Home

»

Gossips

పందెంకోడితో మిల్కీబ్యూటీ?

Jun 28, 2015 5:58PM

తమన్నా పనైపోయిందన్నారు. ఇక బిజినెస్ చేసుకోవడం బెస్టన్నారు. కానీ కామెంట్ చేసిన వాళ్లకి ఝలక్ ఇచ్చేలా వరుస ఆఫర్స్ సొంతం చేసుకుంటోంది తమ్మూ. ఇప్పటికే బెంగాల్ టైగర్ తో రొమాన్స్ చేసిన మిల్కీ...కోలీవుడ్ లో ఆర్యతో ఓ సినిమాలో నటిస్తోంది.

లేటెస్ట్ గా పందెంకోడితో రొమాన్స్ చేయనుందట. అదేంటి ఎవరైనా పందెంకోడితో పోటీ పడతారు కానీ రొమాన్స్ చేస్తారా అంటారా? అయ్యో కోడి కాదండి పందెంకోడి కుర్రాడువిశాల్ తో నటించే ఛాన్స్ కొట్టేసిందట. అదికూడా పందెంకోడికి సీక్వెల్ గా తెరకెక్కనుందట.

ఇప్పటివరకూ విశాల్ తో బొద్దుగుమ్మలే కానీ నాజూకు భామలు నటించలేదు. దీంతో తమ్మూ అదిరిపోద్దంటున్నారు. మొత్తానికి తంబీలకు సరికొత్త విందన్నమాట. మరి పందెంకోడి సీక్వెల్ హిట్టైతే ఇంకొన్నాళ్లు తమ్మూకి తిరుగులేదంతే!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com