Home

»

Latest News

ప్రభాస్‌కి బాలీవుడ్ ఆఫర్?

Oct 15, 2015 1:51PM

బాలీవుడ్ కన్ను ప్రభాస్ మీద పడింది. గతంలో ప్రభాస్ నటించిన బోలెడన్ని తెలుగు సినిమాలు హిందీలోకి డబ్బింగ్ అయి విడుదలయ్యాయి. అయినప్పటికీ ప్రభాస్ మీద బాలీవుడ్ కన్ను పడలేదు. లేటెస్ట్‌గా బాహుబలి విడుదలైన తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒక్కసారిగా బాలీవుడ్‌ దృష్టిని ఆకర్షించాడు. ప్రభాస్‌ని డైరెక్ట్ బాలీవుడ్ ఫిలిం ద్వారా ఇంట్రడ్యూస్ చేయడానికి చాలామంది నిర్మాతలు ఇంట్రస్ట్ చూపిస్తున్నట్టు సమాచారం.

ఇప్పటికే కొంతమంది బాలీవుడ్ బడా దర్శక నిర్మాతలు ప్రభాస్‌ని అప్రోచ్ అయ్యారట కూడా. అయితే ప్రభాస్ వారికి ఎస్ అనిగానీ, నో అని గానీ చెప్పకుండా పెండింగ్‌లో పెట్టాడని న్యూసు. బాలీవుడ్ మాయలో పడి టాలీవుడ్‌కి దూరం కావడం ప్రభాస్‌కి ఇష్టం లేదని ప్రభాస్ సన్నిహితులు చెబుతున్నారు. అయితే బాలీవుడ్‌లో ఒక ట్రైల్ వేస్తే తప్పేమీ లేదని ప్రభాస్ సన్నిహితులు అతన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌కి బాలీవుడ్ నుంచి వచ్చిన ఆఫర్లు కూడా చిన్నా చితకా ఆఫర్లు కాదట. ఇప్పటి వరకు ఏ టాలీవుడ్ హీరోకీ రానంత బిగ్గెస్ట్ ఆఫర్ ప్రభాస్ పర్మిషన్ కోసం ఎదురుచూస్తోందట.

టాలీవుడ్ హీరో రానా ఇప్పటికే బాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. ఇప్పుడు ప్రభాస్ కూడా ఆ రూట్లో వెళ్తే బాగుంటుందని ఆయన అభిమానులు అనుకుంటున్నారు. బాలీవుడ్‌లో అయితే ప్రభాస్ మీద భారీ అంచనాలు వున్నాయని, ప్రభాస్ కనుక బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తే చాలాకాలం హిందీ సినిమాలను ఏలే ఛాన్స్ వుందని అనుకుంటున్నట్టు భోగట్టా. ప్రభాస్ ఇప్పటికే ముంబై యాడ్స్.లో నటించేస్తున్నాడు. ఇక ముంబై సినిమాల్లో నటించకుండా వుంటాడా... చూద్దాం.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com