ప్రముఖ యువ హీరో అల్లు అర్జున్ మ్యారేజ్ ఫంక్షన్ స్నేహారెడ్డితో మార్చ్ 5 వ తేదీన హైదరాబాద్ హైటెక్స్ లో ఘనంగా జరిగింది. అల్లు అర్జున్ మ్యారేజ్ ఫంక్షన్ కి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై, అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంపతులను ఆశీర్వదించారు. అల్లు అర్జున్ మ్యారేజ్ ఫంక్షన్ ని ప్రముఖ శాటిలైట్ టి.వి.ఛానల్ "మా"టి.వి. లైవ్ టెలికాస్ట్ చేసింది. అల్లు అర్జున్ మ్యారేజ్ ఫంక్షన్ ఏర్పాట్లన్నీ అంటే పెళ్ళి వేదిక సెట్ వేయటం దగ్గర్నుండీ అన్ని పనులూ అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ దగ్గరుండి పర్యవేక్షించాడు.
ఈ అల్లు అర్జున్ మ్యారేజ్ ఫంక్షన్ కి చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, నాగేంద్రబాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ప్రభాస్, సూర్య, కార్తీక్, రానా, రామ్, మోహన్ బాబు, కె.రాఘవేంద్ర రావు, దాసరి నారాయణరావు, టి.సుబ్బిరామిరెడ్డి, మురళీ మోహన్, ఆలీ, సీనియర్ నటి శారద, క్రిష్, సంపత్ నంది, దిల్ రాజు, కీరవాణి, కోటి, కోడి రామకృష్ణ, శరత్ మరార్ (మా టి వి సి.ఇ.వొ.), జె.సి.దివాకర్ రెడ్డి,రాఘవులు, గుత్తా సుఖేందర్ రెడ్డి, జానారెడ్డి,బండారు దత్తాత్రేయ, పొన్నాల లక్ష్మయ్య, దేవేందర్ గౌడ్, అంబటి రాంబాబు, గట్టు రామచంద్రరావు, జయప్రకాష్ నారాయణ్ తదితరులు హాజరయ్యారు.
ఈ అల్లు అర్జున్ మ్యారేజ్ ఫంక్షన్ "మా"టి.వి. లైవ్ టెలికాస్ట్ కారణంగా మీడియాకి ఫొటోలు తీసుకోటానికీ, వీడియో తీయటానికి అనుమతి లేదు. అల్లు అర్జున్ మ్యారేజ్ ఫంక్షన్ పూర్తికాగానే తామే మీడియా వారందరికీ అల్లు అర్జున్ మ్యారేజ్ ఫంక్షన్ ఫొటోలూ, వీడియో క్లిప్పింగులూ అందజేస్తామని అల్లు అరవింద్ తెలియజేశారు. అల్లు అర్జున్ మ్యారేజ్ ఫంక్షన్ పూర్తికాగానే " నా వివాహానికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించిన అతిథులందరికీ నా ధన్యవాదాలు. అతిథులలో ఎవరికైనా ఏ విధమైన ఇబ్బంది కలిగినా అందుకు నన్ను మన్నించాల్సిందిగా కోరుతున్నాను" అని పెళ్ళి కొడుకు అల్లు అర్జున్ స్వయంగా మైక్ లో చెప్పటం ఆహూతులను ఆకట్టుకుంది. |