The 3rd Floor

The 3rd Floor

నీరసం, గుండెదడ, తలనొప్పి, వస్తున్నాయని డాక్టర్ దగ్గరికి వెళ్లాడు ఆనందం.

" ఏమిటి నీ సమస్య ?" అని అడిగాడు డాక్టర్ పరమానందం. " డాక్టర్ గారు...నేను ఒకటి

పూర్తీ చేయగానే బాగా నీరసం, రెండవది పూర్తీ చేయగానే గుండెదడ, మూడవది

పూర్తీ చేయగానే తలనొప్పి వస్తున్నాయి. అలా రాకుండా ఉండాలంటే ఏమి చేయాలి ?"

అని తన సమస్య చెప్పి వాటికి పరిష్కారం అడిగాడు ఆనందం.

" ఒకసారి అవ్వగానే నీరసంగా ఉన్నప్పుడు రెండవది, మూడవది ఎందుకు చేస్తున్నారు ?"

అని అయోమయంగా అడిగాడు డాక్టర్ పరమానందం.

" అదెలా కుదురుతుంది డాక్టర్...నేను కాపురం వుంటున్నది మూడవ అంతస్తులో మరి "

అని అసలు విషయం చెప్పాడు ఆనందం.

" ఆ...." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు.