Home

»

Gossips

భాగ్యలక్ష్మి ఎవరో?

Jun 28, 2015 5:51PM

పవన్ కు పెద్దగా ఎవ్వరూ నచ్చరా? లేదా పవన్ సినిమా దర్శకుల రచ్చ ఎక్కువుంటుందా? ఏమోగానీ పవన్ కళ్యాణ్ సినిమాకి హీరోయిన్ పై ఎప్పుడూ టెన్షనే. ఈ పిల్ల కాదు ఆ పిల్ల ఆ పిల్ల కాదు ఈ పిల్ల అని అమ్మడి ముఖానికి రంగేసేవరకూ ఫైనల్ చేయరు. గబ్బర్ సింగ్ సీక్వెల్ కి ఇప్పుడిదే పరిస్థితి వచ్చింది. ముందుగా అనుకున్న అనీషా అంబ్రోస్ ని తీసేశారుగా ఇప్పుడెవరా అని ఆరాతీస్తే సమంత, శ్రుతి హాసన్ లో ఎవరో ఒకరనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో భాగ్యలక్ష్మిగా శ్రుతికి మంచి మార్కులే పడ్డాయి.అటు అత్తారింటికి దారేదిలో బావ బావ అంటూ పవన్ ను ప్రేమతో తడిపేసింది. రెండూ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలే. దీంతో వీళ్లిద్దర్లో ఎవరైనా ఓకే అంటున్నారు అభిమానులు. ఇంతకీ పవన్ తో రొమాన్స్ చేసేదెవరో?

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com