మై డియర్ రోమియో - 4

Listen Audio File :

Get latest telugu Audio comedy serials My Dear Romeo, telugu serial comics and latest jokes online

 

మై డియర్ రోమియో - 4

 

స్వప్న కంఠంనేని

 

మర్నాడు ...
రాజా, మీనాలు ఆదరికంటే ముందుగా కాలేజీకి చేరుకున్నారు.
కొంచెంసేపట్లో హానిత కూడా కైనటిక్ హోండా మీద దూసుకుంటూ వచ్చింది.
కాలేజీకి ఆమె అంట తొందరగా రావటం చూసిన గెట్ కీపర్ కి ఒళ్ళుపై తెలీలేదు.
తాను ప్రిన్సిపాల్ తో తిట్టించునందువల్లే ఆమె తొందరగా వచ్చేసిందనుకున్నాడు.
హానిత బైక్ పార్క్ చేస్తూ "హాయ్ తాతయ్యా!'' అంటూ గెట్ కీపర్ కి విష్ చేసింది.
నలభైఏళ్ళ గెట్ కీపర్ కి ఆమె మాటలకు తల కొట్టేసినట్లయింది. ఒళ్ళు మండిపోయింది కూడా.
అతడి రియాక్షన్ కి హానిత నవ్వుకుంటూ రాజా మీనాలను చేరుకుంది.
ముగ్గురూ కాసేపు మంతానాలు జరిపారు
అదయిపోయాక ఏమీ ఎరగనట్లుగా హానిత, రాజాలు లోపలికి వెళ్ళిపోయారు.
మీనా గెట్ దగ్గర నిలబడింది.
నెమ్మదిగా కాలేజీ అఆరణ స్టూడెంట్స్ తో నిండుకోసాగింది.
హీరోహోండా మీద వస్తున్నా వైభవ్ ని చూడగానే మీనా మొహం వెలిగిపోయింది.
అతని బైక్ కి అడ్డాలు పడుతూ లేస్తూ అతని దగ్గరికి పరుగెత్తింది.
గున్నేనుగులా మీదకొస్తున్న మీనాని చూసి ముందు కంగారుపడ్డాడు వైభవ్. అంతలోనే తమాయించుకుని పలకరింపుగా నవ్వాడు.
మీనా సిగ్గుపడుతూ చున్నీని వెలికి చుట్టుకుంటూ కాలి బొటనవేలితో నేలమీద సున్నాలు చుడుతూ నిలబడిపోయింది.
ఆమె వాలకం అర్థమైన వైభవ్ బైక్ పార్క్ చేసి క్లాస్ రూమ్ వైపుకు అడుగులు వేసాడు.
మీయా అతడ్ని అనుసరించింది.
ఇద్దరూ క్లాస్ రూమ్ లోకి అడుగుపెట్టారు.
ఇంకా ఏదో విషయాన్ని గురించి సీరియస్ గా డిస్కస్ చేసుకుంటున్న హానిత, రాజాలు వీళ్ళ రాకను గమనించలేదు.
మీనా గబగబా హానిత వాళ్ళ దగ్గరకు నడిచింది.
"ఆయనొచ్చారే'' సిగ్గుపడుతూ చెప్పింది మీనా.
ఆ మాటలు తన గురించేనని అర్థమైన వైభవ్ కి ఏడుపొచ్చింది.
'కొంపదీసి ఈ పర్వతంగానీ నాకు లైనెయ్యడం లేదు కదా?' తనలో తాను అనుకున్నాడు.
వాళ్ళను చోదనట్లుగా వెళ్ళి ఫస్ట్ బెంచిలో కూర్చున్నాడు.
మీనా వెళ్ళి వైభవ్ పక్కన కూర్చుంది.
హానిత గబగబా లేచి వెళ్ళి మీనాపక్కన కూర్చుంది. బెల్ మోగింది.
కెమిస్ట్రీ లెక్చరర్ క్లాస్ రూమ్ లోకి అడుగుపెట్టాడు.
ఇంతలో వైభవ్ గొంతు ఖంగుమంటూ వినిపించింది.
"ఛత్! వెధవ గోల. రెండు రోజుల నుంచి ఇదే సంత''
ఉలిక్కిపడ్డాడు వైభవ్.; ఆ గొంతు తనదేగానీ ఆ మాటలు తననలేదు.
అదే సమయంలో లెక్చరర్ కూడా ఉలిక్కిపడ్డాడు. అనుమానంగా వైభవ్ వైపు చూసాడు.
లెక్చరర్ తనవైపు చూసేసరికి వైభవ్ దిక్కులు చూడడం మొదలుపెట్టాడు.
లెక్చరర్ తమాయించుకుని మళ్ళీ లెసన్ చెప్పడంలో లీనమయ్యాడు.
మళ్ళీ వైభవ్ గొంతు వినిపించింది.
"ఛత్! నోర్ముయ్. నోరెత్తావంటే చంపేస్తాను.!''
ఈసారి వైభవ్ కి అర్థమైంది.
హనితే గొంతు మార్చి తనలా మాట్లాడుతోంది.
"అమ్మ రాక్షసీ'' తనలోతాను అనుకున్నాడు
లెక్చరర్ వైభవ్ కేసి చూస్తూ చెప్పాడు.
