LATEST NEWS
వైసీపీ సీనియర్ నాయకుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి ఏపీ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మద్యం కుంభకోణం కేసులో ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ముందస్తు బెయిలు మంజూరు చేయలేమని పేర్కొంటూ కోర్టు ఆయన యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ ను కొట్టివేసింది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో పీకల్లోతు ఇరుక్కున్న మిథున్ రెడ్డి ఈ కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు   సుప్రీంను ఆశ్రయించారు. మిథున్ రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్ విచారించిన సుప్రీం కోర్టు ఈ విషయాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని పేర్కొంటూ.. అప్పటి వరకూ అరెస్టు నుంచి మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మిథున్ రెడ్డి సుప్రీంను ఆశ్రయించారు. ఇప్పుడు  ఏపీ హైకోర్టు మిథున్ రెడ్డి  ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ మంగళవారం (జులై 15) తీర్పు ఇచ్చింది. దీంతో మిథున్ రెడ్డికి అరెస్టు నుంచి రక్షణ లేకుండా పోయింది. దీంతో ఏ క్షణమైనా ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.   మద్యం కుభకోణంలో పలువురు నిందితులను అరెస్టు చేశారు. ఇంకా కొంత మంది పరారీలో ఉన్నారు.ఇదే కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా అరెస్టయ్యారు. చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ విచారణలో ఉంది. అయితే మిథున్ రెడ్డి బెయిలు పిటిషన్ ను సుప్రీం తిరస్కరించడంతో ఆయన ఏ క్షణమైనా అరెస్టయ్యే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. 
వైయస్సార్ కడప జిల్లాలో  ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో దారుణం జరిగింది.ఇక్కడ ఇంటర్ విద్యార్థిని   దారుణ హత్యకు గురైంది. హత్య గురైన బాలిక మృతదేహం ముళ్ళపొదల్లో నగ్నంగా పడి ఉండడం  చూస్తే హంతకుడు హత్యాచారానికి పాల్పడ్డాడన్న అనుమానాలు వ్యక్తం అవు తున్నాయి.అందిన సమాచారం మేరకు  బాలిక ప్రొద్దుటూరులోని  గీతం జూనియర్ కాలేజీలో  ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతోంది. సోమవారం ఉదయం 8 గంటలకు కళాశాలకు వెళుతున్నట్లు చెప్పి   ఇంటి నుంచి వెళ్లింది. ఎర్రగుంట్ల మండలం హనుమనగుత్తి గ్రామానికి చెందిన లోకేష్,  అదే గ్రామానికి చెందిన  బాలికను తన ద్విచక్ర వాహనంపై ఉదయం  ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో గండికోట కు తీసుకువెళ్లాడు. తరువాత 10:47 గంటల సమయంలో లోకేష్ ఒక్కడే తన ద్విచక్ర వాహనంపై గండికోట నుంచి వెనక్కు వచ్చేసినట్లు  సిసి ఫుటేజీలో రికార్డు అయ్యింది. కాగా ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో   బాలిక కాలేజీకి రాలేదని  కళాశాల యాజమాన్యం ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పారు . ఉదయం 8 గంటలకే తమ కుమార్తె కాలేజీకి వచ్చిందని  చెప్పిన కుటుంబ సభ్యులు ఆ వెంటనే కాలేజీకి వచ్చి విచారించారు.  లోకేష్ ఆ బాలికను బైక్ పై తీసుకు వెళ్లాడని తెలియగానే వారు గండికోటకే వెళ్లి ఉంటారని భావించిన  కుటుంబ సభ్యులు ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి , గండికోటకు వెతికేందుకు వెళ్లారు. సాయంత్రం వరకు వైష్ణవికి సంభంధించిన ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు.సాయంత్రం గండికోట పై భాగంలో మైనర్ విద్యార్థిని కాలేజీ బ్యాగు , చున్ని కనిపించాయి. దీంతో ఆ చుట్టుపక్కల వెతికినా మైనర్ విద్యార్థిని ఆచూకీ లభించలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. లోకేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలిసింది. అతని ఇచ్చిన సమాచారం మేరకు మైనర్ బాలిక మృతదేహం ఉన్న ప్రాంతాన్ని పోలీసులు, కుటుంబ సభ్యులు మంగళవారం (జులై 15) ఉదయం గుర్తించారు. మైనర్ విద్యార్థినిని  హత్య చేసినట్లు నిర్ధారించుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  
బాలీవుడ్ నటుడు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ దత్  ముంబై పేళ్లలకు సంబంధించి  మరోసారి వివాదాల్లో చిక్కుకుంటున్నారు. సంజయ్‌దత్ తలుచుకుని ఉంటే ముంబై పేలుళ్లను ఆపి ఉండేవారని ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ తాజాగా ఓ నేషనల్  మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ వాణిజ్య రాజధాని ముంబైలో 1993లో జరిగిన పేలుళ్ల కేసును వాదించిన ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ తాజాగా  చేసిన వ్యాఖ్యలు పెను సంచలనంగా మారాయి. న్యాయవాదిగా పలు సంచలన కేసులను వాదించిన ఉజ్వల్ నికమ్ ఆ తర్వాత రాజకీయ అరంగేట్రం చేశారు. ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ముంబై పేలుళ్ల గురించి, నటుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ దత్ గురించి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.   1993, మార్చి 12న ముంబైలో వరుస పేలుళ్లు జరిగాయి. ఆ పేలుళ్లకు కొన్ని రోజుల ముందు సంజయ్ ఇంటికి ఆయుధాలతో నిండిన ఓ వ్యాన్ వచ్చింది. గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు అబూం సలేం తీసుకొచ్చిన ఆ వ్యాన్‌లో హ్యాండ్ గ్రనేడ్లు, ఏకే 47 తుపాకులు, బాంబులు ఉన్నాయి. వాటిని సంజయ్ పరిశీలించారు. వాటిల్లో నుంచి ఒక ఏకే 47 తుపాకీని తీసుకుని తన దగ్గర ఉంచుకున్నారు. అయితే..అప్పుడే ఆ ఆయుధాల వ్యాన్ గురించి పోలీసులకు సంజయ్ సమాచారం ఇచ్చి ఉంటే ఆ పేలుళ్లు జరిగి,  అంత మంది చనిపోయి ఉండేవారు కాదని ఉజ్వల్ నికమ్ పేర్కొన్నారు. ముంబై పేలుళ్లతో సంబంధం ఉందనే కారణంతో సంజయ్‌పై అప్పట్లో టాడా కేసు నమోదైంది. సంజయ్ ఉగ్రవాది అని ఆరోపణలు వచ్చాయి. కోర్టు మాత్రం సంజయ్‌ను నిర్దోషిగా ప్రకటించింది. అయితే అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే అభియోగం   రుజువు కావడంతో సంజయ్‌ను దోషిగా నిర్దారిస్తూ కోర్టు ఐదేళ్లు జైలు శిక్ష విధించింది. పుణెలోని యరవాడ జైల్లో శిక్ష అనుభవించిన సంజయ్ 2016లో విడుదల అయ్యాడు. కాగా..  న్యాయవాది ఉజ్వల్ నికమ్ బీజేపీలో చేరి 2024లో ముంబై నార్త్-సెంట్రల్ లోక్‌సభ్ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా ఆయనను బీజేపీ రాజ్యసభకు నామినేట్ చేసింది. ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్న సంజయ్‌దత్‌తో పాటు బీజేపీ అధిష్టానం సైతం ఉజ్వల్ వ్యాఖ్యలతో ఇరకాటంలో పడినట్లైంది.
