• Prev
  • Next
  • చిలక చెప్పినట్టు జరిగింది

    Funny Parrot Telugu Joke

    చిలక చెప్పినట్టు జరిగింది

    చిలకజోస్యం చెప్పేవాడి మీద మండిపడిపోతున్నాడు జగన్నాధం.

    " ఏం జ్యోతిష్యమండీ మీ బొంద! త్వరలో నేనొక ఇంటివాడినౌతానన్నారు. సంవత్సరం

    తిరిగినా పెళ్ళి కాలేదు సరి కదా అప్పులెక్కువై ఉన్న రెండు ఇళ్ళలో ఒక ఇల్లు

    అమ్మేయవలసి వచ్చింది" అన్నాడు.

    "మరింకేమండీ! ఇప్పుడు మీరు ఒక్క ఇంటివారే కదా! నా జ్యోతిష్యాన్ని తిడతారేం?" అని

    అమాయకంగా అన్నాడు జ్యోతిష్కుడు.

    " ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు జగన్నాధం.

  • Prev
  • Next