"క్లాసయ్యాక నన్ను కలువు''
హానిత కిసుక్కున నవ్వింది.
వైభవ్ ఆమెకేసి సీరియస్ గా చూశాడు.
కాసేపటికి బెల్ మోగింది.
లెక్చరర్ బయటకెళ్తూ వైభవ్ కి సైగ చేశాడు. వైభవ్ కూడా లేచి ఆయన వెనకే వెళ్లాడు.
స్టాఫ్ రూమ్ లో కెళ్ళాక లెక్చరర్ అన్నాడు.
"చూడు వైభవ్! క్లాస్ లో అరిచింది నువ్వు కావని, హనితేనని నాకు తెలుసు. ఇదేకాదు. వాళ్ళింకా నిన్ను చాలా రకాలుగా ఆట పట్టిస్తారు. నువ్వు పట్టించుకొనట్టుగా ఊరుకోవడమే మంచిది. తెలీక వాళ్ళతో నువ్వు గొడవ పడతావేమోనని చెప్తున్నాను. వాళ్ళదసలే పెద్ద రౌడీమూక. జాగ్రత్తగా వుండు. వాళ్ళు నీ పక్కన కూర్చుంటే నువ్వు వెళ్ళే వేరే బెంచీలో కూర్చ. ఒకే''
"అలాగే సార్'' అని చెప్పి క్లాస్ రూమ్ లోకి వెళ్లాడు వైభవ్.
అప్పటికి హానిత, మీనాలు వ్ల్లిపోయి లాస్ట్ బెంచీలో రాజు పక్కన కూర్చుని వున్నారు.
వైభవ్ ని చూస్తూ విజయగర్వంతో ముగ్గురూ నవ్వుతున్నారు.
వైభవ్ సీరియస్ గా హానిత దగ్గరకెళ్ళి నిలబడ్డాడు.
"ఏమిటా లుక్కు, కొడతావా ఏమిటి?'' హానిత  అంది ఎగతాళిగా.
"నిన్న నాతొ నువ్వేం చెప్పావ్? హాండ్ రేజిలింగ్ లో నేను గెలిస్తే మళ్ళీ నాజోలికి రానన్నావ్ కదా?'' అన్నాడు వైభవ్ కోపంగా.
"అవును అన్నాను అయితే ఏమిటి?''
"అయితే ఏమిటా? మరిప్పుడు నా గొంతుతో ఎందుకు మాట్లాడావు?''
ఈలోగా వీళ్ళ గొడవకి క్లాసంతా వీళ్ళ చుట్టూ చేరారు.
"నీ గొంతుతో నేనెక్కడ మాట్లాడాను? నా నోటితోనే నేను మాట్లాడాను'' సర్కాస్టిక్ గా అంది హానిత.
"పిచ్చి జోకులేయకు. నా జోలికి రానని నిన్న నాకు మాటిచ్చి ఇవ్వాళ మాట తప్పుతావా?''
"నిన్న నిన్నే, ఈ రోజు ఈరోజే. నా ఇష్టమొచ్చినట్లు నేను చేస్తాను. నీకు మాటిచ్చిన పాపానికి నేను నా ప్రవర్తన మార్చుకోవాలా?''
"అలా మాట్లాడడానికి నీకు సిగ్గులేదా?'' అన్నాడు వైభవ్.
ధన్ మని లేచి నిలబడింది హానిత. కోపంతో ఆమె సుకుమార దేహం కంపించిపోయింది. వీళ్ళ చుట్టూ మూగిన స్టూడెంట్స్ అందరికీ భయం పుట్టి గానగాబా వెళ్ళి ఎవరి సీట్లలో వాళ్లు కూర్చున్నారు.
"హద్దు మీరుతున్నావు జాగ్రత్త. ఇంతవరకూ నన్నెవరూ పల్లెత్తు మాట కూడా అనలేదు. నోటికొచ్చినట్లు వాగితే చంపి పారేస్తా ఏమనుకుంటున్నావో? నీకు చేతనయితే నువ్వు నీ ఇష్టమొచ్చినంత అల్లరి చేయి. ఒకళ్ళని ఆట పట్టించడం కూడా చేతకాని వాజమ్మవి నువ్వు నన్ను తిడతావా?'' వొళ్ళు మరచి అంది హానిత.
"ఓహో! ఏంటే నీ ఉద్దేశ్యం మేమందరం నీతో గెలవలేక, నీకు భయపడి తూరుకుంటున్నామనుకుంటున్నావా? ఏదో ఆడపిల్ల కదా అని ఊరుకుంటుంటే మరీ నెత్తికెక్కుతున్నావు. సరే! చేతనైతే నన్ను నా ఇష్టమొచ్చినట్టు చేయమన్నావుగా, ఇక నుంచి నేనేంటో నీకు చూపిస్తాను'' ఉక్రోషంగా అన్నాడు వైభవ్.
"పోవోయ్ కొత్తెం'' అతని మాటల్ని చాలా చులకనగా తీసి పారేసింది హానిత.
"పోతాన్లేవే తింగరబుచ్చి అంటూ వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు వైహావ్.
హనితహతాశురాయి లాగా నిలబడిపోయింది.
కాలేజీ లైఫ్ లో ఆమెకదే మొదటిసారి ఛాలెంజ్ ఎదురుకావడం.