తిరుమల దేవుడి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ కేసులో సుప్రీం కోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. తిరుమల లడ్డూ కల్తి వ్యవహారంలో వాస్తవాలను వెలికి తీయడం లక్ష్యంగా సుప్రీం కోర్టు గత ఏడాది అక్టోబర్ లో స్వతంత్ర సిట్ ను ఏర్పాటు చేసిన సంగతి విదితమే. ఈ సిట్ కు సీబీఐ డైరెక్టర్ నేతృత్వం వహిస్తుండగా, రాష్ట్ర పోలీసు శాఖ, సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ అధారిటీ అధికారులు సభ్యులుగా ఉన్నారు.  సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తులో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ జరిగిందని నిర్ధారణ అయ్యింది.  తన దర్యాప్తులో కనుగొన్న విషయాలను సిట్ సుప్రీం కోర్టుకు సీల్డ్ కవర్ లో నివేదించింది.  లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించిన నెయ్యి కల్తీ కేసుకు సంబంధించి సిట్ 14 మందిని అరెస్టు చేసింది. అరెస్టు చేసిన వారిలో  బోలెబాబా డెయిరీ, ఏఆర్ డెయిరీ, వైష్ణవీ డెయిరీ డైరెక్టర్లు, సిబ్బంది ఉన్నారు. అలాగే సిట్ తన దర్యాప్తులో బాగంగా టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్న సహా పలువురు టీటీడీ ఉద్యోగులను విచారించింది.  ఈ విషయాన్ని కూడా సిట్ సుప్రీంకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. అంతే కాకుండా ఈ కేసులో నిందితులు దర్యాప్తును అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలను సవివరంగా ఆ నివేదికలో పొందుపరిచింది.   ఈ నేపథ్యంలోనే టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ కేసులో దర్యాప్తు సుప్రీం కోర్టు పర్యవేక్షణలో పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరిగేలా చూడాలంటూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు దర్యాప్తు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మితిమీరి జోక్యం చేసుకుని రాజకీయ ఒత్తిడిని తీసుకువస్తోందని ఆయన తన పిటిషన్ లో ఆరోపించారు. కాగా సుబ్బారెడ్డి బెయిలు పిటిషన్ విచారణను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ కు లిస్ట్ చేయవలసిందిగా.. ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ వినోద్ చంద్రన్, జస్టిస్ నిలయ్ విపిన్ చంద్రఅంజారియాల ధర్మాసనం కోరింది. అదలా ఉంచితే.. లడ్డూ ప్రసాదం తీయారీలో వినియోగిచిన నెయ్యిలో కల్తీ వ్యవహారంలో తనను అరెస్టు చేస్తారన్న భయం సుబ్బారెడ్డిలో పెరిగిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తాడిపత్రి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సొంత ఇంట్లో అడుగుపెట్టే భాగ్యం ఇప్పట్లో లేనట్లు కనిపిస్తోంది. ఆయన ఎప్పుడు తాడిపత్రి బయలుదేరినా ఏదో ఒక అవాంతరం ఎదురవుతోంది. ఆయన తాడిపత్రి ఎంట్రీకి పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు . తాజాగా మంగళవారం (జులై  15)న మరో సారి పోలీసులు ఆయన తాడిపత్రిలో తలపెట్టిన కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు. దీంతో   తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మరోసారి తాడిపత్రి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకున్నారు. ఎన్నికల సమయంలో కూటమి సర్కార్ ఇచ్చిన హామీలపై నిలదీసేందుకు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని తాడిపత్రిలో నిర్వహించేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఈ  కార్యక్రమంలో పాల్గొనేందుకు తనకు అనుమతి ఇవ్వాలని పెద్దారెడ్డి పోలీసులను కోరారు. అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సైతం ఆ జిల్లా ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరికి లేఖ రాశారు. కాగా గతంలో పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చిన సందర్భంలో  శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కావడంతో   పోలీసులు ఆయన్ను వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. ఈ సారి కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు. తాడిపత్రికి రావొద్దని స్పష్టం చేశారు. ఈ క్రమంలో కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డికి నోటీసులు అందించారు.   తాడిపత్రిలో మంగళవారం (జులై 15)మంత్రుల ప్రొగ్రాం ఉందని.. శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉండటంతో వైసీపీ నేతలు తమ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని పోలీసులు నోటీసుల్లో  పేర్కొన్నారు. ఈనెల 18 లేదా ఆ తర్వాత కార్యక్రమం నిర్వహించుకోవచ్చని సూచించారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో చేసేది ఏమి లేక పెద్దారెడ్డి వెనక్కి తగ్గారు. ఈ నెల 18న ఈ కార్యక్రమాన్ని జరుపుతామని పెద్దారెడ్డి తెలిపారు. తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి , వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య  మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే విధంగా వారిద్దరి మధ్య వైరం ఉన్న సంగతి తెలిందే.  కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తున్నారు అన్న సమాచారాన్ని విహార యాత్రలో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డికి అక్కడి టీడీపీ కార్యకర్తలు సమాచారం ఇచ్చారు. వెంటనే అలర్ట్ అయిన హుటాహుటిన ప్రత్యేక విమానంలో విహారయాత్ర నుంచి తాడిపత్రి బయలుదేరినట్లు సమాచారం. ఒకవేళ పెద్దారెడ్డి తన తాడిపత్రి పర్యటనను వాయిదా వేసుకోకపోయుంటే అక్కడ తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకునేవి అంటున్నారు.
