Prize Winner

ప్రైజ్ విన్నర్

ప్రజలకు చేరువయ్యే పథకంలో బాగంగా కొత్తగా పెట్టిన టోల్ గేట్ దాటినా ప్రతీ

నూరవ ప్రయాణికుడికి వెయ్యి నూట పదహార్లు బహుమతిగా ఇద్దామని

అనుకున్నారు పోలీసు విభాగం వాళ్ళు.

సరిగ్గా ఆ ప్రకారం ఓ మారుతీ కారు వచ్చింది.ఆ కారుని ఆపిన పోలీసు డ్రైవింగ్

సీటులో ఉన్నతనికి పుష్పగుచ్ఛం, నూట పదహారు రూపాయల చెక్కు ఇచ్చి

విషయం చెప్పి శుభాకాంక్షలు చెప్పాడు.

థ్యాంక్స్ " అంటూ బొకేను అందుకుని పక్కనున్న భార్యకు ఇచ్చాడతను.

అనుకోకుండా వచ్చిన ఈ డబ్బుతో మీరేం చేయబోతున్నారు ?” అడిగాడు

పోలీసు.

అతని దగ్గర సమాధానం రెడీగా ఉంది.

డ్రైవింగ్ లైసెన్సు కొనుక్కోబోతున్నా !” అన్నాడు ఉషారుగా.

పోలీసు ఉలిక్కిపడడం చూసి భార్య సర్ధబోయింది.

మా ఆయన తాగినప్పుడు అలాగే మాట్లాడుతాడు.పట్టించుకోకండి " అంది.

వెనక సీటులో కునికిపాట్లు పడుతున్న చెవిటి తాతగారు ఈ హడావుడికి

నిద్రలేచి పోలీసును చూసి మొత్తుకున్నాడు.

నేనక్కడికి మా వాడికి చెబుతూనే ఉన్నానండి.కొట్టేసిన కారుతో ఎక్కువ

దూరం వెళ్ళలేంరా.పోలీసులు మధ్య దారిలోనే పట్టేసుకుంట్రారా " అని .

(హాసం పత్రిక సౌజన్యంతో )