LATEST NEWS
  ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్‌  ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. 300 పేజీలకుపైగా ఉన్న ప్రాధమిక ఛార్జ్‌షీట్‌‌ను సిట్ అధికారులు ఏసీబీ జడ్జికి అందజేశారు.  ఆ పత్రాలను ట్రంకు పెట్టెలో తీసుకెళ్లారు. మరో 20 రోజుల్లో రెండవ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసిన సిట్ వారిని పలు దఫాలు విచారించింది.11 మంది వాంగ్మూలాలు, రిమాండ్ రిపోర్టులు, వందకుపైగా ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నివేదికలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలను జత చేసి కోర్టుకు సమర్పించారు.  మొత్తంగా రూ.62 కోట్లు సీజ్‌ చేసినట్లు సిట్‌ పేర్కొంది. ఛార్జ్‌షీట్‌లో వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి పాత్రపై సిట్‌ అధికారులు పేర్కొనలేదు. 20 రోజుల్లో మరో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేస్తామని సిట్‌ పేర్కొంది. మద్యం పాలసీ మొదలు, బ్రాండ్‌ల తయారీ, డబ్బు తరలింపు  వాటిని చేరవేసిన డెన్‌లు, తదితర వివరాలు అన్నీ ఛార్జీషీట్‌లో పేర్కొంది. మొత్తం 26ె8 మంది సాక్షులను విచారించి సేకరించిన సమాచారం 62 కోట్ల రూపాయలు సీజ్ చేసినట్లు అందులో పేర్కొంది.  షెల్ కంపెనీల ద్వారా డబ్బుని తరలించి, బ్లాక్ మనీనీ వైట్‌గా మార్చిన వైనాన్ని రియల్ ఎస్టేట్, బ్యాంకులు బంగారు దుకాణాలలో పెట్టుబడులు పెట్టినట్లు వివరాలను ఛార్జీషీట్‌లో పేర్కొంది. సాంకేతికంగా సమాచారం దొరకకుండా ధ్వంసం చేసిన ఫోన్‌లలోని సమాచారన్ని కుడా సేకరించినట్లు సిట్ బృందాన్నికి సేకరించినట్లు తెలుస్తోంది.ఈ కేసులో  ఎంపీ మిథున్‌రెడ్డి విజయవాడలో సిట్‌ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ మేరకు ఢిల్లీలో ఉన్న ఆయన కాసేపటి క్రితం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి విజయవాడలోని సిట్  కార్యాలయానికి వెళ్లనున్నారు. ఆయన ఈ కేసులో ఏ4గా ఉన్నారు. ఇప్పటికే మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. 
  కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వరంగల్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అని, ప్రధాని మోదీ దానిని నేరవేర్చారని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. మెగా కోచ్ ఫ్యాక్టరీ పనులను ఆయన పరిశీలించారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో 2026లో ఉత్పత్తి ప్రారంభమవుతుందని రైల్వే మంత్రి తెలిపారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులు కేంద్ర మంత్రులకు వివరించారు.  కాజీపేటలో మెగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కేంద్రం నిర్మిస్తోందని ఆయన పేర్కొన్నారు.పనులు వేగంగా సాగుతున్నట్లు ఆయన తెలిపారు. 2026లో ఉత్పత్తి ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు. కాజీపేట నుంచి త్వరలో 150 లోకోమోటివ్‌లు కూడా ఎగుమతి అవుతాయని ఆయన అన్నారు. భవిష్యత్తులో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో మెట్రో కోచ్‌లు కూడా తయారవుతాయని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ 40 ఏళ్ల పోరాటమని గుర్తు చేశారు. రైల్వే వ్యాగన్లు, కోచ్‌లు, ఇంజిన్ల తయారీ పరిశ్రమను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంజూరు చేశారని అన్నారు. రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నామని వెల్లడించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ద్వారా 40 ఏళ్ల ఓరుగల్లు వాసుల కల సాకారం అవుతుందని కిషన్‌రెడ్డి తెలిపారు. దీని ద్వారా 3 వేల మందికి నేరుగా ఉపాధి లభిస్తుందని తెలిపారు.   వరంగల్ ఎయిర్ పోర్ట్ కోసం భూములు ఎంత త్వరగా అప్పగిస్తే అంత త్వరగా నిర్మాణ పనులు చేపట్టాతమని కిషన్ రెడ్డి తెలిపారు  
  పాము ఉందని తెలిస్తే అటు వైపు వెళ్లడానికి ఎవరైన భయాపడుతారు.. అలాంటిది విషపూరిత సర్పాల జోలికి వెళ్తే ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. అయితే కొందరు వ్యక్తులు పాములతో చాలా ధైర్యంగా వ్యవహరిస్తారు. ఇళ్లలోకి, జనావాసాల్లోకి వచ్చిన పాములను పట్టుకుని కాపాడుతుంటారు.  బిహార్ సమస్తిపూర్లోని సింధియా ఘాట్‌లో వందల మంది యువకులు నాగుపాములను మెడలో వేసుకొని ఊరేగింపుగా వెళ్లిన వీడియో వైరలవుతోంది. పిల్లలు సైతం పామును చూసి భయపడకుండా భజనలు చేస్తూ నాగదేవత ఆలయానికి వెళ్లారు. నాగ పంచమి సందర్భంగా స్థానికులు పాముల ఉత్సవం నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే, గత 200 ఏళ్లుగా ఈ సంప్రదాయాన్ని జరుపుకుంటున్నట్లు వారు చెబుతున్నారు.
ALSO ON TELUGUONE N E W S
  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'హరి హర వీరమల్లు'. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జూలై 24న విడుదల కానున్న 'హరి హర వీరమల్లు' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు, పాటలకు విశేష స్పందన లభించింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఆ ఉత్సాహంతో ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచింది చిత్ర బృందం. జూలై 21న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించబోతున్నారు. అలాగే తాజాగా పాత్రికేయులతో ముచ్చటించిన లెజండరీ నిర్మాత ఎ.ఎం. రత్నం.. సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. హరి హర వీరమల్లు సినిమా ఎలా ఉండబోతుంది? 17వ శతాబ్దం నేపథ్యంలో జరిగే కథ ఇది. బయట ప్రచారం జరుగుతున్నట్టుగా ఇది నిజ జీవిత కథ కాదు. ఓ కల్పిత పాత్రను తీసుకొని, దాని చుట్టూ కథ అల్లుకోవడం జరిగింది. హరి హర వీరమల్లు పేరు పెట్టడానికి కారణం ఏంటంటే.. హరి హర అంటే విష్ణువు, శివుడు కలయిక. అలాగే వీరుడిని సూచించేలా వీరమల్లు అని పెట్టాము.  హరి హర వీరమల్లు ప్రయాణం గురించి చెప్పండి? నేను 'భారతీయుడు' సహా ఎన్నో భారీ చిత్రాలను నిర్మించాను. అయితే నా సినీ జీవితంలో ఇంత సుదీర్ఘ ప్రయాణం చేసిన సినిమా ఇదే. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే ఇది పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇచ్చినంత మాత్రాన వెంటనే పూర్తి చేయగలిగే సాధారణ చిత్రం కాదు. అత్యంత భారీ చిత్రం. సెట్స్, గ్రాఫిక్స్ తో ముడిపడిన చారిత్రక కథ. అందుకే ఆలస్యమైంది. బాగా ఆలస్యమవవడంతో సినిమా ఎలా ఉంటుందోననే అనుమానాలు కొందరు వ్యక్తం చేశారు. అయితే ట్రైలర్ తో అందరి అనుమానాలు పటాపంచలు అయ్యాయి. నేను నిర్మించిన సినిమాల్లో 90 శాతానికి పైగా విజయం సాధించాయి. ఆ అనుభవంతో చెప్తున్నాను.. హరి హర వీరమల్లు ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కించాలని ముందే అనుకున్నారా? మొదట రెండు భాగాలని అనుకోలేదు. సినిమా అనేది వినోదంతో పాటు, సందేశాన్ని అందించాలనేది నా భావన. నేను రూపొందించిన ఎక్కువ శాతం సినిమాలు అలాగే ఉంటాయి. వీరమల్లు అనేది చారిత్రక నేపథ్యమున్న కథ. ఇలాంటి గొప్ప కథలో సందేశం ఉంటే.. ఎక్కువమందికి చేరువ అవుతుందని భావించాము. అలా చర్చల్లో కథ స్పాన్ పెరిగింది.  తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ వేస్తున్నారా? జూలై 24 తెల్లవారుజాము నుంచి షోలు వేయాలని మేము భావించాము. కానీ అభిమానులు ముందురోజు రాత్రి నుంచే షోలు వేయాలని కోరుతున్నారు. వారి కోరిక మేరకు జూలై 23 రాత్రి నుంచి షోలు వేసే ఆలోచనలో ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారితో మీ అనుబంధం గురించి? ఖుషి, బంగారం తర్వాత పవన్ కళ్యాణ్ గారితో చేసిన మూడో చిత్రమిది. పేరుకి మూడు సినిమాలే కానీ.. మా మధ్య 25 సంవత్సరాల  అనుబంధం ఉంది. పవన్ కళ్యాణ్ గారిని దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా.. ఓ నటుడిగా కంటే కూడా మంచి ఆశయాలున్న మనిషిగా ఆయన నాకు ఎక్కువ ఇష్టం. సమాజం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఖుషి సమయంలో ఆయన ఆలోచన విధానం చూసి ఆశ్చర్యపోయాను. అది ప్రేమ కథా చిత్రం అయినప్పటికీ.. ఓ సన్నివేశంలో రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, లాలా లజపత్ రాయ్ వంటి గొప్ప వ్యక్తుల పేర్లు చెప్పారు. అలాగే ఒక పాటలో దేశభక్తిని చాటుకున్నారు. సినిమాల్లో చూపించే ఇలాంటి విషయాలు ఎందరికో స్ఫూర్తిని కలిగిస్తాయి. హరి హర వీరమల్లు కూడా విజయవంతమైన చిత్రంగా నిలవడమే కాకుండా, ప్రేక్షకుల్లో ఆలోచన కలిగిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు జాతీయ నాయకుడిగా ఎదిగారు. ఆయన సినిమా వస్తుందంటే దేశవ్యాప్తంగా దృష్టి ఉంటుంది. ఆ ఒత్తిడి ఏమైనా మీపై ఉందా? ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఆ ఒత్తిడిని మేము బాధ్యతగా భావించి, మరింత శ్రద్ధగా సినిమాని రూపొందించాము. పవన్ కళ్యాణ్ గారి గౌరవానికి తగ్గట్టుగా సినిమా ఉంటుంది. అలాగే పవన్ గారి అభిమానులతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను.. ఈ సినిమా మెప్పిస్తుందనే నమ్మకం ఉంది. సినిమా ఆలస్యమైంది కదా.. పవన్ కళ్యాణ్ గారి సహకారం ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారి సహకారం లేకుండా ఇంత భారీ చిత్రాన్ని రూపొందించడం సాధ్యం కాదు. పవన్ గారంటే నాకెంత ఇష్టమో.. అలాగే నేనంటే కూడా ఆయనకి ఇష్టం. మేకర్ గా నన్ను గౌరవిస్తారు. పవన్ గారు పూర్తి సహకారం అందించారు కాబట్టే.. ఈ సినిమా ఇంత గొప్పగా తీయగలిగాము. అలాగే టీం అందరూ ఎంతో సహకరించారు. అందరం కలిసి ఎంతో కష్టపడి ఈ సినిమాని పూర్తి చేశాము. మీ కుమారుడు జ్యోతికృష్ణ గారి గురించి? మా అబ్బాయి అని చెప్పడం కాదు కానీ, జ్యోతికృష్ణ దర్శకత్వ ప్రతిభ చూసి ఆశ్చర్యపోయాను. మేమందరం చూడని ఓ కొత్త కోణంలో ఈ కథని చూశాడు. మన చరిత్రను ముడిపెడుతూ ఈ తరానికి చేరువయ్యేలా.. ఇండియన్ జోన్స్ తరహాలో సినిమాని గొప్పగా మలిచాడు. సాంకేతికంగా కూడా ఎంతో ఉన్నతంగా ఆలోచించాడు. జ్యోతికృష్ణ పనితీరు చూసి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశంసించారు.
Coolie starring Superstar Rajinikanth, King Nagarjuna, Upendra, Aamir Khan has faced leaks while shooting in Vizag port area with Nagarjuna. Also, there have been leaks from Pawan Kalyan's OG sets. Now, Megastar Chiranjeevi's Mega157 is facing leaks with Chiranjeevi and Nayanthara images leaking from sets.  Earlier, there have been leaks from Shah Rukh Khan's Jawan sets and several big films as well. Even Rajamouli has not been exempt for these leaks. Hence, Baahubali team in 2013 have decided to not allow phones on sets. Even they did same for RRR but SSMB29 shoot scenes have been leaked from Orissa schedule.   Lokesh Kanagaraj had to write a note requesting fans to not share the leaked clips while Nag's Simon character traits have created huge buzz and excitement for the film. Mega157 team have also released a statement asking fans to not share such images anymore.    Well, big films and big stars does create huge amount of anticipation all over and excitement. But sharing the film scenes from shoot without clear cut permissions lead to unnecessary spoilers spreading all over. This could dilute the excitement for the film or create huge expectations prior release.  Also, piracy has been huge issue from two decades with the dawn of new technology. The makers are trying to find creative ways to reduce the effects of piracy and they have been trying to disperse their films to OTT platforms at the earliest for good amount. Now, leaks have become a new issue for producers to tackle.  The excitement of fans and audiences to watch stars in action is understandable but recording them and releasing on social media. These sort of leaks are harmful for sustaining the theatrical excitement of audiences while some can work in positive way. In any case, it is harmful to encourage such leaks and catching matinee idols on big screens is advisable.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)అప్ కమింగ్ మూవీ 'హరిహర వీరమల్లు'(Hari Hara Veeramallu)ఈ నెల 24 న వరల్డ్ వైడ్ గా విడుదల కానున్న విషయం తెలిసిందే. 'బ్రో' మూవీ వచ్చిన రెండు సంవత్సరాలకి పవన్ నుంచి వీరమల్లు వస్తుండటం, పైగా పోరాటయోధుడుగా ఫస్ట్ టైం చారిత్రాత్మక మూవీ చెయ్యడంతో వీరమల్లులో పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి  అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను ఉంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ పై అగ్ర నిర్మాత ఎ ఏం రత్నం(Am Rathnam)అత్యంత భారీ వ్యయంతో నిర్మించాడు. రీసెంట్ గా  ఎఏం రత్నం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు హరిహర వీరమల్లు క్యారక్టర్ పూర్తిగా కల్పిత పాత్ర. కొంత మంది అనుకున్నట్టుగా నిజజీవిత కథ కాదు. 17 వ శతాబ్దంలో వీరమల్లు కథ జరుగుతుంది.  హరిహర అంటే శివుడు, విష్ణువు కలయిక. వీరమల్లు అంటే వీరుడు. అందుకే హరిహరవీరమల్లు అని టైటిల్ నిర్ణయించాం. ఇప్పటి వరకు సాగిన నా సినీ జర్నీలో 'వీరమల్లు' తోనే ఎక్కువ ప్రయాణం చేశాను. పవన్ డేట్స్ ఇచ్చినంత మాత్రాన వేంటనే పూర్తి చేసే సాధారణ చిత్రం కాదు. గ్రాఫిక్స్, సెట్స్ తో ముడిపడిన చారిత్రాత్మక సబ్జెక్టు. అందుకే చాలా లేట్ అవుతూ వచ్చింది. దీంతో చాలా మంది మూవీ ఎలా ఉండబోతుందో అనే అనుమానాన్ని వ్యక్తం చేసారు. ట్రైలర్ తో ఆ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి.  తొంబై శాతం విజయాల్ని చూసిన వాడిగా చెప్తున్నాను. వీరమల్లు ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది. జాతీయ స్థాయిలో పవన్ గారి పేరు నిలబెడుతుంది. మా అబ్బాయి జ్యోతి కృష్ణ ఈ చిత కథని సరికొత్తగా మలిచాడు. ముందు రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెయిడ్ ప్రీమియర్ షోస్ కూడా వెయ్యబోతున్నామని ఎ ఏం రత్నం చెప్పుకొచ్చాడు. వీరమల్లుకి మొదట క్రిష్(Krish)ఆ తర్వాత జ్యోతికృష్ణ(Jyothi Krishna)దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. నిధి అగర్వాల్(Nidhhi Agerwal)హీరోయిన్ గా చేస్తుండగా బాబీ డియోల్, నోరా ఫతేహి, నర్గిస్ ఫక్రి, అనసూయ, రఘుబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీత దర్శకుడు. ఈ నెల 21 న హైదరాబాద్ లో  ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.        