ALSO ON TELUGUONE N E W S
Naga Vamsi, the renowned active producer of Telugu Cinema, has been confident about his upcoming biggie, Kingdom. Vijay Deverakonda, Bhagyashri Borse are starring in this tale of a spy leading an uprising in an island. Gowtam Tinnanuri is directing this film after his highly appreciated Jersey.  In a media interaction, Naga Vamsi expressed his fear about negativity surrounding Vijay Deverakonda. He stated that there are unanimous trolls and high amount of negativity surrounding Vijay and they have to work hard to push the film beyond all these trolls and negativity.  His tone appeared concerned about Vijay's recent duds and even more about the negative comments, trolls surrounding Vijay in social media. While he is stating that the film will work well with the audiences, at the same time, he is making such statements. Several onlookers are commenting that he is unable to hide his fear.  It is common for producers to feel nervous about their investment when a big film is releasing. But with a great track record of hits in recent times, a producer like Naga Vamsi making such a statement about Vijay's credibility and his negative image among audiences, is giving opportunity to several onlookers to spread even more negativity about the film.  While we cannot be sure about film's quality prior to the release, producers and directors do have an understanding about the product in hand. Reports suggest that Kingdom did undergo several reshoots and these kind of remarks could be a strategy to cover up any misses and throw blame on negative image of the actor?  He seems to be worried that Kingdom will be affected by this negative image and maybe this could be his way of asking people to be kind. Well, let's hope the movie releasing on 31st July will answer to every question and let it just be a random comment made by Naga Vamsi and not something profound.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
Meher Ramesh doesn't need an introduction as he gave unforgettable disasters in Telugu Cinema. He directed Kantri, Billa, Shakti, Shadow, and Bhola Shankar with big stars. Kantri and Billa ended up being average grossers to an extent but Shakti, Shadow turned to be career worst films for NTR, Venkatesh, respectively.  He returned back to direct Megastar Chiranjeevi for Bhola Shankar. The movie became career worst of Chiranjeevi as well. He earned the reputation of being a director who delivers career worst films of big stars and fans are scared about a film with him.  He is the only director in Telugu Cinema to earn such a bad reputation that fans like to dislike. Now, he stated in an interview that he achieved his lifetime dream to work with Megastar Chiranjeevi and he wants to direct Pawan Kalyan, as well. After his revelation, Pawan Kalyan fans are scared if Meher Ramesh will get the opportunity.  Sarcastically, several fans are making fun comments against such a film being end of many careers. Even some are trying to state that if Pawan Kalyan decides to be a part of Meher's film, he could directly announce retirement and they can just think about his political career.  Pawan Kalyan did not care about giving Harish Shankar an opportunity, even after Mr. Bachchan, he did not care about giving Bheemla Nayak to Saagar K. Chandra, and BRO to Samuthirakani. So, fans are afraid if Meher Ramesh will also get an opportunity.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
  కొందరి మాటలు ఎప్పుడూ వివాదాస్పదమవుతూ ఉంటాయి. కెరీర్ స్టార్టింగ్ నుండి విజయ్ దేవరకొండకు ఈ సమస్య ఉంది. తెలిసీ తెలియకుండా అన్న మాటలు కాంట్రవర్సీ అవుతుంటాయి. ఈ మధ్య కాలంలో కూడా రెండు వివాదాలు ఎదురయ్యాయి. రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పహల్గామ్ ఉగ్ర దాడి గురించి మాట్లాడుతూ ట్రైబ్ అనే పదం ఉపయోగించగా అది వివాదాస్పదమైంది. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకు బ్యాక్ గ్రౌండ్ లేకపోవడం వల్ల స్క్రిప్ట్ ల విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చిందని విజయ్ చెప్పగా.. అది కూడా కాంట్రవర్సీ అయింది. ఓ రకంగా విజయ్ ఏదీ మాట్లాడినా వివాదమే అన్నట్టుగా తయారైంది. ఇదే విషయాన్ని తాజాగా నిర్మాత నాగవంశీ ప్రస్తావించారు. విజయ్ మీద కొంచెమైనా జాలి చూపించాలని అన్నారు.   విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం 'కింగ్ డమ్'. ఈ యాక్షన్ డ్రామా జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.   "అసలు విజయ్ గారిని జనం ఎందుకు టార్గెట్ చేస్తారో తెలీదు. పాపం అసలే ఆయన సినిమాలు ఆడక డౌన్ లో ఉన్నారు. రెట్రో ఈవెంట్ లో చిన్న మాట అంటే దాన్ని హంగామా చేశారు. హాలీవుడ్ రిపోర్టర్ ఇంటర్వ్యూలో ఏదో అంటే దాన్ని ఇంకోలా తీసుకున్నారు. అసలు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఆయన్ని? ఏం అవసరం?. ఇదివరకు అంటే యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడి ఉండొచ్చు. ఇప్పుడేం మాట్లాడట్లేదు కదా. ఆఫ్ కెమెరా ఆయనసలు చాలా మంచిగా ఉంటారు. జనాలకు అసలు హీరో మీద జాలి కూడా లేదు. ఓ పక్క హిట్లు లేక ఆయన అలా ఉంటే.. ఆయన ఏం మాట్లాడినా భూతద్దంలో చూస్తూ కాంట్రవర్సీ చేయడానికి ట్రై చేస్తున్నారు." అని నాగవంశీ చెప్పుకొచ్చారు.  
ఎనర్జిటిక్  స్టార్ రామ్ పోతినేని(Ram Pothineni)హీరోగా వచ్చిన 'ది వారియర్', 'స్కంద' వంటి చిత్రాలతో పాటు నాగార్జున(Nagarjuna),నాగ చైతన్య(Naga Chaitanya) లతో 'నా సామి రంగ', 'కస్టడీ' వంటి పలు విభిన్న చిత్రాలని నిర్మించిన నిర్మాణ సంస్థ 'శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్'. ఈ సంస్థ అధిపతి పేరు 'చిట్టూరి శ్రీనివాసా'(Srinivasaa Chitturi).  ఈ రోజు ఉదయం శ్రీనివాసా సోదరుడు 'చిట్టూరి కాశీవిశ్వనాథ్'(Chitturi Kashi Vishwanath)ఉమ్మడి గోదావరి జిల్లాలోని ఆయన స్వగ్రామం పసివేదులలో చనిపోవడం జరిగింది. కాశీ విశ్వనాధ్ గత కొంత కాలంగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఆయన వయసు ప్రస్తుతం 49 సంవత్సరాలు. దీంతో పలువురు చిత్ర ప్రముఖులు చిట్టూరి శ్రీనివాసాకి తమ సానుభూతిని తెలియచేస్తున్నారు. చిట్టూరి శ్రీనివాసా 2018 లో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'యూటర్న్'తో సినీ రంగ ప్రవేశం చేసాడు. గోపీచంద్, తమన్నా, సంపత్ నంది కాంబోలో వచ్చిన 'సిటీ మార్' అనే చిత్రాన్ని కూడా నిర్మించడం జరిగింది.    
తన స్టార్ డమ్ కి ఎలాంటి డ్యామేజ్ కలగకుండా, ఏ క్యారక్టర్ లోకైనా అవలీలగా ప్రవేశించి, ఆయా క్యారెక్టర్స్ కి  స్టార్ డమ్ ని తెచ్చే హీరో 'నాగార్జున'(Nagarjuna). ఆయన నుంచి ఇప్పటి వరకు వచ్చిన   చిత్రాలే అందుకు ఉదాహరణ. సిల్వర్ స్క్రీన్ పై 'నాగ్' టచ్ చెయ్యని జోనర్ లేదు. రీసెంట్ గా  కుబేరతో సత్తా చాటిన నాగ్, అగస్ట్ 14 న 'కూలీ'(Coolie)తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రంలో 'సైమన్' అనే నెగిటివ్ షేడ్ ఉన్న రోల్ లో కనిపిస్తుండటంతో, నాగ్ క్యారక్టర్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.  రీసెంట్ గా 'కూలీ' దర్శకుడు 'లోకేష్ కనగరాజ్'(lokesh Kanagaraj)ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'కూలీలో నాగ్ సర్ క్యారక్టర్ చాలా కొత్తగా ఉండబోతుంది. క్యారక్టర్ కి సంబంధించిన ఐడియాని మొదట నాగ్ సర్ కి  చెప్పాను. ఆయనకెంతో నచ్చింది. కానీ సర్ ని ఒప్పించడం అంత తేలిక కాదు. చాలా కష్టంతో ఒప్పించాను. సుమారు ఏడెనిమిది సార్లు వరకు నారేషన్ ఇచ్చాను. సదరు  క్యారక్టర్ ని తీర్చిదిద్దటం కూడా సవాలుగా మారిందని లోకేష్ చెప్పుకొచ్చాడు. లోకేష్ చెప్పిన ఈ మాటలతో నాగార్జున కథల విషయంలో, తన క్యారక్టర్ కి సంబంధించిన విషయంలో ఎంత సిన్సియర్ గా ఉంటారో అర్ధమవుతుంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న 'కూలీ'లో రజనీకాంత్(Rajinikanth),నాగార్జున స్క్రీన్ షేర్ చేసుకోనుండటంతో, పాన్ ఇండియా వ్యాప్తంగా ఉన్న ఇద్దరి అభిమానులు 'కూలీ' కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శృతి హాసన్(Shruthi haasan)హీరోయిన్ గా చేస్తుండగా మరో హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde)ఒక స్పెషల్ సాంగ్ లో చేస్తుంది. 'మోనికా' అంటూ ఇటీవల రిలీజైన ఆ సాంగ్, సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్ తో ముందుకు దూసుకుపోతుంది. అగ్ర హీరో 'అమీర్ ఖాన్'(Amir Khan)గెస్ట్ రోల్ లో కనిపిస్తున్న 'కూలీ' ని సన్ పిక్చర్స్ పై కళానిధి మారన్(kalanithi Maaran)భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు. అనిరుద్ సంగీతాన్ని అందించడం జరిగింది.    
