LATEST NEWS
కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. బ్యారేజీల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, జాతీయ డ్యామ్ సేఫ్టీ నిపుణుల సూచనల మేరకే మరమ్మతులు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  ఈ ఏడాది డిసెంబర్‌లోనే పునరుద్ధరణ పనులు ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా బ్యారేజీలను సురక్షితంగా పునరుద్ధరించాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని సీఎం పేర్కొన్నారు. మేడిగడ్డ వద్ద నీళ్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం వాటిని లిఫ్ట్ చేయడం లేదంటూ జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని మంత్రులకు సూచించారు.  ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడి నీటిని సాంకేతికంగా లిఫ్ట్ చేయడం సాధ్యం కాదని నీటిపారుదల శాఖ ఇంజినీర్లు వివరించారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించాలంటే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గేట్లు మూసివేయాల్సి ఉంటుందని తెలిపారు. అయితే, నిర్మాణ లోపాలున్న ఈ రెండు బ్యారేజీల గేట్లను తెరిచే ఉంచాలని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) సూచించిన విషయాన్ని గుర్తుచేశారు. దిగువ గోదావరి జలాల సద్వినియోగం.! దిగువ గోదావరిలో లభించే నీటిని వృథా కాకుండా దేవాదుల, సీతారామ ఎత్తిపోతల పథకాల ద్వారా సమర్థంగా వినియోగిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ పథకాల ద్వారా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని ఆయకట్టుకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించినట్లు వివరించారు. గత ప్రభుత్వ హయాంలో దేవాదుల ప్రాజెక్టు ద్వారా ఏడాదికి సగటున 9.57 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేయగా, ఈ మూడేళ్లలో సగటున 18.13 టీఎంసీల నీటిని వినియోగించినట్లు చెప్పారు. గతంతో పోలిస్తే ఇది 89 శాతం అధికమని వివరించారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి దేవాదుల ద్వారా 16.71 టీఎంసీలు, సీతారామ ప్రాజెక్టు ద్వారా 8.10 టీఎంసీలు.. మొత్తంగా 24.81 టీఎంసీల గోదావరి జలాలను సద్వినియోగం చేసుకున్నట్లు వెల్లడించారు. రూ.4,193 కోట్లతో పునరుద్ధరణ ప్రణాళిక.! మూడు బ్యారేజీల పునరుద్ధరణకు రూపొందించిన ప్రణాళికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మేడిగడ్డ కుంగుబాటుకు గత ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్మాణ లోపాలే కారణమని సీఎం పేర్కొన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి ప్రాణహిత ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే కరువు పరిస్థితుల్లోనూ నీటి ఇబ్బందులు తలెత్తేవి కాదని అభిప్రాయపడ్డారు.  ప్రాణహిత జలాలను తక్కువ ఖర్చుతో ఎల్లంపల్లికి తరలించే అవకాశం ఉండేదని చెప్పారు.మేడిగడ్డ దెబ్బతిన్న తర్వాత మూడు బ్యారేజీల పరిస్థితిపై ప్రభుత్వం సమగ్ర అధ్యయనం చేయించినట్లు అధికారులు తెలిపారు. జాతీయ స్థాయి నిపుణులు, కేంద్ర ప్రభుత్వ సాంకేతిక సంస్థల సహకారంతో అవసరమైన పరిశోధనలు పూర్తి చేసినట్లు వివరించారు. పునరుద్ధరణకు సంబంధించిన ప్రాథమిక ప్రణాళికలకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఇప్పటికే సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. మూడు బ్యారేజీల పునరుద్ధరణ కోసం సుమారు రూ.4,193 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. నిర్మాణ లోపాల కారణంగా చేపట్టాల్సిన మరమ్మతుల వ్యయాన్ని సంబంధిత నిర్మాణ సంస్థలే భరించేలా, అదనపు పనుల వ్యయాన్ని ప్రభుత్వం భరించేలా ప్రతిపాదనలు రూపొందించినట్లు వివరించారు. డిసెంబర్‌లో పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశం.! మూడు బ్యారేజీల పునరుద్ధరణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ నెలాఖరులోగా తుది అనుమతులు పొందేందుకు ప్రయత్నించాలని, డిసెంబర్‌లో పనులు ప్రారంభించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. బ్యారేజీల నీటి వినియోగ సామర్థ్యాన్ని పునరుద్ధరించే పనులు, రక్షణ చర్యలను రెండు దశలుగా విభజించి చేపట్టాలని సూచించారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని, అవసరమైన అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థలతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ సమీక్షా సమావేశంలో నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్, టన్నెల్స్ అండ్ సేఫ్టీ కార్యదర్శి కల్నల్ పరీక్షిత్ మెహ్రా, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.   ఇది కూడా చదవండి: చలికాలంలో ఈ తప్పులు చేస్తున్నారా.. ఆరోగ్యానికి ప్రమాదమే..! [ Telangana government pays special attention to the renovation of barrages, Revanth Reddy, Kaleshwaram Project, Medigadda Barrage, Annaram Barrage, Sundilla Barrage, Kaleshwaram Barrage Repairs, Barrage Restoration, Dam Safety, NDSA, Irrigation Projects, Devadula Lift Irrigation, Sitarama Lift Irrigation ]
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చేపట్టిన సోదాలు ముగిశాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, గుంటూరులోని మొత్తం ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించిన తనిఖీలు పూర్తయ్యాయి. అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి, ఐపీఎస్ అధికారి పి. సీతారామాంజనేయులు నివాసంలోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) సెక్షన్ 17 కింద హైదరాబాద్ జోనల్ అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. 84 రోజుల పాటు రిసార్ట్‌లోనే జవాబు పత్రాలు.! ఈ కేసులో గుంటూరు జిల్లా చినకాకానిలోని హాయ్‌లాండ్ రిసార్ట్ వ్యవహారం కీలకంగా మారింది. గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకన బాధ్యతను కామ్‌సైన్ మీడియా అనే ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. అయితే, నిబంధనలకు విరుద్ధంగా జవాబు పత్రాలను రిసార్ట్‌కు తరలించి, 2021 డిసెంబర్ నుంచి 2022 ఫిబ్రవరి వరకు ఏకంగా 84 రోజుల పాటు అక్కడే ఉంచినట్లు దర్యాప్తులో వెల్లడైన అంశాలు చర్చనీయాంశంగా మారాయి. మూల్యాంకనం చేయకుండానే రూ.1.14 కోట్లు.? ఈడీ ప్రాథమిక విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవంగా మూల్యాంకనం చేయకుండానే పాత మార్కులను కొత్త మార్కులుగా నమోదు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ, అప్పటి కార్యదర్శి సంతకంతో కామ్‌సైన్ సంస్థకు రూ.1.14 కోట్ల ప్రజాధనం చెల్లించిన వ్యవహారంపై అధికారులు దృష్టి సారించారు. ఆ తర్వాత ఆ మూల్యాంకనాన్ని రద్దు చేసి, సీసీటీవీ నిఘాలో మరోసారి జవాబు పత్రాలను మూల్యాంకనం చేయించినట్లు సమాచారం. ఏడు చోట్ల సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం.! కామ్‌సైన్ మీడియా ఎండీ మధుసూదన్ రావుకు సంబంధించిన ప్రదేశాలు, హాయ్‌లాండ్ రిసార్ట్, ట్రూగ్రేడర్ సర్వీసెస్ కార్యాలయాల్లోనూ ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు డిజిటల్ పరికరాలు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. విజయవాడలోని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ.. రూ.1.14 కోట్ల చెల్లింపులను నేరం ద్వారా సంపాదించిన సొమ్ము (Proceeds of Crime) కోణంలో పరిశీలిస్తోంది. సీతారామాంజనేయులుతో పాటు పలువురి వాంగ్మూలాలను నమోదు చేసిన అధికారులు, సంబంధిత ఆస్తుల పత్రాలనూ పరిశీలిస్తున్నారు. మొత్తంగా 84 రోజుల పాటు రిసార్ట్‌లో జవాబు పత్రాలను ఉంచడం వెనుక అసలు కారణమేంటి? మూల్యాంకనం చేయకుండానే రూ.1.14 కోట్లు ఎలా చెల్లించారు? ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది? అనే ప్రశ్నలకు ఈడీ దర్యాప్తులో సమాధానాలు లభించాల్సి ఉంది. ఈ సోదాలతో గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణం మరోసారి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.   ఇది కూడా చదవండి: మయోనైజ్ ప్రియులకు బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఏడాది పాటు బ్యాన్.!   [ APPSC Group-1 Scam, ED Investigation, Group-1 Evaluation Scam, Resort Controversy, 84 Days Resort Stay, APPSC Papers, Enforcement Directorate, Evaluation Irregularities, Andhra Pradesh Politics, Group-1 Case ]
తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. పచ్చిగుడ్లతో తయారు చేసే మయోనైజ్‌పై ఏడాది పాటు నిషేధం విధించింది. రాష్ట్రంలో వరుసగా వెలుగుచూస్తున్న ఆహార కలుషిత ఘటనలు, ఫుడ్ పాయిజనింగ్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఆహార భద్రతా కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. తయారీ నుంచి విక్రయాల వరకు నిషేధం.! రాష్ట్రవ్యాప్తంగా పచ్చిగుడ్లతో తయారయ్యే మయోనైజ్ తయారీ, నిల్వ, విక్రయాలపై ఈ నిషేధం వర్తించనుంది. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం–2006లోని సెక్షన్ 30(2)(ఎ) ప్రకారం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్తర్వులు 2026 అక్టోబర్ 30 నుంచే అమల్లోకి వచ్చాయి. ఇందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను నవంబర్ 4న విడుదల చేశారు. ఫుడ్ పాయిజనింగ్ ముప్పుతోనే నిర్ణయం.! పచ్చిగుడ్లతో తయారుచేసే మయోనైజ్‌ను సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయకపోవడం, తయారీ సమయంలో పరిశుభ్రత పాటించకపోవడం వల్ల బ్యాక్టీరియా పెరిగి ఆహార కలుషితం జరిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఫుడ్ పాయిజనింగ్ ఘటనలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. హోటళ్లు, రెస్టారెంట్లకు కీలక ఆదేశాలు.! ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, ఇతర ఆహార విక్రయ సంస్థలు అప్రమత్తం కావాల్సి ఉంటుంది. నిషేధాన్ని ఉల్లంఘించి పచ్చిగుడ్ల మయోనైజ్‌ను తయారు చేసినా, నిల్వ ఉంచినా, విక్రయించినా సంబంధిత సంస్థలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. మొత్తంగా ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలో పచ్చిగుడ్ల ఆధారిత మయోనైజ్ తయారీ, సరఫరా, విక్రయాలకు ఏడాది పాటు బ్రేక్ పడనుంది. అయితే ఈ నిషేధం పచ్చిగుడ్లతో తయారైన మయోనైజ్‌కే వర్తిస్తుందని, ఇతర ప్రత్యామ్నాయ ఉత్పత్తుల విషయంలో ఉత్తర్వుల నిబంధనలను పరిశీలించాలని ఆహార వ్యాపారులు గుర్తుంచుకోవాలి. ఇది కూడా చదవండి: ఇకపై సంక్షేమ పథకాలు పొందాలంటే ఆ గుర్తింపు కార్డు ఉంటేనే అర్హత.!       [ Telangana Mayo Ban, Raw Egg Mayonnaise Ban, Telangana Food Safety, Mayonnaise Ban 2026, Food Poisoning, Telangana Government Orders, Food Safety Commissioner, Hyderabad Food News, FSSAI Act 2006 ]
ALSO ON TELUGUONE N E W S
  అయోధ్య రాముడు నిన్న సెల్యులాయిడ్ పై కాలు మోపిన విషయం తెలిసిందే. టాక్ కూడా పాజిటివ్ గా రావడంతో  ఆల్ ఓవర్ ఇండియాలోని సింగిల్ స్క్రీన్స్, మల్టి ప్లెక్స్ లు అభిమానులు, ప్రేక్షకులతో కళకళ లాడతున్నాయి.  దీంతో మొదటి రోజు  వరల్డ్ వైడ్ గా 150 కోట్ల గ్రాస్ మార్కును చేరుకుని ట్రేడ్ వర్గాలని  సైతం ఆశ్చర్యపరిచింది. భాషల వారీగా చూస్తే, హందీ వెర్షన్ రికార్డు స్థాయిలో  47.50 కోట్ల షేర్‌తో సింహభాగం ఆక్రమించింది. కన్నడ వెర్షన్ 7.25 కోట్లు సాధించగా, తెలుగు ప్రాంతాలలో . 6 కోట్ల వసూళ్లను రాబట్టి దక్షిణాది మార్కెట్‌లో కూడా బలమైన పునాది వేసింది. థియేటర్ల ఆక్యుపెన్సీ కూడా విశేషంగా నమోదైంది. ముఖ్యంగా ఈవెనింగ్ అండ్ నైట్ షోలలో హిందీ 3డి ఫార్మాట్‌లో అత్యధికంగా 38.08% ఆక్యుపెన్సీ నమోదవ్వగా, హైదరాబాద్‌లో 37.3%, కోల్‌కతాలో 38% పైగా థియేటర్ల సీట్లు నిండిపోయాయి.   ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమా సందడి మొదలైంది. నార్త్ అమెరికాలో మొదటి రోజు తొలి సగం సమయానికే $940,000 డాలర్లు వసూలు చేయగా, మొదటి రోజు మొత్తం ఓవర్సీస్ ప్రీమియర్లతో కలిపి సుమారు $3.5 మిలియన్ డాలర్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇది కూడా చదవండి: ఘనంగా జరిగిన సాయి దుర్గాతేజ్ నిశ్చితార్థ వేడుక: అల్లు అర్జున్ స్పెషల్ ఎట్రాక్షన్! సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ మరియు రాబోయే దీపావళి లాంగ్ వీకెండ్ తోడుకావడంతో, ఫస్ట్ వీక్ లోనే  375 కోట్ల నికర కలెక్షన్ల మార్కును దాటుతుందని ట్రేడ్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. లైఫ్‌టైమ్ బాక్సాఫీస్ రన్ పరంగా గ్లోబల్ మార్కెట్‌లో ఏకంగా1,600 కోట్ల నుంచి రూ. 1,800 కోట్ల కలెక్షన్లను కొల్లగొడుతుందని అంచనా వేస్తున్నారు. రణ్‌బీర్ కపూర్ రాముడిగా చూపిస్తున్న అద్భుతమైన అభినయం, సీతగా సాయి పల్లవి ఒదిగిపోయిన తీరు,రావణాసురుడిగా యష్ చూపించిన రాజసం,ప్రొడక్షన్ వాల్యూస్, విజువల్ ఎఫెక్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చూస్తుంటే రిపీట్ ఆడియన్స్ పక్కా అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.   మీకు నచ్చవచ్చు:ఘనంగా జరిగిన సాయి దుర్గాతేజ్ నిశ్చితార్థ వేడుక: అల్లు అర్జున్ స్పెషల్ ఎట్రాక్షన్! మీకు నచ్చవచ్చు :సమ్మర్ హాలిడేస్ మూవీ రివ్యూ    [Ramayana Part 1 First Day Collections, Ramayana first day box office collections, Ramayana Part 1 Day 1 collection, Ranbir Kapoor Ramayana box office, Tollywood, Tollywood News, Telugu Cinema, Telugu Cinema News]
