LATEST NEWS
బ్యాంకింగ్ నిబంధనలు ప్రజలకు సాయపడాలి కానీ, వారిని క్షోభకు గురిచేయకూడదు. కానీ ఒడిశాలో ఓ బ్యాంకు అధికారుల మొండితనం ఒక వ్యక్తిని తన సోదరి సమాధిని తవ్వి ఆమె అస్థిపంజరాన్ని బ్యాంకు గడపకు తీసుకువచ్చేలా చేసింది.  అసలేం జరిగిందంటే.. ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై  వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు. అయితే అందుకు అధికారులు అంగీకరించలేదు. బ్యాంకులో సొమ్ము విత్ డ్రా చేయాలంటే.. ఖాతాదారుడు స్వయంగా వచ్చి తీరాలన్నారు. అలా రాలేని పక్షంలో సంతకం, లేదా వేలిముద్రకావాలని చెప్పారు.  తన సోదరి చనిపోయిందని, ఆమె రాలేదని  ఆ వ్యక్తి బ్యాంకు అధికారుల కాళ్లావేళ్లా పడినా ఫలితం లేకపోయింది. డెత్ సర్టిఫికేట్ ఉందని చెప్పినా బ్యాంకు అధికారులు వినకపోవడంతో..  తీవ్ర మనస్తాపానికి గురైన ఆ వ్యక్తి సంచలన నిర్ణయం తీసుకుని అమలు చేశాడు. బ్యాంకు నుంచి నేరుగా తన సోదరిని పూడ్చిపెట్టిన సమాధి వద్దకు వెళ్లాడు. ఆమె సమాధిని తవ్వి ఆమె అవశేషాలను (అస్తిపంజరం) వెలికి తీసి..మోసుకుంటూ మూడు కిలోమీటర్లు నడిచి బ్యాంకుకు వచ్చాడు. బ్యాంకు అధికారులకు తన సోదరి అస్తిపంజరాన్ని చూపుతూ.. ఆమె వచ్చింది.. ఇప్పుడు డబ్బులు ఇవ్వండంటూ డిమాండ్ చేశాడు.   ఈ సంఘటన అందరి చేతా కన్నీళ్లు పెట్టించింది.  వివరాలిలా ఉన్నాయి.. కియోన్‌ఝర్‌ జిల్లాలోని దియానాలి గ్రామానికి చెందిన గిరిజనుడు జితు ముండా సోదరి కక్రా ముండా రెండు నెలల క్రితం మరణించింది. ఆమె భర్త, ఏకైక సంతానం కూడా ముందే చనిపోవడంతో జితు ఒక్కడే ఆమెకు దగ్గరి బంధువుగా మిగిలాడు. కక్రా పేరు మీద మల్లీపసిలోని ఒడిశా గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉండగా, అందులో రూ.19,300 ఉన్నాయి. ఆ సొమ్ము తీసుకునేందుకు జితు ముండా బ్యాంకుకు వస్తే.. అధికారులు  నిబంధనల ప్రకారం అడ్డు చెప్పారు. ఈ ఘటనపై నెటిజనులు బ్యాంకు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగితాలకే విలువఇస్తూ మానవత్వాన్ని మరిచారని దుమ్మెత్తి పోస్తున్నారు. 