  జూనియర్ ఎన్టీఆర్ నటించిన బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2'. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఆగస్టు 14న థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ నిర్మాత నాగవంశీ సొంతం చేసుకున్నారు. జూలై 31న విడుదల కానున్న 'కింగ్ డమ్' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో 'వార్-2' గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నాగవంశీ.   "ఇండియాలోని ఇద్దరు ఫైనెస్ట్ యాక్టర్స్ స్క్రీన్ మీద నువ్వా నేనా అన్నట్టుగా తలపడనున్నారు. అది ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ అంచనాలతోనే నేను వార్-2 రైట్స్ తీసుకున్నాను. ఎన్టీఆర్ పాత్ర నిడివి తక్కువ ఉంటుందని, 45 నిమిషాలే కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. అందులో వాస్తవం లేదు. ఇద్దరు హీరోల పాత్రలు సమానంగా ఉంటాయి. ఎన్టీఆర్ రోల్ అదిరిపోతుంది, ఇక ఇంట్రడక్షన్ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది." అని నాగవంశీ చెప్పుకొచ్చారు.   అలాగే ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ భారీ మైథలాజికల్ ఫిల్మ్ పట్టాలెక్కనుంది. ఈ ప్రాజెక్ట్ గురించి కూడా నాగవంశీ స్పందించారు. ఎన్టీఆర్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని, 2026 ద్వితీయార్థంలో సినిమా మొదలవుతుందని అన్నారు. రామాయణ అనౌన్స్ మెంట్ ను మించేలా భారీస్థాయిలో అధికారికంగా ప్రకటించాలని ప్లాన్ చేస్తున్నట్లు నాగవంశీ తెలిపారు.  
Trivikram Srinivas, one of the biggest directors of Telugu Cinema, is going to direct a mythological cinema for the first time. The movie stars NTR as Lord Murugan/ Karthikeya Swami in the film. The movie official announcement has not been announced yet and producer Naga Vamsi revealed important details about it.  Naga Vamsi stated that Trivikram Srinivas has been continuously completing the pre-production works. He further stated that the director is going to start his next with Venkatesh in August and it could release in Summer. And for now, they are planning to start NTR - Trivikram film shoot in second half of 2026.  He stated that they are planning to announce the movie in a bigger way than Ramayana. He remarked that Ramayana has become a new benchmark for gradoise and hence, they have decided to not rush but plan it in a big way. The movie will be special and have heavy VFX, CG works, so they will not rush into completion for this movie.  The producer has clarified many doubts about the film and timelines with these revelations. He further stated that WAR 2, releasing on 14th August, will be on next level and the action sequences are huge for any Indian film. Naga Vamsi remarked that NTR's character and action sequences will shock and surprise audiences.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
Coolie starring Superstar Rajinikanth, King Nagarjuna, Upendra, Aamir Khan, Satyaraj, Soubin Shahir, Shruti Haasan has been making all the headlines. The movie is set for a huge release on 14th August and director Lokesh Kanagaraj interacted about the film with a famous journalist Anupama Chopra.  He stated that each star has a high moment in the film and no one has asked him to change the script. He stated that they have locked the script before going to shoot and gave a reading to each one of them. Only after everyone expressed their readiness, he took it to sets.  Lokesh further revealed that he was shocked that Rajinikanth okayed it in first narration. He stated that Rajinikanth accepted to be part of the film by the end of first half narration. But he remarked that it was hard to convince Nagarjuna to play an antagonist role. He stated that Nag took 4 months and 7 narrations to accept. He stated that he needed to convince Nagarjuna for long as it was the first time, the big star is playing an antagonist. He further remarked that he wouldn't have approached so many stars if they did not have the necessity in the script. Well, he further said that Nag had maximum fun and shocked himself on sets.  Well, Anirudh Ravichander has already set the ball rolling with Chikitu Vibe, Monica songs along with Coolie Powerhouse glimpse. Lokesh has revealed that he is not sure about Rs.1000 crores box office collection but he stated that it will give money's worth entertainment to audiences for their ticket price.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
  దర్శకధీరుడు రాజమౌళి మెజారిటీ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా సెంథిల్ కుమార్ వర్క్ చేస్తుంటాడు. దర్శకుడిగా రాజమౌళి ఇప్పటిదాకా 12 సినిమాలు చేస్తే.. అందులో 8 సినిమాలకు సెంథిలే డీఓపీ కావడం విశేషం. అలాంటిది ప్రస్తుతం మహేష్ బాబుతో రాజమౌళి రూపొందిస్తున్న భారీ చిత్రానికి సెంథిల్ వర్క్ చేయట్లేదు. దీంతో రాజమౌళి-సెంథిల్ మధ్య గొడవలు జరిగాయని, అందుకే సెంథిల్ ను పక్కన పెట్టారని ప్రచారం జరిగింది. తాజాగా ఈ అంశంపై సెంథిల్ స్పందించారు.   జూనియర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్-రాజమౌళి ప్రాజెక్ట్ చేయకపోవడంపై సెంథిల్ స్పందించారు. "రాజమౌళి గారు వేరే సినిమాటోగ్రాఫర్ తో వర్క్ చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా వేరే వాళ్ళతో వర్క్ చేశారు. మర్యాదరామన్నకి రామ్ ప్రసాద్ గారు, విక్రమార్కుడుకి సర్వేశ్ గారు పని చేశారు. అన్ని సినిమాలు కలిసి చేయాలని లేదు. కొన్ని సినిమాలకు కొత్తగా ట్రై చేయాలనుకుంటారు. అది చాలా సాధారణ విషయం. అందరూ ఊహించుకుంటున్నట్టు ఏమీ జరగలేదు." అని సెంథిల్ చెప్పుకొచ్చారు.   కాగా, 'బాహుబలి-1' విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల మూవీ టీం రీ యూనియన్ అయింది. ఆ రీ యూనియన్ కి సెంథిల్ కూడా వచ్చారు. దాంతోనే రాజమౌళి-సెంథిల్ మధ్య బాండింగ్ ఎప్పటిలాగే మంచిగా ఉందని క్లారిటీ వచ్చేసిందని చెప్పవచ్చు.  
