LATEST NEWS
ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్  తెలుగుదేశం కూటమి వశమైంది. ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికలలో  తెలుగుదేశం  ఘన విజయం సాధించింది. ఒంగోలు మేయర్ స్థానాన్ని టీడీపీ అభ్యర్థి నల్లమళ్ళ శ్రీశిల్ప కైవసం చేసుకున్నారు.   ఆమె తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థిపై  37 వేల ఓట్ల అఖండ మెజారిటీతో విజయం సాధించారు.  ఈ విజయంతో తెలుగుదేశం కూటమి శ్రేణులు ఒంగోలులో సంబరాలు చేసుకున్నారు.  కౌంటింగ్ లో మొదటి నుంచి నల్లమళ్ళ శ్రీశిల్ప స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచారు.  అదలా ఉంటే ఒంగోలు కార్పొరేషన్ లో   తెలుగుదేశం  39 స్థానాల్లో గెలుపొందగా, మిత్రపక్షాలు  జనసేన   8 డివిజన్లలో, బీజేపీ ఒక డివిజన్‌లో విజయం సాధించాయి.  ఇక వైసీపీ కేవలం 11 డివిజన్లకే పరిమితమైంది. ఇతరులు మూడు డివిజన్ లలో గెలుపొందారు.  కాగా మురసు తుపాను కారణంగా ఒంగోలు కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు ఆలస్యమైంది. తుపాను కారణంగా మంగళవారం (నవంబర్ 3) జరగాల్సిన ఓట్ల లెక్కింపు  బుధవారం (నవంబర్ 4) నిర్వహించారు.   [TDP Win Ongole Corporation, Mayor, SriSilpi, TDP Victory,  Ongole Municipal Corporation, AP Local Body Elections, Telugu One]
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు. ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయాన్ని జీర్ణించుకోలేక  ఆయన అక్కసు వెళ్లగక్కుతున్నారు. గతంలో చేసిన విమర్శలే చేస్తూ.. అదే తప్పును పునరావృతం చేస్తున్నారు. పార్టీ పరాజయానికి కారణాలు, క్యాడర్ లో భరోసా నింపడంలో తన వైఫల్యాలపై ఆత్మ విమర్శ చేసుకోవడం, పార్టీ తీరుపై సమీక్షలు నిర్వహించడం అన్నది ఆయన డిక్షనరీలోనే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.   రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి హవా స్పష్టంగా కనిపించింది. ప్రతిచోటా అధికార పక్షం వైపే ఓటర్లు మొగ్గు చూపడంతో వైకాపాకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఈ భారీ పరాభవంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన వైఎస్ జగన్... సోషల్ మీడియా వేదికగా తన అక్కసును వెళ్లగక్కారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పోలీసులు,  ఎన్నికల సంఘాన్ని ట్యాగ్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.  ప్రతిపక్షం పోటీ చేసే అవకాశమే ఇవ్వకుండా ఎన్నికల్లో అద్భుతంగా గెలవడం ఎలాగో మీరు నిరూపించారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి.  రాష్ట్రంలో జరిగినవి  ఎన్నికలు కాదని  సెలెక్షన్స్ అనీ జగన్ ఆరోపించారు.  అధికార పార్టీ మరియు ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ విధంగా విమర్శలు చేయడం ద్వారా, ప్రజల తీర్పును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని జగన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాతీర్పును  గౌరవించకుండా జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయనకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదన్న విషయాన్ని చాటుతున్నాయంటున్నారు.  క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని తప్పులను సరిదిద్దుకునే దిశగా వైకాపా అధినాయకత్వం అడుగులు వేయడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇదే వైఖరిని కనుక కొనసాగిస్తే పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు.  ప్రజల నుంచి వచ్చిన స్పష్టమైన తీర్పును అంగీకరించి ఆత్మసమీక్ష చేసుకోవడానికి బదులుగా,  నిందలు మోపి, పరాజయానికి నెపం తెలుగుదేశం పార్టీపైనా, ఎన్నికల సంఘంపైనా నెట్టేయడం సరి కాదంటున్నారు.   ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును శిరసావహించి, ప్రజల మధ్య ఉంటూ సమస్యలపై పోరాడితేనే మళ్లీ పుంజుకునే అవకాశం ఉంటుందని లేకపోతే పార్టీ భవిష్యత్  ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు.  [Jagan Reaction On Defeat, Municipal polls, AP Local Body Election Results,   Team CBN Tweet, AP politics, Telugu One]
ఆంధ్రప్రదేశ్‌లో మునిసిపోల్ ఫలితాలు ఫలితాలు వైసీపీకి కోలుకోలేని పరాభవాన్ని మిగిల్చాయి. 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తెరపైకి తెచ్చిన  మావిగన్ (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు) రాజధాని ప్రతిపాదనను స్థానిక ప్రజలు పూర్తిగా తిరస్కరించినట్లు ఈ ఎన్నికల తీర్పు స్పష్టం చేస్తోంది. అంటే జగన్ 2029 ఎన్నికలకు మావిగన్ నినాదంతో వెడతామని ప్రకటించారు. అయితే అంత వరకూ ఆగక్కర్లేదు, ఆ నినాదంతో ఎన్నికలకు వెడితే ఫలితం ఇలాగే ఉంటుందని మునిసిపోల్స్ లో తమ విస్పష్ట తీర్పు ద్వారా ప్రజలు నిర్ద్వంద్వంగా చాటారు.  గతంలో మూడు రాజధానుల ముసుగులో విశాఖపట్నాన్ని ప్రధాన కేంద్రంగా చూపేందుకు ప్రయత్నించినప్పటికీ, 2024 ఎన్నికల్లో వైజాగ్ నియోజకవర్గాల ప్రజలు వైసీపీని పూర్తిగా పక్కనబెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ తన రాజకీయ వ్యూహాన్ని మార్చుకుని, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను అనుసంధానిస్తూ  మావిగన్ పేరుతో కొత్త పల్లవి ఎత్తుకుంది. అయితే, 2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.   మున్సిపల్ ఫలితాల్లో  అధికార తెలుగుదేశం కూటమి తిరుగులేని ఆధిక్యతను సాధించింది. మచిలీపట్నం కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 60 డివిజన్లలో  తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేనలు ఏకంగా 48 స్థానాలను కైవసం చేసుకోగా, ఇండిపెండెంట్లు 3 చోట్ల విజయం సాధించారు. వైసీపీ 9 స్థానాలకే పరిమితమైంది.  