English | Telugu

మహారాణా ప్రతాప్ సినిమా చేస్తున్న రాజమౌళి..?

on May 10, 2016

రాజమౌళికి జక్కన్న అన్న పేరు రావడానికి కారణం ఉంది. సినిమాను రిలీజ్ ముందు రోజు వరకూ చెక్కుతూనే ఉంటాడాయన. అందుకే సినిమాను అంతలా చెక్కుతాడని జక్కన్న అన్న పేరుతో ముద్దుగా పిలుస్తుంటారు ఇండస్ట్రీ జనాలు. కానీ అంతకు మించి రాజమౌళిలో ఉన్న మరో మంచి విషయం, ఎవరూ తీసుకోని సబ్జెక్ట్ లను, భారీతనాన్ని ఎంచుకోవడం. స్వయంగా తానే చాలా సార్లు చెప్పినట్టు రాజమౌళి, చందమామ కథలా సినిమాను చూపించాలనుకుంటాడు. మగథీర అయినా,ఈగ అయినా, బాహుబలి అయినా జక్కన్న చేసింది ఇదే. చిన్న సినిమాలు మామూలు సినిమాలు రాజమౌళి ఎంచుకోలేడు.

విషయంలోకి వెళ్తే, ప్రస్తుతం బాహుబలి 2 చెక్కుతున్న రాజమౌళి దృష్టి మహారాణా ప్రతాప్ జీవిత చరిత్ర మీద పడిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. స్వయంగా రాజమౌళే తనకు చారిత్రక సినిమా తీయాలని ఉందని ప్రకటించాడు కూడా. లేటెస్ట్ గా తన ఫేస్ బుక్ పేజ్ లో మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా ఆయన్ను గుర్తు చేసుకుంటూ పోస్ట్ పెట్టాడు. దీంతో, ఇప్పటికే సినిమా తీయాలని ఉందని ప్రకటించిన రాజమౌళి, నెక్స్ట్ రాణా ప్రతాప్ సినిమా తీయడం కన్ఫామ్ అంటున్నారు సినీజనాలు. బాహుబలి తర్వాత ఎన్టీఆర్ సినిమా ఉంటుందని, ఆ వెంటనే రాణా ప్రతాప్ కథతో చారిత్రక సినిమాను తెరకెక్కిస్తాడని వార్తలు వస్తున్నాయి. ఎలాగూ దేశవ్యాప్త గుర్తింపు ఉంది కాబట్టి, జక్కన్న ఆ సినిమా తీసినా ఇండియా వైడ్ ప్రేక్షకులు ఆదరిస్తారు. అయితే ఇప్పటికే బాహుబలి లాంటి భారీ సినిమాను తీసిన దర్శక బాహుబలి మళ్లీ వెంటనే ఆ రేంజ్ సినిమా తీయడానికి పూనుకుంటాడో లేదా అన్నదే అసలు ప్రశ్న.

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here