గోపీచంద్ స్వింగ్ మీదున్నాడు
on Mar 13, 2015
.jpg)
గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ ‘జిల్’ ఆడియో విడుదల చేసి విడుదలకు సిద్దమవుతోంది. గత కొంతకాలంగా వరుస పరాజయాలతో డీలాపడ్డ గోపీచంద్ మళ్ళీ లౌక్యం సినిమాతో సూపర్ హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చాడు. 'లౌక్యం' తరువాత గోపిచంద్, 'మిర్చి' 'రన్ రాజా రన్' వంటి సూపర్ హిట్ల తరువాత యువి క్రియేషన్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే వున్నాయి. దీంతో బిజినెస్ కూడా బాగానే జరిగిందనేది ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ సినిమాకి యావరేజ్ టాక్ వచ్చిన కూడా లాభాలు రావడం ఖాయమంటున్నారు. ఇక హిట్ టాక్ వస్తే నిర్మాతల జేబుల్ని జిగేల్‌మన్పించడం ఖాయమట. సో గోపీచంద్ ‘జిల్’తో హిట్ కొడితే మళ్ళీ ట్రాక్ లోకి వచ్చినట్లే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



