Home

»

Latest News

ఫ్యాన్స్ కు ఎన్టీఆర్ పుట్టినరోజు గిఫ్ట్..!

Apr 29, 2016

యంగ్ టైగర్ ఎన్టీఆర్, జనతా గ్యారేజ్ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. కొరటాల శివ డైరెక్షన్లో, ఈ మూవీ శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. కాగా, మే 20 ఎన్టీఆర్ బర్త్ డే.తన పుట్టిన రోజున అభిమానులకు ఏదొక గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నాడు తారక్. గతేడాది బర్త్ డే కు, తన కొడుకు అభయ్ రామ్ ఫోటోలు విడుదల చేసి, అభిమానులందరికీ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఈ సారి బర్త్ డే కు జనతాగ్యారేజ్ ఫస్ట్ లుక్ తో ఫ్యాన్స్ ను ఖుష్ చేయాలనుకుంటున్నాడు యంగ్ టైగర్. మే నెలలోనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మరో విశేషం ఉంది. మే 28న స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి. ఆ సందర్బంగా కూడా ఫ్యాన్స్ కు టీజర్ కట్ చేసిద్దామని ప్లాన్ చేస్తున్నాడు ఎన్టీఆర్. సో నందమూరి అభిమానులకు మే నెలలో రెండు గిఫ్ట్ లు కన్ఫామ్ అన్న మాట.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com