TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
.png)
సరోజ, సునీత వెళ్ళేసరికి చంచల్ గూడ సెల్ లో రాంబాబు, చిన్నారావ్ మొహం వేళ్ళాడేస్కుని వున్నారు. “ఏంటి రాంబాబూ ... అసలేమైంది?’’ అడిగింది సరోజ.
“ఏమో! పేపర్ లో న్యూస్ చూసే వుంతారుగా .... మీకం తెల్సో మాకూ అంతే తెల్సు’’ అన్నాడు రాంబాబు.
“దీపని ఆ నాగరాజుగాడే కిడ్నాప్ చేసి, మా సహకారంతోనే కిడ్నాప్ చేసినట్టు కమీషనర్ లింగారావ్ కి చెప్పాడు ...’’ అన్నాడు రాంబాబు.
“పైగా మేం నాగరాజు గాడికి సాయం చేసినందుకు వాడిని రెండు లక్షలు అడుగుతున్నట్టు కమీషనర్ లింగారావ్ కి చెప్పాడు ...’’ అన్నాడు రాంబాబు.
“అయినా మీరు ముక్కూ మొహం తెలీనివాడిని ఎలా నమ్మారు?! నామ్మడమే కాకుండా పోయిపోయి వాడిని కమీషనర్ ఇంట్లో తీస్కెళ్ళిపెట్టారు. వాడు గజదొంగ మంగులు మనిషే. మంచి ప్లాన్ వేస్కుని మీ దగ్గర చేరాడు’’ అంది సునీత.
“అవును ... చాలా పోరాబాటైపోయింది’’ అన్నాడు చిన్నారావ్.
“అయినా దీపాని మంగులు నుండి ప్రాణాలతో కాపాడినవాళ్ళు ఇప్పుడిలా చేశారంటే కమీషనర్ లింగారావ్ ఎలా నమ్ముతున్నారు?!’’ అడిగింది సరోజ.
“నాగరాజు మాకు రెండు లక్షలు ఆఫర్ చేశాడనీ ... దానికి ఆశపడి మేం ఈ పని చేశామనీ కమీషనర్ లింగారావ్ నమ్ముతున్నాడు’’ చెప్పాడు రాంబాబు.
“అలా ఎలా అనుకుంటాడు? వుండు ... కమీషనర్ లింగారావ్ ని మేమిద్దరం కల్సి మాట్లాడతాం!’’ అంది సరోజ ఆవేశంగా.
“వద్దు, మీరిప్పుడు ఈ విషయమై కమీషనర్ ని కలిస్తే మిమ్మల్ని కూడా లింగారావ్ అనుమానిస్తాడు. పోలీసుల సంగతి నీకు తెలీదు!’’ అన్నాడు రాంబాబు.
“మరిప్పుడు ఎలా?” బాధగా అంది సరోజ.
“చూద్దాం ... మంచివాళ్ళకెప్పుడూ అన్యాయం జరగదు’’ అన్నాడు రాంబాబు.
*****
రాంబాబు, చిన్నారావ్ లు ఆరెస్టయ్యారన్న వార్తవిని సంతోషించిన ఏకైక వుఅక్తి ఇన్స్ పెక్టర్ అప్పారావ్. “పీడా వదిలిపోతుంది. లేకపోతే కమీషనర్ అండ చూస్కుని ఎంత కాల్చుకుతిన్నారు?’’ అనుకున్నాడు.
కమీషనర్ లింగారావ్ దీప ఆచూకీ చెప్పమని నయానా, భయానా ఏ విధంగా అడిగినా మాకేం తెలీదనే సమాధానమే రాంబాబు, చిన్నారావ్ ల నోటినుండి వస్తోంది. ఆరోజు ....
“ట్రింగ్ ... ట్రింగ్ ... ట్రింగ్ ...’’ కమీషనర్ లింగారావ్ ఇంట్లో ఫోన్ మోగింది.
కమీషనర్ లింగారావ్ ఫోన్ ఎత్తాడు. “హలో ! ....’’ అన్నాడు.
“నేనే ... మగుల్ని మాట్లాడ్తున్నా!’’ అన్నాడు అవతలినుండి గజదొంగ మంగులు.
“ఉండు ... ఒక్క క్షణం ...’’ అన్నాడు కమీసనర్ లింగారావ్.
“మిస్టర్ లింగారావ్ ... నువ్వేమీ ఫోన్ ట్రాప్ చెయ్యడానికి అవస్థపడకు, ఇది పబ్లిక్ ఫోన్ ... కాబట్టి దాని గురించి ఆలోచించకుండా నేను చెప్పింది విను’’ అంటూ “అబ్బా! ...’’ అని బాధగా అరిచాడు.
“ఎంటో చెప్పు!’’ అన్నాడు కమీషనర్ లింగారావ్.
“ఏంటయ్యా చెప్పేది? మీ పాప కర్రతో నా మొకాలిచిప్పలమీద కొట్టింది. సరేగానీ, మేం చెప్పిన పదిలక్షల గురించి ఏం ఆలోచిన్చావ్?’’ అడిగాడు మంగులు.
“మీరు ఒక్క పైసా కూడా తగ్గానని అంటున్నారు. పదిలక్షలు అంత అర్జెంట్ గా ఎలా తేగలను? నాకు కాస్త టైం ఇవ్వండి’’ అన్నాడు లింగారావ్.
“నువ్విలా టైం తీస్కుంటూనే వుండు. నువ్వు డబ్బు రెడీ చేస్కుని చెప్పేదాకా నేను మీ దీప క్షేమ సమాచారాల గురించి నీకు చెప్పను’’
“మా దీప క్షేమంగా వుందని నాకు తెల్సు!’’ అన్నాడు కమీషనర్ లింగారావ్.
“ఎలా తెల్సు?!’’ ఆశ్చర్యంగా అడిగాడు గజదొంగ మంగులు.
“ఇందాకే కదా మా దీప దుడ్డుకర్రతో నీ మోకాలి చిప్పలమీద కొట్టింది?’’ అన్నాడు కమీషనర్ లింగారావ్.
“బాబోయ్ ... చంపేసిందిరా నాయనో ... మళ్ళీ కొట్టింది!’’ అవతలనుండి ఘోల్లుమన్నాడు మంగులు.
*****
|
|