మై డియర్ రోమియో - 3

Listen Audio File :

Get latest telugu Audio comedy serials My Dear Romeo, telugu serial comics and latest jokes online

 

మై డియర్ రోమియో - 1

 

స్వప్న కంఠంనేని

 

హానిత వాళ్ళందరినీ చూస్తూ అనౌన్స్ చేసింది. "డియర్ ఫ్రెండ్స్! ఇప్పుడు మన కొత్త క్లాస్ మేట మిస్టర్ వైభవ్ మనకి ప్రెగ్నెంట్ లేడీలా నడిచి చూపిస్తాడు''
అదిరిపడ్డాడు వైభవ్.
"నో! నేను చేయను'' అన్నాడతను వెనక్కొక్క అడుగు వేస్తూ.
"నువ్వు చేస్తావ్! నీ తలలో జేజమ్మ కూడా చేస్తుంది. నువ్వీ కాలేజీలో చదవాలంటే కనీసం ఈ ఒక్క రోజు మేం చెప్పినట్టు చేయాల్సిందే'' దబాయించింది హానిత.
ఎందుకొచ్చిన గొడవలే, ఈ ఒక్క రోజే అంటున్నారు కదా అనుకుని లేచి నిలబడ్డాడు వైభవ్.
నడుము మీద చేయి పెటుకుని వెనక్కి వంగి వభవ్ నడుస్తుంటే క్లాసంతా చప్పట్లు కొడుతూ విరగబడి నవ్వసాగారు.
వైభవ్ గోడ దాకా అలా నడిపించాక చెప్పింది హానిత "ఇప్పుడు వైభవ్ మన ఆయాతో 'ఐ లవ్ యూ డార్లింగ్'' అని చెప్తాడు.
ఇక సహించలేకపోయాడు వైభవ్.
"నీకేమన్నా పిచ్చా? ఆయా మనకి తల్లిలాంటిది. ఆయాని కూడా అమ్మలాగే ట్రీట్ చెయ్యటం మన కర్తవ్యం. పేదవాళ్ళయినంత మాత్రాన వాళ్ళని మనం చులకన చేయకూడదు. ఇలాంటి పనులు మాత్రం నేను చేయలేను. చేయను' అన్నాడు ఖచ్చితంగా.
గొంతు ఆర్ద్రంగా మర్చి అంది హానిత.
"నిజంగా నువ్వు మా కళ్ళు తెరిపించావు వైభవ్''
ఆమె వాలకాన్ని చూసి ఆమె మారిపోయింది అనుకున్నాడు వైభవ్. ఆమె సున్నిత మనస్తత్వానికి మనసులో జోహార్లర్పించబోయాడు.
మళ్ళీ అంతలోకే హానిత స్వరాన్ని కఠినంగా చేసి వెటకారంగా అన్నది. "గౌతమ బుద్ధుడిలా నీతిబోధలు చేయటం మాని చెప్పిన పని చేయవోయ్''
ఎంత చెప్పినా, ఎంత బతిమాలినా వాళ్ళు వినకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు వైభవ్ కి. విసిగిపోయి అన్నాడు.
"సరే చెప్తాను. అయితే ఒక పందెం. మీలో ఎవరైనా సరే నన్ను హ్యాండ్ రెజ్లింగ్ లో ఓడించితే మీరు చేయమన్నది చేస్తాను. నన్నెవరూ ఓడించలేకపోతె  మాత్రం మీరింక నా జోలికి రాకూడదు''
పందెం అనేసరికి అందరికీ హుషారొచ్చింది .
హనితే సంబరంగా అంది "ఓస్! ఇంతేనా? ఏమో అనుకున్నాను. గట్టి వాడివేనే! మా మీనాని ఓడించు చూద్దాం ముందు. మిస్టర్ పప్పు సుద్దా! నీ చేయి ముక్కలు ముక్కలుగా విరిచేయగలదు మీనా. తెలుసా?''
మీనా తలొంచుకుని సిగ్గుపడుతూ అంది.
"అమ్మో! నాకు సిగ్గేస్తుంది. నేనాయనతో ఎలా పోటీ పడగలను చెప్పు''
