Home

»

Latest News

సిద్ధాపూర్ ను సందర్శించిన శ్రీమంతుడి శ్రీమతి..!

Apr 29, 2016

సూపర్ స్టార్ మహేష్ బాబు దత్తత తీసుకున్న ఊళ్లను ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ సందర్శిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం, బుర్రిపాలెం ఊరికి వెళ్లి వచ్చిన ఆమె, ఈ సారి తెలంగాణాలోని సిద్ధాపూర్ ఊరికి చేరుకున్నారు. మహేష్ బాబు ఆంధ్రాలో బుర్రిపాలెం గ్రామాన్ని, తెలంగాణాలో సిద్ధాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. సిద్ధాపూర్ చేరుకున్న ఆమె, ఊరంతా పర్యటించారు. త్వరలోనే మంత్రి కేటీఆర్, మహేష్ బాబులు ఈ ఊరికి వస్తారని ఆమె చెప్పారు. ఊరికి కావాల్సిన అభివృద్ధి పనుల గురించి కలెక్టర్ తో చర్చిస్తున్నామని ఆమె తెలిపారు. బుర్రిపాలెంలో పర్యటించిన సమయంలో కూడా ఆ ఊరి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారామె. తాము దత్తత తీసుకున్న ఈ రెండు ఊర్లనూ మోడల్ విలేజ్ లుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తామన్నారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com