వైసీపీ సోషల్ మీడియా విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సోషల్ మీడియా వేదికగా జరిగిన దాడులు, అసభ్యకర పోస్టుల వెనుక ఉన్న ఆర్థిక మూలాల గురించి పోలీసులు సజ్జల భార్గవ్‌రెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు. ముఖ్యంగా ఈ కార్యకలాపాలకు నిధులు ఎక్కడి నుండి వచ్చాయి? ఈ నెట్‌వర్క్‌ను నడపడానికి ఎవరెవరు సహకరించారు? అనే కోణంలో దర్యాప్తు సాగింది.  విచారణ సమయంలో పోలీసులు ముఖ్యంగా నిధుల వ్యవహారంపై ఆరా తీశారు. సోషల్ మీడియా వింగ్ నడపడానికి భారీ మొత్తంలో ఖర్చవుతుందని, ఆ నిధులను ఎవరు సమకూర్చారనేది ఇప్పుడు కేసులో కీలకంగా మారింది.  ఏ1 నిందితుడు వర్రా రవీందర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా భార్గవ్‌రెడ్డిని పోలీసులు ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే విచారణకు సజ్జల భార్గవ్ రెడ్డి సహకరించలేదనీ, చాలా ప్రశ్నలకు ఆయన  తెలియదు, గుర్తులేదు' అని సమాధానమిచ్చినట్లు సమాచారం.ఈ కేసులో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే..  నిందితులు వాడిన పరికరాల గురించి పోలీసులు అడిగిన ప్రశ్నలు. పోస్టులు పెట్టడానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను అప్పగించాలని పోలీసులు కోరగా..  భార్గవ్‌రెడ్డి   నిరాకరించినట్లు తెలుస్తోంది. కోర్టు ఆదేశాలు ఉంటేనే వాటిని ఇస్తానని ఆయన స్పష్టం చేశారని అంటున్నారు. రాజకీయ నేతలను, ముఖ్యంగా మహిళా నేతలను లక్ష్యంగా చేసుకుని చేసిన అసభ్యకర పోస్టుల వెనుక ఎవరి ప్రోద్బలం ఉందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. షర్మిల, విజయమ్మ వంటి వారిపై జరిగిన వ్యక్తిగత దాడుల వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించేందుకు పోలీసులు సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తున్నారు. ఈ పోస్టుల తయారీ మరియు వ్యాప్తి కోసం ప్రత్యేక టీమ్‌లు పనిచేశాయని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో అన్నమయ్య ప్రాజెక్ట్ వంటి సున్నితమైన అంశాలపై కూడా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసుల దర్యాప్తు కేవలం పోస్టులకే పరిమితం కాకుండా, ఆ వ్యవస్థ వెనుక ఉన్న ఆర్థిక వనరులపై కూడా ఫోకస్ పెట్టింది. తదుపరి విచారణలో మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి భార్గవ్‌రెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేసిన పోలీసులు, తదుపరి విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఈ కేసులో మరికొంత మంది వైసీపీ నేతలకు కూడా నోటీసులు అందే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.  
  బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు. త్వరలోనే అన్ని స్థాయిల్లో కొత్త కమిటీలను నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా నియమించబోయే కమిటీలకు శిక్షణా తరగతులు కూడా నిర్వహించనున్నారు. పార్టీ పునర్వ్యవస్థీకరణ బాధ్యతలను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కేసీఆర్ అప్పగించారు. ఈ నిర్ణయాన్ని పార్టీ అంతర్గత సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణపై అవమానకర వ్యాఖ్యలు చేసినప్పుడు… తెలంగాణకు చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు మౌనం పాటించారని విమర్శించారు. “వాళ్లు తెలంగాణలో పుట్టలేదా? తెలంగాణ పౌరుషం లేదా?” అని ప్రశ్నించారు.“ఒక్క బీఆర్ఎస్ ఎంపీ ఉన్నా… క్షమాపణ చెప్పించేవాళ్లం” అని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు స్పందించకపోవడం పౌరుషం లేని వ్యవహారమని విమర్శించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వంపై కూడా కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. గతంలో తెలంగాణను వ్యవసాయం సహా అన్ని రంగాల్లో ముందంజలో నిలబెట్టామని… ఇప్పుడు మాత్రం భూముల కబ్జాలు, కూల్చివేతల్లో నెంబర్ వన్‌గా మార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు.ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం విఫలమైందని… రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రుల తీరు చూస్తే జాలి వేస్తోందని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో జీవన్ రెడ్డిని జనరల్ సెక్రటరీగా ప్రకటించి, కార్యవర్గానికి పరిచయం చేశారు కేసీఆర్.  