తెలుగు, తమిళ చిత్రసీమలో విశేష ప్రేక్షకాదరణ కలిగిన యాక్షన్ హీరో విశాల్(Vishal). అంతే స్థాయిలో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో లవ్ అండ్ ఫ్యామిలీ చిత్రాలకి పెట్టింది పేరు సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్ బి చౌదరి(Rb choudary). ఇప్పుడు ఈ ఇద్దరి  కాంబోలో ఒక మూవీ రూపుదిద్దుకోనుండటంతో, అభిమానులతో పాటు ప్రేక్షకులలో సదరు చిత్రంపై ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్  పూజా కార్యక్రమాలతో నిన్న చెన్నైలో ఎంతో అట్టహాసంగా  ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతో పాటు ప్రముఖ హీరోలు కార్తీ, ఆర్ బి చౌదరి కొడుకు జీవా పాల్గొని మూవీ విజయం సాధించాలని కోరుకున్నారు. విశాల్ నుంచి వస్తున్న ఈ 35 వ చిత్రంలో వేట్టయ్యన్, రాయన్ చిత్రాల ఫేమ్ 'దూషారా విజయన్'(Dushara Vijayan)హీరోయిన్ గా చేస్తుండగా, రవి అరసు దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. గతంలో రవి నుంచి ఐంగారన్, ఈట్టి వంటి విభిన్న కథాంశంతో  కూడిన చిత్రాలు వచ్చాయి. పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)కెరీర్ లో ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన 'సుస్వాగతం'తో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన 'ఆర్ బి చౌదరి', ఆ తర్వాత రాజా, సూర్యవంశం, నిన్నే ప్రేమిస్తా, నువ్వు వస్తావని, అన్నవరం, ప్రియమైన నీకు, సింహరాశి, శివరామరాజు, సంక్రాంతి, గోరింటాకు, రచ్చ, గాడ్ ఫాదర్ వంటి పలు చిత్రాలని నిర్మించారు. విశాల్ తో నిర్మిస్తున్న కొత్త  చిత్రం సూపర్ గుడ్ కి తమిళ, తెలుగు భాషల్లో కలిపి 99 వ చిత్రం. విశాల్  ఈ సంక్రాంతికి  'మదగజరాజ'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.        
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
నేటి జనరేషన్ లో  యువ జంటలలో విడాకులు తీసుకోవడం పద్దతి వేగంగా పెరుగుతోంది. గతంలో వివాహం చేసుకుంటే జీవితాంతం కలిసుండేవారు. కానీ ఇప్పుడు చాలా జంటలు వివాహం అయిన కొన్ని సంవత్సరాలు, నెలల తర్వాత విడిపోవాలని నిర్ణయించుకుంటున్నారు. తాజాగా బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్,  పారుపల్లి కశ్యప్   విడిపోతున్నట్లు ప్రకటించారు. 7 సంవత్సరాల వివాహ బంధాన్ని ఇంతటితో ముగిస్తున్నట్టు స్పష్టం చేశారు. కేవలం సెలబ్రిటీలే కాదు.. నేటి కాలంలో సాధారణ కుటుంబాలలో కూడా వివాహం తర్వాత విడాకుల తంతు చాలా ఎక్కువగానే జరుగుతోంది.  యువ జంటలు విడిపోవడానికి అనేక సామాజిక, మానసిక,  ఆచరణాత్మక కారణాలు ఉండవచ్చు. అలాంటి 5 ప్రధాన కారణాలు తెలుసుకుంటే..  సహనం  ఓర్పు.. నేటి యువ జంటలలో  మునుపటి కాలంతో పోలిస్తే సహనంలో చాలా లోపాలు కలిగి ఉన్నారు. చిన్న సమస్యలకు వాదించుకోవడం,  దానిని పరిష్కరించుకోవడానికి  బదులుగా సంబంధాన్ని వదిలివేయడం ఒక సాధారణ ధోరణిగా మారింది. గొడవ నుండి పారిపోవాలనే ధోరణి కారణంగా బార్యాభర్తల మధ్య విడాకుల సమస్యకు దారితీస్తోంది.  స్వేచ్ఛ,  సెల్ఫ్ స్పేస్.. నేటి యువకులు ఎక్కువ స్వేచ్ఛ,  పర్సనల్ స్పేస్ కావాలని  కోరుకుంటారు. వివాహం తర్వాత, భాగస్వామి యొక్క అంచనాలు వారి స్వేచ్ఛకు అడ్డంకిని సృష్టిస్తే వారు దానిని తట్టుకోలేక విడాకులు తీసుకోవడం లేదా విడిపోయే మార్గాన్ని ఎంచుకోవడం చేస్తున్నారు. కెరీర్,  ఆర్థిక ఒత్తిడి.. పెరుగుతున్న పోటీ, కెరీర్ గురించి ఆలోచనలు,  ఆర్థిక అస్థిరత కారణంగా యువ జంటలు మానసికంగా ఒత్తిడికి గురవుతారు. ఈ ఒత్తిడి సంబంధాలను ప్రభావితం చేస్తుంది.  కొన్నిసార్లు పరస్పర అవగాహన లేకపోవడం జరుగుతుంది. సోషల్ మీడియా,  బాహ్య ప్రభావాలు.. సోషల్ మీడియాలో కనిపించే ఆదర్శ జీవితం,  గ్లామర్ జంటలలో తప్పుడు అంచనాలను ఏర్పరుస్తాయి. వారు తమ సంబంధాన్ని ఇతరులతో పోల్చుకుంటారు. ఇది అసంతృప్తికి,  భార్యాభర్తల మధ్య  దూరం ఏర్పడటానికి  దారితీస్తుంది. కమ్యూనికేషన్ గ్యాప్,  భావోద్వేగ సంబంధం లేకపోవడం.. సంబంధాలకు కమ్యూనికేషన్ అతిపెద్ద పునాది. కానీ భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ తగ్గడం ప్రారంభించినప్పుడు, అపార్థాలు పెరుగుతాయి. ఇది కాకుండా ఎమోషనల్ బాండింగ్ కూడా చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ సంబంధం లేకపోవడం కూడా సంబంధం విచ్ఛిన్నానికి దారితీస్తుంది.                       *రూపశ్రీ.
ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇప్పుడు పాలసీ అనేది కామన్ అయిపోయింది. ఏ రోజు సంపాదన ఆరోజు సరిపోయి ఏదో జీవితం అట్లా సాగుతున్నవాళ్ళు తప్ప పేదల నుండి, మధ్యతరగతి, ధనవంతుల వరకు ఈ పాలసీలలో మునిగి తేలుతున్నారు. ఇంకా చెప్పాలంటే మధ్యతరగతి వారి మీదనే ఈ పాలసీ సంస్థలు కూడా నడుస్తున్నాయంటే కాస్త ఆశ్చర్యం వేస్తుంది. ధనవంతులకు ఈ పాలసీలు ఉన్నా లేకపోయినా ఏమి సమస్య లేదు. పెద్దలు వెనుకేసిన ఆస్తులు, బ్యాంక్ బ్యాలెన్సులు, వ్యాపార లాభాలు వంటివి సమృద్ధిగా ఉండటం వల్ల వారికి పాలసీల గురించి పెద్ద ఆసక్తి కూడా తక్కువే.  అయితే వ్యక్తి నుండి వాహనాలకు, వస్తువులకు, ఇళ్లకు, సంస్థలకు ఇన్సూరెన్స్ చేయించడం అనేది మొదలయ్యాక ఈ ధనవంతులు కూడా వీటితో బాగానే ప్రయోజనాలు పొందుతున్నారు. ఇకపోతే చాలా చోట్ల చాలా కుటుంబాలలో కనిపించే అతి సాధారణ సమస్య ఒకటుంది. శ్రీరామ్ చిట్స్ ఎల్.ఐ.సి హెచ్.డి.ఎఫ్.సి ఇంకా ఇంకా వివిధరకాల బోలెడు సంస్థలు ఎన్నో ఇన్సూరెన్స్ లు అందిస్తున్నాయి. వీటిలో పాలసీలు తీసుకుని వాటిని కడుతున్న వారిలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు అధికంగా ఉంటాయి. అయితే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్య పాలసీ చెల్లింపు గడువు రాగానే పైసల కోసం వెతుక్కోవడం. నిజానికి ఈ పాలసీలు కట్టడం మొదలుపెట్టినప్పుడు తప్ప మిగిలిన సందర్భాలలో డబ్బు సమకూర్చుకోవడం కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనిక్కారణం సరైన ప్లానింగ్ లేకపోవడమే అనేది చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. సగటు మధ్యతరగతి వ్యక్తి ఆరు నెలలకు ఒకసారి మూడువేల రూపాయల పాలసీ కట్టడానికి నిర్ణయించుకుంటే అతడి నెలవారీ సంపాదనలో ఐదువందల రూపాయలను పక్కన పెడుతుండాలి. ఆ ఆరు నెలల మొత్తం పాలసీ చెల్లింపును ఎలాంటి ఆందోళన లేకుండా చేస్తుంది. కానీ మధ్యతరగతి వాళ్ళు ఈ విషయం గూర్చి ఎక్కువ ఆలోచించరు. తీరా చెల్లింపు గడువు ముందుకొచ్చినప్పుడు అప్పు చేసో లేక వేరే చెల్లింపుల నుండి దీనికి డబ్బు మరల్చడమో చేస్తుంటారు. ఫలితంగానే ఒకవైపు ఇన్సూరెన్స్ లు కడుతూ మరోవైపు అప్పులు చేస్తూ ఉంటారు. ఇదీ సగటు మధ్యతరగతి పాలసీదారుని పితలాటకం. హెల్త్ ఇన్సూరెన్స్ లు వచ్చినప్పటి నుండి ఓ ఆలోచన పురుగులా మెదడును తొలిచేది. చావుకు అగ్రిమెంట్ రాసుకున్నట్టు చస్తే ఆ ఇన్సూరెన్స్ తాలూకూ డబ్బులు బోల్డు వస్తాయని కదా ఇవన్నీ అని. కానీ నిజానికి  పేద, మధ్యతరగతి వ్యక్తులు ఎప్పుడూ ఇంతే కదా కుటుంబచట్రంలో ఇరుక్కుపోయిన జీవులు కదా అనిపిస్తుంది. ఇకపోతే ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఇలాంటి ఆలోచనలు చేసే మధ్యతరగతి జీవుల వల్ల హాయిగా తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నాయి.  సంవత్సరంలో ఈ పాలసీలు కట్టాలనే కోణంలో తమ సంతోషాలు కూడా వధులుకుంటున్న మధ్యతరగతి కుటుంబాలు కోకొల్లలు ఉన్నాయి. మనిషికోక పాలసీ, కానీ సంపాదన ఒకే ఒకరిది. ఇబ్బందులున్నా కట్టడానికే ముందుకు వెళ్తారు. కారణం భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉండటమే.  పాలసీలతో జాగ్రత్త! కొందరుంటారు. ఈ పాలసీ సంస్థలలో పనిచేసే ఎంజెంట్లు. వీళ్ళు పాలసీలు తీయించడం, డబ్బులు వసూలు చేయడం పనిగా చేస్తుంటారు. అదే వారి ఉద్యోగం కూడా. అయితే పాలసీ తీయించేటప్పుడు 90% మంది ఆ పాలసీ వల్ల లాభాలు మాత్రమే చెబుతారు. కానీ దాని వల్ల వచ్చే నష్టాలు ఎవరూ ఏమీ చెప్పరు. చివరకు దానివల్ల ఏదో ఒక నష్టం ఎదురయ్యే దాకా దాని గురించి పాలసీదారుడికి తెలియదు కూడ. ఇలాంటి సంఘటనలు బోలెడు జరుగుతూ ఉంటాయి. సగటు మధ్యతరగతి ఒక సంస్థమీద ఎంతకని పోరాడతాడు. కాబట్టి ఒకటికి బట్టి నాలుగైదు సార్లు తిరుగుతాడు, ఆ తరువాత మోసం చేసిన వాడి నాశనం వాడిదే  అనుకుని కొన్నిరోజులు బాధపడి తిరిగి జీవితమనే పోరాటంలో పడిపోతాడు. కానీ నిజానికి ఆ సంస్థవాడు హాయిగా తన వ్యాపారాన్ని పెంచుకుంటూ ఉంటాడు. కాబట్టి పాలసీ తీసుకునేటప్పుడు అందులో ప్లస్ పాయింట్స్ మాత్రమే కాదు మైనస్ పాయింట్స్ ఏంటి అనేది మొదట అందరూ తెలుసుకోవాలి. పైన చెప్పుకున్న విషయమంతా చదివాక పాలసీ అంటే భరోసా ఇవ్వాలి కానీ అది చిరాకు పెట్టించేదిగా ఉండకూడదని అందరికీ ఆర్గమయ్యే ఉంటుందనుకుంటా! ◆ వెంకటేష్ పువ్వాడ  
అబ్బాయి అయినా, అమ్మాయి అయినా.. ప్రతి ఒక్కరూ పరిపూర్ణ భాగస్వామి కావాలని కోరుకుంటారు. అలా కోరుకున్నప్పటికీ కొంతమందికి వారి హృదయాలను ముక్కలు చేసే భాగస్వాములు  జీవితంలోకి వస్తుంటారు.  ఇలాంటి పరిస్థితిలో హృదయంతో పాటు, మనస్సును కూడా  చురుగ్గా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. తద్వారా ఫెయిల్యూర్ ఎదురైనప్పుడు, భాగస్వామి సరిగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి, వారి విషయంలో తీసుకునే నిర్ణయాలు తప్పా, ఒప్పా అనే విషయం ఆలోచించుకోవడానికి అవకాశం ఉంటుంది.  చాలా సార్లు ప్రేమ గా ఉన్నప్పుడు ఎదుటివారు ఏదైనా తప్పు చేసినా సరే.. ఆ తప్పులను  విస్మరిస్తుంటారు. అలా తప్పులను పట్టించుకోకపోవడం అనేది సరైనదే.. కానీ అన్నిసార్లు అది సరైనది కాదు.  మగవాళ్లలో ఉండే మూడు లక్షణాలు పైకి చెప్పుకొన్నంత సాధారణమైని కావు. ఇవి అమ్మాయిల జీవితాలను నరకప్రాయంగా మారుస్తాయి.  అబ్బాయిలలో ఉండే అలాంటి లక్షణాలు ఏంటి తెలుసుకుంటే.. నియంత్రణ.. కొంతమంది అబ్బాయిలు నియంత్రణ స్వభావం కలిగి ఉంటారు. వారు ప్రతి విషయంలోనూ భార్యలను  నియంత్రించాలని కోరుకుంటారు. ఇది అబ్బాయిలలో పెద్ద చెడు లక్షణం.  