• Prev
  • Next
  • హలో... రాంగ్ నెంబర్.! - 72

    Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and latest jokes online

     

    హలో... రాంగ్ నెంబర్.! - 72

     

    ముచ్చర్ల రజనీ శకుంతల

     

    "ఇదీ లూసీ...ఇవ్వాళ ఉదయం నుంచీ జరిగిన సంఘటనలు. నేను మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాను" చెప్పాడు శ్రీకర్.

    "మీరు అన్నీ మరిచిపోయి ప్రశాంతంగా నిద్రపోండి..రేప్పొద్దుటికి అన్నీ సర్దుకుంటాయి"

    "జ్ఞాపకాలు సర్డుకోవు..మనసును ఆక్రమించుకుంటాయి" అన్నాడు శ్రీకర్.

    "మీలా..అందంగా చెప్పలేను. ఒక్కటి మాత్రం నిజం" అంది లూసీ.

    "ఏమిటదీ..."

    "మీరు మంచి మంచి వాళ్ళు..మంచి చెడ్డ వాళ్ళు కాదు"

    "ఎలా చెప్పగలవు?"

    "మీరు ఫీలవ్వడాన్ని బట్టి"

    శ్రీకర్ కు ఆమె చెప్పింది కన్విన్సింగ్ గా అనిపించలేదు. ఈమధ్యకాలంలో తనెప్పుడూ ఇంతగా డిస్టర్బ్ అవ్వలేదు.

    "మీ కోసం ప్రియంవద మేడమ్ ఫోన్ చేసారు. మీరెక్కడికెళ్ళారని అడిగారు. ఎవరో క్లయింట్ ని కలవడానికి వెళ్ళారని చెప్పాను"

    "ప్రియంవద ఏమంది?"

    "మీరెవరిని అడిగారు. కొత్తగా అపాయింట్ అయిన పి.ఏ. ని అని చెప్పాను"

    "దానికి తను ఏమంది?"

    "ఏమీ అన్లేదు. మేడమ్ మాటల్లో సంస్కారం కనిపించింది. మరొకరైతే గుచ్చి గుచ్చి అడిగేవాళ్ళు. పైగా తన ఆఫీసులో పనిచేసే వ్యక్తే కదా...చులకనగా మాట్లాడేవాళ్ళు. తను అలా మాట్లాడలేదు. చాలా డీసెంట్ గా మాట్లాడారు"

    "అవును. ప్రియంవద చాలా మంచిది. తను నాలా కాదు" అన్నాడు శ్రీకర్.

    లూసీకి ఏం మాట్లాడాలో తోచలేదు.

    "లూసీ...నేను ఇందాకే ప్లాట్ ఓనర్ తో మాట్లాడాను. నువ్వు రేపే ప్లాట్ లోకి షిఫ్ట్ అవ్వొచ్చు"

    "థాంక్యూ సార్...మీకు శ్రమయిస్తున్నాను."

    "ఇందులో శ్రమ ఏమీ లేదు. టు బి ఫ్రాంక్ ఇది నా బాధ్యత. నా దగ్గర పని చేసే పి.ఏ. కు ఫెసిలిటీస్ కల్పించడం నా బాధ్యతలో భాగమే"

    "డిన్నర్ తీసుకుంటారా?" అడిగింది లూసీ.

    "వద్దు..ఇంటికి వెళ్తాను...గుడ్ నైట్ లూసీ"

    "గుడ్ నైట్ సార్ "

    శ్రీకర్ బయటకు వచ్చి కారులో కూచున్నాడు. అతని కారును జేమ్స్ బాండ్ ఫాలో అవుతూనే వున్నాడు.

    *             *              *

    జేమ్స్ బాండ్ ప్రియంవదకు ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్లు అన్నీ చెప్పాడు.

    "అంటే కేవలం ఓ అమ్మాయితో హోటల్ కు వెళ్ళడం..సరదాగా షికారు చేయడం తప్ప....విశేషం ఏమీ లేదా?"

    "ఏం లేదు మేడమ్. అయితే శ్రీకర్ గారు తన పి.ఏ. లూసీని కలుసుకున్నారు. వాళ్ళ సంభాషణ వినడం కుదర్లేదు కానీ...వాళ్ళిద్దరి మధ్యా ఏ ఎఫయిరూ లేదు"

    "ఇలా అయితే కష్టం...సాధ్యమైనంత త్వరలో మనం ఎవిడెన్స్ సంపాదించాలి"

    "చాలా కష్టంలా అనిపిస్తోంది మేడమ్."

    "ఎందుకని?" ప్రియంవద అడిగింది.

    "మనం అనుకున్నంతగా శ్రీకర్ గారు అమ్మాయిలతో స్పెండ్ చేయడంలేదు. అదే పనిగా అమ్మాయిల వెంట పడ్డట్టూ అనిపించడం లేదు"

    "అలాంటప్పుడు మనమే ఓ పనిచేయాలి."

    "చెప్పండి. ఏం చేయమంటారు?"

    "అమ్మాయిలే ఆయన వెంట పడేలా చేయాలి"

    "అంటే..."

    "ఆయనెలాగైనా ఓడిపోవాలి. అందుకని మనమే తెలిసిన అమ్మాయిల్ని అతనివైపు ఉసిగొల్పాలి. తర్వాత ఆధారపడి సంపాదించాలి."

    జేమ్స్ బాండ్ షాకయ్యాడు.

  • Prev
  • Next