TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
.png)
“అయితే నా కిడ్నీ నిజంగానే తీసేశారా?” వెక్కివెక్కి ఏడుస్తూ డాక్టర్ శ్రీనివాస్ ని అడిగాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.
“తీసేశాను. రిపోర్ట్స్ ప్రకారం కిడ్నీ పూర్తిగా చెడిపోయింది” చెప్పాడు డాక్టర్ శ్రీనివాస్.
“కానీ ఆ మనిషిని నేను కాదుకదయ్యా.....” ఘొల్లుమన్నాడు అప్పారావ్.
“నిజమే ఇన్స్ పెక్టర్ ఆ విషయం మాకు తర్వాత తెల్సింది! మీరు బ్లూ షర్టు వేస్కుని వుండడంతో ఆ పొరబాటు జరిగింది” అన్నాడు డాక్టర్ శ్రీనివాస్.
“ఓ పని చెయ్యవయ్యా! బ్లూ షర్ట్ వేస్కున్న అందరి కిడ్నీలూ తీసి పారేయ్” కోపంగా అని, “ఓరి దేవుడోయ్” అంటూ ఘొల్లుమన్నాడు అప్పారావు.
అతని బాధ చూసి కానిస్టేబుల్స్ అంతా కన్నీరు కార్చారు.
“మీరేం బాధ పడకండి ఇన్స్పెక్టర్! మనిషి ఒక కిడ్నితో హాయిగా బ్రతకొచ్చు!” ధైర్యం చెప్పాడు డాక్టర్ శ్రీనివాస్.
“నిజమే! ఒక కన్నుతో కూడా బ్రతకొచ్చు... పీకేయ్యవయ్యా! ఇప్పుడే నా కంటి గుడ్డు కూడా పీకెయ్...” నెత్తి కొట్టుకున్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.
“ఒక కిడ్ని పోగొట్టుకుని ఒంటి కిడ్ని గాడిలా బతకాలన్న మాట నేను!” బాధగా అన్నాడు.
“మీరిలా అంటారనే నేనో పనిచేశాను ఇన్స్ పెక్టర్!” గర్వంగా అన్నాడు డాక్టర్ శ్రీనివాస్.
“ఏంటది?” అడిగాడు ఇన్స్ పెక్టర్.
“మీరు ఒంటి కిడ్నిగాడు కాదు.... మా అందర్లా రెండు కిడ్నీగాళ్ళే! మీకిప్పుడు రెండు కిడ్నిలున్నాయ్!”
ఇన్స్ పెక్టర్ అప్పారావ్ అతనివంక ఆశ్చర్యంగా చూశాడు. “ఓక కిడ్నీని కత్తిరించి పారేశావ్ గా... మరి రెండు కిడ్నీలు ఎలా వుంటాయ్! కొంపదీసి నేను మూడు కిడ్నీలతో పుట్టలేదు కదా?”
“కాదుగా?” చిలిపిగా నవ్వుతూ అన్నాడు డాక్టర్ శ్రీనివాస్.
“మరి నాకు రెండు కిడ్నీలు ఎలా వున్నాయ్ త్వరగా చెప్పూ....” జుట్టు పీక్కుంటూ అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.
“టుంగోనేషియా దేశంలో ....” ఏదో చెప్పబోయాడు డాక్టర్ శ్రీనివాస్.
“అలాంటి దేశం ఉందా?” అనుమానంగా అడిగాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.
“ఉంది....” ఆ దేశంలోని సైంటిస్టులు కుక్కల మీద చాలా చాలా సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఒక విషయం తేల్చారు.. అదేంటంటే కుక్క కిడ్నీలూ అచ్చం మనిషి కిడ్నీలలానే పనిచేస్తాయనీ.... మనిషిని కుక్క కిడ్నీ మ్యాచ్ అవుతుందనీ...”
ఇన్స్ పెక్టర్ అప్పారావ్ డాక్టర్ శ్రీనివాస్ వంక భయంభయంగా చూశాడు. “అంటే.... ఏంటి మీరంటున్నది?” అడిగాడు.
“మీరు ఉహించింది సెంట్ పర్సెంట్ కరెక్ట్... మీ నుండి తీసిపారేసిన కిడ్నీ స్థానంలో కుక్క కిడ్నీని అమర్చా!” గర్వంగా చెప్పాడు డాక్టర్ శ్రీనివాస్.
ఇన్స్ పెక్టర్ అప్పారావ్ ఘోల్లుమంటూ వెనక్కి విరుచుకుపడిపోయాడు.
|
|