భర్త భార్యను   ప్రతిదానిలోనూ నియంత్రిస్తుంటే..  ఏమి ధరించాలి, ఎవరితో మాట్లాడాలి, ఎక్కడికి వెళ్లాలి, ఏమి తినాలి? ఇలాంటివి అనిపిస్తుంటే అప్పుడు  అమ్మాయిల ఆలోచన  ఎలా అనిపిస్తుంది? ప్రారంభంలో, అలాంటి స్వభావం మంచిగా అనిపించవచ్చు. కానీ క్రమంగా  అలాంటి సంబంధంలో ఉక్కిరిబిక్కిరి అవుతారు. ఇలా  నియంత్రించడం ప్రేమ లేదా శ్రద్ధ కాదు, అది  బలవంతం. అలాంటి భాగస్వాములు భార్యల నమ్మకాన్ని నాశనం చేస్తారు.  దీని కారణంగా  క్రమంగా తమను తాము కోల్పోయామని అమ్మాయిలు బాధపడతారు. టే, ఏమి ధరించాలి, ఎవరితో మాట్లాడాలి, ఎక్కడికి వెళ్లాలి, ఏమి తినాలి? అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ప్రారంభంలో, అలాంటి స్వభావం మంచిగా అనిపించవచ్చు. కానీ క్రమంగా మీరు అలాంటి సంబంధంలో ఉక్కిరిబిక్కిరి అవుతారు. ప్రకృతిని నియంత్రించడం ప్రేమ లేదా శ్రద్ధ కాదు, బలవంతం. అలాంటి భాగస్వాములు మీ విశ్వాసాన్ని నాశనం చేయవచ్చు, దీని కారణంగా మీరు క్రమంగా కోల్పోయినట్లు అనిపించడం ప్రారంభిస్తారు. ప్రతి విషయంలోనూ తాము సరైనవారని నిరూపించుకునే అలవాటు.. అబ్బాయిలు ఏ విషయంలో అయినా, ఎలాంటి పరిస్థితిలో అయినా, వారివైపు ఎలాంటి తప్పిదం ఉన్నా సరే.. వారు ఏ పోరాటంలోనైనా, చర్చలోనైనా లేదా సంభాషణలోనైనా తమ తప్పులను చూడరు. వారు ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించరు. అలాంటి వ్యక్తులు తమ సొంత మాటలను మాత్రమే సరైనవిగా భావిస్తారు.  వాటిపై చర్య తీసుకోవడానికి ఇష్టపడతారు. ఇలాంటి వ్యక్తులతో జీవితం నరకం.  అలాంటి వ్యక్తులు మానసికంగా పరిణతి చెందరు. అలాంటి వ్యక్తితో జీవించడం చాలా నిరాశకు గురి చేస్తుంది. అమ్మాయిలు కోరుకునే అందమైన జీవితం ఇవ్వడంలో ఇలాంటి అబ్బాయిలు కంప్లీట్ గా ఫెయిల్ అవుతారు. అలాంటి వ్యక్తి  మానసిక ఆరోగ్యాన్ని కూడా పాడు చేసే అవకాశం ఉంది. అతిగా అనుమానించే అబ్బాయిలు.. భార్యలను అనుమానించే భర్తలు చాలానే ఉంటారు.  ఇలా అతిగా అనుమానించే భర్తలు భార్యలకు నరకం పరిచయం చేస్తారు. భాగస్వామి గురించి కొంచెం ఆందోళన చెందడం సరే, కానీ ప్రతిదానిపైనా సందేహం లేదా అసూయ కలిగి ఉండటం చాలా తప్పు. అలాంటి అబ్బాయిలకు తమ భాగస్వామి స్నేహంతో సమస్యలు మొదలవుతాయి.  చేసే ప్రతి పనికి  అనుమానంగా చూస్తారు. అలాంటి సంబంధం నెమ్మదిగా పాయిజన్ గా  మారుతుంది.                                *రూపశ్రీ.  
  వర్షాకాలం చాలామందికి బాగా ఇష్టంగా ఉంటుంది.  వాతావరణం బాగా చల్లగా ఉంటుందనే కారణంతో దీన్ని ఇష్టపడతారు. అయితే వర్షాకాలం విషజ్వరాలను,  వైరల్ ఇన్ఫెక్షన్లను మోసుకొచ్చే కాలం. ఈ కాలంలో విషజ్వరాలు స్వైర విహారం చేస్తాయి. అందుకే ఈ సీజన్ మార్పుకు అనుగుణంగా అలవాట్లు మార్చుకోవాలి.  జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా విషజ్వరాలలో డెంగ్యూ ప్రముఖమైనది. లో ప్లేట్ లెట్ ల కౌంట్ తగ్గుతుంది. ప్లేట్‌లెట్ కౌంట్ 10,000 కంటే తక్కువగా ఉంటే, దానిని పెంచాల్సిన అవసరం ఉంటుంది. వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లను నివారించడానికి ఆహారం,  శుభ్రమైన నీటిని మాత్రమే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.   త్రాగే నీరు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. నీరు స్వచ్చంగా లేవని అనిపిస్తే  వాటిని మరిగించి చల్లార్చి తీసుకోవాలి. వర్షాకాలంలో ఫ్లూ ఎక్కువగా వస్తుంది. దీనివల్ల జ్వరం,  శరీర నొప్పులు వస్తాయని ఆయన అన్నారు. దీనితో పాటు జ్వరం చాలా ఎక్కువగా ఉండి, తలనొప్పి నిరంతరంగా ఉంటే డెంగ్యూ వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు నాలుగు నుండి ఐదు గంటల్లోపు మందులు తీసుకున్న తర్వాత జ్వరం తగ్గితే, మలేరియా వచ్చే ప్రమాదం పెరుగుతుందని వైద్యులు అంటున్నారు.  నీటి ద్వారా సంక్రమించే వ్యాధులలో  టైఫాయిడ్, విరేచనాలు, డెంగ్యూ, మలేరియా వంటివి ముఖ్యమైనవి. వాటిని నివారించడానికి  ఎల్లప్పుడూ మరిగించి చల్లార్చిన లేదా  ఫిల్టర్ చేసిన  నీటిని తాగాలి.  నీటి పాత్రను శుభ్రంగా ఉంచుకోవాలి. నీటి పాత్ర మీద ఎల్లప్పుడూ కప్పి ఉంచాలి.  తినడానికి ముందు,  తిన్న తర్వాత, మలవిసర్జన చేసిన తర్వాత  నీటిని తాకే ముందు సబ్బుతో చేతులు బాగా కడుక్కోవాలి. పిల్లలు  క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం అలవాటు చేసుకోవడం మంచిది. ఎందుకంటే వాళ్లు ఆటల నేపథ్యంలో చేతులను ఉపయోగించే విధానం వేరుగా ఉంటుంది. ఆహారం ఎప్పుడూ బాగా ఉడికినదై ఉండాలి.  పచ్చి లేదా సగం ఉడికించిన ఆహారాన్ని నివారించాలి. పండ్లు,  కూరగాయలను తినేముందు శుభ్రమైన నీటితో కడగాలి. బయట ఆహారాన్ని తినడం మానేయడం మంచిది. బావులు, నదులు లేదా చెరువుల దగ్గర మలవిసర్జన చేయవద్దు. నీటి వనరులను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి.  ఇంటి చుట్టూ నీరు పేరుకుపోకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇది దోమలు,  బ్యాక్టీరియా పెరుగుదలకు కారణమవుతుంది. స్థానిక ఆరోగ్య కేంద్రం నుండి నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల గురించి సమాచారం పొందాలి. మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచుకోవాలి.  వీలైనంత వరకు పరిశుభ్రతే శ్రీరామ రక్ష అనే విషయం మరవకూడదు.  ఈ చర్యలు తీసుకోవడం ద్వారా, నీటి ద్వారా సంక్రమించే వ్యాధులను చాలా వరకు నివారించవచ్చు. విరేచనాలు, వాంతులు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.                                    *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..    