రమేష్ జక్కల దర్శకత్వంలో ప్రసన్న లక్ష్మి భూమిరెడ్డి నిర్మాతగా ప్రసన్న భూమి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం "యద్భావం తద్భవతి".  వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇనయ సుల్తానా, రేణు శ్రీ హీరోయిన్స్ గా నటిస్తుండగా సుమన్, నాగ మహేష్, లోహిత్ కుమార్, ధనరాజ్, శ్వేత వర్మ, దయానంద్ రెడ్డి, శ్రీకాంత్ అయ్యంగర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.  ఈ సినిమా నవంబర్ 27న థియేటర్లలో విడుదల విడుదల కానుంది. శ్యామ్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి మిహిరామ్ సంగీతం అందించారు. విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా "యద్భావం తద్భవతి" చిత్ర టీజర్ ను ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ గారి చేతుల మీదగా విడుదల చేయడం జరిగింది.  ఇది కూడా చదవండి: బాలయ్య ‘దాదా’ వాయిదా.. క్లారిటీ ఇచ్చిన మూవీ టీమ్.! "యద్భావం తద్భవతి" టీజర్ ఆకట్టుకుంటోంది. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఇక వరుణ్ సందేశ్ పాత్రను డిజైన్ చేసిన తీరు కూడా బాగుంది. ఆ పాత్ర వెనుక ఏదో కథ దాగి ఉంది? అనే క్యూరియాసిటీ కలిగేలా మలిచారు. టీజర్ లాంచ్ ఈ సందర్భంగా లగడపాటి శ్రీధర్ గారు మాట్లాడుతూ... "అందరికీ నమస్కారం. ఇప్పుడే యద్భావం తద్భవతి చిత్ర టీజర్ చూసాను. ప్రసన్న లక్ష్మి భూమిరెడ్డి గారు నిర్మించిన ఈ చిత్ర టీజర్ చూస్తుంటే చిన్న సినిమా అయినప్పటికీ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నట్లు అనిపిస్తుంది. అలాగే ఒక పాట కూడా చూడటం జరిగింది. రమేష్ జక్కల  గారి దర్శకత్వం, మిహిరామ్ గారి సంగీతం చాలా బాగున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ కళ పట్ల ఉన్న అభిమానంతో సినిమా తీయడం చాలా పెద్ద విషయం.  ఈ సినిమాలో నటించిన వరుణ్ సందేశ్ అలాగే ఇతర నటీనటులకు చిత్ర బృందానికి నా అభినందనలు. లోహిత్, శ్రీకాంత్ అయ్యంగర్ వంటి ఎంతో సీనియర్ నటులు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాను ప్రేక్షకులు అందరూ ఆదరించి నిర్మాత మరో సినిమా తీసేలా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను" అన్నారు.  మీకు నచ్చవచ్చు: 'ఇట్లు అర్జున' హీరో అనీష్ ఎవరు?.. నాగార్జున, ఎన్టీఆర్ సపోర్ట్ వెనుక అసలు కథ ఇదేనా.? బాంబు పేల్చిన రెజీనా.. బాలీవుడ్‌లో సౌత్ హీరోయిన్లని ఇంత దారుణంగా చూస్తారా.?       [Yad Bhavam Tad Bhavathi Teaser, Yadbhavam Tadbhavathi Teaser, Varun Sandesh, Inaya Sultana, Ramesh Jakkala, Sridhar Lagadapati, Telugu Movies 2026, Telugu Film News]  
మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. నిన్న గురువారం నాడు హైదరాబాద్‌లోని హిల్టన్ జీనోమ్ వ్యాలీ రిసార్ట్ వేదికగా తన స్నేహితురాలు అయిన కిరణ్మయితో నిశ్చితార్థ వేడుక అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా జరిగింది.   కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య  ఉంగరాలు మార్చుకుని వివాహ బంధానికి తొలి అడుగు వేశారు. ఈ వేడుక మెగా కాంపౌండ్‌లో పండుగ ವాతావరణాన్ని నింపింది.నిశ్చితార్థ వేడుకకు అత్యంత ప్రాధాన్యత లభించడానికి ప్రధాన కారణం కొణిదెల మరియు అల్లు కుటుంబాల గ్రాండ్ రీ-యూనియన్. గత కొంతకాలంగా వేర్వేరు కార్యక్రమాల్లో కనిపించిన మెగా, అల్లు కుటుంబ సభ్యులంతా ఈ శుభకార్యం కోసం ఒకే చోట చేరి సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.   వీరితో పాటు నాగబాబు, వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి, వైష్ణవ్ తేజ్, నిహారిక కొణిదెల, అల్లు శిరీష్, అలాగే పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ మరియు కుమార్తె ఆద్య ఈ కార్యక్రమానికి హాజరై సందడి చేశారు. ఇది కూడా చదవండి: Summer Holidays Movie Review Telugu: సమ్మర్ హాలిడేస్ మూవీ రివ్యూ  వేడుక ముగిసిన వెంటనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా నిశ్చితార్థ ఫోటోను పంచుకుంటూ నూతన జంటకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. "#KiranTejForever"అనే హాష్‌ట్యాగ్‌తో చరణ్ చేసిన ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్‌గా మారింది.   సోషల్ మీడియాలో మెగా, అల్లు హీరోలంతా ఒకే ఫ్రేమ్‌లో నిలిచిన పిక్చర్ టాలీవుడ్ వర్గాల్లోను, అభిమానుల్లోను విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. అలాగే సినీ ప్రముఖులు మంచు మనోజ్-భూమా మౌనిక, నటుడు నవదీప్, దర్శకుడు వెంకీ కుడుముల, కమెడియన్ హర్ష చెముడు తదితరులు హాజరై జంటని ఆశీర్వదించారు. మీకు నచ్చవచ్చు : ఇద్దరిలో బెస్ట్ పెర్ఫార్మ్ ఇచ్చింది ఆ హీరోనే: ఆ హీరో ఫ్యాన్స్ ఫీలవ్వద్దు! మీకు నచ్చవచ్చు :గత రామాయణ చిత్రాలకి, ఇప్పటి రామాయణకి ఉన్న తేడా ఇదే!    [Sai Durgha Tej Engagement, sai durgha tej fiancée kiranmayi, mega family engagement photos, ram charan allu arjun mega reunion, sai dharam tej wedding date, Tollywood, Tolywood News, Telugu Cinema, Telugu Cinema News]
-సినిమా పేరు : 'సమ్మర్ హాలిడేస్' -నటీనటులు : రోహన్, అరుణ్, జయసుధ, వాసుకి, రాజీవ్ కనకాల, హర్షవర్ధన్, ఖుషి, హర్షిణి తదితరులు.. -మ్యూజిక్ : శింజిత్ ఎర్రమిల్లి -ఎడిటింగ్ : సంతోష్ నాయుడు -ఫొటోగ్రఫీ : సాయి ప్రకాష్ -బ్యానర్ నేమ్ : ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ -నిర్మాతలు : ధీరజ్ మొగిలినేని, గిరి బాబు వల్లభనేని -రచన, దర్శకత్వం: శ్రీకర్ నయన్ -విడుదల తేదీ :  నవంబర్ 6 , 2026  ప్రచార చిత్రాలతో క్రేజ్ సంపాదించుకున్న 'సమ్మర్ హాలిడేస్' ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్న ప్రీమియర్స్ కూడా ప్రదర్శించారు. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.  కథ  రావూరి వెంకటేష్ ఉరఫ్ ఆర్. వి (అరుణ్ దేవ్) . వయసు సుమారు పదమూడేళ్లు.. కల్మషం అంటూ లేని స్వచ్ఛమైన మనసు తన సొంతం. క్రికెట్ అంటే ప్రాణం. ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే బాగానే చదువుతాడు. కానీ ర్యాంకుల కోసం తండ్రి( హర్షవర్ధన్) ఫోర్స్ చేస్తుంటాడు. కానీ ఆర్. వికి అంత సీన్ లేదు. తల్లి పేరు (వాసుకి) ఆర్ వి కి ఫుల్ సపోర్ట్. తోటవారిపాలెం అనే గ్రామానికి చెందిన  కాశీ వెంకటేశ్వర్లు ఉరఫ్ కెవి (రోహాన్ ). ఆర్. వి వయసే. బాగా పేదవాడు. తాగుడుకి బానిసై చిన్న వయసులోనే తండ్రి చనిపోతాడు.  