Telugu Konte Questions

Konte Questions – Tuntari Javabulu - 9

*******************************

*******************************************************************

కొంటె కొశ్శెన్ : నాటి కాలేజీ కుర్రాళ్ళకి, నేటి కాలేజీ కుర్రాళ్ళకి ఏమిటి తేడా ?

తుంటరి జవాబు : అప్పటి కుర్రాళ్ళు రోడ్డుమీదకు వెళ్లి సైట్ కొట్టేవాళ్ళు. ఇప్పటి కుర్రాళ్ళు

ఇంటర్నెట్ లో వెబ్ సైట్ కొడుతున్నారు.

*******************************************************************

కొంటె కొశ్శెన్ : అత్యంత భార్యా విధేయుడు ?

తుంటరి జవాబు : నిద్రలో గురకపెట్టడానికి కూడా భయపడేవాడు.

*******************************************************************

కొంటె కొశ్శెన్ : భవిష్యత్ లో అక్షరాభాస్యం ఎలా చేస్తారు ?

తుంటరి జవాబు : మౌస్ చేత్తో పట్టింటి కంప్యూటర్ స్ర్కీన్ మీద అక్షరాలు రాయిస్తారు.

*******************************************************************

కొంటె కొశ్శెన్ : చాలామంది ఆడవాళ్ళు చీరలకు ఫాల్స్ లేకపోతే కట్టరు.ఎంచేతంటారు ?

తుంటరి జవాబు : అదో ఫాల్స్ ప్రిస్టేజి కాబట్టి.

*******************************************************************

కొంటె కొశ్శెన్ : అతి తెలివి తేటలతో అల్లాడి పోతున్న చమత్కారి టెలిఫోన్ బూత్ కి వెళితే ఏం

అడుగుతాడు ?

తుంటరి జవాబు : ఫెవికాల్ సౌకర్యం వుందా అని అడుగుతాడు.

*******************************************************************

కొంటె కొశ్శెన్ : కార్డియాలజిస్ట్ అదిరిపడేదెప్పుడు ?

తుంటరి జవాబు : కష్టాలను తట్టుకోవాలి కాబట్టి గుండె గట్టిపడటానికి ట్రీట్ మెంట్ ఇవ్వండి

డాక్టర్' అని పేషెంట్ అడిగినప్పుడు.

*******************************************************************