Konte Questions-Tuntari Jawabulu-4

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.

కొంటె కొశ్శెనలు -తుంటరి జవాబులు -4

****************************************************************************************

వి.మంజురాణి,హైదరాబాద్.

కొంటె కొశ్శెన్ :ఎందుకు తాగుతున్నావురా అని అంటే చమత్కారి నిరుద్యోగి ఏం అంటాడు ?

తుంటరి జవాబు :ఏజ్ 'బార్'అయిపోయింది కనుక అని అంటాడు.

*******************************************************************

కొంటె కొశ్శెన్ :చూపుల్తోనే కాల్చేస్తే ?

తుంటరి జవాబు :టెలిఫోన్ డిపార్ట్ మెంట్ కి బోలెడంత నష్టం వస్తుంది.

*******************************************************************

కొంటె కొశ్శెన్ :''కృష్ణం వందే జగద్గురుం ''అంటే ఏమిటి ?

తుంటరి జవాబు :ఓ కృష్ణా...ఈ జగత్తుకి గురువు లాంటి వాడివి కనుక అవసరమైనప్పుడు

ఒక్కటిచ్చుకో (వన్ దే )అని అర్థం.

*******************************************************************

బి.చంద్రశేఖరయ్య,రామసముద్రం.

కొంటె కొశ్శెన్ :ఉన్నత ప్రమాణాలంటే ?

తుంటరి జవాబు :హైకోర్టు సుప్రీంకోర్టులో చేసే ప్రమాణాలు.

*******************************************************************

కూర్మాన వెంకట సుబ్బారావు,విశాఖపట్నం.

కొంటె కొశ్శెన్ :చీరలు కామెంట్ ప్లీజ్

తుంటరి జవాబు :భార్యలు కొనుక్కొస్తే బెనారస్ క్వాలిటీ,భర్తలు తెస్తే బేవార్స్ క్వాలిటీ.

*******************************************************************

డి.రామమూర్తి,విజయవాడ

కొంటె కొశ్శెన్ :ప్రజాప్రతినిధి అంటే ఎవరు ?

తుంటరి :ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రతి నిధినీ మనవి చేస్తూ తనవిగా చేసుకునేవాడు.

*******************************************************************

మరిన్ని కొంటె కొశ్శెన్లు తుంటరి జవాబులతో మళ్ళీ కలుదాం.

హాసం సౌజన్యంతో