ఇక్కడ టీడీపీకి చెందిన షేక్ అబ్దుల్లా అభిదా మేయర్‌గా విజయం సాధించారు. అలాగే విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలోనూ ఇదే ఫలితం వచ్చింది.  విజయవాడ కార్పొరేషన్‌ను జనసేన అభ్యర్థి వంగవీటి రాధా దక్కించుకోగా, 86 డివిజన్లలో అత్యధిక భాగం తెలుగుదేశం కూటమి ఖాతాలోనే పడ్డాయి. అ  గుంటూరు కార్పొరేషన్‌లో మొత్తం 76 డివిజన్లలో  కూటమి మెజారిటీ స్థానాలను గెలుచుకుంది.  టీడీపీకి చెందిన కోవలమూడి లక్ష్మీ అపర్ణ మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు. ఈ మూడు నగరాల్లోనూ వైసీపీ కనీస పోటీ కూడా   కూడా ఇవ్వలేకపోయింది. దీంతో  2029 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే  మావిగున్ రాజధాని ప్రతిపాదనకు అసలైన రెఫరెండమ్ జగన్ గతంలో పలు సందర్భాలలో చెప్పారు. అయితే ప్రస్తుతం ఈమూడు నగరాల  కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకి ఎదురైన ఘోర పరాజయం చూస్తుంటే... ఆ రెఫరెండమ్ ఫలితం కోసం ప్రజలు మరో రెండున్నరేళ్లు ఆగాల్సిన అవసరం లేదని స్పష్టమౌతోంది. జగన్ మావిగన్ ప్రతిపాదనను జనం నిర్ద్వంద్వంగా తిరస్కరించారనడానికి ఈ ఫలితాలే నిలువెత్తు నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   [People Reject MAVIGUN, AP Municipal Corporation Election Results, YSRCP Capital Narrative, TDP Janasena Alliance victory, AP politics, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
Allu Arjun took a moment to appreciate the makers behind the massive mythological drama, Ramayana. The pan-India star shared his wholehearted backing for the ambitious vision being brought to life. His message underscores the cultural weight and cinematic ambition of the upcoming film. He conveyed his feelings by writing, "My best wishes to the entire #Ramayana team. It’s not just a movie. It’s a representation of our culture and an attempt to raise the bar of Indian films. I wholeheartedly send my pure, positive wishes to the entire team for their divine attempt. Let’s all unite and come forward to support a pure attempt that carries our stories, our culture and our glory. Jai Sri Ram." The public display of solidarity showcases a unified front from the Indian film fraternity. Promoting a movie of this scale demands a collective push, and the superstar is leading by example. His encouraging post highlights the dedication required to mount such a culturally vital story. Ranbir Kapoor, Yash, Sai Pallavi are starring in Lord Rama, Ravana, Maa Sita roles, respectively. The movie is being released by Sony Pictures worldwide while Dil Raju is releasing it in Telugu States. Namit Malhotra, Yash and DNEG are producing the film in Nitesh Tiwari direction. Hans Zimmer and AR Rahman composed music for the film.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం కావడంతో ఈ సినిమాపై సినీ ప్రేక్షకుల్లోనే కాకుండా ఇండస్ట్రీలోనూ ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన మద్దతు ప్రకటించారు. ‘రామాయణ’ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఇది కేవలం సినిమా మాత్రమే కాదని.. మన సంస్కృతికి ప్రతిరూపమని ఆయన పేర్కొన్నారు. భారతీయ సినిమాల స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లే ప్రయత్నంగా అభివర్ణించారు. మన కథలు, మన సంస్కృతి, మన ఘనతను ప్రపంచానికి చాటే ఇలాంటి ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ దైవిక ప్రయత్నం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అల్లు అర్జున్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అందరం ఒక్కటై ఇలాంటి ప్రయత్నానికి అండగా నిలవాలని చెబుతూ చివర్లో ‘జై శ్రీరామ్’ అంటూ తన సందేశాన్ని ముగించారు. అల్లు అర్జున్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా ‘రామాయణ’ను కేవలం సినిమాగా కాకుండా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రయత్నంగా చూడాలన్న అల్లు అర్జున్ వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇది కూడా చదవండి: సందీప్ రెడ్డి వంగా ఫైర్.. రాప్తాడు విషాదాన్ని అడ్డం పెట్టుకుని టార్గెట్ చేస్తున్నారు.! https://x.com/alluarjun/status/2117904605933912569       [Allu Arjun Tweet On Ramayana, Allu Arjun Twitter, Ramayana Movie, Ranbir Kapoor, Sai Pallavi, Yash, Allu Arjun, Nitesh Tiwari, Namit Malhotra, Telugu Film News]  
