Home

»

Latest News

పవన్ పూరీ తో సినిమా మొదలెట్టేస్తాడా..?

Apr 29, 2016 7:24PM

సర్దార్ గబ్బర్ సింగ్ ను అంచనాలు అందుకోలేకపోవడంతో, మరో సినిమాతో ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వడం కోసం పవర్ స్టార్ బిజీ అయ్యాడు. తనతో గతంలో ఖుషీ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన ఎస్ జే సూర్య డైరెక్షన్లో ఫ్యాక్షనిస్ట్ లవ్ స్టోరీ చేయడానికి కమిట్ అయ్యాడు. 2019లో పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రానుండటంతో, ఈలోపే వీలైనన్ని సినిమాల్ని పూర్తి చేసేయాలని పవర్ స్టార్ ప్లాన్. సూర్య సినిమా తర్వాత త్రివిక్రమ్ తో సినిమా అనుకున్న పవర్ స్టార్, ఇప్పుడు పూరీ వైపు మొగ్గుచూపుతున్నాడని వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ సినిమా షూటింగ్ సంవత్సరం పడుతోంది. తనకున్న టైమ్ లిమిట్ దృష్ట్యా, సూర్య తర్వాత పూరీతో సినిమా అయితేనే బెస్ట్ అని పవన్ అనుకుంటున్నాడని ఫిలింనగర్ జనాలంటున్నారు. కానీ పూరీ ఇప్పటికే కళ్యాణ్ రామ్ తో సినిమా స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమా, మహేష్ తో జనగణమన ఉన్నాయి. మరి పవన్ తో సినిమా పూరీ ఎప్పుడు చేస్తాడు. కాబట్టి, ఇదంతా పుకారే అని పవన్ అభిమానులు కొట్టిపారేస్తున్నారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ పవన్ పూరీతో చేసేకంటే, త్రివిక్రమ్ తో చేస్తేనే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఏది నిజమో ఇంకొన్నాళ్ల పాటు ఆగితే గానీ తెలీదు మరి. కాగా ఎస్ జే సూర్య తో చేస్తున్న సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీకి హుషారు అనే పేరును పరిశీలిస్తున్నారని సమాచారం.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com