Cast: Atharvaa, Nimisha Sajayan, Mohammed Zeeshan Ayyub, Chetan, Manasa Choudhary, Ramesh Thilak, Balaji Sakthivel, Viji Chandrasekhar, Riythvika, Bose Venkat Crew:  Written by Nelson Venkatesan, Athisha Vino Music by Sathyaprakash, Sreekanth Hariharan, Pravin Saivi, Sahi Siva, Anal Akash, Ghibran Vaibodha Cinematography by Parthiban Editing by V. J. Sabu Joseph Directed by Nelson Venkatesan Produced by Jayanthi Ambethkumar, S. Ambethkumar Atharvaa has been struggling recently with his films not living up to their potential. He finally received good word of mouth for his DNA. Nimisha Vijayan, who has been choosing good scripts acted in this movie in leading lady role. Interestingly, Telugu version of this film, My Baby, released just one day before its OTT release, yesterday. Let's discuss about the movie in detail.  Plot:  Anand (Atharvaa) gets addicted to drugs and alochol as his ex-lover Saranya (Manasa) gets married to someone else leaving him. His father doesn't like this transistion in his life and starts to hate. His younger brother also dislikes him as he is being a hurdle to get married to his love interest. Aanand reveals why he became so reclusive in his life, as Saranya committed suicide unable to handle the torture of her husband.  Family sends him to an ashram to recover. On the other hand, Divya (Nimisha Sajayan) due to her sensitive mentality, appears to be a mentally challenged person. For Anand's brother, his family takes the decision to get Anand married to Divya. He accepts despite his friends' objections of her condition. Divya and Anand construct a happy life for themselves. But their baby gets exchanged and abducted immediately after birth. While no one believe Divya, Anand starts the investigation for their baby. What will he do? Can they find their real baby and real parents of the baby with them? Watch the movie to know more. Analysis:  Atharvaa did well in this role that needs him to play an addict and then a recovered person happy with his wife. Even though he did well, the writing for his character seems too simple as the investigative part starts. The beginning looses its effectivity due to this. Nimisha Vijayan, once again, delivered her best where she needed to balance the over sensitive person with normalcy. Again, investigative part undermines her character arc, too.  All others have been able to do well in their roles. Mohammad Zeeshan Ayyub did well in his role but it seemed too simple for a person of his capability. Even for story, his role seems to be underdeveloped and too common for a protagonist. It seems to have been too easy for him to construct such a big nexus and investigation part doesn't really give the vibes of the layered approach that the makers talk about him constructing for his network.  DNA suffers with such simplified writing that doesn't really take up detailing seriously. The lead characters don't really go through much changes due to the incident in their lives. Everything feels handled too lightly with investigation part taking over everything. Even several fights haven't been dealt with such impact. Still, the director could engage audiences into the next scene.  It is just that they did not really live up to the potential the film had. Not to compare but Maharaja has thrilling elements laced throughout for a thriller with emotional highs. DNA misses out on such highs but due to its engaging narrative even with flaws, the movie succeeds to an extent in holding audiences interest. The makers could have made it easily even more impactful thriller with better writing. Still, it is watchable.  Bottomline:  DNA could have been much impactful film but ends up being an okay engaging one.  Rating: 2.75/5  Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Organisation recommends viewers' discretion.
ఇటీవలికాలంలో సోషల్‌ మీడియా విపరీతంగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సినిమాలకు సంబంధించి రకరకాల అంశాలను వివిధ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వెలుగులోకి తెస్తున్నారు. దానివల్ల ఒక్కోసారి హీరో, హీరోయిన్లతోపాటు దర్శకనిర్మాతలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయాన్ని ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రస్తావించారు. విజయ్‌ దేవరకొండ హీరోగా తను నిర్మిస్తున్న ‘కింగ్‌డమ్‌’ చిత్రం జూలై 31న విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ సోషల్‌ మీడియా వల్ల తను గతంలో ఎదుర్కొన్న సమస్యల గురించి మాట్లాడారు సూర్యదేరవ నాగవంశీ.  ఆ క్రమంలోనే మహేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో నాగవంశీ నిర్మించిన ‘గుంటూరు కారం’ చిత్రానికి వచ్చిన ట్రోలింగ్‌పై తన బాధను వ్యక్తం చేశారు. ‘సినిమా ఇండస్ట్రీలో శుక్రవారం అనేది చాలా ముఖ్యమైంది. సినిమా పుట్టిన నాటి నుంచి ఇప్పటివరకు శుక్రవారమే ఎక్కువగా సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి. ఆ ఒక్కరోజే సినిమా వారి భవిష్యత్తు ఏమిటి అనేది తెలిసిపోతుంది. ఆరోజు మన సినిమా రిలీజ్‌ అయినా, వేరే వాళ్ళ సినిమా రిలీజ్‌ అయినా దాని నుంచి మనం కూడా ఎంతో కొంత నేర్చుకుంటాం. ఒక విధంగా శుక్రవారం అనేది ఇండస్ట్రీకి సర్‌ప్రైజ్‌ ఇచ్చే రోజు. నా కెరీర్‌లో రెండు సార్లు సర్‌ప్రైజ్‌ అయ్యాను. ఈమధ్యకాలంలో నన్ను సర్‌ప్రైజ్‌ చేసిన సినిమా లక్కీ భాస్కర్‌. ఎందుకంటే నేను ఎక్స్‌పెక్ట్‌ చేసినంత రెవిన్యూ అది చేయలేకపోయింది.  అలాగే గుంటూరు కారం కూడా నన్ను మరో విధంగా సర్‌ప్రైజ్‌ చేసింది. విడుదలైన మొదటిరోజు, రెండో రోజు సినిమాపై విపరీతమైన ట్రోలింగ్‌ జరిగింది. అలా మా సినిమాను ఎందుకు ట్రోల్‌ చేశారు అనే విషయం ఇప్పటికీ నాకు అర్థం కావడంలేదు. ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌ అయినప్పుడు ఎలాంటి ట్రోలింగ్‌ జరగలేదు. సినిమా బాగాలేదు అనే టాక్‌ ఎక్కడా వినిపించలేదు. ట్రోల్‌ చేసేంత విషయం సినిమాలో ఏం ఉందో తెలియలేదు. ఈ రెండు సంవత్సరాల్లో గుంటూరు కారం, లక్కీ భాస్కర్‌ చిత్రాలు నన్ను సర్‌ప్రైజ్‌ చేశాయి’ అంటూ తనను సర్‌ప్రైజ్‌ చేసిన రెండు సినిమాల గురించి చెప్పుకొచ్చారు నిర్మాత నాగవంశీ. 
తమిళ అగ్ర హీరో ఇళయదళపతి 'విజయ్'(VIjay)ప్రస్తుతం 'జననాయగన్'(Jananayagan)అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో 'జననాయకుడు' అనే పేరుతో విడుదల కాబోతుంది. విజయ్ పొలిటికల్ పార్టీ స్థాపించిన తర్వాత వస్తున్న మూవీ కావడం,  టైటిల్ కూడా విజయ్ ఇమేజ్ కి తగ్గట్టుగా ఉండటంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను సదరు మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. హెచ్ వినోద్(H. Vinod)దర్శకత్వంలో తెరకెక్కుతుండగా 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9 న విడుదల కాబోతుంది. ఇదే డేట్ కి శివ కార్తికేయన్(Sivakarthikeyan)తో ప్రముఖ మహిళా దర్శకురాలు 'సుధా కొంగర'(Sudha Kongara)తెరకెక్కిస్తున్న 'పరాశక్తీ'(Para Shakthi)మూవీ రిలీజ్ కాబోతుందనే వార్తలు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ విషయంపై రీసెంట్ గా సుధా కొంగర ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు పరాశక్తి, జననాయగన్ చిత్రాలు సంక్రాంతి కానుకగా విడుదల కానున్నాయనే వార్తల గురించి నాకు తెలియదు. పరాశక్తి ఎప్పుడు విడుదల కావాలో నిర్మాతలే నిర్ణయిస్తారు. రిలీజ్ విషయంలో నా ప్రమేయం ఉండదని చెప్పుకొచ్చింది. తమిళ చిత్ర పరిశ్రమకి చెందిన సుధా కొంగర 'ఇరుది సుట్రు, సురారై పోట్రు' వంటి చిత్రాలతో మంచి పేరు సంపాదించింది. ఈ రెండు చిత్రాలు తెలుగులో గురు, ఆకాశమే నీ హద్దురా అని విడుదలయ్యాయి. ఇక శివ కార్తికేయన్ గత ఏడాది అక్టోబర్ లో 'అమరన్' తో వచ్చి తమిళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా పాన్ ఇండియా వ్యాప్తంగా మంచి విజయాన్ని అందుకున్నాడు. దీంతో 'పరాశక్తి; పై భారీ అంచనాలు ఉన్నాయి. శ్రీలీల హీరోయిన్ గా చేస్తుంది.  