టైగర్ ష్రఫ్ పై హత్యాయత్నం జరిగిన నాటి నుంచి టైగర్ తండ్రి పాన్ ఇండియా అగ్ర నటుడు జాకీ ష్రఫ్ కూడా డైలీ వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు.  రీసెంట్ గా జైలర్ 2 తో తన కట్ ఫుట్ కెపాసిటీ తెలియచేసాడు నేడు  ప్రముఖ అగ్ర నటి టబు బర్త్ డే . ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు, కోట్లాది మంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో జాకీ ష్రాఫ్ చేసిన ఒక ప్రత్యేక పోస్ట్ ప్రస్తుతం నెట్టింట  వైరల్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గతంలో ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంలో టబుతో కలిసి దిగిన రేర్ త్రోబ్యాక్ ఫొటోను జాకీ ష్రాఫ్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. సిల్వర్ రంగు దుస్తుల్లో ఎంతో హుందాగా, అందంగా కనిపిస్తున్న టబుతో కూడిన ఆ చిత్రానికి "హ్యాపీనెస్ ఆల్వేస్" (ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి) అనే  క్యాప్షన్ జతచేశాడు.  ఇది కూడా చదవండి: పవన్ కళ్యాణ్, షారుఖ్ ఖాన్: రెండో ప్రపంచ యుద్దానికి సంబంధం ఏంటి!   అంతేకాకుండా, 1999లో వచ్చిన టబు సూపర్ హిట్ చిత్రం 'తక్షక్' సినిమాలోని మధురమైన 'బూందోన్ సే బాతే' పాటను బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌గా జోడించి ఈ బర్త్ డే విషెస్‌ను మరింత భావోద్వేగభరితంగా మార్చారు. జాకీ ష్రాఫ్, టబు గతంలో '2001: దో హజార్ ఏక్', 'కోహ్రామ్' వంటి పలు చిత్రాల్లో స్క్రీన్‌ను పంచుకున్నారనే విషయం తెలిసిందే.   [jackie Shroff  birthday Wishes To Tabu, Tabu 55th birthday, Jackie Shroff wishes, Tabu birthday news, Bollywood actress Tabu, Tabu movies, Tollywod, tollywood News, Telugu Cinema, Telugu CInema News]
కొన్ని న్యూస్ ఇచ్చే కిక్ అంతే.. అన్ని న్యూస్ కి ఉన్న రికార్డు వ్యూస్ ని దాటేసి అగ్ర స్థానంలో ఉంటాయి. అలాంటి ఒక న్యూస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బాద్షా షారుక్ ని ముడి చేస్తూ వచ్చిన న్యూస్. మరి అదేంటో చూద్దాం. పవన్ కళ్యాణ్‌  ఫ్యాషన్ ట్రెండ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమాల్లో ధరించే దుస్తులు, ముఖ్యంగా హూడీస్, కార్గో ప్యాంట్స్ యువతలో విపరీతమైన ట్రెండ్ సృష్టించేవి. అప్పట్లో పవన్ కళ్యాణ్ స్టైలింగ్ విషయంలో ఆయన మాజీ భార్య, నటి రేణు దేశాయ్ చాలా కీలకమైన పాత్ర పోషించేవారు. తాజాగా ఆమె పంచుకున్న కొన్ని ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పవన్ నుంచి వచ్చిన  ‘బాలు’ సినిమా కోసం ఆమె పడిన కష్టం మరియు అప్పట్లో వారు అనుసరించిన ఫ్యాషన్ ప్రమాణాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.  'బాలు’ చిత్రంలో పవన్ కళ్యాణ్ ధరించిన ప్రత్యేకమైన ప్యాంటు అప్పట్లో ఒక పెద్ద సెన్సేషన్‌గా నిలిచింది. ఆ ప్రత్యేకమైన ప్యాంట్ల గురించి రేణు దేశాయ్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఆ డిజైన్‌లో కేవలం 5 మాత్రమే అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. అంతేకాకుండా, ఆ దుస్తులను తయారు చేయడానికి ఏకంగా రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఉపయోగించిన క్లాత్‌  వాడారనే విషయాన్ని ఆమె బయటపెట్టారు. ఇలాంటి రేర్ కలెక్షన్స్ మరియు ప్రత్యేకమైన డిజైన్ల కోసం ఆమె లండన్‌లోని ఒక ప్రముఖ షాపింగ్ మాల్‌ని  ఆశ్రయించేవారట.  ఇది కూడా చదవండి: జగపతిబాబు మాటని గౌరవించిన గుంటూరు.. సోదరికి భారీ మెజారిటీ..మరి పార్టీ లేదా పుష్ప!   అయితే, అదే లండన్ షాపింగ్ మాల్‌కు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూడా క్రమం తప్పకుండా వచ్చేవారనే ఆసక్తికరమైన రూమర్ మరియు విశేషాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. షారుఖ్ ఖాన్ తరపున ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ కూడా సరిగ్గా అదే లొకేషన్‌కు వచ్చి ఆయన కోసం దుస్తులు ఎంపిక చేసేవారని రేణు దేశాయ్ తెలిపినట్లు సమాచారం. ఒకే సమయంలో ఇద్దరు లెజెండరీ స్టార్ల కోసం ఒకే స్టైలిష్ షాపింగ్ డెస్టినేషన్ ఉండటం అప్పట్లో ఫ్యాషన్ సర్కిల్స్‌లో చర్చనీయాంశమైంది.   టాలీవుడ్ మరియు బాలీవుడ్ దిగ్గజ హీరోలైన పవన్ కళ్యాణ్, షారుఖ్ ఖాన్ ఫ్యాషన్ రుచులు ఒకే చోట కలవడం ఇటు మెగా అభిమానులను, అటు షారుఖ్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. నాటి ‘బాలు’ జ్ఞాపకాలను, ఆ ప్రత్యేకమైన స్టైలింగ్ వెనుక ఉన్న కష్టాన్ని రేణు దేశాయ్ మరోసారి గుర్తుచేయడంతో ఈ విశేషాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.      [Renu Desai About Pawan Kalyan And Shah Rukh Khan Shopping, Pawan Kalyan, Shah Rukh Khan, Renu Desai, Balu movie fashion, Power Star style, Tollywood news, London shopping, Karan Johar, celebrity style secrets, Tollywod, tollywood News, Telugu Cinema, Telugu CInema News]
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో హింస ఎక్కువగా ఉంటుందనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ముఖ్యంగా 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' సినిమాల విషయంలో ఈ చర్చ చాలాసార్లు తెరపైకి వచ్చింది. అయితే తాజాగా ఏపీలోని రాప్తాడులో చోటుచేసుకున్న దారుణ ఘటన మళ్లీ సందీప్ వంగాను వార్తల్లోకి తీసుకొచ్చింది. ఈ ఘటనకు సినిమాల్లోని హింసాత్మక సన్నివేశాలే కారణమంటూ కొందరు విమర్శలు చేయడంతో ఆయన తాజాగా ఘాటుగా స్పందించారు. అనంతపురం జిల్లా రాప్తాడులో పదో తరగతి చదువుతున్న ఓ బాలికపై 21 ఏళ్ల యువకుడు రంపంతో దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. పాఠశాల తరగతి గదిలోనే ఈ దారుణం జరగడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు.. నిందితుడి ప్రవర్తనను సినిమాల్లో చూపించే హింసతో ముడిపెడుతున్నారు. