చెర్రీ సైన్స్ ఫిక్షన్ మూవీ ప్లాన్ చేస్తున్నాడా..?
on Apr 29, 2016

ఆడియన్స్ తెలివికి పరీక్ష పెట్టే అతి కొద్దిమంది డైరెక్టర్లలో సుకుమార్ కూడా ఒకరు. నాన్నకు ప్రేమతో సినిమా తర్వాత, సుక్కు మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో సినిమా కమిట్ అయ్యాడన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం వినిపిస్తోంది. ఇన్నాళ్లూ చెర్రీ యాక్షన్ అండ్ మాస్ సినిమాలు, లవ్ సినిమాలు చేశాడు తప్ప వేరే జానర్ల వైపు పెద్దగా దృష్టి పెట్టలేదు. కానీ సుక్కుతో చేయబోయే సినిమా మాత్రం సైన్స్ ఫిక్షన్ మూవీ ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చరణ్ కున్న మార్కెట్ వాల్యూ దాటి మరీ 70 కోట్ల భారీ ఖర్చుతో ఈ సినిమాను సుక్కు ప్లాన్ చేస్తున్నాడట. తెలుగు హిందీ భాషల్లో సినిమా రిలీజయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. శ్రీమంతుడు సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్నారు. ఇప్పటి వరకూ చేయని కొత్త జానర్లో రామ్ చరణ్ చేస్తున్నాడంటే, మెగాఫ్యాన్స్ కు కూడా పండగే. ప్రస్తుతం చెర్రీ తనీ ఒరువన్ రీమేక్ లో బిజీగా ఉన్నాడు. లెక్కల మాష్టారు సుక్కు, స్క్రిప్ట్ ను పక్కాగా బౌండ్ చేస్తున్నాడట. ఇద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరమే..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