లెలిజాల రవీందర్, రితికా చక్రవర్తి హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న చిత్రం 'రాజు గాని సవాల్'(Raju Gani saval). లెలిజాల కమల ప్రజాపతి సమర్పణలో, ఎల్ ఆర్ ప్రొడక్షన్ బ్యానర్ పై లెలిజాల రవీందర్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. 'రక్షా బంధన్' పండుగ సందర్భంగా ఆగస్టు 8న రిలీజ్ కి సిద్ధమవుతుండగా, శ్రీ లక్ష్మి పిక్చర్స్ పై బాపిరాజు చాలా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.  నిన్న శుక్రవారం ఈ మూవీట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ప్రముఖ   హీరోయిన్ లు డింపుల్ హయతి, రాశీ సింగ్ ట్రైలర్ రిలీజ్ చేసారు. తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు భరత్ భూషణ్, ప్రొడ్యూసర్లు  దామోదర ప్రసాద్, ప్రసన్నకుమార్,  తుమ్మలపల్లి రామసత్యనారాయణ, గీత రచయిత గోరటి వెంకన్న, నటుడు భద్రం,  ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. హీరోయిన్ డింపుల్ హయతి మాట్లాడుతు రాజు గాని సవాల్ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కి గెస్ట్ గా రావడం హ్యాపీగా ఉంది. ట్రైలర్, సాంగ్స్ చాలా బాగున్నాయి. నేను కెరీర్ ప్రారంభించిన కొత్తలో కలిసిన సినిమా మీద ప్రేమ ఉన్న ముగ్గురు వ్యక్తులు బాపిరాజు గారు, సునీల్ కుమార్ రెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు, ఈ అమ్మాయి బాగుంటుందని నాకు మొదటి సినిమా అవకాశం ఇచ్చారు. రాజు గాని సవాల్ మూవీ ట్రైలర్ లాంఛ్ కి మీరు వస్తారా అని బాపిరాజు గారు అడిగినప్పుడు తప్పకుండా వస్తా సార్ అని చెప్పాను. బాపిరాజు గారు సినిమాని   రూపొందించడమే కాదు ప్రేక్షకుల దగ్గరకు రీచ్ అయ్యేలా చేస్తారు. "రాజు గాని సవాల్" టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. ఈ మూవీ రిలీజ్ కోసం నేను కూడా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చింది. దామోదర ప్రసాద్ మాట్లాడుతు ఈ మధ్యే 'రాజు గాని సవాల్"  టీజర్ చూసాను. చాలా బాగుంది. ఇప్పుడు ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. ఈ సినిమా బాగుంటుందని మేము నమ్మకంగా ఉన్నాం ఎందుకంటే బాపిరాజు సెలక్షన్ అలా ఉంటుంది. ఎంతో బాగుంటే గానీ మూవీ రిలీజ్ చేయరు. బాపిరాజు గారికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. ఈ సినిమాతో హీరో హీరోయిన్స్ తో పాటు మొత్తం టీమ్ అందరికీ మంచి గుర్తింపు, విజయం దక్కాలని కోరుకుంటున్నాను. మరో నిర్మాత ప్రసన్నకుమార్ మాట్లాడుతు 'రాజు గాని సవాల్" టైటిల్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. కవాడిగూడ ఏరియాలో జరిగే కల్చరల్ ఈవెంట్స్ నేపథ్యంతో సాగే చిత్రమిది. ట్రైలర్ చూస్తే మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రవీందర్ తనే దర్శకుడిగా, నిర్మాతగా, హీరోగా ఈ మూవీ చేశాడు. ఆయన వెనక ఎంతో అనుభవం ఉన్న బాపిరాజు గారు ఉన్నారు. ఈ చిత్రానికి సపోర్ట్ చేసేందుకు హీరోయిన్స్ డింపుల్ హయతి, రాశీ సింగ్ రావడం సంతోషకరం. మూవీ  మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను  హీరోయిన్ రాశీ సింగ్ మాట్లాడుతు ఈ ఈవెంట్ కు వచ్చే ముందే 'రాజు గాని సవాల్' సినిమా ట్రైలర్ చూశాను చాలా బాగుంది. ఇదొక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా మూవీ. హీరో రవీందర్ గారితో పాటు రితిక, సంధ్య బాగా నటించారు. ట్రైలర్ కి  మంచి రెస్పాన్స్ వస్తున్న సందర్భంగా టీమ్ అందరికీ కంగ్రాట్స్ చెబుతున్నా. బాపిరాజు గారి నమ్మకాన్ని ఈ మూవీ నిలబెట్టాలి. "రాజు గాని సవాల్" సినిమా ఘన విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నాను. నటుడు డాక్టర్ భద్రం మాట్లాడుతు 'రాజు గాని సవాల్' దర్శకత్వం, నిర్మాత, హీరోగా మూడు పాత్రలు పోషిస్తున్నారు రవీందర్ గారు. వీటిలో ఒక బాధ్యత నిర్వర్తించడమే కష్టం. ఈ సినిమాను బాపిరాజు గారు రిలీజ్ చేస్తున్నారంటే తప్పకుండా సక్సెస్ అయినట్లే. ఆయన ఈ మూవీ వెనక ఉండటమే ప్రధాన బలం. అందరితో స్నేహంగా ఉండే బాపిరాజు గారు లాంటి వ్యక్తం ఇండస్ట్రీలో ఉండటం మా అదృష్టం. ప్రేక్షకులంతా ఆగస్టు 8న థియేటర్స్ కు రావాలని, ఇలాంటి మంచి చిత్రాన్ని ఆదరించాలని కోరుతున్నాను.. హీరోయిన్ రితికా చక్రవర్తి మాట్లాడుతు 'రాజు గాని సవాల్" మూవీని ప్రతి ఒక్కరూ రిలేట్ చేసుకుంటారు. ఈ చిత్రం కోసం మేమంతా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి పనిచేశాం. మా రవీందర్ గారు ఎంతో కష్టపడి మూవీ చేశారు. మేము మూవీ మీద భారీ అంచనాలు పెట్టుకోలేదు కానీ సినిమా తప్పకుండా అందరం హ్యాపీగా ఫీలయ్యే రిజల్ట్ ఇస్తుందని నమ్ముతున్నాం. ఆగస్టు 8న మా మూవీని థియేటర్స్ కు వెళ్లి చూడండి. మీ అందరి సపోర్ట్ మా మూవీకి ఉంటుందని నమ్ముతున్నాం. అన్నారు. నటి సంధ్య రాథోడ్ మాట్లాడుతు 'రాజు గాని సవాల్" మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కు వచ్చిన అందరికీ థ్యాంక్స్. ఇది మాకొక ప్రత్యేకమైన సందర్భం. ఆగస్టు 8వ మా మూవీ రిలీజ్ కు వస్తోంది. చాలా ఎగ్జైటింగ్ గా ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నాం. ఈ చిత్రంలో నటించడం మా అందరికీ గ్రేట్ ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. ఈ చిత్రానికి వర్క్ చేసిన వాళ్లంతా కొత్తవాళ్లే. మాకు ఈ సినిమా మంచి విజయాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాం. నటుడు రవీందర్ బొమ్మకంటి మాట్లాడుతూ - "రాజు గాని సవాల్" చిత్రంలో నేను విలన్ రోల్ చేశాను. ఈ సినిమాలో చాలా మంది కొత్తవాళ్లే నటించారు. వాళ్లకు ఈ చిత్రంతో మంచి బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నా. ఈ సినిమాలో నటించే అవకాశం కల్పించిన హీరో రవీందర్ గారికి, బాపిరాజు గారికి థ్యాంక్స్.  "రాజు గాని సవాల్" సినిమాను మీరంతా హిట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు. దర్శక నిర్మాత, హీరో లెలిజాల రవీందర్ మాట్లాడుతూ - మా "రాజు గాని సవాల్" మూవీ ట్రైలర్ లాంఛ్ కు వచ్చిన పెద్దలు అందరికీ థ్యాంక్స్. ఇలాంటి పెద్దల మధ్య నా మూవీ ఈవెంట్ జరుపుకోవాలని కొన్నేళ్లుగా కలగంటున్నాను. అది ఈ రోజు నెరవేరడం హ్యాపీగా ఉంది. మా జీవితాల్లో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ను ఆధారంగా చేసుకుని రూపొందించిన చిత్రమిది. సహజంగా ఉండేందుకు కవాడిగూడ రియల్ లొకేషన్స్ లో షూటింగ్ చేశాం. మధ్య తరగతి వారి జీవితంలో ఎన్నో సవాళ్లు ఉంటాయి. అలాంటి సందర్భంలో ఒక పెద్ద సమస్య ఎదురైతే ఆ మిడిల్ క్లాస్ పర్సన్ ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఈ చిత్రంలో చూస్తారు. ఫ్యామిలీ బాండింగ్స్, స్నేహితుల మధ్య ఉండే అనుబంధాలను ఆకట్టుకునేలా  తెరకెక్కించాం. సినిమా టెక్నికల్ గా క్వాలిటీగా ఉండాలని టాప్ టెక్నీషియన్స్ ను పెట్టుకున్నాం. యశ్వంత్ నాగ్ గారి మ్యూజిక్ లో రామ్ మిరియాల, అనురాగ్ కులకర్ణి, గోరటి వెంకన్న వంటి సింగర్స్ మా మూవీలో సాంగ్స్ పాడారు.  ఈ సినిమా చూశాక మా టీమ్ కు కెప్టెన్ వంటి బాపిరాజు గారు "రాజు గాని సవాల్" సినిమా క్లాసిక్ డ్రామాగా మ్యూజికల్ హిట్ అవుతుందని చెప్పారు. ఆయన మాట నిజం కావాలని ఆశిస్తున్నా. అన్నారు. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు మాట్లాడుతూ - మా "రాజు గాని సవాల్" మూవీ ట్రైలర్ లాంఛ్ కు వచ్చి సపోర్ట్ చేస్తున్న పెద్దలందరికీ కృతజ్ఞతలు. ప్రసన్న కుమార్ గారు, దామోదర ప్రసాద్ గారు, తెలుగు ఫిలింఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ గారు, డింపుల్ హయతి, రాశీ సింగ్, భద్రం గారు...ఇలా వీళ్లంతా నా మీద అభిమానంతో ఫోన్ లో మాట్లాడి అడగగానే వచ్చారు. ఇంతమంది అభిమానంతో మా వెనక నిలబడ్డారు. వారి బ్లెస్సింగ్స్ తో మా "రాజు గాని సవాల్" సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది. ఘనంగా రిలీజ్ అయ్యి కాసుల వర్షం కురిపిస్తుందని నమ్ముతున్నాం.  హీరో రవీందర్ గారు నా గురించి ఎంత చెప్పినా, ఆయన నాకు మూవీ ఇవ్వకుంటే ఈ రోజు ఈ వేదిక మీద నిలబడి మాట్లాడే అవకాశం వచ్చేది కాదు. రవీందర్ గారికి నా కృతజ్ఞతలు చెబుతున్నా. నా కెరీర్ ఈ స్థాయిలో ఉందంటే నా కుటుంబ సభ్యులైన మీడియా వారు కారణం. వాళ్లకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. అన్నారు. గీత రచయిత గోరటి వెంకన్న మాట్లాడుతూ హీరో లెలిజాల రవీందర్ మంచి సంస్కారం ఉన్న వ్యక్తి. ఈ సినిమాలో పాటకు నేను రాసిన సాహిత్యం తగ్గట్టు పాడి సంగీతం ఇచ్చారు. అద్భుతంగా వుంది. పాట పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. కమర్షియల్ అంశాలు ఈ సినిమాలో వున్నాయి. సినిమా సక్సెస్ కావాలి. ప్రజలు కూడా ఆశీర్వదించాలి అని అన్నారు. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ - "రాజు గాని సవాల్" సినిమాకు నిర్మాత, దర్శకుడే కాదు హీరోగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న లెలిజాల రవీందర్ ను అభినందిస్తున్నాను. ఎవరో అవకాశం ఇస్తారని ఎదురుచూడకుండా తనే ధైర్యం చేసి ఈ సినిమా రూపొందించాడు. మంచి సినిమా చేయడమే కాదు ఆ చిత్రాన్ని ప్రేక్షకుల దగ్గరకు రీచ్ చేయాలి. అలా మూవీని ప్రమోట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయగల బాపిరాజు గారు రవీందర్ కు తోడవడం హ్యాపీగా ఉంది. దాదాపు 30 ఏళ్లుగా డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్న బాపిరాజు గారు ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా రిలీజ్ చేస్తున్నారు. "రాజు గాని సవాల్" సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. టెక్నీషియన్స్: డి ఓ పి: సోమ శేఖర్ కె, ప్రొడక్షన్ డిజైన్: అరవింద్ ములే, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: మని జెన్న, స్క్రీన్ ప్లే: సాయి తేజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పృథ్వీ తేజ్, సౌండ్ డిజైన్: సాయి మనీందర్ రెడ్డి, ఉదయ్ ఉప్పాల, లైన్ ప్రొడ్యూసర్: విన్సెంట్ ప్రవీణ్, మేకప్ అండ్ కాస్ట్యూమ్స్: పవన, లిరిసిస్ట్: గోరేటి వెంకన్న, రూపక్ రొనాల్డ్సన్, యశ్వంత్ నాగ్, గోపాలకృష్ణ శాఖాపూర్, సింగర్స్: రామ్ మిరియాల, అనురాగ్ కులకర్ణి, యశ్వంత్ నాగ్ , నిర్మాత, దర్శకత్వం : లెలిజాల రవీందర్
వాస్తవికతకి దగ్గరగా ఉండే సినిమాలు నిర్మించడంలో మలయాళ చిత్ర పరిశ్రమ ముందు వరుసలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ కోవలోనే మత్తు పదార్ధాలకి అలవాటు పడితే ఎంత ప్రమాదమో, సెల్ ఫోన్ కి బానిస అయితే అంతే ప్రమాదం అనే కాన్సెప్ట్ తో  'ఈ వలయం'(E Valayam)అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. గత నెల 13 న రిలీజవ్వగా  మహిళా దర్శకురాలు 'రేవతి'(Revathi)తెరకెక్కించగా, 'జోబీ జాయ్'(Jobi Joy)నిర్మాతగా వ్యవహరించడం జరిగింది. రీసెంట్ గా 'జోబీ జాయ్' మాట్లాడుతు 'ఈ వలయం' మూవీని తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లోకి అనువాదం చేయబోతున్నాం. నేటి విద్యార్థులు, యువత సెల్ ఫోన్ కి ఏ విధంగా బానిసలుగా మారుతున్నారో అని మా చిత్రంలో చెప్పడం జరిగింది. ప్రేక్షకులకి వినోదంతో పాటు మంచి మెసేజ్ ఇచ్చినందుకు ఎంతో సంతృప్తిగా ఉందని చెప్పుకొచ్చాడు. మత్తు పదార్ధాలకి అలవాటు పడితే ఎంత ప్రమాదమో, సెల్ ఫోన్ ఎక్కువ వాడితే అంతే ప్రమాదమంటు తీర్చి దిద్హిన కథనాలు సినిమాలో హైలెట్ గా నిలిచాయి.  'ఈ వలయం' లో సెల్ ఫోన్ లేకుండా క్షణం కూడా గడపలేని 'నేలి' అనే యువతిగా 'యాష్లీ ఉష'(Ashly Usha)చాలా అద్భుతంగా నటించింది. ఆ సమయంలో ఆమె ఎదుర్కునే సమస్యలతో పాటు సెల్ ఫోన్ లేకపోతే  వచ్చే 'నోమో ఫోబియా' అనే అరుదైన వ్యాధి గురించి మూవీలో చర్చించారు. మిగతా పాత్రల్లో రెంజి ఫణిక్కర్, ముత్తుమని, నందు, షాలు రహీమ్ తదితరులు కనిపించగా జెర్రీ అమల్దేవ్ సంగీతాన్ని అందించాడు.      