వైభవ్ మనసులో అనుకున్నాడు "గున్నేనుగు సిగ్గుపడుతోందిరో దేవుడా! ఇందాక అంకుల్ అంది. ఇప్పుడు మళ్ళీ ఆయన అంటోంది. కాసేపయితే తాతయ్య అంటుందేమో''
"ఓసి నీ సిగ్గు సంతకెళ్ళ. నువ్వొద్దులే కానీ ముందు సిగ్గుపడటం ఆపు. చూడలేక ఛస్తున్నాం'' అంది హానిత.
తర్వాత వైభవ్ తో అంది "రాజా హ్యాండ్ రెజ్లింగ్ లో కాలేజీ ఛాంపియన్. నువ్వతనితో పోటీపడి గెలిస్తే మీమిక నీ జోలికి రాము. లేదంటే ఈ సంవత్సరం మొత్తం మేం చెప్పినట్లు నువ్వు వినాలి. ఓ.కే.?''
"సరే''
రాజా, వైభవ్ లిద్దరూ చెట్టు కింద ఉన్న సిమెంట్ చప్టామీద చెరోవైపునా కూర్చున్నారు.
అంతా ఆసక్తిగా చూడసాగారు.
ఇద్దరూ మోచేతుల్ని చప్టా మీద ఆనించి చేయి, చేయి కలిపారు.
"రెడీ'' అరిచింది మీనా.
ఇద్దరూ చేతుల్ని బలంగా కదిలిచారు.
ప్రత్యర్థిపై గెలుపొందాలని ఇద్దరి మనస్సుల్లో తాపత్రయం.
కాసేపు రాజాది పైచేయి అయింది.
ఆటను గర్వంగా హానితకేసి చూడసాగాడు.
అప్పటివరకూ అంతంత మాత్రంగా పోటీ పడ్డ వైభవ్ సడెన్ గా తన బలాన్నంతా ప్రయోగించాడు.
రాజీ చేయివెనక్కి వొరిగింది.
పైన వైభవ్ చేయి.
రాజా మొహం మాడిపోయింది.
వైభవ్ మోహంలో చిరునవ్వు మాత్రం చెక్కు చెదరలేదు.
అంతకు మించి పెద్ద ఆనందాన్నేమీ ప్రదర్శించలేదతను.
అప్పుడు చూసింది హానిత అతడివైపు పరిశీలనగా.
"అరె! అచ్చం రోజా హీరో అరవింద్ లాగా ఉన్నాడే!'' అనుకుంది తనలో తాను.
తర్వాత హానిత మొహాన్ని అసహ్యంగా పెట్టి రాజావైపు చూసింది. ఆమె కళ్ళల్లోకి చూడలేక చూపులు దించుకున్నాడు రాజా.
"ఛీ, ఛీ! పరువంతా తీశావ్ కదా రాజా'' అంది మీనా.
రాజా మీనాకేసి కోపంగా చూశాడు.
వైభవ్ అక్కడ్నుంచి లేచి వెళ్ళిపోయాడు.
అంతలోనే హానిత సర్దుకుంది. మూడ్ ని మార్చుకుంది. రాజాతో అంది. "పోన్లే రాజా! నువ్వు మాత్రం ఏం చేస్తావ్? పల్లెటూరి వెధవ. మోటు బలమంతా ప్రయోగించాడు. అసలు నేనీ పందానికి ఒప్పుకోకుండా ఉండాల్సింది. అయినా వాడెక్కడికి పోతాడు? రేపట్నుంచీ చూసుకుందాంలే!''
రాజా మొహం వెలిగిపోయింది.
సంబరంగా అన్నాడు "అవును, నేనూ అదే అనుకుంటున్నాను. అసలు రేపట్నుంచీ ...'' అతడి మాటలు సగంలోనే కట్ చేసింది హానిత.
"అత్యుత్సాహం ప్రదర్శించకు. ఓడిపోయాక కాసేపన్నా సిగ్గుపడటం మనిషి ధర్మం. నీకది లేదనుకుంటారు''
రాజాకు ఏం మాట్లాడాలో తెలియలేదు.
అవమాన భారంతో ముగ్గురూ ఆ మిగతా రోజంతా డల్ గా గడిపారు.
కాలేజ్ బెల్ అవగానే మర్నాడు వైభవ్ నెలా ఏడిపించాలో డిస్కస్ చేసుకుంటూ గేటువైపు అడుగులు వేశారు.