TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
.png)
డాక్టర్ సింగినాధం రూమ్ బయట కూర్చున్న ఇద్దరు వ్యక్తుల్లో మొదటివాడు రెండోవాడి తొడమీద గోకాడు.
“ఏంటీ?” చికాకుగా చూస్తూ అడిగాడు రెండోవాడు. మొదటివాడు రెండువేళ్ళు చూపించాడు.
“అర్జంటా?” ఇందాకటికంటే ఎక్కువగా విసుక్కుంటూ అడిగాడు రెండోవాడు. మొదటివాడు అవునన్నట్టు తలూపాడు.
“అయితే వెళ్ళు” అన్నాడు రెండోవాడు.
“అమ్మో... ఒంటరిగా ఈ ఆసుపత్రిలో నేనెక్కడికి వెళ్ళను. అయినా ఎక్కడుందో ఏంటో? నువ్వు కూడా రా....” అన్నాడు మొదటివాడు. రెండోవాడు తలకొట్టుకున్నాడు.
“సరే పద” అన్నాడు. ఇద్దరూ అలా ప్రక్కకి లేచి వేల్లారోలేదో అక్కడికి డేవిడ్, జాకబ్ లు వచ్చారు. గది గుమ్మం ప్రక్కన వున్న డాక్టర్ సింగినాధం అనే బోర్డ్ చూశారు.
“ఇదే రూం” అన్నాడు డేవిడ్.
అంతలో వార్డ్ బోయ్ గది తలుపు తీస్కుని బయటికి వచ్చాడు. “డాక్టర్ సింగినాధం గారు.... హి హి హి.... ఉన్నారా?” వచ్చే నవ్వుని ఆపుకుంటూ అడిగాడు జాకబ్. డేవిడ్ మళ్ళీ జాకబ్ పిర్రమీద గట్టిగా గిల్లేశాడు.
“సార్ లోపల బిజీగా వున్నారు. కాస్సేపయ్యాక పిలుస్తారు.... కూర్చోండి” అని చెప్పి వెళ్ళిపోయాడు వార్డ్ బోయ్.
డేవిడ్, జాకబ్ లు బెంచీమీద కూలబడ్డారు. లోపల....
డాక్టర్ సింగినాధం గదిలో... “ఓక్కేసార్.... నేను వస్తాను” అంటూ లేచాడు మెడికల్ రిప్రజెంటేటివ్. అతనిచ్చిన వాళ్ళ మందుల కంపెనీ శాంపిల్స్, బ్రోచర్స్ అన్నీ డ్రాయర్లో వేస్తూ “ఓక్కే....” అన్నాడు డాక్టర్ సింగినాధం. మెడికల్ రిప్రజెంటేటివ్ బయటికి వెళ్ళిపోయాడు. ఇంతలో ఫోన్ మోగింది.
రిసీవర్ ఎత్తి “హలో!” అన్నాడు డాక్టర్ సింగినాధం.
అవతల గొంతు విని “గుడ్ మార్నింగ్ సార్! హౌ ఆర్ యూ? ఓక్కే... ఓక్కే... అలాగే... ఇప్పుడే వచ్చేస్తా....” అని రిసీవర్ పెట్టేశాడు డాక్టర్ సింగినాధం. అదే టైంలో జూనియర్ డాక్టర్ శ్రీనివాస్ క్యాబిన్ లోకి పచ్చాడు.
“సార్! మెడికల్ కౌన్సిల్ మీటింగేదో వుందట. మిమ్మల్ని...” డాక్టర్ శ్రీనివాస్ ఏదో చెప్పబోయాడు.
“అదే.... ఇప్పుడు ఫోన్ వచ్చింది. నేనా మీటింగ్ కి అర్జంట్ గా వెళ్ళాలి. అన్నట్టు బయట బెంచిమీద యిద్దరు సోదిగాళ్ళున్నారు. ఇందాకంతా నా మెదడుని తినేశారు. వాళ్ళకి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చెయ్యాలి. నువ్వాపని అటెండ్ అవ్వు” అన్నాడు డాక్టర్ సింగినాధం.
“అలాగే సార్” అంటూ బయటికి వచ్చాడు డాక్టర్ శ్రీనివాస్.
“మీరు నాతో రండి” అన్నాడు డేవిడ్ తో డాక్టర్ శ్రినివాస్.
“మీరేనా డాక్టర్ సింగినాధం?” నవ్వును ఆపుకుంటూ అడిగాడు జాకబ్.
“నేను కాదు గానీ... డాక్టర్ సింగినాధం గారు నాకు మీ గురించి చెప్పారు. నా పేరు శ్రీనివాస్. ఇద్దరూ శ్రీనివాస్ ని ఫాలో అయ్యారు.
“డాక్టర్ సింగినాధాన్ని మనం కలవనేలేదు. మరి ఆయన మన గురించి ఇతనికేలా చెప్పాడు?” సందేహంగా జాకబ్ అడిగాడు డేవిడ్ ని.
“నీకు ప్రతీదీ అనుమానమే! రిసెప్షనిస్టు డాక్టర్ సింగినాధానికి ఫోన్ చేసి మన గురించి చెప్పివుంటాడు” విసుక్కున్నాడు డేవిడ్.
“అంతే అయ్యుంటుందిలే....” తలకాయ్ ఊగించాడు జాకబ్.
డాక్టర్ శ్రీనివాస్ ఇద్దర్నీ ఆపరేషన్ థియేటర్లోకి తీస్కేళ్ళాడు.
|
|