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన 'యానిమల్' సినిమాలో రణబీర్ కపూర్ తుపాకీతో స్కూల్ క్లాస్‌రూమ్‌లోకి వెళ్లే సన్నివేశాన్ని ప్రస్తావిస్తున్నారు. దీంతో సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో హింసను గ్లోరిఫై చేస్తున్నారని, ఇలాంటి సినిమాలు యువతపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయని కొందరు విమర్శిస్తున్నారు. మరికొందరు అయితే ఇలాంటి సినిమాలు తెరకెక్కించే దర్శకులపై చర్యలు తీసుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. తన సినిమాలపై వస్తున్న ఈ విమర్శలకు తాజాగా సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇలాంటి భయంకరమైన నేరం జరిగినప్పుడు మొదట బాధితుల పట్ల సానుభూతి చూపించాలని, ఘటన వెనుక ఉన్న అసలు సమస్యలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని అన్నారు. అంతేకానీ, ప్రతి విషయానికి సినిమాలను బలిపశువులను చేయడం సరికాదని మండిపడ్డారు. ఈ విషాదాన్ని అడ్డం పెట్టుకుని కొందరు తమ వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ముఖ్యంగా ఇతరుల సినిమాలపై విమర్శలు చేసే అవకాశం దొరికినప్పుడల్లా సామాజిక సంస్కర్తలుగా మారే కొందరు నటీనటులు, దర్శకులు, నిర్మాతలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక విషాదానికి కావాల్సింది సానుభూతి మాత్రమేనని, అవకాశవాదం కాదని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: రాప్తాడు ఘటన వెనుక అసలు నిజాలు.. సినిమాల వల్లే నేరాలు జరుగుతున్నాయా.? https://x.com/imvangasandeep/status/2117858057262924213       [Sandeep Reddy Vanga, Raptadu Incident, Animal Movie Controversy, Cinema Violence Debate, AndhraPradesh, AP News, Telugu Film News]  
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్ ‘గాడ్ ఆఫ్ వార్’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా కార్తికేయ స్వామి నేపథ్యంతో తెరకెక్కనున్న ఈ సినిమా ఇద్దరి కెరీర్స్ లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా నిలవబోతోందనే టాక్ ఉంది. అయితే ఈ సినిమా ఇద్దరికీ ఒక కీలకమైన పరీక్ష కూడా కాబోతోందా? అనే చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. త్రివిక్రమ్ విషయానికి వస్తే.. బలమైన సంభాషణలు, కుటుంబ భావోద్వేగాలు, కథలోని తాత్విక అంశాలను తనదైన శైలిలో చెప్పడం ఆయన ప్రత్యేకత. అయితే ఇటీవలి సినిమాల విషయంలో మాత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయారనే అభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యంగా ‘గుంటూరు కారం’, ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలు త్రివిక్రమ్ స్థాయిలో లేవనే కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు ‘గాడ్ ఆఫ్ వార్’ రూపంలో ఆయన ముందున్న సవాలు మరింత పెద్దది. పురాణాలపై త్రివిక్రమ్ కి ఉన్న పట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. అయితే ఆ కంటెంట్ ని అంతే అద్భుతంగా తెరపైకి తీసుకొస్తారా? అనేది ఆయన ముందున్న సవాలు. బలమైన కథ, భావోద్వేగాలు, పాత్రల చిత్రణతో పాటు భారీ సెట్స్, గ్రాఫిక్స్, యాక్షన్ సన్నివేశాలతో ముడిపడి ఉన్న మైథలాజికల్ ప్రాజెక్ట్ ఇది. ఈ జానర్ కానీ, ఇలాంటి వీఎఫ్ఎక్స్ అవసరమున్న సినిమాలు కానీ ఇంతకముందు చేసిన అనుభవం త్రివిక్రమ్ కి లేదు.  మరోవైపు ఎన్టీఆర్‌కు కూడా ఈ సినిమా ఒక పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’లో డ్రగ్ లార్డ్ తరహా పాత్రలో కనిపించబోతున్న ఎన్టీఆర్.. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమాలో కార్తికేయుడి పాత్రలో కనిపించనుండటం ఆసక్తిని పెంచుతోంది. ఒక సినిమాలో పూర్తిగా మాస్, రగ్గడ్ షేడ్స్ ఉన్న పాత్ర.. మరో సినిమాలో దైవిక నేపథ్యం కలిగిన పాత్ర. ఈ రెండు పాత్రల మధ్య ఎన్టీఆర్ చూపించబోయే వేరియేషన్ ఎలా ఉంటుందనేది అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా కార్తికేయుడి పాత్రను తెరపై ఆవిష్కరించడం అంత సులభమైన విషయం కాదు. ఆ పాత్రకు ఉండే దైవిక గాంభీర్యం, యోధుడి లక్షణాలు, భావోద్వేగాలు అన్నింటినీ సమపాళ్లలో చూపించాలి. ఎన్టీఆర్ నటనకు మంచి అవకాశం ఉన్నప్పటికీ, ఆ పాత్రకు తగ్గట్టుగా స్టోరీ, స్క్రీన్‌ప్లే, విజువల్ ప్రెజెంటేషన్ ఉండటం చాలా ముఖ్యం. మొత్తానికి ‘డ్రాగన్’తో మాస్ అవతారంలో కనిపించనున్న ఎన్టీఆర్.. ‘గాడ్ ఆఫ్ వార్’తో పూర్తిగా భిన్నమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరోవైపు త్రివిక్రమ్ కూడా తన కెరీర్‌లోనే భారీ ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. మరి ఈ ఇద్దరి కలయికలో రాబోయే ఈ మైథలాజికల్ ప్రాజెక్ట్ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. ఇది కూడా చదవండి: రాప్తాడు ఘటన వెనుక అసలు నిజాలు.. సినిమాల వల్లే నేరాలు జరుగుతున్నాయా.?       [Jr NTR Trivikram Movie, God Of War Movie, Lord Karthikeya, Jr NTR, Trivikram Srinivas, Dragon Movie, Aadarsha Kutumbam Movie, Telugu Film News]  
  జగపతి బాబు.. ఎనీ క్యారెక్టర్ లో మెస్మరైజ్ చేసే అరుదైన వజ్రం లాంటి యాక్టర్. మరి ఆ దిగ్గజ నటుడి సోదరి లక్ష్మీ అపర్ణ  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి జిల్లాగా ఉన్న  గుంటూరు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. లెజండ్రీ నటుడి సోదరి కాబట్టి సినీ హోదాలోనే ఆ న్యూస్ వివరాలేంటో చూసేద్దాం.  కొన్ని రోజుల క్రితం జరిగిన  ఆంధ్రప్రదేశ్  స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు నిన్న విడుదలయ్యాయి. గుంటూరు నగర మేయర్ స్థానానికి కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ నుంచి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ బరిలోకి దిగింది.  నగరంలోని మొత్తం 76 డివిజన్లకు జరిగిన ఈ ఎన్నికల పోరులో లక్ష్మీ అపర్ణ తన సమీప ప్రత్యర్థులపై అఖండ విజయాన్ని సొంతం చేసుకుని గుంటూరు పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో జగపతి బాబు స్వయంగా రంగంలోకి దిగి తన చెల్లెలు కోవెలమూడి లక్ష్మీ అపర్ణ కోసం ప్రత్యేకంగా వీడియో సందేశాన్ని విడుదల చేయడం ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా విపరీతమైన హైప్ తెచ్చిపెట్టింది. "నా చెల్లి లక్ష్మీ అపర్ణ ఎంతో సమర్థురాలు, మంచి మనసున్న వ్యక్తి. గతంలో సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి ఏవిధంగా భారీ మెజారిటీ అందించారో, అలాగే ఇప్పుడు నా చెల్లిని మరియు కూటమి కార్పొరేటర్ అభ్యర్థులను సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి" అంటూ జగపతి బాబు చేసిన భావోద్వేగ అభ్యర్థన ఓటర్లను విపరీతంగా ఆకట్టుకుంది.    