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
  ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డ నిజాయితీగా, వివేకవంతంగా ఉండాలని కోరుకుంటారు. కానీ కొన్నిసార్లు పిల్లలు అకస్మాత్తుగా అబద్ధం చెబుతారు. ఆ తరువాత వారి ప్రవర్తన అలానే కొనసాగుతుంది.   పిల్లలు అలా చేయడం తెలిసిన తరువాత  తల్లిదండ్రులు ఆశ్చర్యపోతారు. అసలు పిల్లలు అబద్దం చెప్పడం ఎందుకు నేర్చుకుంటారు? పిల్లలు అబద్ధం చెప్పకుండా ఉండాలనుకుంటే ఏం చేయాలి? పిల్లలు అబద్దం చెప్పే విషయంలో  తల్లిదండ్రులు చేసే ఐదు సాధారణ తప్పులు తెలుసుకుంటే.. శిక్ష..  పిల్లు ఏదైనా తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు శిక్షతో బెదిరిస్తే, తదుపరిసారి భయం కారణంగా వారు నిజం దాచడం ప్రారంభిస్తారు.  ఇది అబద్ధం చెప్పే అలవాటును పెంచుతుంది. ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు కానీ నిజం చెప్పినందుకు శిక్ష పడుతుందనే భయం లేనప్పుడే పిల్లలు తన తల్లిదండ్రుల ముందు తన తప్పును అంగీకరిస్తాడు. అతిగా రియాక్ట్ కావడం.. తల్లిదండ్రులు చిన్న విషయాలకు కోపం చేసుకున్నా  లేదా అరిచినా పిల్లలు నిజం చెప్పలేరు. ఎందుకంటే  నిజం చెప్పి ఇబ్బందులను ఆహ్వానించడం సరికాదని పిల్లలు భావిస్తారు. ఈ కారణంగా పిల్లలు అబద్ధాన్ని తన రక్షణ కవచంగా చేసుకుంటాడు.  ఏదైనా చెప్పడం కంటే విషయాలను దాచడం మంచిదని పిల్లలు భావిస్తారు. భావాలను విస్మరించడం.. పిల్లల మాటలను విస్మరించినప్పుడు లేదా తీవ్రంగా పరిగణించనప్పుడు పిల్లలు  తమ ఆలోచనలను మార్చుకుంటారు. తల్లిదండ్రులు ప్రాధాన్యత ఇవ్వరు కాబట్టి వారికి నిజాలు చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటారు.  నిజాలు  దాచడం ప్రారంభిస్తారు. తరచుగా తెలిసి లేదా తెలియకుండా తల్లిదండ్రులు పిల్లల ఆలోచనలను, వారి ఇష్టాన్ని  పరిగణలోకి తీసుకోకుండానే నిర్ణయాలు చేస్తారు. తల్లిదండ్రుల ఈ అలవాటు పిల్లవాడు వారి ముందు నిజం మాట్లాడకుండా చేస్తుంది. అబద్దం.. తల్లిదండ్రులు స్వయంగా ఇతరులకు అబద్ధం చెబితే, ఉదాహరణకు ఫోన్‌లో 'నేను ఇంట్లో లేను' అని చెప్పడం వంటివి చేస్తే, పిల్లవాడు దానిని సాధారణమైనదిగా భావిస్తాడు.  పిల్లలు  కూడా అదే చేయడం ప్రారంభిస్తారు. అదే సమయంలో, తల్లిదండ్రులు తరచుగా పిల్లల ముందు ఒకరికొకరు అబద్ధాలు చెప్పుకుంటారు. ఇవన్నీ చూసినప్పుడు,  అబద్ధం చెప్పడం ఒక సాధారణ విషయంగా పిల్లలు పరిగణిస్తారు.  తను కూడా అబద్దం చెప్పడం అలవాటు చేసుకుంటారు. విమర్శ.. పిల్లవాడు ఏదైనా తప్పు చేస్తే తల్లిదండ్రులు అతన్ని విమర్శిస్తే, ఇంకొకసారి తల్లిదండ్రులు తనను విమర్శించకూడదని  నిజం దాచడానికి అబద్దం చెబుతాడు. సాధారణంగా పాఠశాల పరీక్షలలో పిల్లవాడు తక్కువ మార్కులు పొందినప్పుడు ఇది కనిపిస్తుంది. తల్లిదండ్రులు తన మార్కుల పట్ల తమ అసంతృప్తిని వ్యక్తం చేసినప్పుడు, పిల్లవాడు ఇంకొకసారి  తన రిపోర్ట్ కార్డును వారికి చూపించకుండా  అబద్ధం చెప్పడం వంటివి చేస్తాడు.                               *రూపశ్రీ.  
ఒకప్పటి కాలంలో పెళ్లి అనేది అమ్మాయిల కల. పెళ్లి జరగడం కోసం ఎంతో ఆశగా ఎదురుచూసేవారు.  కానీ నేటికాలంలో అమ్మాయిలు పెళ్లి అంటే విముఖత చూపిస్తున్నారు. ఒకప్పుడు అబ్బాయిలను పెళ్లి చేసుకోరా.. అని కుటుంబ సభ్యులు చాలా బతిమాలేవారు.. ఇప్పుడు అమ్మాయిల విషయంలో అలాంటి పరిస్థితి ఏర్పడింది. చాలామంది అమ్మాయిలు పెళ్లి  చేసుకోవడానికి   వెనుకాడుతున్నారు. కుటుంబ సభ్యులు ఎంత ఒత్తిడి చేసినా సరే.. పెళ్లి అంటే ఆమడ దూరం పారిపోయే అమ్మాయిలు కోకొల్లలు ఉన్నారు నేటికాలంలో..   వివాహం గురించి మహిళల అభిప్రాయాలు మారడానికి చాలా కారణాలు ఉన్నాయి. చాలా మంది అమ్మాయిలు  వివాహం అంటే సందేహం, భయం,  అసౌకర్యం వంటి భావనలకు లోనవుతుంటారు. దీని వెనుక ఒకటి కాదు, అనేక లోతైన సామాజిక,  మానసిక కారణాలు ఉన్నాయి. నేటి అమ్మాయిలు పెళ్లికి ఎందుకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారో తెలుసుకుంటే.. స్వాతంత్ర్యం, స్వావలంబన.. కొన్నేళ్ళ కిందటి వరకు ఆడపిల్లలు ఆర్థికంగా తండ్రిపై ఆధారపడి, వివాహం తర్వాత భర్తపై ఆధారపడేవారు. ఆధునిక యుగంలోని అమ్మాయిలు ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్నారు.  మంచి కంపెనీలలో పనిచేస్తారు లేదా వ్యాపార మహిళలుగా రాణిస్తుంటారు. ఆదాయం పరంగా కూడా  ఎవరికీ తక్కువ కాదు. అలాంటి  పరిస్థితిలో వారు ఇతరులపై ఆధారపడవలసిన అవసరం లేదు. దీనితో పాటు, మహిళల్లో స్వాతంత్ర్యంగా ఉండాలనే కోరిక కూడా పెరుగుతోంది.  స్వావలంబన ఉన్న మహిళలు వివాహం తర్వాత తమ స్వేచ్ఛకు భంగం కలుగుతుందని భావిస్తారు. ఈ కారణంగా  వివాహం చేసుకోవడానికి వెనుకాడతారు. కెరీర్.. మహిళలు గతంలో కంటే  అక్షరాస్యత పరంగా చాలా మెరుగ్గా ఉన్నారు. అబ్బాయిలతో సమానంగా చదువుకుంటున్నారు.  వారి కంటే మెరుగ్గా సంపాదిస్తున్నారు కూడా.  