Home

»

Latest News

ఔను..ఆమె మళ్ళీ ప్రేమలో పడింది

Mar 27, 2015 4:02PM

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మరోసారి ప్రేమలో పడ్డారు. అవును… నిజమే… పవన్ తో విడిపోయి ఒంటరిగా ఉంటున్న రేణూ మళ్లీ ప్రేమలో పడింది. ఈ విషయాన్ని ఎవరో చెప్పలేదు… ఆమే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు.గతంలో పవన్ ను ప్రేమించి పెళ్లాడి.. పిల్లలను కని… పవన్ తో వేరుపడిన ఈ సుందరి ఇక ప్రేమలో పడనని అభిమానులకు మాట ఇచ్చింది. అయితే, మళ్లీ ఇప్పుడు ఆమె ప్రేమలో పడింది. మాట తప్పినందుకు అభిమానులను క్షమాపణలు కూడా కోరుతోంది రేణూ. ఇంతకీ ఆమె ఎవరితో ప్రేమలో పడిందో తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోవాల్సిందే. ఆమె ప్రేమలో పడింది ఆమెతోనేనట… ”నాతో నేను ప్రేమలో పడ్డాను” అని రేణూ దేశాయి తాజాగా ట్విట్టర్ లో పెట్టింది. ఆమె చేసిన ట్వీట్ మొత్తం చదివితే కానీ ఈ సంగతి తెలియలేదు. రేణూ ఇప్పుడు ప్రేమ గురించి మళ్లీ మాట్లాడుతుందంటే… కొద్ది రోజుల్లో ఇంకో ట్వీట్ చేస్తుందేమో చూడాలి. అందులో ఈసారి ఏం పెడుతుందో ఏమో? రేణూ తీరు చూస్తుంటే సమ్ థింగ్… సమ్ థింగ్ కదా.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com