Funny Interview

Funny Interview

జర్నలిజం చదివిన కిషన్, తనకు ఇష్టమైన ఒక టివీలో రిపోర్టర్ గా వర్క్ చేయాలని

ఇంటార్వుకు వెళ్లాడు.

" మీకు ఏ ఆటంటే ఎక్కువ ఇష్టం ? " అని అడిగాడు ఆ టివీలో మేనేజర్ గా పని

చేస్తున్న పరమానందం.

" క్రికెట్ " అని సమాధానాలు చెప్పాడు కిషన్.

" బౌండరీ అంటే " అని అడిగాడు మేనేజర్.

" నాలుగు పరుగులు " అని చెప్పాడు కిషన్.

" సిక్సర్ అంటే " అని అడిగాడు మేనేజర్.

" ఆరు పరుగులు " అని చెప్పాడు కిషన్.

" చాలా సులభమైన ప్రశ్నలు ఆడుగుతున్నాను కదూ ? " అని కొంచం గర్వంగా

అన్నాడు మేనేజర్.

" మీకు తెలియనివి అడిగి తెలుసుకోవడంలో తప్పులేదు కదా సార్ " అని లేచి

వెళ్ళిపోయాడు కిషన్.

" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు మేనేజర్.