హలో... రాంగ్ నెంబర్.! - 7

Get latest telugu famous comedy serials, telugu serial comics and latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 7

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

దుబాయ్ ఇంటర్నేషనల్ ఏర్ పోర్ట్.

టెర్మినల్ - 2

విన్సెంట్ ఇంకా రాలేదు. లూసీ, శ్రీకర్ లిద్దరూ కాఫీ షాప్ ముందు నిలబడి కాఫీ తాగుతున్నారు. శ్రీకర్ లూసీ వంకే చూస్తున్నాడు. ఆమెలో వింతైన ఆకర్షణ...ఏదో తెలియని మిస్టరీ...ఈ రెండూ కలిసిపోయి వున్నట్టు అనిపించిందతనికి.

"థాంక్యూ లూసీ. దుబాయ్ లో నీ ఆతిథ్యం నేను మరచిపోలేను" మనస్పూర్తిగానే అన్నాడు శ్రీకర్.

"ఆతిథ్యం ఇచ్చింది హోటల్. నేను మీకు కంపెనీ ఇచ్చాను. అదీ నా వృత్తిలో ఓ భాగంగా. ఇన్ ఫాక్ట్ నిజం చెప్పాలంటే మీరు అనుకున్న కంపెనీ నేను ఇవ్వలేకపోయాను. సారీ ఫర్ దట్."

"నో రిగ్రెట్స్. నేను అలాంటి కంపెనీనే కావాలనుకుంటే మరో విధంగా కూడా అరేంజ్ చేసుకోగలను. ఎందుకో ఈసారి అలా చేయలేకపోయాను. అయినా నాకు ఈ ట్రిప్ మానసికమైన ఆనందాన్ని ఇచ్చింది."

"థాంక్యూ సార్.." అంది లూసీ.

శ్రీకర్ కాఫీ కప్ డస్ట్ బిన్ లో వేసి, జేబులో వున్న దిర్ హమ్స్ బయటకు తీసాడు. "ఏర్ పోర్ట్ లో ఇంకేం కొంటే బావుంటుంది?" అన్నాడు.

"సార్ ! ఇక్కడ టాక్స్ ఫ్రీ  లిక్కర్ వుంటుంది. మీకు రెండు బాటిల్స్ పర్మిట్...తీసుకోండి." అంది.

"థాంక్స్ ఫర్ యువర్ సజెషన్. ఐ లైక్ డ్రింక్స్. ఓ రెండు బాటిల్స్ తీసుకుందాం" అంటూ లూసీ సెలక్ట్ చేసిన బ్రాండ్ ని కాస్ట్ లీ అయినా తీసుకున్నాడు.

మిగిలిన దిర్ హమ్స్ ని లూసీ చేతిలో పెట్టాడు. ఎన్ని వున్నాయో కూడా చూసుకోలేదు.

"లూసీ...నేను విమానం ఎక్కిన మరుక్షణం పనికిరాని ఈ దుబాయ్ కరెన్సీ...దుబాయ్ లో వున్న నీకు పనికి వస్తాయి" అన్నాడు. ఇబ్బందిగా చూసింది లూసీ.

"అందమూ, ఆత్మాభిమానం రెండూ కలిసి వున్న అమ్మాయి చాలా అందంగా వుంటుంది. మరోసారి చెబుతున్నాను..."

చప్పున ఎర్రబడ్డ మొహంతో అప్రయత్నంగా అతని పెదవుల మీద చేయిపెట్టి అంది "ప్లీ..జ్"

ఒక్కక్షణం ఆ చేతివ్రేళ్ళ మీద ముద్దుపెట్టుకుంటూ.

వెంటనే చేతిని వెనక్కి తీసుకుంది.

"లూసీ...నువ్వు ఇండియా వచ్చేయరాదూ...నా పి.ఏ.గా" అన్నాడు శ్రీకర్.

లూసీ కొద్ది క్షణాలు మౌనంగా వుండిపోయింది. శ్రీకర్ ఏదో గుర్తొచ్చినట్టు పర్సు తీసి అందులో నుంచి ఓ విజిటింగ్ కార్డు తీసి లూసీకి ఇచ్చి చెప్పాడు.

"దిసీజ్ మై పర్సనల్ విజిటింగ్ కార్డ్...

శ్రీకర్...ఎట్ యువర్ సర్వీస్....56374677 ఎనీ టైమ్...ఎనీ ప్లేస్...ఎనీవేర్..జస్ట్ వన్ ఫోన్ కాల్..."

లూసీ విజిటింగ్ కార్డు వంక చూసింది.

విజిటింగ్ కార్డు చూడముచ్చటగా వుంది. దాని మీద 'హలో అయామ్ శ్రీకర్.

ఎట్ యువర్ సర్వీస్ 56374677.

.....ఎనీటైమ్...ఎనీప్లేస్...ఎనీవేర్..అని వుంది. ఓ పక్క అతడి ఫోటో.

"చాలా వెరైటీగా వుంది. బావుంది కూడా..." అంది.

లూసీ ఆ విజిటింగ్ కార్డు వంక చూసి.

"ఈ విజిటింగ్ కార్డు నీలాంటి అందమైన అమ్మాయిల కోసం..." చెప్పాడు శ్రీకర్.

మరోసారి ఆమె మొహం ఎర్రబడింది.

"ఇవి పర్సనల్ విజిటింగ్ కార్డులు. ఓన్లీ ఫర్ లేడీస్." చెప్పాడు శ్రీకర్. అప్పుడు గమనించింది. ఆ పర్స్ లో ఓ సీక్రెట్ అరలాంటిది వుంది. చిన్న బటన్ ప్రెస్ చేస్తే విజిటింగ్ కార్డ్స్ ఆ అరలో నుంచి బయటకు వస్తున్నాయి.

"మీ మిసెస్ కు ఎప్పుడైనా ఇచ్చారా?" నవ్వుతూ అడిగి, వెంటనే ఫీలైంది. తను మరోసారి అతడ్ని హర్ట్ చేస్తున్నానేమోనని. అందుకే వెంటనే...

"సారీ సర్" అంది.

"సారీ ఎందుకు...నేను మా ప్రియంవదకీ ఇచ్చాను. తనతో నా పెళ్ళి కాకముందే. అదే నేను చేసిన పొరపాటు...వాళ్ళ బాబాయ్ వస్తాదు. కార్డు ఇచ్చినందుకు పెళ్ళి చేసుకునే వరకూ వదిలిపెట్టలేదు...ప్రామిస్."

ఒక్కసారిగా నవ్వొచ్చింది లూసీకి.

"మీరే విషయాన్నీ సీరియస్ గా తీసుకోరా"