దాంతో అప్పులు తీర్చడానికి స్కూల్ కి వెళ్తూనే చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాడు. కానీ ఎప్పుడు ఫేస్ లో డల్ నెస్ కనిపించదు. తల్లి( హర్షిణి) ఉంటుంది. తన తల్లికి మంచి చీర కొనిపెట్టాలనే ది తన లక్ష్యం. అలాంటి లైఫ్ తో కుస్తీ పడుతున్న ఆర్. వి, కెవి ఇద్దరు తోటవారిపాలెంలో కలుస్తారు. ఆ ఇద్దరు తోటవారిపాలెం లో ఎలా కలిశారు? ఏం చేసారు? ఎవరెవరు పరిచమయ్యారు? లైఫ్ లో కొచ్చిన అదనపు సంతోషాలేంటి? నేర్చుకున్న పాఠాలు ఏంటి? అసలు సమ్మర్ హాలిడేస్ ఏ పర్పస్ తో తెరకెక్కింది అనేదే మూవీ. ఎనాలసిస్  పాన్ ఇండియా దినుసులతో  తెరకెక్కుతున్న సినిమాల మధ్య సమ్మర్ హాలిడేస్ లాంటి చిన్న సినిమా రావడం నిజంగా గ్రేట్.. ఈ విషయంలో మేకర్స్ ని నూటికి నూరుశాతం  మెచ్చుకోవలసిందే. గలగల పారే సెలయేరులా కథ, కథనం సాగింది. కాకపోతే సెలయేరు కూడా వంపులు, పాయలు గా మారుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా! సేమ్ సమ్మర్ హాలిడేస్ పరిస్థితి కూడా అదే. సినీ ట్రిక్ లా స్క్రీన్ ప్లేలో మెరుపులు లేకపోవడం కొంచం ఇబ్బంది. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ఆర్ వి , తండ్రి, తల్లి మధ్య వచ్చిన సీన్స్ రొటీన్. చాలా సినిమాల్లో చూసేసాం. తోటివారి పాలెంకి కథ షిఫ్ట్ అవ్వగానే ఆర్. వి, కె వి మధ్య వచ్చిన అన్ని సీన్స్ బాగున్నాయి. చాలా మందికి బాల్యం గుర్తుకొస్తుంది. కాకపోతే కెవి ఫ్యామిలీ కష్టాలని కథ రన్ అవ్వడం కోసం కావాలని పెట్టినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ విషయంలో మేకర్స్ మరింత జాగ్రత్త పడాల్సిందేమో. ఆర్ వి అమ్మమ్మ( జయసుధ) సీన్స్ కూడా బాగున్నాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ ఎక్స్ టార్డినరీ. సెకండ్ హాఫ్ చూసుకుంటే వచ్చిన అన్ని సీన్స్ బాగానే ఉన్నా,మనకి ముందుగానే తేలిపోస్తుంటాయి. మామిడి చెట్ల ఓనర్( రాజీవ్ కనకాల)  తో పాటు ఆ సందర్భంగా వచ్చిన  సీన్స్ , పుట్టిన రోజు వేడుకలు, తల్లికి చీర కొనాలన్నా కోరిక నెరవేరడం ఇలా కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి. క్లైమాక్స్ పర్లేదు.  నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు    ఆర్. వి గా అరుణ్ దేవ్ జీవించి పడేసాడు. తనకి నేషనల్ అవార్డు ఎందుకు వచ్చిందో మరోసారి చాటి చెప్పాడు. కెవి గా  రోహన్ సైతం తగ్గేదెలే అనేలా చేసాడు, ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో అదరగొట్టేసాడు.  హర్షవర్ధన్,  వాసుకి,  రాజీవ్ కనకాల బాగానే చేసినా అలాంటి నటన చాలా సినిమాల్లోనే చేసేసారు. అమ్మమ్మగా సహజ నటి  జయసుధ గారు సహజమైన నటనతో మెప్పించింది. స్కూల్ అమ్మాయిగా ఖుషి, రోహన్ తల్లిగా హర్షిణి, మహేష్ ఆచంటతో పాటు మిగతా నటీనటులు తమ క్యారక్టర్ ల  పరిధి మేరకు నటించారు.ఫోటిగ్రఫీ బాగుంది. సాంగ్స్ యావరేజ్ అయినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్  బాగుంది. శ్రీకర్ నయన్  దర్శకుడుగా భారీగా సక్సెస్ అయ్యాడు. కాకపోతే డైలాగ్స్, స్క్రీన్ ప్లే విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సింది.నిర్మాణ విలువలు సూపర్ బలాలు 1 .కథ  2 .పల్లెటూరి నేపథ్యం  3 . రోహన్, అరుణ్ పెర్ఫార్మెన్స్ 4 . దర్శకత్వం  బలహీనతలు  1 .ఎలాంటి కథనం వస్తుందో ముందుగానే తెలిసిపోతుండటం  చివరిగా చెప్పాలంటే చాలా రోజుల తర్వాత చిన్న పిల్లల ఆనందాలు, భావోద్వేగాలని బాగానే చెప్పింది.  రేటింగ్ 2 .5 /5                                                                                                                                                                                                                                                          అరుణాచలం   
Actor Sai Durgha Tej and Kiran got engaged at Hilton Hyderabad Genome Valley Resort on 5th November, 2026.  The couple got engaged in the presence of their families and loved ones. The ceremony was a cherished family occasion, bringing together members of the Konidela and Allu families, along with close relatives and friends, to celebrate the couple as they embark on a new chapter in their lives. Ram Charan wished the couple on X and shared the pic, "Congratulations, dear @IamSaiDharamTej and #Kiran, on this beautiful new beginning. Wishing you both endless love, togetherness and a lifetime of happiness. So happy for both of you! #KiranTejForever" The wedding of Sai Durgha Tej and Kiran is scheduled to take place on December 10, 2026, in Hyderabad. The engagement was attended by Sai Durgha Tej’s parents, Dr. Siva Prasad and Vijaya Durga, and his brother Vaishnav Tej. Chiranjeevi and Surekha Konidela; Ram Charan; Allu Arjun and Sneha Reddy; Allu Bobby and Neela Shah; Varun Tej, Lavanya Tripathi and Vaayuv Tej; Naga Babu and Padmaja; Niharika Konidela; Allu Aravind and Allu Nirmala; Allu Sirish and Nayanika Reddy; and Akira Nandan and Aadhya, attended as special guests.  Close friends and colleagues, including Manchu Manoj and Bhuma Mounika Reddy; Naveen Vijay Krishna; Harsha Chemudu; Venky Kudumula; Navdeep; and Harshith Reddy, were also present.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘రామాయణ: పార్ట్ 1’ నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నితేశ్ తివారి దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా, ఈ చిత్రాన్ని చూసిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. సినిమా అద్భుతంగా ఉందంటూ చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారు. ‘రామాయణ’ సినిమా భారీ స్థాయి, తెరపై కనిపించే విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని రాజమౌళి పేర్కొన్నారు. ముఖ్యంగా పెద్ద తెరపై ఈ దృశ్యాలను చూస్తుంటే గొప్ప అనుభూతి కలుగుతుందని తెలిపారు. ఇక శ్రీరాముడి పాత్రలో నటించిన రణ్‌బీర్ కపూర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యంగా వనవాసం ఘట్టం మొదలైన తర్వాత రణ్‌బీర్ నటన ఎంతో ప్రశాంతంగా, అదే సమయంలో గంభీరంగా ఉందని ప్రశంసించారు. ఇక రావణుడి పాత్రలో యశ్ తనదైన ఉనికితో ఆకట్టుకున్నారని రాజమౌళి అన్నారు. రావణుడిగా యశ్ తెరపై కనిపించిన తీరు భయపెట్టేలా ఉందని కొనియాడారు. మరోవైపు సీత పాత్రలో సాయిపల్లవి ఎంతో హుందాగా కనిపించారని ప్రశంసించారు. ఈ ముగ్గురు నటీనటులు తమ పాత్రలకు తగిన న్యాయం చేశారన్న అభిప్రాయాన్ని రాజమౌళి తన రివ్యూలో వ్యక్తం చేశారు. సినిమాలోని ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు తనకు ఎంతగానో నచ్చాయని, ప్రతి క్షణాన్ని ఆస్వాదించానని రాజమౌళి పేర్కొన్నారు. ఇంతటి భారీ ఆలోచనను అద్భుతంగా తెరపైకి తీసుకొచ్చిన దర్శకుడు నితేశ్ తివారి, నిర్మాత నమిత్ మల్హోత్రాతో పాటు చిత్ర బృందం మొత్తానికి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: ఇద్దరిలో బెస్ట్ పెర్ఫార్మ్ ఇచ్చింది ఈ హీరోనే.. ఆ హీరో ఫ్యాన్స్ ఫీలవ్వద్దు ఇక ‘రామాయణ’లో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటించారు. లక్ష్మణుడి పాత్రలో రవి దూబే, హనుమంతుడిగా సన్నీ డియోల్ కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. భారతీయ ఇతిహాసాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు దర్శకుడు నితేశ్ తివారి, నిర్మాత నమిత్ మల్హోత్రా చేసిన ప్రయత్నం ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్‌పై కూడా రాజమౌళి సానుకూలంగా స్పందించారు. ప్రతి భారతీయ కథకుడు చెప్పాలని కలలు కనే కథ రామాయణమని, ఇలాంటి గొప్ప ఇతిహాసాన్ని భారీ స్థాయిలో తెరపైకి తీసుకొస్తున్న చిత్ర బృందాన్ని అభినందించారు. ఇప్పుడు సినిమా చూసిన తర్వాత మరోసారి ప్రశంసలు కురిపించడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. మరి రాజమౌళి ప్రశంసలకు తగ్గట్టుగానే ‘రామాయణ’ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. మీకు నచ్చవచ్చు: నెల రోజులపాటు రజనీకాంత్ బర్త్‌డే వేడుకలు.. లారెన్స్ ప్లాన్ వెనుక కారణం ఇదే.!   [SS Rajamouli Ramayana Review, Ramayana Part 1, Ranbir Kapoor, Yash, Sai Pallavi, Nitesh Tiwari, Namit Malhotra, Rajamouli Praises Ramayana]
‘కేజీఎఫ్’ సినిమాలో యశ్ తల్లిగా నటించి ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు కన్నడ నటి అర్చనా జోయిస్. ఆ సినిమాలో ఆమె నటన, ముఖ్యంగా రాఖీ భాయ్‌ చిన్నప్పటి ఎమోషనల్ సీన్స్ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. అలాంటి అర్చనా జోయిస్ ఇప్పుడు తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తాజాగా ఆమె నటించబోయే కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. కిషోర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాత ఎన్.ఎన్. కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ రాజ్ కుమార్ హీరోగా నటిస్తుండగా.. అర్చనా జోయిస్ హీరోయిన్‌గా అలరించనున్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘అమీతుమీ’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న అతిథి మైకల్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవానికి దర్శకుడు వి.వి. వినాయక్, హీరో ఆది సాయికుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వి.వి. వినాయక్ చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందజేయగా.. నిర్మాత ఎన్.ఎన్. కిషోర్ ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టారు. ఆది సాయికుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సినిమాతో దివాకర్ యడ్ల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రెండు మనసుల మధ్య పుట్టే అందమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా వినోదాత్మక అంశాలను కూడా జోడిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్, కేరళలో షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. ఇది కూడా చదవండి: రామాయణ మూవీ రివ్యూ! ఇక ఈ సినిమా ద్వారా తెలుగులో హీరోయిన్‌గా పరిచయం అవుతున్న అర్చనా జోయిస్ మాట్లాడుతూ.. ‘కేజీఎఫ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులు తనపై ఎంతో ప్రేమ చూపించారని, ఇప్పుడు నేరుగా తెలుగు సినిమాలో హీరోయిన్‌గా నటించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.  కన్నడలో ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన ఆమెకు ‘కేజీఎఫ్’తో దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. మరి ‘కేజీఎఫ్’లో ఎమోషనల్ తల్లిగా గుర్తుండిపోయిన అర్చనా జోయిస్.. ఈసారి తెలుగు తెరపై హీరోయిన్‌గా ఎలాంటి ముద్ర వేస్తారో చూడాలి. మీకు నచ్చవచ్చు: ట్విన్ సిస్టర్స్‌తో రొమాన్స్.. ఒకరిని ప్రేమించి మరొకరితో.? టైటిల్స్‌పై సెన్సార్ ఫోకస్: విడుదలకు ముందు సినిమాలకు మళ్ళీ బారసాల.!       [Archana Jois Heroine Debut, KGF Actress Archana Jois, Archana Jois Telugu Debut, Archana Jois, Vijay Raj Kumar, Divakar Yedla, Telugu Movies 2026, Telugu Film News]  
సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా విడుదలైనా, పుట్టినరోజు వచ్చినా అభిమానులకు పండగే. అయితే ఈసారి తలైవా పుట్టినరోజు వేడుకలను మరింత ప్రత్యేకంగా నిర్వహించేందుకు నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ఓ భారీ ప్లాన్ సిద్ధం చేశారు. సాధారణంగా సెలబ్రిటీల పుట్టినరోజు వేడుకలు ఒకటి రెండు రోజులు జరుగుతుంటాయి. కానీ రజనీకాంత్ కోసం మాత్రం ఏకంగా నెల రోజుల పాటు వేడుకలు నిర్వహించాలని ఆయన నిర్ణయించుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. డిసెంబర్ 12న రజనీకాంత్ తన 76వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా నవంబర్ 12 నుంచి డిసెంబర్ 12 వరకు నెల రోజుల పాటు తలైవా బర్త్‌డే సెలబ్రేషన్స్ నిర్వహించనున్నట్లు రాఘవ లారెన్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఒక నెల.. ఒక వేడుక.. ఒకే ఒక్క తలైవా అంటూ తన అభిమానాన్ని చాటుకున్నారు. రజనీకాంత్ పుట్టినరోజుతో పాటు ఆయన కెరీర్‌లో సాధించిన విజయాన్ని కూడా ఈ వేడుకల్లో భాగంగా జరుపుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. చిన్నప్పటి నుంచి తాను రజనీకాంత్‌కు వీరాభిమానినని, తన సినీ జీవితంలో ఈ స్థాయికి రావడానికి ఆయన స్ఫూర్తి ఎంతో ఉందని లారెన్స్ పేర్కొన్నారు. రజనీకాంత్ తనకు ఎంతో ఇచ్చారని, ఆయన వల్లే తాను ఈ పరిశ్రమలో ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పుకొచ్చారు. 75 ఏళ్ల వయసులోనూ రజనీకాంత్ ఇండస్ట్రీ హిట్ అందుకోవడం తనకు ఎంతో గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. అందుకే ఈసారి ఆయన 76వ పుట్టినరోజును, ఆ విజయాన్ని కలిపి అభిమానుల మధ్య ప్రత్యేకంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అయితే ఈ వేడుకలను రజనీకాంత్ సమక్షంలోనే నిర్వహించాలని రాఘవ లారెన్స్ కోరుకుంటున్నారు. స్వయంగా తలైవాను ఆహ్వానించి ఆయన ముందే ఈ వేడుకలు జరపాలనేది తన కోరిక అని తెలిపారు. అయితే రజనీకాంత్ చాలా సింపుల్‌గా ఉండటానికి ఇష్టపడతారని, తన కోసం భారీ వేడుకలు నిర్వహించుకోవడాన్ని ఆయన అంతగా కోరుకోరని లారెన్స్ అభిప్రాయపడ్డారు. అందుకే అభిమానుల ప్రేమాభిమానాలతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇది కూడా చదవండి: బిగ్ సర్‌ప్రైజ్ అప్పుడే ఓటీటీలోకి ‘జైలర్2’ ఈ నెల రోజుల వేడుకల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తానని లారెన్స్ తెలిపారు. అభిమానులు కూడా ఈ వేడుకల్లో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. రజనీకాంత్ పట్ల తనకున్న ప్రేమ, గౌరవం కారణంగానే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు స్పష్టం చేశారు. అయితే ఈ వేడుకల్లో అన్నదానం, సేవా కార్యక్రమాలు ఉంటాయా? అభిమానుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారా? అనే విషయాలపై మరిన్ని వివరాలు రావాల్సి ఉంది. మొత్తానికి రజనీకాంత్‌పై రాఘవ లారెన్స్‌కు ఉన్న అభిమానం మరోసారి బయటపడింది. ఒకప్పుడు తనకు స్ఫూర్తిగా నిలిచిన నటుడి కోసం నెల రోజుల పాటు వేడుకలు నిర్వహించాలని నిర్ణయించుకోవడం అభిమానులను ఆకట్టుకుంటోంది. నవంబర్ 12 నుంచి ప్రారంభం కానున్న ఈ వేడుకలపై తలైవా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మరి ఈ నెల రోజుల సెలబ్రేషన్స్‌ను లారెన్స్ ఏ విధంగా నిర్వహిస్తారో చూడాలి. మీకు నచ్చవచ్చు: పెళ్లి చేసుకుంటే రూ.30 వేలు నష్టం, హనీమూన్‌కు మరో రూ.30 వేలు.. ఇదేం లెక్క.?   [Rajinikanth Birthday 2026, Raghava Lawrence, Rajinikanth 76th Birthday, Thalaivar Birthday Celebrations, Raghava Lawrence Announcement, Rajinikanth Fans, Superstar Rajinikanth, Rajinikanth Birthday Plans, Kollywood News]