వారు తమ కెరీర్ లో కూడా విజయం సాధించాలని కోరుకుంటారు. చాలా మంది అమ్మాయిలు ముందుగా తమ కెరీర్ ను నిర్మించుకోవాలని కోరుకుంటారు. వారు వివాహాన్ని ఒక విరామం లేదా బాధ్యతగా చూస్తారు. కానీ కొంతమంది వివాహం కారణంగా తమ కెరీర్ ను వదిలేసే సందర్భాలు, సంఘటనలు ఉన్నాయి. ఈ కారణంగా  వారు వివాహాన్ని కెరీర్ విజయానికి అడ్డంకిగా కూడా భావిస్తారు. దీని కారణంగా  కెరీర్ లో విజయం సాధించే వరకు వివాహం చేసుకోవాలని అనుకోరు. అమ్మాయిల మొదటి ప్రాధాన్యత కెరీర్ గా ఉండటం దీనికి కారణం. బంధాలు తెగిపోవడం, విడాకులు.. నేటికాలంలో ఎంత గొప్పగా వివాహాలు జరుగుతున్నాయో..  అంత తొందరగా గొడవలు, విడాకులు జరుగుతున్నాయి.  తమ చుట్టూ చాలామంది వివాహ బంధంలో వైఫల్యం అవ్వడం, అమ్మాయిలు ఆర్థికంగా పీడింపబడటం,  వివాహం తర్వాత గౌరవం,  ప్రాధాన్యత లభించకపోవడం వంటివి  దగ్గరగా చూసిన అమ్మాయిలు  వివాహం గురించి,  విష సంబంధాల గురించి భయపడతారు. వివాహం తర్వాత అమ్మాయిల పరిస్థితి, భర్తతో గృహ సమస్యలు మొదలైనవి వివాహం తర్వాత వారి సంబంధం కూడా భారంగా మారవచ్చని భావించేలా చేస్తాయి. అటువంటి పరిస్థితిలో వివాహం చేసుకోకపోవడమే మంచిదని వారు భావిస్తారు. బాధ్యతలు.. వివాహం తర్వాత మహిళల బాధ్యతలు పెరుగుతాయి. ఆమె ఉద్యోగి అయినా లేదా గృహిణి అయినా ఇంటి పనులన్నింటినీ,  కుటుంబ సభ్యులందరి ఇష్టాయిష్టాలను చూసుకోవడం కోడలి విధిగా పరిగణించబడుతుంది. అమ్మాయిలు ఈ సంప్రదాయాన్ని బహిరంగంగా ప్రశ్నిస్తారు. ఇంటి బాధ్యతలన్నీ ఏకపక్షంగా వారి మీద నెట్టడం అమ్మాయిలలో విముఖత కు దారి తీస్తుంది.  వివాహం తర్వాత ఇంటి బాధ్యతలన్నీ కోడలిపైనే ఎందుకు ఉంటాయి అనేది వారి ప్రశ్న? ఈ ఆలోచనకు సరైన సమాధానం లభించనప్పుడు వివాహానికి దూరంగా ఉండటం మంచిదని వారు భావిస్తారు. సామాజిక జోక్యం.. వివాహం తర్వాత అమ్మాయిలు ధరించే దుస్తుల దగ్గర నుండి, వారికి  పిల్లలు ఎప్పుడు పుడతారు అనే విషయం వరకు చాలా విషయాలు అమ్మాయిల స్వేచ్ఛకు ఆటంకం కలిగిస్తాయి. వివాహం తర్వాత ఒక అమ్మాయి జీవితంలో సామాజిక జోక్యం పెరుగుతుంది. వివాహం చేసుకోవడం వల్ల వారి వ్యక్తిగత స్థలం తగ్గుతుందని అమ్మాయిలు భావిస్తారు. అటువంటి పరిస్థితిలో వారు వివాహానికి దూరంగా ఉండటం ప్రారంభిస్తారు.  అలాంటి జోక్యాన్ని నివారించాలని కోరుకుంటారు.                                    *రూపశ్రీ.  
విడాకులు.. అనే మాట అంత సులభమైనది ఏమీ కాదు. జీవితాంతం కలిసుండాలని ఒక వ్యక్తితో కొంత కాలం ఉండి ఆ తరువాత వారి నుండి విడిపోవడం అనేది మానసికంగా చాలా బాధాకరం. ఇలా విడిపోవడం వల్ల ఎప్పుడూ ఒకరిని మిస్ అవుతున్న భావన ఉంటుంది. అలాంటి పరిస్థితిలో పాత సంబంధం వల్ల అయిన  గాయాన్ని మాన్పుకోకుండా,  దాన్ని మర్చిపోకుండానే  కొన్ని కారణాల వల్ల  కొత్త వ్యక్తితో  మళ్లీ బంధంలోకి వెళ్లడానికి సిద్దపడుతుంటారు. వైవాహిక బంధం జీవితంలో  ముఖ్యమైన భాగం. దానిని మొదలుపెట్టినప్పటి నుండి ముగించే వరకు చాలా జాగ్రత్త అవసరం. జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం నుండి విడిపోయారు అంటే అర్థం అది  చెడు సంబంధం అని. ఆ బంధంలో గాయపడిన వారికి ఆ బందం  మానసిక ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. ఒంటరిగా ఉండటం అంత సులభం కాదు.  ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఒంటరితనాన్ని నివారించడానికి తొందరపడి కొత్తం సంబంధాన్ని ప్రారంభించడం కూడా మంచి ఆలోచన కాదు. కాబట్టి విడిపోయిన తర్వాత మళ్ళీ కొత్త సంబంధంలోకి రావడానికి  మానసికంగా  సిద్ధంగా ఉన్నారా లేదా అని తెలుసుకోవడం ముఖ్యం. విడిపోయిన తర్వాత..  భార్యాభర్తల బంధం చాలా భావోద్వేగమైనది. ఆ బంధంలో ఇద్దరు వ్యక్తులు చాలా ఓపెన్ అవుతారు. దురదృష్ణ వశాత్తు చాలా నిజాయితీగా ఉండి గాయపడిన వ్యక్తులు ఆ బంధం మిగిల్చిన చేదు జ్ఞాపకాలను అంత తొందరగా మరచిపోలేరు. కానీ కొందరు మాత్రం వాటిని మరచిపోవడానికి మరొక సంబంధాన్ని ప్రారంభించాలని అనుకుంటారు.  ఈ పొరపాటు ఎప్పుడూ చేయవద్దని రిలేషన్షిప్ నిపుణులు చెబుతున్నారు. విడిపోవడాన్ని మరచిపోవడానికి ఏర్పడిన సంబంధాలు సాధారణంగా కాలక్రమేణా విషపూరితంగా మారుతాయి. కోల్పోయిన భావన.. ఎవరితోనైనా అయినా సరే.. చాలా అపురూపమైన సమయాన్నిగడిపి ఆ తర్వాత కారణాల వల్ల విడిపోతే..  వారి మనస్సు నుండి సదరు వ్యక్తులను  తొలగించడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ  ఒక విషయం.. ప్రతి రోజూ ఏదో ఒక సమయంలో ఏదో ఒక టాపిక్ లో విడిపోయిన భాగస్వామిని గుర్తు చేసుకుంటూ వారి గురించి మాట్లాడుతూ ఉంటే..  కొత్త సంబంధానికి సిద్దంగా లేనట్టేనని గుర్తించాలి. ఒంటరితనం.. ఆరోగ్యకరమైన సంబంధం కావాలంటే, ఒంటరిగా ఉండటం, ఒంటరితనాన్ని కూడా  ఆనందించడం నేర్చుకునే వరకు కొత్త బంధంలోకి వెళ్లకూడదు.  చాలా కాలంగా ఉన్న సంబంధం విడిపోయినప్పుడు తరచుగా  తమతో తాము సమయం గడపలేరు. తమను తాము సంతోషంగా ఉంచుకోలేరు. ఇలాంటి వారు సంతోషంగా ఉండటానికి ఏవైనా వెన్నంటి ఉండాల్సి ఉంటుంది.   ఆశిస్తున్నారా? భార్యాభర్తల సంబందం గురించి సరైన అవగాహన లేకపోయినా,  అందులో లోతుగా జరిగే వాటిని అర్థం చేసుకోలేకపోయినా దయచేసి వెంటనే కొత్త సంబంధం కోసం ప్రయత్నించకూడదు. కేవలం  సమయం గడపడానికి ఒక సంబంధం నుండి మరొక సంబంధానికి మారడం  మంచిది కాదు. ఇలా చేసే వ్యక్తులు తరచుగా నిరాశ,  స్వీయ-అపరాధ భావనతో బాధపడుతుంటారు.                              *రూపశ్రీ.
