సిల్లీ ఫెలో - 66

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 66

- మల్లిక్

 

బుచ్చిబాబు ఫైల్సు టేబుల్ మీద వేసుకుని వాటిల్లో తల దూర్చాడు.

పావుగంట బుచ్చిబాబు పనిలో దీర్ఘంగా మునిగిపోయాడు.

"బుచ్చిబాబూ... నిన్నే!"

ఎవరో పిలుస్తున్నట్టు అనిపించి తలెత్తి చూశాడు.

కాస్త దూరంలో ఫోన్ రిసీవర్ ఎత్తి పట్టుకునో మోహన్ నిల్చుని వున్నాడు.

ఏంటి అన్నట్టుగా మోహన్ వంక చూసాడు బుచ్చిబాబు.

"కాల్.. మీ ఆవిడ దగ్గర్నుండి! చెప్పాడు మోహన్.

"మా ఆవిడా? మా ఆవిడెవరు??" అయోమయంగా చూస్తూ అడిగాడు బుచ్చిబాబు.

మోహన్ బుచ్చిబాబు వంక అంతకంటే అయోమయంగా చూశాడు.

బుచ్చిబాబుకి అప్పుడు తట్టింది సీత గురించి చెప్తున్నాడని!

"ఓ... మా ఆవిడ... సిల్లీ!" నెత్తిన మొట్టికాయ మొట్టుకున్నాడు "సీత! సీతే కదూ ఫోన్ చేసింది?"

మోహన్ అయోమయంగా తల ఊపాడు.

బుచ్చిబాబు సీట్లోంచి లేచెళ్ళి రిసీవర్ అందుకున్నాడు.

"హలో సీతా?"

"నేనే!" అవతలి నుండి అంది సీత.

"ఊ!" అన్నాడు బుచ్చిబాబు.

"నా మీద కోపం పోయిందా?

"కోపం దేనికి?"

"నాకు తెలుసులే. నామీద నీకు బాగా కోపం వచ్చింది. పొద్దున నాతో సరిగా మాట్లాడలేదుగా"

బుచ్చిబాబు ఏమీ అనలేదు.

"చూశావా... నువ్వు మౌనంగా వున్నావంటే నా మీద ఇంకా కోపం పోనట్టేకదా?" అంది సీత.

కోపగించుకోవడానికి ఏముందనీ... ఎవరి అభిప్రాయాలు వారివి... నీ అభిప్రాయాలు నీకుంటాయి కదా.."

కాస్త దూరం నుండి ఫోన్ లో మాట్లాడుతున్న బుచ్చిబాబు మొహంలోని ఫీలింగ్స్ ని మోహన్ పరిశీలిస్తున్నాడు.

మీ ఆవిడ అంటే ఎవరూ అంటాడేం? అనుకున్నాడు. అతనికి మొదట నుండీ కాస్త అనుమానంగానే వుంది.

"దాల్ మె కుచ్ కాలా హై" అనుకున్నాడు మోహన్.


*            *                 *