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
అమ్మమ్మల కాలం నాటి అరుదైన వంటకాల రుచి ఎప్పటికీ ప్రత్యేకమే. అందులోనూ నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే పెసరపప్పు హల్వా పేరు వింటేనే నోట్లో నీళ్లుూరుతాయి. ఏ ప్రత్యేక సందర్భమైనా, పండగలైనా లేదా దేవునికి నైవేద్యం సమర్పించాలన్నా ఈ సంప్రదాయ తీపి వంటకం ఎప్పుడూ ముందుంటుంది. ఇంట్లోనే ఎంతో సులభంగా తయారు చేసుకోగలిగే ఈ అద్భుతమైన స్వీట్ తయారీ విధానం మరియు దానికి కావలసిన కచ్చితమైన కొలతలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అద్భుతమైన హల్వా తయారీ కోసం ప్రధానంగా ఒక టీ గ్లాస్ పెసరపప్పు, నాలుగు గ్లాసులు నీళ్లు, అర గ్లాసు కంటే కొద్దిగా తక్కువ స్వచ్ఛమైన నెయ్యి, రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పులు, ఒక టేబుల్ స్పూన్ గోధుమపిండి, రెండు గ్లాసులు చక్కెర, నాలుగు దంచిన యాలకులు మరియు చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ అవసరమవుతాయి. ఈ ప్రాచీన రెసిపీ తయారీలో మొదటి దశగా, ఒక మందపాటి పాన్‌లో ఒక టీ గ్లాస్ పెసరపప్పును తీసుకొని చిన్న మంటపై దోరగా వేయించుకోవాలి. పప్పును ఇలా వేయించడం వల్ల హల్వాకు అద్భుతమైన రుచి, కమ్మటి వాసన వస్తాయి. అయితే పప్పు మాడిపోకుండా చిన్న మంటపై నిరంతరం కలుపుతూ వేయించడం చాలా ముఖ్యం. చక్కగా వేగిన తర్వాత వీటిని కుక్కర్‌లోకి తీసుకొని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడగాలి. ఏ గ్లాసుతో పెసరపప్పు తీసుకున్నారో అదే గ్లాసుతో సరిగ్గా నాలుగు గ్లాసుల నీళ్లు పోయాలి. సాధారణంగా మూడు గ్లాసులు పోస్తే పప్పు ముద్దగా మారుతుంది కాబట్టి, హల్వా కాస్త పల్చగా, సాఫ్ట్‌గా రావడానికి అదనంగా మరొక గ్లాసు నీళ్లు కలుపుకోవడం చాలా ముఖ్యం. కుక్కర్‌కు మూత పెట్టి మధ్యస్థ మంటపై 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు పప్పును బాగా ఉడికించుకోవాలి. విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి, ఉడికిన పప్పును పప్పు గుత్తితో మెత్తగా ఎనుపుకోవాలి. కావాలనుకుంటే మిక్సీ జార్‌లో వేసి కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా మెత్తగా ఎనిపిన పప్పు మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక పాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగించాలి. నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు వేసి, అవి బంగారు రంగు వచ్చేవరకు వేయించి ఒక బౌల్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే వేడి నెయ్యిలో ఒక టేబుల్ స్పూన్ గోధుమపిండి వేసి చిన్న మంటపై బాగా వేయించాలి. గోధుమపిండి రంగు మారి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవడం ద్వారా ఇది హల్వాకు అద్భుతమైన బైండింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. గోధుమపిండి సరిగ్గా వేగిన తర్వాత, ముందుగా ఎనిపి పక్కన పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని అందులో కలపాలి. మంటను చిన్న నుండి మీడియం స్థాయికి మార్చి, ఉండలు కట్టకుండా కంటిన్యూస్‌గా కలుపుతూ ఉండాలి. కొద్దిసేపటికి పప్పు మిశ్రమం బాగా చిక్కబడుతుంది. మిశ్రమం చిక్కబడుతూ ఉన్న సమయంలో, మరొక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని అదనంగా వేసి బాగా కలపాలి. అడుగు అంటకుండా నిరంతరం గరిటెతో కలుపుతూ ఉండటం ఈ వంటకంలో అత్యంత కీలకమైన భాగం. హల్వా మరింత చిక్కబడిన తర్వాత, ఏ గ్లాసుతో పెసరపప్పు తీసుకున్నారో అదే గ్లాసుతో రెండు గ్లాసుల చక్కెరను వేసుకోవాలి. ఒకవేళ ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం కోరుకుంటే చక్కెర స్థానంలో బెల్లంతో కూడా ఈ హల్వాను ఎంతో రుచిగా చేసుకోవచ్చు. ఇది కూడా చదవండి:https://teluguone.com/news/content/nethi-bobbatlu-recipe-35-236219.html చక్కెర వేసిన తర్వాత మంటను తగ్గించి, చక్కెర పూర్తిగా కరిగి హల్వా దగ్గర పడే వరకు కలపాలి. చక్కెర కరిగిన తర్వాత మిశ్రమం కొద్దిగా పల్చబడినట్లు అనిపించినా, నిరంతరం కలుపుతూ ఉంటే మళ్ళీ చక్కగా చిక్కబడుతుంది. ఈ దశలో మధ్యమధ్యలో కొద్దికొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఉండాలి. హల్వా పూర్తిగా చిక్కబడిన తర్వాత, చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకోవాలి. హల్వా మరింత గట్టిపడిన తర్వాత, మరొక టేబుల్ స్పూన్ నెయ్యి మరియు దంచిన నాలుగు యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఈ స్టేజ్‌లో నెయ్యి పాన్ అంచుల నుండి విడిపోవడం, హల్వా పాన్‌కు అంటుకోకుండా సులువుగా రావడం ప్రారంభమవుతుంది. ఇలా పాన్ నుండి విడివడుతున్నప్పుడే పెసరపప్పు హల్వా పూర్తిగా రెడీ అయినట్లు భావించాలి. వెంటనే స్టవ్ ఆపివేసి, ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు పలుకులను అందులో వేసి బాగా కలపాలి. అంతే, ఎంతో సువాసన వెదజల్లే, నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే అచ్చమైన అమ్మమ్మల కాలం నాటి పెసరపప్పు హల్వా సిద్ధమవుతుంది. దీన్ని వేడి వేడిగా లేదా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే కుటుంబసభ్యులందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ప్రత్యేక పండగ రోజుల్లోనూ, అతిథులు వచ్చినప్పుడు ఈ ట్రెడిషనల్ స్వీట్‌ను చేసి మీ ఇంట్లో అందరి ప్రశంసలను అందుకుని ఆనందించండి. మీకు నచ్చవచ్చు:https://teluguone.com/news/content/crispy-rice-flour-murukku-35-236136.html                                 https://teluguone.com/news/content/masala-vada-recipe-35-235245.html       Moong Dal Halwa Recipe, Traditional Indian Sweets, Authentic Yellow Lentil Halwa, Grandmothers Special Recipe, Festival Dessert Ideas, Buttery Sweet Recipes, Food Articles In Telugu.  