ఇది కూడా చదవండి: తమిళ సినీ పరిశ్రమకి సీఎం విజయ్ గుడ్‌న్యూస్: ఎంతైనా సినీ బిడ్డ కదా!      ఇలా గెలుపు అనంతరం  ఇది కేవలం ఒక సాధారణ రాజకీయ విజయం కాదని, ప్రజలు తనపై ఉంచిన అపారమైన బాధ్యత అని గెలుపు అనంతరం కోవెలమూడి లక్ష్మీ అపర్ణ స్పష్టం చేశారు. స్వచ్ఛ గుంటూరు, హరిత గుంటూరు సాధనే తన ప్రథమ ధ్యేయమని, నగర ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా అభివృద్ధి బాటలో నడిపిస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ చారిత్రాత్మక విజయం వెనుక సీఎం చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు బీజేపీ రాష్ట్ర నాయకుల సంయుక్త కృషి ఎంతో ఉందని లక్ష్మీ అపర్ణ కృతజ్ఞతలు తెలిపారు.  లక్ష్మి అపర్ణ  96,294 ఓట్ల మెజార్టీతో విజయకేతనం ఎగురవేశారు. ఇక అభిమానులు సోషల్ మీడియా వేదికగా మీరు చెప్పినట్లే మీ సోదరిని గెలిపించాం. పార్టీ లేదా పుష్ప అని  కామెంట్స్ చేస్తున్నారు.      [Jagapathi Babu Sister Kovelamudi Lakshmiparna Wins Guntur Mayor, Jagapathi Babu About Lakshmi Aparna, Jagapathi Babu sister, Guntur Corporation Election, Tollywod, tollywood News, Telugu Cinema, Telugu CInema News]  
సినీ, కళా మాధ్యమం అనేది పంచభూతాల కంటే పవర్ ఫుల్ అంటూ ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా  సింగిల్ టైంలో తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవతరించాడు ఇళయ దళపతి విజయ్. మరి తనకి అంతటి శక్తీని ఇచ్చిన సినిమాకి సాయం చేయడంలో  ఏమైనా వెనుకంజ వేస్తాడా చెప్పండి. సినిమాకి సరికొత్త శక్తిని ఇచ్చాడు. తమిళ చిత్ర పరిశ్రమని  ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కించేందుకు, అలాగే అభిమానులకి  సినిమా చూసే అనుభూతిని మరింత చేరువ చేసేందుకు విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. థియేటర్లలో సినిమాల ప్రదర్శన సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జీవో  ప్రకారం ఇకపై రాష్ట్రవ్యాప్తంగా రోజుకు ఏకంగా 6 షోలు ప్రదర్శించుకోవడానికి ప్రభుత్వం అధికారికంగా అనుమతినిచ్చింది. అంతేకాకుండా, అభిమానుల కోసం ఉదయం పూట ఉత్సాహాన్ని నింపేలా ప్రత్యేకంగా 6 AM ఎర్లీ మార్నింగ్ స్క్రీనింగ్స్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ నిర్ణయం పట్ల కోలీవుడ్ వర్గాలు, స్టార్ హీరోల అభిమానులు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, థియేటర్ యాజమానుల సంఘాలు, నిర్మాతలు గత కొంతకాలంగా కోరుతున్న మరో ప్రధాన డిమాండ్‌పై మాత్రం ప్రభుత్వం భిన్నమైన వైఖరిని ప్రదర్శించింది. విపరీతంగా పెరిగిపోయిన నిర్మాణ వ్యయం, నిర్వహణ భారాలను దృష్టిలో ఉంచుకుని సినిమా టికెట్ల ధరలను పెంచాలని థియేటర్ యజమానులు గట్టిగా కోరారు. కానీ, సామాన్య ప్రేక్షకులపై ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి విజయ్ ఈ టికెట్ ధరల పెంపు ప్రతిపాదనను పూర్తిగా తిరస్కరించారు. రోజువారీ షోల సంఖ్యను 6కి పెంచడం ద్వారా నిర్మాతలు, థియేటర్ల యజమానులు బాక్సాఫీస్ వద్ద ఎక్కువ వసూళ్లు సాధించే అవకాశం ఉంటుందని, అదే సమయంలో సామాన్య ప్రజలకు తక్కువ ధరకే వినోదం అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం ఈ సమతుల్య నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. అది కూడా సినిమా మంచి కోసమే. ఇది కూడా చదవండి: డ్రాగన్ పై క్లారిటీ ఇచ్చేసిన ప్రశాంత్ నీల్: ఫ్యాన్స్ లో హుషారు!   ఈ తాజా నిబంధనల అమలుతో కోలీవుడ్‌లో పెద్ద సినిమాల విడుదల సమయాల్లో నెలకొనే ఇబ్బందులు తొలగిపోతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణ రోజుల్లోనూ, పండుగ సీజన్లలోనూ 6 షోల ప్రదర్శన వల్ల కలెక్షన్ల జోరు మరింత పెరుగుతుందని బాక్సాఫీస్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ 6 AM షోల వల్ల మొదటి రోజు కలెక్షన్ల రికార్డులు తిరగరాసే అవకాశం ఉందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టికెట్ ధరలు పెరగకపోవడం వల్ల కుటుంబ ప్రేక్షకులు ఎలాంటి సంకోచం లేకుండా థియేటర్లకు వచ్చేందుకు వెసులుబాటు దొరికింది. మొత్తానికి కోలీవుడ్ ఇండస్ట్రీ మనుగడను కాపాడుతూనే, ప్రేక్షకుల ప్రయోజనాలను దెబ్బతీయకుండా సీఎం విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో  హాట్ టాపిక్‌గా మారింది.   [Cm Vijay Approves Six Shows Per Day, CM Vijay, Tamil Nadu cinema news, 6 shows per day, Kollywood movie updates, 6 AM screenings, Tollywod, tollywood News, Telugu Cinema, Telugu CInema News]
