• Prev
  • Next
  • హలో... రాంగ్ నెంబర్.! - 71

    Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and latest jokes online

     

    హలో... రాంగ్ నెంబర్.! - 71

     

    ముచ్చర్ల రజనీ శకుంతల

     

    కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిచింది నాయర్ కు. అయిదు నిమిషాల క్రితమే అతను ఆ రెస్టారెంట్ కు వచ్చాడు. ఏ.సి. రెస్టారెంట్ అది. చికెన్ బిర్యానీ తీసుకురమ్మని

    చెప్పాడు. వెయిటర్ ఓ బౌల్ లో బిర్యానీ, ప్లేటు తీసుకు వచ్చి. బిర్యానీ ప్లేటులో సర్ది వెళ్ళిపోయాడు. బిర్యానీ తినబోతుండగానే కళ్ళు తిరుగుతోన్న ఫీలింగ్ కలిగింది.

    టేబుల్ ని గట్టిగా పట్టుకొని, సీటు వెనక్కి వాల్చాడు. చిన్నగా ఛాతిలో నొప్పి ప్రారంభమైన ఫీలింగ్. ఏ.సి. లోనూ అతని మొహానికి చెమట పట్టింది. కోటు జేబులో వున్న

    సెల్ తీసి హాస్పిటల్ కు ఫోన్ చేయాలనుకున్నాడు. కానీ అతని చేతులు కూడా సహకరించడం లేదు. మొహానికి పట్టిన చెమట తుడుచుకోవడం కోసం కర్చీఫ్ కోసం

    వెతికాడు.

    సరిగ్గా అప్పుడే అతనికి కళ్ళకు మసగ్గా కనిపించింది. ఇన్స్పెక్టర్ చండీ. యూనిఫామ్ లో లేదు. చీరకట్టులో వుంది. చీర చెంగుతో నాయర్ మొహానికి పట్టిన చెమట

    తుడుస్తోంది.

    "చండీ...చం..."

    చండి నాయర్ ని జాగ్రత్తగా లేపింది. అతని నడుం చుట్టూ చేతులు వేసి జాగ్రత్తగా నడిపిస్తోంది.


    *         *            *

    కళ్ళు  తెరిచాడు నాయర్. ఎదురుగా ఇన్స్పెక్టర్ చండి. ఎప్పుడూ యూనిఫామ్ తో, చేతిలో స్టిక్ తో కనిపించే చండి...చీరలో, మొహాన బొట్టు, జడలో పువ్వులు...ఆ క్షణం

    అతనికి చండి చాలా అందంగా కనిపించింది. చుట్టూ చూసాడు. అంది తన ఇల్లు కాదు. తనప్పిడు చండి ఇంట్లో వున్నాడు.

    "కంగారు పడకండి. మిమ్మల్ని కిడ్నాప్ చేయలేదు. మా యింటికి తీసుకువచ్చాను. జ్యూస్ తెస్తానుండండి" అంటూ కిచెన్ లోకి వెళ్ళింది ఇన్స్పెక్టర్ చండి.

    నాయర్ గదిని పరిశీలనగా చూసాడు. గది గోడలకు తన ఫోటోలే...ఎన్ లార్జ్ చేయబడి, లామినేటింగ్ తో వున్నాయి. తమ కాలేజీ రోజుల్లో తీయించుకున్న ఫోటో కూడా

    వుంది. తన దగ్గర వున్న రేర్ ఫోటోలు ఇక్కడికి ఎలా వచ్చాయి?

    టేబుల్ మీద ఆల్బం...దానిని తిరగేసాడు. అందులోనూ తన ఫోటోలే. తన ఫోటో పక్కన చండి ఫోటో అతికించి వుంది. తనను చండి ఎంత గాఢంగా ప్రేమిస్తోందో

    అర్థమైంది.

    "ఇదిగోండి జ్యూస్" అంది చండి జ్యూస్ ని నాయర్ కు అందిస్తూ.

    అందరినీ బెదిరిస్తూ, హుందాగా వుండే చండీలోని అందమైన స్త్రీత్వాన్ని మొదటిసారిగా చూస్తున్నాడు. నాయర్.

    "చండీ..నేనంటే నీకింత ప్రేమా?"

    "ఇంకా చాలా ప్రేమ..మీరు లేకుండా నేను లేను" అంది చండి.

    "ఎలా చండీ..నేను భవిష్యత్తులో పెళ్ళి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను కదా"

    "ఇప్పుడు పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకోండి.

    "మనిద్దరివీ వేరు వేరు దారులు. వృత్తిలో మనిద్దరికీ ఎప్పుడూ చుక్కెదురే"

    "అలా అయితే, నా వృత్తే మీకు అడ్డం అయితే ఈ క్షణమే నా వుద్యోగానికి రాజీనామా చేస్తాను. నేనూ మీ డిటెక్టివ్ ఏజెన్సీలో చేరి, మరో విధంగా ప్రజలకు సేవ చేస్తాను"

    "చం...డీ...."

    "మీ చండీనే...మళ్ళీ పిలవండి"

    "మళ్ళీ కాదు చండీ...మళ్లీ మళ్లీ పిలుస్తాను...ఐ లవ్ యూ"

    "ఐ టూ లవ్ యూ"

    ఆ విధంగా వాళ్ళ సుదీర్ఘమైన ప్రేమకథ, పెళ్ళికథతో శుభం కార్డుకు దారితీసింది.

    *             *               *

    టైం చూసుకున్నాడు శ్రీకర్. ఎనిమిది కావస్తుంది. జెన్నిఫర్ కు మాటిచ్చాడు వస్తానని. అక్షితతో ఏడు గంటల వరకు స్పెండ్ చేసాడు.

    అక్షితను ఇంటి దగ్గర డ్రాప్ చేసి కారులో పిచ్చిగా అటూ ఇటూ తిరిగాడు. అక్షిత జ్ఞాపకం అతడ్ని హట్ చేస్తుంది. తానెంతో డిటాచ్డ్ గా వుంటానని అనుకున్నాడు.

    కాదు...తనకూ అటాచ్ మెంట్స్ వున్నాయి. అటాచ్డ్ గా వుండడం కన్నా, డిటాచ్డ్ గా వుండడమే కష్టమని అతనికి అర్థమైంది.

    జెన్నిఫర్ దగ్గరకి వెళ్ళబుద్ధేయ లేదు.

    తనిప్పుడు వెళ్ళినా ఎంజాయ్ చేయలేడు. ఈ రోజుని ఇలాగే పదిలంగా జ్ఞాపకం వుంచుకోవాలంటే జెన్నిఫర్ దగ్గరకి వెళ్ళకూడదు.

    వెంటనే జెన్నిఫర్ కు ఫోన్ చేసాడు.

    "సారీ...ఈవేళ రాలేను. రేపు కలుద్దాం. బై..గుడ్ నైట్" చెప్పి ఫోన్ పెట్టేసాడు.

    తన మనసులోని ఫీలింగ్స్ అన్నీ ఎవరికైనా చెప్పుకోవాలి. ఎవరికి చెప్పుకోవాలి? అప్పుడు గుర్తొచ్చింది లూసీ.

    *           *              *

  • Prev
  • Next