Home

»

Latest News

రాజమౌళి రికార్డ్ కు ప్రభాస్ బ్రేక్ వేస్తాడా?

Mar 13, 2015 11:15AM

టాలీవుడ్ లో వరుస విజయాలు సాధిస్తున్న ఎస్‌ఎస్‌ రాజమౌళికి మరో ట్రాక్ రికార్డ్ కూడా వుంది. ఆయన సినిమాలో నటించే ఏ హీరోకైనా వరస ప్లాఫ్‌లు తప్పవనే టాక్ ఇండస్ట్రీలో వుంది. రాజమౌళితో మూడు సినిమాలు చేసిన ఎన్టీఆర్ కు సింహాద్రి తర్వాత మళ్ళీ యమదొంగ వరకు హిట్టే రాలేదు. అలాగే మగధీర తర్వాత రామ్‌చరణ్‌కు, మర్యాద రామన్న తర్వాత సునీల్‌, విక్రమార్కుడు తర్వాత రవితేజకు ప్లాఫ్‌లే ఎదురుకాగా, ఈగ తర్వాత నానికి ఇప్పటి వరకు హిట్టు అన్నది లేకుండా పోయింది. ప్రభాస్‌కు కూడా రాజమౌళి ఎఫెక్ట్‌ బాగానే తగిలింది. ఛత్రపతి లాంటి సూపర్‌హిట్‌ తర్వాత ప్రభాస్‌ కు వరుస ప్లాఫ్‌లే పలకరించాయి. దీంతో ఈ సారి ఈ సెంటిమెంట్‌ను ఎలాగైనా అధిగమించాలనే ఆలోచనలో ప్రభాస్ వున్నట్లు సమాచారం. అందుకే తనకు ఎక్కువగా కలిసొచ్చిన లవ్‌ ఎంటర్‌టైన్‌లపై దృష్టి పెట్టాడట. ఈ క్రమంలోనే రన్‌రాజారన్‌ ఫేమ్‌ సుజీత్‌ ప్రభాస్‌ కోసం ఓ అద్భుతమైన లవ్‌, రొమాంటిక్‌ ఎంటర్‌టైన్‌ను రెడీ చేస్తున్నట్లు సమాచారం. మరి ప్రభాస్ రాజమౌళికి ట్రాక్ రికార్డ్ బ్రేక్ చేస్తాడో? లేదో వేచిచూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com