TeluguOne Services
Copyright © 2000 -
2025
, TeluguOne - Comedy - All rights reserved.
పూలకొట్లో పనిచేసే భర్త
చాల రోజుల తరువాత సుజాతని పలకరించడానికి కావేరి వచ్చింది.
హాల్లోని సోఫాలో కూర్చొని ఒకరిని ఒకరు పలకరించుకొని మాట్లాడుకోసాగారు. వాళ్ళు
అలా మాట్లాడుకుంటుండగా, సుజాత భర్త పదినిమిషాలకొకసారి బెడ్ రూములో నుండి
వచ్చి సుజాత నెత్తిమీద నీళ్ళు చల్లి వెళ్ళేవాడు.
అలా నాలుగైదుసార్లు గమనించిన కావేరి విషయం ఏంటో తెలుసుకోవాలని అడిగింది.
" అదేంటే...మీ ఆయన పది నిమిషాలకొకసారి నీ నెత్తిమీద నీళ్ళు జల్లుతున్నాడు " అని
ఆశ్చర్యంగా అడిగింది కావేరి.
" నా నెత్తిమీద కాదు...నేను పెట్టుకున్న పూలమీద, ఆయన పూలకొట్లో పనిచేస్తారులే "
అని అసలు విషయం చెప్పి పకపక నవ్వింది సుజాత.
|