Home

»

Latest News

రజనీ కబాలి టీజర్ విడుదుల.. లైకులు, షేర్లతో నెట్టింట్లో హల్ చల్..

May 01, 2016

రజనీకాంత్ కలైపులి ఎస్ థానూ సమర్పణలో, రంజిత్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా కబాలీ ట్రైలర్ విడుదలైంది. అలా విడుదలైందో లేదో అప్పుడే సోషల్ మీడియాలో ఈ వీడియో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా టీజర్ మే 1న విడుదల చేయనున్నట్లు కొద్దిరోజులు క్రితం సినిమా యూనిట్ చెప్పినట్టే ఈరోజు సినిమా టీజర్ విడుదల చేశారు. అయితే తమిళంలోనే ఈ టీజర్ విడుదలైంది. ‘కబాలి అంటే మెలితిప్పిన మీసం , లుంగీ కట్టకుని వుంటాడనుకున్నావా..?’’ అని టీజర్లో రజనీ పలికే మాటలు.. సెక్యూరిటీ మధ్య రజనీ తనదైన స్టయిల్ లో నడిచి రావడం, ఓ స్వచ్ఛంధ సంస్థ నిర్వహించిన ముఖాముఖిలో "అవును, నువ్వేనా గ్యాంగ్ స్టర్?" అని అడిగిన ప్రశ్నకు తన కళ్లద్దాలను తీస్తూ రజనీ నవ్వడం, రెండు పోరాట దృశ్యాలు ఇందులో ఉన్న ఈ టీజర్ చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమైన విడుదలైన ఈ టీజర్ కు ఇప్పటికే 60 వేల 'లైక్'లతో, షేర్లతో దూసుకెళ్లిపోతోంది. మరి మీరు కూడా ఓ లుక్కేయండి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com