  రుతుపవనాలు వచ్చాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. అయితే, వర్షాకాలం వచ్చిన వెంటనే, ఆరోగ్య సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది. ఈ వర్షాకాలంలో ఆరోగ్య రక్షణ కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.  వాటిలో రాగి పాత్రలో నిల్వ చేసిన నీరు తాగడం ఒకటని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  రాగి పాత్రలో ఉంచిన నీరు ఈ సీజన్‌లో ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రాగి నీరు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, అనేక వ్యాధుల నుండి కూడా రక్షిస్తుంది. ఇది అమృతం లాంటిది. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. వర్షాకాలంలో నీటి కాలుష్యం ప్రమాదం పెరుగుతుంది, ఇది ఇన్ఫెక్షన్ లకు దారితీస్తుంది. ఇలాంటి పరిస్థితిలో, రాగి నీరు సురక్షితమైన ఆయుర్వేద నివారణ. రాగి యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది నీటిలో ఉన్న హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది,  నీటిని శుద్ధి చేస్తుంది. రాగి పాత్రలోని నీరు స్వచ్ఛమైనది.  శరీరం నుండి విషాన్ని బయటకు పంపి, శరీరాన్ని ఆరోగ్యంగా,  మనస్సును ఉల్లాసంగా ఉంచడంలో సహాయపడుతుంది. రాగి పాత్రలో నీరు త్రాగడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా బలపడుతుంది. ఇది ఆహారాన్ని బాగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది.  మలబద్ధకం, అపానవాయువు,  అజీర్ణం వంటి కడుపు సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. దీనితో పాటు ఈ నీరు మూత్రపిండాల ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.  మూత్రపిండాలు సజావుగా పనిచేయడానికి సహాయపడుతుంది. రాగి పాత్రలోని  నీరు రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది. ఇది వర్షాకాలంలో వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. రాగి నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మానికి కూడా మేలు జరుగుతుంది. ఇది చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది,  ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఆయుర్వేదం కూడా రాగి పాత్రలో నీరు త్రాగమని సిఫార్సు చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం రాగి నీరు శరీరంలోని త్రిదోషాలను (వాత, పిత్త, కఫ) సమతుల్యం చేస్తుంది. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రాగి పాత్రలో నీటిని రాత్రంతా ఉంచి ఉదయం ఖాళీ కడుపుతో త్రాగడం ఉత్తమం.  కానీ పాత్ర తుప్పు పట్టకుండా ఉండటానికి దానిని క్రమం తప్పకుండా శుభ్రపరచడం అవసరం. ఈ చిన్న మార్పుతో వర్షాకాలంలో కూడా నీరు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.                                   *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..  
డయాబెటిస్ రోగులు క్రమం తప్పకుండా రక్తంలో చక్కెరను తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం. దీని సహాయంతో మందులను సక్రమంగా తీసుకుంటూ ఉండటమే కాకుండా ,  ఆహారాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి,    తీవ్రమైన సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది. ఈ రోజుల్లో చాలా మంది ఇంట్లో గ్లూకోమీటర్‌తో చక్కెర స్థాయిని తనిఖీ చేసుకుంటూ ఉంటారు.  ఇది ఆరోగ్యానికి మంచిదే.  కానీ చాలాసార్లు ఈ పరీక్ష తప్పుగా జరుగుతోందని డయాబెటిస్ నిపుణులు అంటున్నారు.  దీని కారణంగా రీడింగ్ కూడా తప్పుగా వస్తుంది. ఇంట్లో రక్తంలో చక్కెరను తనిఖీ చేసేటప్పుడు  చాలామంది చేస్తున్న తప్పులేంటి? వాటిని ఎలా నివారించాలి?తెలుసుకుంటే.. చేతులు కడుక్కోకపోవడం.. చాలా మంది చేతులు కడుక్కోకుండానే పరీక్షలు చేసుకుంటారు. చెమట, నూనె లేదా చేతులపై చిన్న ఆహారం ముక్క కూడా తప్పుడు రీడింగ్ ఇస్తుంది. అందువల్ల, రక్తంలో చక్కెరను తనిఖీ చేసే ముందు ఎల్లప్పుడూ  చేతులను సబ్బుతో కడుక్కోవాలి.  చేతులు పూర్తీగా ఆరిన తరువాత పరీక్ష చేసుకోవాలి.   వేలు గుచ్చడానికి ప్రతిసారీ ఒకే వేలును ఉపయోగించడం.. ప్రతిసారీ ఒకే ప్రదేశం నుండి రక్తాన్ని తీయడం వల్ల అక్కడి చర్మం కఠినంగా మారుతుంది. దీని వల్ల  రక్తాన్ని తీయడం కష్టమవుతుంది. వేళ్లను మారుస్తూ ఉండాలి.  ఒకే వేలును పదే పదే ఉపయోగించకూడదు. పాత స్ట్రిప్స్ వాడకం.. టెస్ట్ స్ట్రిప్స్ కు గడువు తేదీ ఉంటుంది. చాలా సార్లు  పాత లేదా తేమతో కూడిన స్ట్రిప్స్ వాడతారు. ఇది తప్పు రీడింగ్ లను ఇస్తుంది. స్ట్రిప్స్ ను ఎల్లప్పుడూ పొడి,  చల్లని ప్రదేశంలో ఉంచాలి.  అలాగే  గడువు తేదీని తనిఖీ చేసుకుంటూ ఉండాలి. రక్త నమూనా తీసుకోవడానికి ఎక్కువ ఒత్తిడి తీసుకురావడం.. కొన్నిసార్లు రక్తం బయటకు రానప్పుడు,  వేలిని చాలా గట్టిగా నొక్కుతారు, ఇది కణజాల ద్రవాన్ని రక్తంతో కలిపి రీడింగ్‌ను ప్రభావితం చేస్తుంది. మృదువుగా  గుచ్చాలి.  అవసరమైతే చేతిని కొద్దిగా రబ్ చేయాలి,  లేదా క్రిందికి వంచాలి. తప్పు సమయంలో తనిఖీ చేయడం.. ఖాళీ కడుపుతో, భోజనం చేసిన 2 గంటల తర్వాత లేదా నిద్రపోయే ముందు రక్తంలో చక్కెరను తనిఖీ చేయడానికి సరైన సమయం. తప్పు సమయంలో తనిఖీ చేయడం వల్ల నివేదిక గందరగోళంగా మారే అవకాశం ఉంటుంది. ఇది తీసుకునే ఆహారం గురించి, వాడాల్సి మందుల గురించి కూడా గందరగోళం క్రియేట్ చేస్తుంది.                                 *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..