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం.. ప్రకృతి సృష్టించే విలయానికి అడ్డుకట్ట వేసేదెలా.! ప్రకృతి సృష్టించే అత్యంత భయంకరమైన , విధ్వంసకరమైన ముప్పులలో సునామీ ఒకటి. సముద్ర గర్భంలో సంభవించే భూకంపాలు లేదా అల్లకల్లోలాల కారణంగా ఉద్భవించే ఈ రాక్షస అలలు క్షణాల్లో తీర ప్రాంతాలను ముంచెత్తుతాయి. ప్రాణ, ఆస్తినష్టాలను భారీగా మిగులుస్తాయి. ఈ ముప్పుపై ప్రజలను అప్రమత్తం చేయడానికి, ప్రాణాలను కాపాడుకునే మార్గాలపై అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం నవంబర్ 5 తేదీన ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. అసలు సునామీ అంటే ఏమిటి? సునామీ అంటే సముద్రంలో వచ్చే పెద్ద అలలు అని అందరికీ తెలిసిందే. కానీ ఇవి సాధారణ అలలలా కాకుండా వేగంగా, గోడలా ఎత్తుగా ఎగసిపడతాయి. భూమి లోపల జరిగే మార్పుల వల్ల సముద్రపు నీరు ఒక్కసారిగా కదిలి తీరాల వైపు దూసుకొస్తుంది. ఈ విపత్తు గురించి సరైన అవగాహన ఉంటే చాలా వరకు ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు. అందుకే ఈ ప్రత్యేక దినోత్సవం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తారు. సునామీ సమయంలో ఏం జరుగుతుంది? సునామీ సమయంలో ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో అందరూ తెలుసుకోవాలి. సముద్రపు నీరు అకస్మాత్తుగా వెనక్కి తగ్గిపోవడం, తీర ప్రాంతంలో పెద్ద శబ్దాలు రావడం, భూమి కంపించడం వంటివి సునామీ రాకకు ప్రధాన సూచనలు. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే ప్రజలు ఎలాంటి భయానికి లోనుకాకుండా వెంటనే సురక్షితమైన ఎత్తైన ప్రాంతాలకు లేదా కొండల వైపు పరుగెత్తాలి. ప్రభుత్వాల కసరత్తు.. ప్రభుత్వాలు , విపత్తు నిర్వహణ శాఖలు కూడా ఇలాంటి సమయాలలో ఎలా స్పందించాలనే దానిపై ఎప్పటికప్పుడు మాక్ డ్రిల్స్ నిర్వహిస్తాయి. తీర ప్రాంతాలలో నివసించే ప్రజలకు హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేస్తాయి. మనం కూడా ఈ విషయాలపై పూర్తి అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. ప్రకృతి ప్రకోపం ముందు మనం ఎంత బలహీనమో సునామీలు గుర్తు చేస్తాయి. కానీ సరైన ముందస్తు జాగ్రత్తలు, సకాలంలో స్పందించే తత్వం ఉంటే ఎన్నో ప్రాణాలను రక్షించుకోవచ్చు. మన బాధ్యత.. సునామీలు నేరుగా మానవ కార్యకలాపాల వల్ల వచ్చేవి కానప్పటికీ, ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవడం ద్వారా కొన్ని రకాల తీర ప్రాంత విపత్తుల తీవ్రతను చాలా వరకు తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా సముద్ర తీరాలలో ఉండే మడ అడవులను సంరక్షించడం చాలా ముఖ్యం. ఈ అడవులు సహజ సిద్ధమైన రక్షణ గోడలా పనిచేసి, సముద్రం నుండి వచ్చే పెద్ద అలల వేగాన్ని అడ్డుకుంటాయి , తీర ప్రాంత కోతను నివారిస్తాయి. భూమిపై కాలుష్యాన్ని తగ్గించడం, పర్యావరణానికి హాని కలిగించే కార్యక్రమాలను అరికట్టడం ద్వారా వాతావరణ మార్పులను నియంత్రించవచ్చు. సముద్ర తీర ప్రాంతాలలో ఇష్టానుసారంగా కట్టడాలు చేపట్టకుండా, పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా అభివృద్ధి పనులను చేయడం వల్ల ప్రకృతి ప్రకోపం నుండి రక్షణ పొందవచ్చు. ప్రకృతిని గౌరవిస్తూ, పర్యావరణాన్ని కాపాడుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటి పెను ముప్పుల నుంచి మనల్ని మనం రక్షించుకోగలం.                                                                                                                                              *రూపశ్రీ
హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనది మరియు అద్భుతమైన ఐదు రోజుల దీపావళి వేడుకలకు ధన త్రయోదశి లేదా ధంతేరస్ పర్వదినంతో అత్యంత ఘనంగా అంకురార్పణ జరుగుతుంది. కార్తీక మాసపు కృష్ణ పక్ష త్రయోదశి తిథి నాడు వైభవంగా వచ్చే ఈ పవిత్ర దినం సంపద, ఆరోగ్యం, సిరులు మరియు సర్వ శుభారంభాలకు సజీవ ప్రతీకగా నిలుస్తుంది. ఈ ఏడాది నవంబర్ 6 మరియు నవంబర్ 7 తేదీల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్న ఈ అరుదైన పండుగ వేళ, ఏ రోజు ఏ ప్రత్యేక వస్తువులను కొనుగోలు చేస్తే ఇంట్లో సిరుల వర్షం కురుస్తుందనే అంశంపై ప్రతి ఒక్కరిలోనూ అమితమైన ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా ధంతేరస్ తొలి రోజున బంగారం, వెండి నాణేలు, ఆభరణాలతో పాటు రాగి, ఇత్తడి లేదా ఉక్కుతో తయారు చేసిన సరికొత్త వంట పాత్రలను కొనుగోలు చేయడం అత్యంత శుభప్రదమని వేద శాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం ఖరీదైన లోహాలే కాకుండా, సాక్షాత్తు లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ ఇంట్లో ఉండటం కోసం సరికొత్త చీపురు, మంగళప్రదమైన కొత్తిమీర గింజలను కూడా మార్కెట్ నుంచి ఇంటికి తెచ్చుకోవడం మన సాంప్రదాయంలో ఎంతో విశిష్టమైన ప్రాముఖ్యతను సంతరించుకుంది. సూర్యాస్తమయం అయిన తర్వాత ఇంటా బయటా సరిగ్గా 13 మట్టి దీపాలను వరుసగా వెలిగించి, ధనానికి అధిపతి అయిన కుబేరుడు, లక్ష్మీదేవితో పాటు ఆయుర్వేద దైవమైన ధన్వంతరి భగవానుడిని భక్తితో పూజించడం వల్ల సమస్త ఆర్థిక బాధలు పూర్తిగా తొలగిపోయి, కుటుంబంలో సానుకూల శక్తి వెల్లివిరుస్తుందని పెద్దలు బలంగా నమ్ముతారు. అయితే, జ్యోతిష్య మరియు మత విశ్వాసాల ప్రకారం ఈ పవిత్ర దినాన కొన్ని నిర్దిష్ట వస్తువులకు మాత్రం దూరంగా ఉండాలని నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. రాహువుకు ప్రతీకగా భావించే గాజు సామగ్రి, శనితో ముడిపడి ఉండే ఇనుప వస్తువులు, కత్తులు లేదా కత్తెరల వంటి పదునైన వస్తువులు, అలాగే నలుపు రంగు దుస్తులు లేదా వస్తువులను ధంతేరస్ రోజున పొరపాటున కూడా కొనుగోలు చేయడం పూర్తిగా అశుభమని, ఇవి ఇంట్లో ప్రతికూల శక్తిని తెస్తాయని విశ్వసిస్తారు. కేవలం ఒక రోజనే కాకుండా దీపావళి వచ్చే మొత్తం ఐదు రోజుల పండుగ ప్రయాణంలో ప్రతి రోజుకు తగినట్లుగా ఇంటి అవసరాలకు తగ్గట్టుగా షాపింగ్ చేయడం వల్ల ఆయురారోగ్యాలతో పాటు లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఇంట్లో నివాసం ఉంటుందని పెద్దల మాట. బడ్జెట్ ఏదైనా సరే, మనస్ఫూర్తిగా మరియు భక్తిభావంతో కొనుగోలు చేసే ప్రతి కొత్త వస్తువు ఇంట్లో ధనలక్ష్మిని ఆహ్వానిస్తుందని, ఈ దీపావళి షాపింగ్ ప్రతి ఒక్కరి జీవితంలో సరికొత్త వెలుగులు నింపుతుందని నమ్ముతారు.     Dhanteras Shopping Guide, What To Buy On Dhanteras, Diwali Festival Purchases, Wealth Bringing Items, Auspicious Days For Buying Gold, Festival Traditions, Spiritual Articles In Telugu.  
