Home

»

news

ఆమె దారిలో సమంత..!!

Mar 27, 2015

టాలీవుడ్‌, కోలీవుడ్లలో ప్రేమ ప్రయాణాలకు కొదువలేదు. ఇందులో కొన్ని ప్రేమ జంటలు పెళ్ళి పీటల దాకా వెళ్ళినవి ఉన్నాయి. మరికొన్ని ప్రేమ వరకే వచ్చి ఆగిపోయినవి ఉన్నాయి. ప్రేమ పెళ్ళి చేసుకున్న వారిలో అజిత్‌-శాలిని, సూర్య-జ్యోతిక, ప్రసన్న-స్నేహ, మమతామోహనదాస్‌ తన చిన్ననాటి మిత్రుణ్ని వివాహం చేసుకున్నారు. ఇలాంటి జాబితాలో చాలా మందే ఉన్నారు. అలాగే తెలుగు ఇండస్ట్రీలో కూడా శ్రీకాంత్‌-ఊహా జంటది ప్రత్యేకమైన స్థానం. ఇద్దరిదీ ప్రేమ వివాహమే. ఇలా చాలానే సినిమా ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు నడుస్తున్నాయి. మొన్నటి దాకా ఓ టాలీవుడ్‌ హీరోతో చెట్టపట్టాల్‌ వేసుకుని తిరిగిన త్రిష.. ఇప్పుడు చెన్నైకి చెందిన ఓ యువ వ్యాపారవేత్తని పెళ్ళి చేసుకోబోతోంది. ప్రస్తుతం తెలుగులో బాలయ్యతో ‘లయన్‌’ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం పూర్తవగానే… ఈ అమ్మడు పెళ్ళి పీటలు ఎక్కనుందనే ప్రచారం సాగుతోంది. మొన్నటి వరకు సమంత కూడా హీరో సిద్ధార్థ్‌తో పీకల్లోతు ప్రేమలో కురుకుపోయింది. ఇప్పుడు ప్లేటు ఫిరాయించింది. నా ప్రేమ చాలా బలమైందని పలుమార్లు చెబుతూ వచ్చిన ఈ తమిళ్‌ పొన్ను… సిద్ధార్థ్‌తో తెగతెంపులు చేసుకుని తాజాగా ఓ యువ వ్యాపార వేత్తతో డేటింగ్‌ చేస్తోందని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే ఈ ప్రేమికుడితోనైనా పెళ్ళి పీటలెక్కుతుందేమో లేదో చూడాలి!!

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com