Home

»

Latest News

యూఎస్‌లో బ్రహ్మోత్సవం మానియా.. గంటకే కోటి దాటిన వసూళ్లు..

May 20, 2016

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మహేశ్ బ్రహ్మోత్సవం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదల కావడంతో తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మోత్సవ వాతావరణాన్ని తీసుకువచ్చింది.  సూపర్‌స్టార్ మహేశ్ బాబు-కొరటాల శివ కాంబినేషన్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత వీరిద్దరూ జత కట్టడంతో సినిమా ఎలా ఉండబోతుందోనని ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఎగ్జయిటింగ్‌తో ఉన్నారు.

అయితే భారత్ కంటే ముందుగానే అమెరికాలో 87 సెంటర్లలో మహేశ్ పలకరించాడు. యూఎస్‌లోని 87 సెంటర్లలో బ్రహ్మోత్సవం రిలీజైంది. అంతేకాకుండా భారత కాలమాన ప్రకారం నిన్న రాత్రి 8 గంటల సమయానికి కోటి రూపాయల వసూళ్లు దాటినట్టు ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో బ్రహ్మోత్సవం ఫెస్టివల్ టాప్ ట్రెండింగ్‌లో ఉంది. అటు రిలీజ్‌కు ముందే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అన్న టాక్ రావడంతో ఫ్యామిలీ ఆడియాన్స్ ముఖ్యంగా యువత ధియేటర్ల వద్ద సందడి చేస్తోంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com