ప్రస్తుత ఆధునిక కాలంలో సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో, వైద్య మరియు ఆరోగ్య రంగాలలో కృత్రిమ మేధస్సు (AI) పాత్ర రోజురోజుకూ అత్యంత కీలకంగా మారుతోంది. ముఖ్యంగా మానవ పోషకాహార విధానాలు, జీవక్రియ (Metabolism) మరియు వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక సరికొత్త విప్లవానికి నాంది పలికింది. మారుతున్న జీవనశైలి కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలకు శాస్త్రవేత్తలు సరికొత్త AI ఆధారిత ఫ్రేమ్‌వర్క్‌లను రూపకల్పన చేస్తున్నారు. ఈ అత్యాధునిక విధానాలు మనిషి శరీరం యొక్క ప్రత్యేకమైన జన్యుపరమైన అవసరాలను గుర్తించి, దానికి తగినట్లుగా ఖచ్చితమైన పోషకాహార మార్గదర్శకాలను అందించడంలో అద్భుతంగా పనిచేస్తున్నాయి. సాధారణంగా అందరికీ వర్తించే ఒకే రకమైన డైట్ ప్లాన్‌లకు స్వస్తి చెప్పి, ప్రతి వ్యక్తి యొక్క బయోమార్కర్స్ మరియు ఆరోగ్య స్థితిగతులను విశ్లేషించి వ్యక్తిగతీకరించిన ప్రయోజనాలను చేకూర్చడంలో ఈ సాంకేతికత ఎంతో ముందంజలో ఉంది. పరిశోధకులు వెల్లడించిన గణాంకాల ప్రకారం, ఆధునిక పోషకాహార మార్గదర్శకాలను మరియు ప్రివెంటివ్ మెడిసిన్‌ను సరిగ్గా అమలు చేయడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధుల ముప్పును గణనీయంగా తగ్గించవచ్చు. నేడు కేవలం ఒకే రకమైన మందులు లేదా సాధారణ ఆహార నియమాలపై ఆధారపడకుండా, సిస్టమ్స్ బయాలజీ మరియు ప్రిడిక్టివ్ అనలిటిక్స్ సాయంతో మానవ ఆరోగ్యాన్ని ముందే అంచనా వేయడం సాధ్యమవుతోంది. ముఖ్యంగా గ్లోబల్ హెల్త్ సర్వేలు మరియు మెడికల్ రీసెర్చ్ నివేదికల ఆధారంగా, డిజిటల్ హెల్త్ ప్లాట్‌ఫారమ్‌లు మరియు AI అల్గారిథమ్‌లు సుమారు 70 శాతానికి పైగా ప్రజల్లో జీవక్రియ సంబంధిత సమస్యలను ముందస్తుగా గుర్తించి తగిన నివారణ చర్యలను సూచించగలవు. ఈ సాంకేతిక విప్లవం ద్వారా ప్రతి ఒక్కరూ తమ దైనందిన ఆహారపు అలవాట్లను మెరుగుపరుచుకుంటూ, వ్యాధిని నివారించే శక్తిని కూడగట్టుకుంటున్నారు. ఈ వినూత్న ఫ్రేమ్‌వర్క్ కేవలం బరువు నియంత్రణకే పరిమితం కాకుండా, గుండె జబ్బులు, మధుమేహం మరియు ఇతర దీర్ఘకాలిక అనారోగ్యాల నివారణలోనూ అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో శరీరంలోని విభిన్న పోషకాల శోషణ శాతాన్ని, విటమిన్ల లోపాలను అత్యంత కచ్చితత్వంతో విశ్లేషించడం ఇప్పుడు సాధ్యమైంది. దీనివల్ల వైద్యులు మరియు పోషకాహార నిపుణులు రోగులకు అవసరమైన కచ్చితమైన మోతాదులో పోషకాలను సిఫారసు చేయడానికి వీలవుతుంది. డిజిటల్ టెక్నాలజీ మరియు క్లినికల్ సైన్స్ సంయుక్తంగా మానవుని ఆయురారోగ్యాలను మెరుగుపరచడంలో అపూర్వమైన మార్పులను తెస్తున్న ఈ తరుణంలో, భవిష్యత్ వైద్య రంగం మరింత సురక్షితంగా మరియు కచ్చితమైన ఫలితాలతో ముందుకు సాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.     AI In Healthcare, Modern Nutrition Frameworks, Personalized Health Tech, Artificial Intelligence Wellness, Preventive Medicine Trends, Digital Health Innovations, Health Articles In Telugu.
నేటి కాలంలో మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్ లు, కంప్యూటర్లు మన దైనందిన జీవితంలో ప్రధాన భాగమైపోయాయి. ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు స్క్రీన్ వైపు చూడటం చాలా మందికి అలవాటుగా మారిపోయింది. సోషల్ మీడియా వాడకం, ఆఫీస్ పని లేదా వినోదం కోసం గంటల తరబడి డివైజ్‌ల ముందే గడపడం సర్వసాధారణం అయింది. ఈ నేపథ్యంలో స్క్రీన్ టైమ్ ఎక్కువైతే దుష్పభావాలు ఉంటాయని వైద్యులు కూడా చెబుతున్నారు. అయితే తాజాగా..  ఈ విషయం గురించి  వైద్య నిపుణులు , పరిశోధకులు చెబుతున్న విస్తుపోయే నిజాలేంటో వివరంగా తెలుసుకుంటే.. నిపుణుల అభిప్రాయం ప్రకారం కేవలం స్క్రీన్ ముందు గంటల తరబడి కూర్చోవడం వల్ల నేరుగా పక్షవాతం వస్తుందని చెప్పలేము. అయితే ఎక్కువ సమయం స్క్రీన్ చూస్తూ గడపడం అనేది ఒక రకమైన నిశ్చల జీవన శైలితో ముడిపడి ఉంటుంది. ఈ విధంగా శారీరక శ్రమ లేకుండా రోజంతా ఒకే చోట కూర్చునే అలవాటు వల్ల క్రమంగా అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా బరువు పెరగడం, హై బ్లడ్ ప్రెషర్, మధుమేహం , చెడు కొలెస్ట్రాల్  వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవన్నీ కూడా పక్షవాతం ముప్పును పెంచే ప్రధాన కారణాలలో ముఖ్యమైనవిగా వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అమెరికన్ స్ట్రోక్  అసోసియేషన్  కు చెందిన జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం అరవై  సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న వారు రోజులో కనీసం ఎనిమిది గంటల పాటు శారీరక శ్రమ లేకుండా కేవలం కూర్చునే పనులలో  గడిపితే, వారిలో పక్షవాతం వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుందని తేలింది. అయితే ఇది నేరుగా స్క్రీన్ వల్ల జరిగే నష్టం కాకపోయినా, ఎక్కువ సమయం కదలకుండా కూర్చునే స్వభావం వల్ల కలిగే దుష్పరిణామం అని పరిశోధకులు పేర్కొంటున్నారు. కాబట్టి స్క్రీన్ చూసే గంటలను మాత్రమే లెక్కగట్టి ప్రమాదాన్ని అంచనా వేయలేము. ఎందుకంటే రోజంతా కంప్యూటర్ ముందు పని చేసే వ్యక్తి క్రమం తప్పకుండా వ్యాయాయం చేస్తుంటే, అస్సలు శారీరక శ్రమ లేని వ్యక్తితో పోలిస్తే అతనిలో ప్రమాదం కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే రాత్రి సమయాల్లో ఎక్కువ సేపు మొబైల్ లేదా ల్యాప్టాప్ వాడటం వల్ల నిద్ర నాణ్యత దెబ్బతింటుంది. నిద్రలేమి సమస్య ఏర్పడినప్పుడు అది రక్తపోటును , జీవక్రియలను నియంత్రించడం కష్టం చేస్తుంది. దీనివల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా హైపర్ టెన్షన్, డయాబెటిస్, ఊబకాయం , గుండె జబ్బులు ఉన్నవారు తమ ఆరోగ్యం పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అధిక రక్తపోటు అనేది పక్షవాతానికి దారితీసే అత్యంత ముఖ్యమైన కారకాల్లో ఒకటి కాబట్టి, బీపీని ఎప్పుడూ అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. యువత కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పక్షవాతం కేవలం వృద్ధులలోనే వస్తుందని అనుకోవడం  పొరపాటు. మారుతున్న జీవన శైలి కారణంగా నేడు యువతలో కూడా ఇలాంటి ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. అయితే ఉద్యోగరీత్యా లేదా చదువురీత్యా ఎప్పుడూ స్క్రీన్ ముందు పనిచేయాల్సిన వారు పూర్తిగా డివైజ్ లను పక్కన పెట్టడం సాధ్యం కాదు. అలాంటి వారు కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. జాగ్రత్తలు.. రోజూ గంటల తరబడి ఒకే చోట కదలకుండా కూర్చోకుండా మధ్యమధ్యలో చిన్న బ్రేక్ లు  తీసుకోవడం మంచిది. కుర్చీలోంచి లేచి కొద్దిసేపు నడవడం, ఫోన్ మాట్లాడేటప్పుడు గదిలో తిరగడం, అలాగే రోజూవారీ జీవితంలో తగినంత శారీరక శ్రమ ఉండేలా చూసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెద్దలు ప్రతి వారం కనీసం నూట యాభై నిమిషాల పాటు ఏదైనా వ్యాయామం లేదా నడక వంటి శారీరక కార్యకలాపాలు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.  