Home

»

Latest News

సల్లూభాయ్ పెళ్లికి డేట్ ఫిక్సైపోయిందా...?

May 18, 2016

ఇప్పుడు దేశవ్యాప్తంగా జనాల దృష్టంతా సల్మాన్ పెళ్లి పైనే ఉంది. ఇదేదో జాతీయ విపత్తులా చర్చించేసుకుంటున్నారు జనాలు. ఇన్నాళ్లూ లేని ఈ డిస్కషన్, మనోడు ముదిరిపోయాక ఎందుకయ్యా అంటే, దానికి కారణం లూలియా వంటూర్. ఈ రొమానియన్ మోడల్ సీన్ లోకి ఎంటరైన తర్వాతే పెళ్లి రూమర్లు పెరిగాయి. ఇప్పటి వరకూ సల్లూభాయ్ ఐశ్వర్య, కత్రినా అంటూ చాలామందిని ట్రై చేశాడు గానీ వర్కవుట్ అవలేదు. ఎట్టకేలకు ఈ లూలియా పాప ఆయనకు సెట్టయ్యింది. సల్మాన్ తల్లిని కూడా చాలా ప్రేమగా చూసుకుంటున్న ఆమెను తన జీవితభాగస్వామిగా సల్లూ భాయ్ యాక్సెప్ట్ చేసేశాడని టాక్ ఒకటి బాలీవుడ్ లో నడుస్తోంది. వయసు పెరిగిపోతున్న తల్లికి, తన పెళ్లితో గిఫ్ట్ ఇవ్వాలని సల్లూ భాయ్ అనుకుంటున్నాడని, డిసెంబర్ 27న పెళ్లికి డేట్ ఫిక్స్ చేశారని పుకార్లు జోరుగా షికారు చేస్తున్నాయి. సరిగ్గా ఆ రోజే సల్మాన్ బర్త్ డే. 51లోకి అడుగుపెట్టే ఆ శుభసందర్భంలోనే పెళ్లి జీవితంలోకి కూడా అడుగుపెట్టాలనుకుంటున్నాడట. అయితే ఈ వార్తలపై బ్యాచిలర్ గారు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ ఈ న్యూస్ నిజమైతే సల్మాన్ ఫ్యాన్స్ కు పండగే..

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com