ఖుషిఖుషీగా ప్రేమికుల గిలిగింతలు

ఖుషిఖుషీగా ప్రేమికుల గిలిగింతలు

అమ్మాయిలకైన అబ్బాయిలకైనా ప్రేమించడం, ప్రేమించబడటం ఈ రెండు గొప్పే! కాకపొతే

వీళ్ళు ఆ ప్రేమలో ఎంతవరకు సఫలీకృతం అవుతారన్నది వాళ్ళకే కాదు చూస్తున్నవాళ్ళకి

కూడా అర్థం కాదు. ప్రేమ బాధితులల్లో అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు.

సరదాగా అమ్మాయిల మీద అబ్బాయిలు, అబ్బాయిల మీద అమ్మాయిలు చేసుకునే

కామెంట్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం !

* " చూసే పత్రి అమ్మాయి నవ్వదు, నవ్వే ప్రతి అమ్మాయి ప్రేమించదు, ప్రేమించే

ప్రతి అమ్మాయి పెళ్లి చేసుకోదు, విశ్వదాభిరామ అమ్మాయిల్ని నమ్మకురా

మామ " ఒక ప్రేమ బాధితుడు.



*
" డబ్బులేని అబ్బాయిలను చూడకు, డబ్బులేని అబ్బాయిలతో మాట్లాడకు,

వాళ్ళు ఏమి చెప్పినా వినకు ! డబ్బున్న అబ్బాయిని పట్టుకో దర్జాగా లైఫ్ ని

ఎంజాయ్ చేసుకో " ఒక ప్రేమ బాధితురాలు.



*
" గొడుగుతో ఉంటే అది వానాకాలం, కూలర్ తో ఉంటే అది ఎండాకాలం, స్వెటర్

తో ఉంటే అది చలికాలం, లవర్ తో ఉంటే అది పోయే కాలం! " ఒక ప్రేమ

బాధితుడు.


*
" అబ్బాయిలు ప్రేమించే మనసును చూడరు, ఆకర్షించే అందాన్నే చూస్తారు..ఛీ

ఛీ...ఈ అబ్బాయిలు ఎప్పుడు మారుతారో ఏమో " ఒక ప్రేమ బాధితురాలు.


* " అమ్మాయిలు కూడా అంతే ! ప్రేమించే మనసును చూడరు, నిండుగా ఉండే

పర్స్ నే చూస్తారు " ఒక ప్రేమ బాధితుడు.



* " అమ్మాయిలు చదవరు, అబ్బాయిల్ని చదవనీయరు, కాని బాగా

చదువుకున్న మొగుడు కావాలి...ఏంటో ఈ అమ్మాయిలు ! " ఒక ప్రేమ

బాధితుడు.



* " అమ్మాయిలకు ప్రేమించేటప్పుడు తల్లిదండ్రులు గుర్తుకురారు. పెళ్లి

చేసుకునేటప్పుడు ప్రేమించినవాడు గుర్తుకు రాడు. అందుకేరా బాబు

అమ్మాయిలను నమ్మకూడదు " మరొక ప్రేమ బాధితుడు.



* " ప్రేయసి కోసం ఒక ప్రియుడు తాజ్ మహల్ కట్టాడు కాని ప్రియుడి కోసం ఒక

ప్రేయసి చిన్నగుడిసె అయినా కట్టిందా ! " ఒక ప్రేమ బాధితుడు.