బ్రహ్మోత్సవానికి అనుకోని అవాంతరం..!
on May 19, 2016
మహేష్ బ్రహ్మోత్సవం సినిమాకు అంతా సిద్ధమైంది. తెలంగాణాలో మొదటి రోజు సింగిల్ స్క్రీన్స్ లో ఐదు షోలు వేసుకోవడానికి ప్రభుత్వం పర్మిషన్ కూడా ఇచ్చింది. అయితే ఈ ఆనందంలో ఉన్న మూవీ టీం కు, వర్షం పెద్ద సెట్ బ్యాక్ లా మారింది. సూపర్ స్టార్ సినిమా కాబట్టి, భీభత్సమైన ఓపెనింగ్స్ ఎక్స్ పెక్ట్ చేయచ్చు. బాహుబలి క్రాస్ చేయలేకపోయినా, సెకండ్ ప్లేస్ అయితే ఖచ్చితంగా టార్గెట్ చేయచ్చు. అయితే తెలంగాణాలో ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్న బ్రహ్మోత్సవానికి, ఆంధ్రా ప్రాంతంలో మాత్రం వర్షాలు దెబ్బ కొట్టేలా కనబడుతున్నాయి. మూవీ ఫ్యాన్స్ ఫస్ట్ డే ఎలాగూ చూసి తీరతారు.
అయితే ఆ తర్వాతి నుంచి మాత్రం జనాలు, ఫ్యామిలీలు ఈ వర్షాల్లో, తుఫానుల్లో హాల్ కు వస్తారా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురవడమే కాక, తీర ప్రాంతాలకు తుఫాన్ హెచ్చరికలు కూడా జారీ అయిన సంగతి తెలిసిందే. అందుకే ఇఫ్పుడు శ్రీకాంత్ అడ్డాల అండ్ కో కు దిగులు పట్టుకుంది. కలెక్షన్లపై ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. వర్షాలు తగ్గాలని, జనాలు సినిమాకు రావాలని మూవీ యూనిట్ కోరుకుంటున్నారు. గతంలో మెగాస్టార్ జగదేకవీరుడు అతిలోక సుందరి రిలీజైనప్పుడు తుఫాన్ రాష్ట్రాన్ని వణికించేస్తున్నా, జనాలు ఆ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర కాసులు కురిపించారు. మరి అలాంటి సీన్ ఇప్పుడు రిపీట్ అవడానికి ఛాన్స్ ఉందా..? చూద్దాం.