గర్భధారణ సమయంలో చాలా సార్లు తల్లి లేదా బిడ్డ ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే సాధారణ ప్రసవం సాధ్యం కాని పరిస్థితులు తలెత్తుతాయి. దీనివల్ల  వైద్యులు సి-సెక్షన్‌ను సిఫారసు చేస్తారు.  నిజానికి నేటి కాలంలో సి-సెక్షన్ ఏ ఎక్కువగా సాగుతోంది. అయితే నేటి కాలం మహిళలలో మెల్లిగా మార్పు వస్తోంది.  చాలామంది సి-సెక్షన్ బదులు సాధారణ ప్రసవం కావాలని వైద్యులను సంప్రదిస్తున్నారు.  ఇందుకోసం ప్రెగ్నెన్సీ క్లియర్ అయ్యింది మొదలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు కూడా. అయితే చాలామంది మహిళలు చేసే ఒక తప్పు వల్ల సాధారణ డెలివరీ కావాలని అనుకున్న వారు కూడా సి-సెక్షన్ కు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మహిళలు చేస్తున్న తప్పేంటి? తెలుసుకుంటే.. నీరు.. గర్భాధారణ సమయంలో మహిళలు  నీరు పుష్కలంగా తాగకపోవడం సాధారణ డెలివరీ అవకాశాలను తగ్గిస్తుందట.  భారతదేశం వంటి వేడి చాలా ఎక్కువగా ఉండే దేశంలో గర్భిణీ స్త్రీలు కనీసం 3 నుండి 4 లీటర్ల నీరు లేదా ద్రవాలు తీసుకోవాలని గైనకాలజిస్టులు చెబుతున్నారు. చాలా మంది దాహం వేసినప్పుడు మాత్రమే నీరు తాగుతారు లేదా నీటి వనరులు అంటే నీరు మాత్రమే అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. దీని కోసం జ్యూసులు  కూడా తాగవచ్చు. అలాగే  కొబ్బరి నీళ్లు తాగవచ్చు. కానీ  రోజంతా 3 నుండి 4 లీటర్లు నీరు తాగాలి. శరీరంలో నీటి కొరత ఉన్నప్పుడు, అది గర్భంలో ఉన్న శిశువు చుట్టూ ఉన్న అమ్నియోటిక్ ద్రవం పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని గైనకాలజిస్టులు చెబుతున్నారు. దాని స్థాయి పడిపోతే శిశువు ఎప్పుడైనా గర్భంలో మల విసర్జన చేయవచ్చు.  ఇది ప్రసవాన్ని  అత్యవసరం చేస్తుంది. అటువంటి పరిస్థితిలో డాక్టర్ సాధారణ ప్రసవానికి బదులుగా సి-సెక్షన్‌ను సిఫారసు చేస్తారు. కాబట్టి నీటి విషయంలో జాగ్రత్త వహించాలి.                                 *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
భారతదేశంలో స్వీట్లకు, ముఖ్యంగా గులాబ్ జామున్‌కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అది పండుగ అయినా, పెళ్లి అయినా, ఆఫీస్ పార్టీ అయినా - గులాబ్ జామున్ కనిపించకుండా ఉండదు. పైగా గులాబ్  జామూన్ వండటం కూడా చాలా తేలిక.  దీని కారణంగా చాలామంది గులాబ్ జామూన్ ను చేయడానికి ఇష్టపడతారు.  ఇక దీని రుచి కారణంగా దీనికి విపరీతమైన అబిమానులు ఉన్నారు.  విదేశీయులు సైతం గులాబ్ జామూన్ అంటే పడి చస్తారు. కానీ గులాబ్ జామూన్ గురించి కొన్ని నిజాలు తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది.  అవేంటో తెలుసుకుంటే.. గులాబ్ జామూన్ రుచిగా ఉన్నప్పటికీ ఈ గులాబ్  జామున్‌లో దాగి ఉన్న చక్కెర,  సంతృప్త కొవ్వు స్థాయి నేరుగా  శరీరానికి ఎన్ కౌంటర్ లాంటి చేటు చేస్తుందట.  ఇది ఊబకాయాన్ని పెంచడమే కాకుండా, గుండె జబ్బులు, మధుమేహం,  కాలేయ సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది. స్వీట్లు అంటే ఇష్టమే అయినా ఇలా చక్కెర, నూనె ఎక్కువగా వినియోగించి చేసే పదార్థాల విషయంలో చాలా జాగ్రత్త అవసరమని అంటున్నారు ఆహార నిపుణులు, ఆరోగ్య వైద్యులు. తియ్యని రుచి కాదు.. కేలరీల  కొండ.. ఒక చిన్న గులాబ్ జామున్ సగటున 125 నుండి 150 కేలరీలు ఇస్తుందని తెలుసా? చాలా షాకింగ్ గా అనిపిస్తుంది కానీ ఇదే నిజం. ఇందులో దాదాపు 20 గ్రాముల చక్కెర,  5 గ్రాముల కంటే ఎక్కువ సంతృప్త కొవ్వు ఉంటుంది. కేవలం ఒక్క చిన్న గులాబ్ జామూన్ లోనే ఇంత ఉంటే.. ఇక రుచి బాగుందని ఆబగా తినే వారి సంగతి తలచుకుంటే చక్కెర కొండ మింగుతున్నారా అని అనిపిస్తుంది.  రుచి మోజులో శరీరానికి ఎంతో చేటు చేసే పదార్థాలను అవగాహన లేకుండానే అలా పొట్టలోకి పంపేస్తున్నామని చాలామందికి అస్సలు తెలియదు. ఇటువంటి స్వీట్లను నిరంతరం తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది, జీవక్రియ నెమ్మదిస్తుంది,  వేగంగా బరువు పెరుగుతుంది.  బరువును నియంత్రించుకోవాలనే ఆలోచనలో ఉన్నవారు ఇలా చక్కెర శాతం ఎక్కువగా ఉండే గులాబ్ జామూన్ లాంటి స్వీట్లను అస్సలు తీసుకోకూడదని అంటున్నారు ఆహార నిపుణులు. స్వీట్లు ఈ జనరేషన్ లోనే ఎందుకు చేటు చేస్తున్నాయ్.. కాస్త వివరంగా ఆలోచిస్తే.. గతంలో  అంటే కిందటి తరాల వారికి శారీరక శ్రమ ఎక్కువ ఉండేది. కానీ శారీరక శ్రమ తక్కువగా ఉన్న నేటి జీవనశైలిలో, చక్కెరను అధికంగా తీసుకోవడం శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. స్వీట్లు రక్తంలో చక్కెరను అసమతుల్యత చేయడమే కాకుండా ఫ్యాటీ లివర్,  అధిక ట్రైగ్లిజరైడ్లను కూడా కలిగిస్తాయి . ఈ ప్రభావం పిల్లలు,  వృద్ధులలో మరింత ప్రమాదకరం. కాబట్టి, 'రుచి' పేరుతో   ఆరోగ్యాన్ని లైట్ తీసుకోకూడదు. పిల్లలకు, వృద్దులకు చేసే చేటు.. స్వీట్లు తినడం మద్య వయసు వారికే ప్రమాదం అనుకుంటే పొరపాటు. పిల్లలకు, వృద్దులకు ఇది చాలా డేంజర్.. పిల్లల్లో స్వీట్లు ఎక్కువగా తినడం వల్ల ఊబకాయం, దంతక్షయం, హైపర్యాక్టివిటీ వంటి సమస్యలు వస్తాయి. మరోవైపు వృద్ధులలో స్వీట్లు రక్తంలో చక్కెరను పాడు చేస్తాయి.  ఇది మధుమేహం, గుండె జబ్బులు,  మూత్రపిండాల సమస్యలకు దారితీస్తుంది. చాలా సార్లు  "కొంచెం తీపి తింటే ఏమి తేడా ఉంటుంది" అని  లైట్ తీసుకునే వారు ఎక్కువ.  కానీ ఈ చిన్న మొత్తాలు కలిసి శరీరంపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. భవిష్యత్తులో  ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా చిన్నతనం నుండే పిల్లల అలవాట్లకు సరైన దిశానిర్దేశం చేయడం చాలా ముఖ్యం.                                *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..