ్ళింది కాంతం. ఆ షాపులోని సేల్స్ మెన్ రకరకాల

    రంగురంగుల్లో ఉన్న చీరలను చూపిస్తూ " మేడం..ఈ చీర బిజినెస్ మేన్ సినిమాలో కట్టిన

    కట్టిన చీర." అంటూ రెడ్ కలర్ చీర ఒకటి చూపించాడు.

    ఆ చీరను చూసి పక్కన పడేసింది కాంతం.

    వెంటనే ఆ సేల్స్ మెన్ మరొక చీరను చూపిస్తూ " మేడం..ఇదిగోండి ఈ చీరను చూడండి..

    ఈ చీర డమరుకం సినిమాలో అనుష్క కట్టిన చీర " అంటూ లైట్ బ్లూ కలర్ చీర

    చూపించాడు.

    ఆ చీరను చూసి పక్కన పడేసింది కాంతం.

    ఆలస్యం చేయకుండా వెంటనే ఆ సేల్స్ మేన్ మరొక చీరను చూపిస్తూ " మేడం ఈ చీర

    మీకు ఖచ్చితంగా నచ్చుతుంది...ఈ చీర కృష్ణం వందే జగద్గురుం సినిమాలో నయనతార

    కట్టిన చీర...మీకు చాలా బాగుంటుంది " అంటూ వైట్ కలర్ అండ్ లైట్ బ్రౌన్ కలర్ రెండు

    కలిసిపోయి ఉన్న చీరను చూపించాడు.

    ఆ చీరను చూసి పక్కన పడేసింది కాంతం.

    " ఆ చీర కూడా మీకు నచ్చలేదా మేడం..చెప్పండి మేడం మీకు ఏ సినిమాలో ఏ

    హీరోయిన్ కట్టిన చీర కావాలో చెప్పండి మేడం...మీరు చెప్పితే వాటిని తెప్పిస్తాం " అని

    వినయంగా అన్నాడు ఆ సేల్స్ మేన్.

    " ఛి..ఛి...వాళ్ళూ వీళ్ళూ కట్టి విడిచిన చీరలు తప్ప కొత్తవేమి లేవా మీ షాపులో " అని

    కోపంగా లేచి ఆ సేల్స్ మేన్ ను తిట్టుకుంటూ వెళ్ళిపోయింది.

    " ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు ఆ సేల్స్ మేన్.

  • Prev
  • Next