• Prev
  • Next
  • Ullasanga Utsahanga Special Jokes

    Ullasanga Utsahanga Special Jokes

    " ఉల్లాసంగా ఉత్సాహంగా స్పెషల్ " పార్కులో రాధాకృష్ణులు

    " రాధ...అస్తమానం ఈ పార్కులో ఏం కూర్చుంటాం చెప్పు. అలా సరదాగా మంచి

    సినిమాకి వెళ్దాం " అని అన్నాడు కృష్ణ చిలిపిగా నవ్వుతూ.

    " అబ్బ....ఆశ... అవన్నీ పెళ్ళయ్యాకే " అని రాధ కాస్త సిగ్గుపడుతూ.

    " కానీ...పెళ్ళయ్యాక నాతో సినిమాకి పంపడానికి మీ ఆయన ఒప్పుకోడేమో రాధ " అని

    గబుక్కున నాలిక్కరుచుకున్నాడు కృష్ణ.

    " ఆ...." అని ఆశ్చర్యంగా నోరు తెరిచింది రాధ.

     

    కొద్దిసేపటి తరువాత....

    " అదిసరే కృష్ణ...నా మెడలో తాళి ఎప్పుడు కడతావు ? " సిగ్గుపడుతూ అడిగింది రాధ.

    " బంగారం ధర తగ్గిన తరువాత " అని చెప్పి పకపక నవ్వాడు కృష్ణ.

     

    మరికొద్దిసేపటి తరువాత....

    " పెళ్లి చేసుకున్నాక ఉద్యోగం చేయడం ఇబ్బందే...ఏమంటావు రాధ ? " అని గోముగా

    అన్నాడు కృష్ణ.

    " ఔను కృష్ణ...పెళ్ళవగానే నేనే ఉద్యోగం మనేయాలనుకుంటున్నాను " అని చెప్పింది

    రాధ. " నువ్వు మానేస్తే ఎలాగ ? నేనే మానేద్దామనుకుంటున్నాను " అని గబుక్కున

    నాలిక్కరుచుకున్నాడు కృష్ణ.

  • Prev
  • Next