Shivatandavam - Comedy Serial 21

Listen Audio File :

 

21 వ భాగం

శివుడూ, బుజ్జులు భోజనానికి కూర్చున్నారు.

శివుడు మాములుగానే భోజనం చేస్తున్నాడు గానీ బుజ్జులు మాత్రం కంచంలో చేతులు మాత్రమే వుంచాడు. ముద్ద కలపలేదు. అతని దృష్టి అన్నయ్య మీద వుంది.

" అన్నం తిను " అన్నాడు శివుడు.

బుజ్జులికి ఆ మాట వినిపించలేదు.

అన్నయ్య మోహంలో వరూధిని ప్రవరాఖ్య డాన్స్ చూస్తున్నాడు.

" నిన్నేరా ! అన్నం తిను " అని మళ్ళా అన్నాడు శివుడు.

అప్పటికి గాని బుజ్జులుకి పరాకు దూరం కాలేదు. ముద్దా మింగడానికి వుద్యుక్తుడయ్యాడు.

" ఏమిటి ఆలోచిస్తున్నావు ?" అని అడిగాడు శివుడు.

" వరూధినీ ప్రవరాఖ్య " అనేశాడు బుజ్జులు యధాలాపంగా.

" ఏమిటీ ?" అని రెట్టించాడు శివుడు.

బుజ్జులు సర్దుకుని అన్నాడు " ఇవాళ తెలుగు క్లాసులో వరూధినీ ప్రవరాఖ్య పాఠం చెప్పారన్నయ్యా ! దారి చూపించమని అడగడానికి వచ్చిన ప్రవరాఖ్యుడు ఆ సంగతి మర్చిపోయి వరూధినీ అందచందాలకు పరవశుడై ఆమెను గట్టిగా కావలించుకుంటాడు " అని.

" బుజ్జులు " అని గట్టిగా అరిచాడు శివుడు.

" ఏమిటన్నయ్యా ? " అని అడిగాడు బుజ్జులు.

" ఆమెను కౌగిలించుకున్నట్టు ఎవడ్రా చెప్పింది ?" కోపంగా అన్నాడు శివుడు.

" తెలుగు మాస్టార్ "

" తప్పుడు పాఠాలు చెప్పినందుకు మీ మాస్టారును చెప్పిచ్చుకొట్టాలి. ప్రవరాఖ్యుడు ఆప్టరాల్ ఆడదాని అందడానికి ఎప్పుడూ దాసుడు కాలేదు! కాడు ! అండర్ స్టాండ్ " అంటూ తను భోజనం మీది నుండి లేచి వెళ్ళిపోయాడు.

ఉదయం అన్నదమ్ములుద్దరూ సీరియస్ గా బస్కీలు తీస్తున్నారు.

బక్సీలు తీస్తూనే కిష్ణుడు అడిగాడు " అన్నయ్యా, నువ్వెప్పుడైనా నాటకాలు వేశావా ?" అని.

బస్కీలు తీస్తూనే శివుడు అడిగాడు " ఇప్పుడు ఆ సంగతి ఎందుకు ?" అని.

" తెలుసుకుందామని " అంటూ బక్సీలు తీస్తూనే ఉన్నాడు.

" పిచ్చి పిచ్చి విషయాలు అడగకూడదు " బక్సీలు తీస్తూనే అంటాడు శివుడు.

" నాటకం వేయడం పిచ్చి విషయమా "

" అవును నా ఉద్దేశంలో అంత పిచ్చి పని మరొకటి లేదు "

" అయ్యో ఇప్పుడేట్లా "

" ఏం జరిగింది ?"

" మా కాలేజీ నాటకం లో నా పేరు ఇచ్చాను "

" నన్ను అడగకుండా ఎందుకు ఇచ్చావు రా ? ఇంతకీ ఏమిటా నాటకం ?"

" వరూధినీ ప్రవరాఖ్య " అని చెప్పాడు బుజ్జులు.

ఆ నాటకం పేరు వినగానే శివుడు బస్కీలు తీయడం ఆపాడు. అన్నయ్య ఆగిపోవడంతో తమ్మయ్య కూడా ఆగిపోయాడు. శివుడు గంభీరంగా అడిగాడు " ప్రవరాఖ్యుడు ఎవరు ? " అని.

" నేనే "

" వరూధినీ "

" ఇంకా దొరకలేదు "

శివుడు సీరియస్ గా అన్నాడు " వద్దురా బుజ్జులూ ! నువ్వు ఆ నాటకం వేయద్దు " అని.

" ఎందుకని "

" ఎందుకా ? మీ తెలుగు మాస్టార్ చెప్పనట్టు కథ మారిపోతుంది. చెంపదెబ్బ తింటావు. అర్థమైందా ? ఊ...ఇంకొ పాతిక బస్కీలు బెలేన్సు ఉంది. కానివ్వు " అంటూ బస్కీలు ప్రారభించాడు.

" మాటల్లో పడినా నా బస్కీలు లెక్కపెడుతూనే ఉన్నావా " అంటూ బుజ్జులు కూడా బస్కీలు తీస్తున్నాడు.

" లెక్క లెక్కే ! అది తప్పకూడదు "

" అన్నయ్యా "

" ఊ "

" నీకు పంకజంగారు తెలుసా ?" ఈమాటతో శివుడు మళ్ళీ ఆగిపోయాడు.

దాంతో బుజ్జులు కూడా ఆగిపోయాడు. " ఏం కూసేవ్ ?" అని ర\రోషంగా అడిగాడు శివుడు.

" కూయలేదు అడిగాను పంకజం " అని అన్నాడు బుజ్జులు.