వీటితో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, పొగత్రాగడం వంటి అలవాట్లకు దూరంగా ఉండటం , ప్రశాంతమైన నిద్ర  చాలా అవసరం. గుర్తుంచుకోవాల్సిన విషయం.. కేవలం స్క్రీన్ టైమ్ తగ్గించడం వల్ల మాత్రమే పక్షవాతం రాకుండా నివారించలేము. ముఖ్యంగా బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు వాటిని అదుపులో ఉంచుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పక్షవాతం బారిన పడకుండా ఉండాలంటే శరీరానికి తగిన వ్యాయామం ఇస్తూ, ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడం ఎంతో ముఖ్యం. ఒకవేళ ఎవరికైనా ముఖం ఒకవైపు వంకరపోవడం, శరీరంలో అకస్మాత్తుగా బలహీనత రావడం, మాట తడబడటం, చూపు మందగించడం లేదా విపరీతమైన తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం.                                                                                                                                          *రూపశ్రీ*
వైద్య రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు మనుషుల జీవన శైలిని , బాధ్యతలను పూర్తిగా మార్చేస్తున్నాయి. ఇప్పటివరకు కుటుంబ నియంత్రణ , గర్భనిరోధక బాధ్యతలు ఎక్కువగా మహిళల మీదే ఉంటూ వచ్చాయి. మార్కెట్లో లభించే వివిధ రకాల గర్భనిరోధక మాత్రలు లేదా పద్ధతులు అన్నీ మహిళల శారీరక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని రూపొందించినవే. కానీ మారుతున్న కాలానికి తగినట్టుగా వైద్య శాస్త్రం కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. తాజాగా పురుషుల కోసం ప్రత్యేకంగా గర్భనిరోధక మాత్రలను తీసుకువచ్చే దిశగా పరిశోధనలు జోరుగా సాగుతున్నాయి. ఈ కొత్త  ఆవిష్కరణ భవిష్యత్తులో గర్భనిరోధక పద్ధతులపై  చాలా అంచనాలు సృష్టిస్తోంది.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..  గర్బనిరోధక మాత్రలు.. సాధారణంగా మహిళలు వాడే గర్భనిరోధక మాత్రలు వారి శరీరంలోని హార్మోన్ల వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. దీనివల్ల వారిలో కొన్ని రకాల శారీరక మార్పులు లేదా దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంటుంది. కానీ పురుషుల కోసం తయారు చేస్తున్న ఈ సరికొత్త  మాత్రల ప్రత్యేకత ఏమిటంటే ఇవి ఎలాంటి హార్మోన్ మార్పులకు గురిచేయవు. కేవలం పురుషుల శరీరంలో ఉండే శుక్రకణాల కదలికలను మాత్రమే నేరుగా ప్రభావితం చేసేలా ఈ మందులను రూపొందిస్తున్నారు. మానవ శరీరంలో , పురుషుల వ్యవస్థలో ప్రత్యేకంగా ఉండే ఒక ఎంజైమ్ పై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. శుక్రకణాలు ముందుకు కదలడానికి , మహిళల అండం వరకు సులభంగా చేరుకోవడానికి ఈ ప్రత్యేక ఎంజైమ్ చాలా కీలకంగా పనిచేస్తుంది. ఇప్పుడు కొత్తగా కనిపెడుతున్న  ఔషధం తీసుకున్నప్పుడు ఆ ఎంజైమ్ కొన్ని గంటల పాటు తాత్కాలికంగా నిలిచిపోతుంది. దీనివల్ల శుక్రకణాలు సాధారణ పద్ధతిలో ముందుకు కదలలేవు. ఫలితంగా అవి అండం వరకు చేరే సామర్థ్యాన్ని కోల్పోతాయి కాబట్టి  గర్భధారణ జరిగే అవకాశం చాలావరకు తగ్గిపోతుంది. పురుషుల కోసం కనిపెడుతున్న ఈ కొత్త  గర్భనిరోధక మాత్రల గురించి శాస్త్రవేత్తలు వెల్లడించిన మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే వీటిని ప్రతిరోజూ క్రమం తప్పకుండా మింగాల్సిన అవసరం ఉండదు. శారీరక సంబంధానికి కేవలం ముప్పై నిమిషాల ముందు ఈ మాత్రను తీసుకుంటే సరిపోతుందని పరిశోధనలు చెబుతున్నాయి. మొదటి దశలో జరిపిన పరీక్షల ప్రకారం ఈ మందు ప్రభావం శరీరంలో కొన్ని గంటల పాటు ఉండే అవకాశం ఉంది. ఒకవేళ భవిష్యత్తులో జరిగే క్లినికల్ పరీక్షలు , పరిశోధనలు విజయవంతమైతే పురుషులు రోజూ ఎలాంటి మందులు వాడకుండా కేవలం అవసరమైనప్పుడు మాత్రమే వీటిని ఉపయోగించే వెసులుబాటు కలుగుతుంది. ఈ మాత్రలు తీసుకుంటే పురుషులలో శుక్రకణాల ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతుందా అని చాలా మందిలో ఒక  సందేహం కలుగుతుంది . అయితే ఈ మాత్రల ప్రధాన ఉద్దేశం పురుషులలో శుక్రకణాలు పుట్టకుండా చేయడం కాదు. కేవలం తాత్కాలికంగా వాటి కదలికలను నిలిపివేయడం లేదా మందగించడం మాత్రమే. ఈ  మాత్ర  ప్రభావం పూర్తిగా ముగిసిన తర్వాత శుక్రకణాలు నార్మల్ గా  తమ సాధారణ స్థితికి చేరుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయినప్పటికీ మందు ప్రభావం పోయిన తర్వాత పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యం పూర్తిగా సాధారణ స్థితికి వస్తుందా లేదా అనేదానిపై మరింత లోతైన పరీక్షలు అవసరం అంటున్నారు. ఈ కొత్త ఆవిష్కరణను ప్రస్తుతం జంతువులపై ప్రయోగించి పరిశీలిస్తున్నారు. మనుషులపై వీటిని వాడే ముందు వాటి భద్రత , సరైన మోతాదును నిర్ణయించడం  చాలా ముఖ్యం. ఏవైనా దుష్ప్రభావాలు వస్తాయా లేదా అని నిరంతరం పరిశీలించాల్సి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిశోధనలు అన్నీ విజయవంతమైతే భవిష్యత్తులో గర్భనిరోధక బాధ్యతలను కేవలం మహిళలు మాత్రమే కాకుండా  భాగస్వాములిద్దరూ సమానంగా పంచుకోవడానికి ఒక చక్కటి అవకాశం లభిస్తుంది. అయితే ఈ మాత్రలు కేవలం గర్భధారణను మాత్రమే నివారిస్తాయి కానీ ఎలాంటి లైంగిక  వ్యాధుల నుంచి రక్షణ ఇవ్వలేవని వైద్యులు స్పష్టం చేస్తున్నారు                             *రూపశ్రీ.