నాన్ వెజ్ ప్రియులు ఎప్పుడూ ఒకే రకమైన వంటకాలకు బదులుగా వైవిధ్యమైన రుచులను కోరుకుంటారు. సాధారణంగా ఎరుపు రంగు కారంతో చేసే కూరలకు భిన్నంగా, సరికొత్త పచ్చి కారం మరియు సువాసన వెదజల్లే పచ్చి మసాలాలతో తయారు చేసే గ్రీన్ మటన్ కర్రీ రుచి నూటికి నూరుపాటలు అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ఈ ప్రత్యేకమైన కూరను రుచి చూస్తే ఎవరైనా మళ్లీ మళ్లీ కావాలని అడుగుతారు. ఈ అరుదైన మరియు కమ్మనైన రెసిపీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ ప్రామాణికమైన గ్రీన్ మటన్ కర్రీ తయారీ కోసం ప్రధానంగా సరిగ్గా 1 కేజీ బరువున్న లేత మటన్ చాప్స్ లేదా బోన్ పీసెస్‌ను తీసుకోవాలి. దీనితో పాటు సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ ముక్కలు, అర టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కూర వేయించడానికి సరిగ్గా 4 టేబుల్ స్పూన్ల నూనె మరియు తగినంత నీరు ముందుగా సిద్ధం చేసి పెట్టుకోవాలి. నాన్ వెజ్ వంటకాల్లో ఈ కొలతలు పక్కాగా ఉంటేనే కూర యొక్క అసలైన రుచి మరియు పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తుంది. ఇక ఈ కూరకు ప్రత్యేకమైన సువాసనను తెచ్చే పచ్చి మసాలా పేస్ట్ తయారీ చాలా కీలకం. దీనికోసం ముక్కలుగా కోసిన 4 ఉల్లిపాయలు, పొట్టు తీసిన 3 వెల్లుల్లి గడ్డలు, 3 అంగుళాల అల్లం ముక్క, కారానికి తగినట్లుగా 8 నుంచి 10 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. వీటితో పాటు 1 టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, 5 నుంచి 6 లవంగాలు, 2 యాలకులు, అర కప్పు తాజా పచ్చి కొబ్బరి తురుము, గుప్పెడు తాజా కొత్తిమీర అలాగే ఒక గుప్పెడు తాజా పుదీనా ఆకులను సేకరించుకోవాలి. మొదటగా శుభ్రం చేసి పెట్టుకున్న 1 కేజీ మటన్ ముక్కలను గిన్నెలో వేసి, రుచికి సరిపడా ఉప్పు జోడించి అధిక మంటపై 3 నుంచి 4 నిమిషాల పాటు వేయించాలి. ఇలా చేయడం వల్ల మటన్‌లోని సహజమైన నీరంతా బయటకు వస్తుంది. ఆ తర్వాత సరిగ్గా 1 గ్లాసు నీళ్లు పోసి, కుక్కర్ మూత పెట్టి మధ్యస్థ మంటపై సుమారు 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇది కూడా చదవండి:https://teluguone.com/news/content/chinta-chiguru-royyala-curry-35-236222.html ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేసిన తర్వాత, ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి మరియు నల్ల మిరియాలు వేసి పచ్చివాసన పూర్తిగా పోయే వరకు వేయించాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత దానిని మిక్సీ జార్‌లోకి మార్చుకుని, అవసరమైతే కొద్దిగా నీళ్లు చేర్చి మెత్తటి పచ్చని పేస్ట్‌లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చివరగా ఒక వెడల్పాటి మందపాటి పాత్రలో ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కలను ఆ నీటితో సహా వేయాలి. ఆపై మనం ముందుగా సిద్ధం చేసుకున్న గుమగుమలాడే తాజా గ్రీన్ మసాలా పేస్ట్‌ను ఇందులో కలిపి మంటపై బాగా ఉడికించుకోవాలి. కొద్దిసేపు మగ్గిన తర్వాత దించుకుంటే నోరూరించే అచ్చమైన గ్రీన్ మటన్ కర్రీ సిద్ధమవుతుంది. మీకు నచ్చవచ్చు:https://teluguone.com/news/content/nalla-kura-fry-35-236225.html                               https://teluguone.com/news/content/senagapappu-mutton-curry-35-235799.html     Green Mutton Curry, Hariyali Mutton Recipe, Green Masala Mutton, Non Veg Recipes, Traditional Cooking Guide, Mutton Gravy Dishes, Food Articles In Telugu.
దీపావళి పండుగ అనగానే వెలుగులు, బాణసంచా మరియు ఉత్సాహం ఉరకలేస్తాయి. కానీ చిన్న క్షణం నిర్లక్ష్యం మొత్తం ఆనందాన్ని వైద్య అత్యవసర పరిస్థితిగా మార్చేయవచ్చు. ముఖ్యంగా టపాసులు కాల్చేటప్పుడు వెలువడే మంటలు, నిప్పు రవ్వలు మరియు ప్రమాదకర రసాయన కణాలు కంటికి తగిలి తీవ్రమైన గాయాలవుతుంటాయి. మేరెంగో ఆసియా హాస్పిటల్స్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ శిబాల్ భర్తియా ప్రకారం, ఈ ప్రమాదాలు కంటిలోని కార్నియా, లెన్స్ లేదా రెటినాపై తీవ్ర ప్రభావం చూపి કీరమైన దృష్టి లోపానికి దారితీసే అవకాశం ఉంది. టపాకాయ పేలుడు సంభవించినప్పుడు కేవలం ఒక నిప్పు రవ్వ మాత్రమే కాకుండా, తీవ్రమైన వేడి, పేలుడు తరంగాలు, ఎగసిపడే తునకలు మరియు రసాయన అవశేషాలు ఒకేసారి కంటిపై దాడి చేస్తాయి. కార్నియాపై గీతలు పడటం లేదా కాలిపోవడం వంటి సాధారణ సమస్యల నుంచి, కంటిలోపల రక్తస్రావం కావడం (హైఫేమా), ఐరిస్ చిట్లడం, లెన్స్ స్థానభ్రంశం చెందడం లేదా రెటినా దెబ్బతినడం వంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయి. ఈ గాయాల వల్ల కంటి చూపు శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం కూడా లేకపోలేదు. బయట కనిపించే చిన్న ఎరుపెక్కడం లేదా నొప్పి ఒక్కోసారి లోపలి తీవ్రతను పూర్తిగా బయటపెట్టవు. కొన్నిసార్లు రెటినా డిటాచ్‌మెంట్ వంటి సమస్యలు ప్రమాదం జరిగిన రోజుల లేదా వారాల తర్వాత బయటపడవచ్చు. అంతేకాకుండా, అంతర్గత నష్టం కారణంగా పెరిగే కంటి ఒత్తిడి నెలలు లేదా సంవత్సరాల తర్వాత కూడా సమస్యలను సృష్టించవచ్చు. అందువల్ల, కంటికి బలమైన దెబ్బ తగిలితే చూపు సాధారణంగా కనిపించినప్పటికీ తప్పనిసరిగా నేత్ర వైద్య పరీక్ష చేయించుకోవడం అత్యంత ముఖ్యం. టపాసులు కాల్చేవారే కాకుండా, చుట్టుపక్కల ఉండే ప్రేక్షకులు, బాల్కనీల నుండి వీక్షించే ఇటువంటవారు మరియు చిన్న పిల్లలు కూడా ఈ ప్రమాదాల బారిన పడుతున్నారు. రాకెట్లు మరియు చక్రాలు వంటి బాణసంచా ఊహించని దిశలో దూసుకురావడం వల్ల దూరం నుండి చూసేవారికి కూడా హాని కలుగుతుంది. పిల్లలు దీనిలోని ప్రమాదాలను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల వారు మరింత ఎక్కువగా ప్రభావితమవుతారు. ఇది కూడా చదవండి:https://teluguone.com/news/content/diwali-pollution-35-236362.html కంటికి గాయమైన వెంటనే తక్షణ వైద్య సహాయం తీసుకోవడం ద్వారా చూపును కాపాడుకునే అవకాశాలు పెరుగుతాయి. ఈ సమయంలో కంటిని ఎట్టి పరిస్థితుల్లోనూ రుద్దకూడదు లేదా నొక్కకూడదు. కంటిలో ఏదైనా ముక్క ఇరుక్కుంటే దాన్ని అలాగే ఉంచి అత్యవసర సహాయం కోరాలి. వైద్య సలహా లేకుండా ఎలాంటి ఐ డ్రాప్స్, నూనెలు లేదా కాటుక వంటి ఇంటి చిట్కాలను ఉపయోగించకూడదు. రసాయనాలు లేదా పొడి కంటిలో పడితే వెంటనే శుభ్రమైన పారే నీటితో కడగాలి. పెద్ద లేదా లోతైన గాయాలు సంభవించినట్లు భావిస్తే వెంటనే సమీపంలోని నేత్ర వైద్య అత్యవసర విభాగానికి చేరుకోవాలి. టపాసులు కాల్చేటప్పుడు రక్షణ కళ్లద్దాలు ధరించడం, వెలిగించిన టపాసుల దగ్గర వంగకపోవడం మరియు వెలగని టపాసులను మళ్లీ వెలిగించే ప్రయత్నం చేయకపోవడం ద్వారా ఈ ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చు. మీకు నచ్చవచ్చు:https://teluguone.com/news/content/dhanteras-2026-shopping-35-236242.html                                 https://teluguone.com/news/content/dark-circles-remedy-35-236423.html       Diwali Eye Injury Safety, Cracker First Aid Tips, Fireworks Eye Care, Emergency Medical Precautions, Festival Safety Guide, Doctor Health Advice, Health Tips In Telugu.
మలబద్ధకం సమస్యతో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. సరిగ్గా మలవిసర్జన కాకపోవడం, మలం గట్టిగా రావడం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రోజువారీ జీవితాన్ని ఇబ్బందులకు గురిచేస్తాయి. ఇలాంటి సమస్యలకు సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు ఎంతో ఉపయోగపడతాయి. ఈ వీడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ మలబద్ధకం సమస్యకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను వివరించారు. వాము, బెల్లం, కరక్కాయ పెచ్చుల వంటి సహజ పదార్థాల ఉపయోగాలు, జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో వాటి పాత్ర గురించి తెలియజేశారు. మలబద్ధకం సమస్యకు కారణాలు ఏమిటి? పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి? మలవిసర్జన సాఫీగా జరిగేందుకు ఎలాంటి ఆహారపు అలవాట్లు పాటించాలి? వాము, బెల్లం, కరక్కాయలను ఎలా ఉపయోగించాలి? మలబద్ధకం సమస్యను తగ్గించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. సహజమైన పద్ధతులతో జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే వారికి ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది. మలబద్ధకం సమస్య తరచూ వేధిస్తున్నా, తీవ్రమైన కడుపునొప్పి లేదా మలంలో రక్తం కనిపించినా వైద్యులను సంప్రదించడం అవసరం. మలబద్ధకం సమస్యకు ఆయుర్వేదంలో సూచించే సహజ పరిష్కారాలు, వాము, బెల్లం, కరక్కాయ పెచ్చుల ఉపయోగాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
నేటి కాలంలో మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్ లు, కంప్యూటర్లు మన దైనందిన జీవితంలో ప్రధాన భాగమైపోయాయి. ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు స్క్రీన్ వైపు చూడటం చాలా మందికి అలవాటుగా మారిపోయింది. సోషల్ మీడియా వాడకం, ఆఫీస్ పని లేదా వినోదం కోసం గంటల తరబడి డివైజ్‌ల ముందే గడపడం సర్వసాధారణం అయింది. ఈ నేపథ్యంలో స్క్రీన్ టైమ్ ఎక్కువైతే దుష్పభావాలు ఉంటాయని వైద్యులు కూడా చెబుతున్నారు. అయితే తాజాగా..  ఈ విషయం గురించి  వైద్య నిపుణులు , పరిశోధకులు చెబుతున్న విస్తుపోయే నిజాలేంటో వివరంగా తెలుసుకుంటే.. నిపుణుల అభిప్రాయం ప్రకారం కేవలం స్క్రీన్ ముందు గంటల తరబడి కూర్చోవడం వల్ల నేరుగా పక్షవాతం వస్తుందని చెప్పలేము. అయితే ఎక్కువ సమయం స్క్రీన్ చూస్తూ గడపడం అనేది ఒక రకమైన నిశ్చల జీవన శైలితో ముడిపడి ఉంటుంది. ఈ విధంగా శారీరక శ్రమ లేకుండా రోజంతా ఒకే చోట కూర్చునే అలవాటు వల్ల క్రమంగా అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా బరువు పెరగడం, హై బ్లడ్ ప్రెషర్, మధుమేహం , చెడు కొలెస్ట్రాల్  వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవన్నీ కూడా పక్షవాతం ముప్పును పెంచే ప్రధాన కారణాలలో ముఖ్యమైనవిగా వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అమెరికన్ స్ట్రోక్  అసోసియేషన్  కు చెందిన జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం అరవై  సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న వారు రోజులో కనీసం ఎనిమిది గంటల పాటు శారీరక శ్రమ లేకుండా కేవలం కూర్చునే పనులలో  గడిపితే, వారిలో పక్షవాతం వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుందని తేలింది. అయితే ఇది నేరుగా స్క్రీన్ వల్ల జరిగే నష్టం కాకపోయినా, ఎక్కువ సమయం కదలకుండా కూర్చునే స్వభావం వల్ల కలిగే దుష్పరిణామం అని పరిశోధకులు పేర్కొంటున్నారు. కాబట్టి స్క్రీన్ చూసే గంటలను మాత్రమే లెక్కగట్టి ప్రమాదాన్ని అంచనా వేయలేము. ఎందుకంటే రోజంతా కంప్యూటర్ ముందు పని చేసే వ్యక్తి క్రమం తప్పకుండా వ్యాయాయం చేస్తుంటే, అస్సలు శారీరక శ్రమ లేని వ్యక్తితో పోలిస్తే అతనిలో ప్రమాదం కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే రాత్రి సమయాల్లో ఎక్కువ సేపు మొబైల్ లేదా ల్యాప్టాప్ వాడటం వల్ల నిద్ర నాణ్యత దెబ్బతింటుంది. నిద్రలేమి సమస్య ఏర్పడినప్పుడు అది రక్తపోటును , జీవక్రియలను నియంత్రించడం కష్టం చేస్తుంది. దీనివల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా హైపర్ టెన్షన్, డయాబెటిస్, ఊబకాయం , గుండె జబ్బులు ఉన్నవారు తమ ఆరోగ్యం పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అధిక రక్తపోటు అనేది పక్షవాతానికి దారితీసే అత్యంత ముఖ్యమైన కారకాల్లో ఒకటి కాబట్టి, బీపీని ఎప్పుడూ అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. యువత కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పక్షవాతం కేవలం వృద్ధులలోనే వస్తుందని అనుకోవడం  పొరపాటు. మారుతున్న జీవన శైలి కారణంగా నేడు యువతలో కూడా ఇలాంటి ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. అయితే ఉద్యోగరీత్యా లేదా చదువురీత్యా ఎప్పుడూ స్క్రీన్ ముందు పనిచేయాల్సిన వారు పూర్తిగా డివైజ్ లను పక్కన పెట్టడం సాధ్యం కాదు. అలాంటి వారు కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. జాగ్రత్తలు.. రోజూ గంటల తరబడి ఒకే చోట కదలకుండా కూర్చోకుండా మధ్యమధ్యలో చిన్న బ్రేక్ లు  తీసుకోవడం మంచిది. కుర్చీలోంచి లేచి కొద్దిసేపు నడవడం, ఫోన్ మాట్లాడేటప్పుడు గదిలో తిరగడం, అలాగే రోజూవారీ జీవితంలో తగినంత శారీరక శ్రమ ఉండేలా చూసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెద్దలు ప్రతి వారం కనీసం నూట యాభై నిమిషాల పాటు ఏదైనా వ్యాయామం లేదా నడక వంటి శారీరక కార్యకలాపాలు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.  వీటితో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, పొగత్రాగడం వంటి అలవాట్లకు దూరంగా ఉండటం , ప్రశాంతమైన నిద్ర  చాలా అవసరం. గుర్తుంచుకోవాల్సిన విషయం.. కేవలం స్క్రీన్ టైమ్ తగ్గించడం వల్ల మాత్రమే పక్షవాతం రాకుండా నివారించలేము. ముఖ్యంగా బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు వాటిని అదుపులో ఉంచుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పక్షవాతం బారిన పడకుండా ఉండాలంటే శరీరానికి తగిన వ్యాయామం ఇస్తూ, ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడం ఎంతో ముఖ్యం. ఒకవేళ ఎవరికైనా ముఖం ఒకవైపు వంకరపోవడం, శరీరంలో అకస్మాత్తుగా బలహీనత రావడం, మాట తడబడటం, చూపు మందగించడం లేదా విపరీతమైన తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం.                                                                                                                                          *రూపశ్రీ*