మామ చిరంజీవి సినిమా కోసం కోడలు ఉపాసన పూజలు..
on May 1, 2016
.jpg)
చిరంజీవి తాను నటించబోయే 150వ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగిన సంగతి తెలిసిందే. 'కత్తి' చిత్రానికి రీమేక్ గా వివి వినాయక్ దర్శకత్వంలో ఈచిత్రం తెరకెక్కుతోంది. అయితే షూటింగ్ మాత్రం జూన్ నుండి ప్రారంభమయి.. వచ్చే ఏడాది సంక్రాతికి రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ తన మామగారు చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుకుంటూ, హీరో రాంచరణ్ భార్య ఉపాసన ఇప్పటినుండే పూజలు చేస్తున్నారంట. తూర్పు గోదావరి జిల్లా, అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించారట. జిల్లా చిరంజీవి అభిమాన సంఘం నేత కత్తిపూడి బాబి, మరికొందరు అభిమానులు ఆమెతో పాటు దేవాలయానికి రాగా, పండితులు స్వాగతం పలికి ప్రత్యేక పూజా ఏర్పాట్లు చేశారు. మరి ఉపాసన పూజలు ఫలిస్తాయోలేదో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



