• Prev
  • Next
  • ముఖ్యమంత్రి పారిపోయాడు

    ముఖ్యమంత్రి పారిపోయాడు

    ఒకసారి ముఖ్యమంత్రి పిచ్చాసుపత్రి చూడ్డానికి వెళ్లాడు.

    పిచ్చి వాళ్ళంతా భయభయంగా పక్కకి తప్పుకోసాగారు.

    ఒకడు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన పిచ్చి చేష్టలు కొనసాగిస్తున్నాడు.

    ముఖ్యమంత్రి అతని దగ్గరికి వెళ్లి " ఏం నేనంటే నీకు లెక్కలేదా ? నేనెవరో తెలుసా ?

    ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని " అన్నాడు ముఖ్యమంత్రి.

    " ష్...! గట్టిగా అరవకండి ఆర్నెల్లు కిందట ఇక్కడకి వచ్చి నేను ఇలాగే అన్నాను.

    అంతే ! అప్పటి నుండి నన్ను ఇక్కడే ఉంచేశారు " అని నెమ్మదిగా చెప్పాడు

    ఆ పిచ్చాడు. అంతే !

    అక్కడి నుండి ముఖ్యమంత్రి పారిపోయాడు.

  • Prev
  • Next