తెలంగాణ రాజకీయ యవనికపై  భారత రాష్ట్ర సమితి  అధినేత కే. చంద్రశేఖరరావు తనయ, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల  ఎంట్రీ సంచలనాలకు వేదికైంది. పార్టీ ప్రకటన సందర్భంగా తన కన్నతండ్రిపై ఆమె చేసిన వ్యాఖ్యలు, విమర్శలు హాట్ టాపిక్ గా మారాయి. తండ్రి చాటు బిడ్డగా రాజకీయాలలో ఎదిగిన కల్వకుంట్ల కవిత.. ఇప్పుడు  తండ్రి బాటను వీడి సొంతంగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించడం  చర్చనీయాంశమైంది.  తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పేరుతో సరికొత్త పార్టీని ప్రకటించిన ఆమె, గతంలో తండ్రి స్థాపించిన పార్టీ పేరులోని అక్షరాలనే మళ్ళీ తెరపైకి తీసుకురావడం ఆసక్తిరేకెత్తిస్తోంది. అన్నిటికీ మించి తన తండ్రిని మరమనిషి, గుంటనక్కల చేతిలో బంది అంటూ ఓ రేంజ్ లో విమర్శించడంతో అంతా దీనిపై బీఆర్ఎస్ రియాక్షన్ ఏ స్థాయిలో ఉంటుందా అని ఇసక్తిగా ఎదురు చూశారు. బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.   ముఖ్యంగా కేసీఆర్ మౌనం వ్యూహమా? భయమా అన్న చర్చ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో హాట్ హాట్ గా సాగుతోంది. కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ కవిత వ్యాఖ్యల వెనుక పటిష్టమైన, పకడ్బందీ వ్యూహం ఉందని పరిశీలకులు అంటున్నారు.  అయితే కేసీఆర్ మౌనమే ఇప్పుడు అందరికి అర్ధం కాకుండా పోయింది.  తాజాగా కవిత చేసిన వ్యాఖ్యలపైనే కాదు.. ఆమెను  నుండి కవితను బహిష్కరించిన నాటి నుండి ఇప్పటి  వరకూ కేసీఆర్   ఏ సందర్భంలోనూ తన కుమార్తె గురించి పల్లెత్తు మాట మాట్లాడలేదు.  కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కవిత చేసిన అవినీతి ఆరోపణల నుంచి తనను మరమనిషిగా అభివర్ణించడం వరకూ కవిత ఎంత పరుషంగా మాట్లాడినా కేసీఆర్ మాత్రం మౌనాన్నే ఆశ్రయించారు.  దీంతో కేసీఆర్ మౌనం వ్యూహాత్మక, కన్నబిడ్డ అన్న మమకారమా? అన్న చర్చ జరుగుతోంది.   కేసీఆర్ మౌనం ఇలాగే కొనసాగితే.. రానున్న రోజులలో బీఆర్ఎస్ ఓటు బ్యాంకును కవిత భారీగా చీల్చడం ఖాయమన్న భావన పార్టీ వర్గాలలోనే వ్యక్తమౌతోంది.  
  తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి. ఇక, తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన విజయ్‌ నేతృత్వంలోని టీవీకే ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.  విజయ్‌ పాపులారిటీ, అనూహ్యంగా పెరిగిన పోలింగ్‌, ప్రశాంతంగా ఎన్నికలు ముగియడం వంటి కారణాలతో.. టీవీకే ప్రభావాన్ని అంచనా వేస్తున్నారు. ఇక, విజయ్ తన పార్టీ గెలుపుపై భారీగా ఆశలు పెట్టుకున్నారని.. ఆయన ఏకంగా మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలనే జాబితాను సైతం ఆల్రెడీ సిద్ధం చేశారనే ప్రచారం కూడా జరుగుతోంది.  ఇంత‌కీ ఈ జాబితాలో ఎవ‌రి పేర్లు ఉన్నాయి? అని చూస్తే.. బుస్సీ ఆనంద్. ఈయ‌న‌ టీవీకే జనరల్ సెక్రటరీ. ఈయన విజయ్‌కు అత్యంత సన్నిహితుడు, అంతేనా పార్టీ వ్యవహారాలన్నీ చూసుకునే వ్యక్తి. ఈయనకు అత్యంత కీలకమైన శాఖ- బహుశా హోం లేదా మున్సిపల్ శాఖ.. దక్కే అవకాశం ఉందని అంటున్నారు. ఆదవ్ అర్జున. ఈయన ఎన్నికల వ్యూహకర్తగా పేరుపొందారు. ఈయనకు ఆర్థిక లేదా ఐటీ శాఖల బాధ్యతలు అప్పగించవచ్చని ప్రచారం జరుగుతోంది.కె.ఎ. సెంగోట్టయన్. గతంలో ఏఐఏడీఎంకే లో సీనియర్ మంత్రిగా పనిచేసిన ఈయన, విజయ్ పార్టీలో చేరడంతో ఆయన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక శాఖ ఇచ్చే అవకాశం ఉంది. వేణుగోపాల్, మాజీ ఎంపీ. ఈయనకు కూడా సీనియారిటీ కోటాలో చోటు దక్కవచ్చని సమాచారం. కె.జి. అరుణ్‌రాజ్. పార్టీ సిద్ధాంతకర్త, ప్రచారంలో కీలక పాత్ర పోషించిన ఈయన పేరు కూడా పరిశీలనలో ఉంది.మహిళా కోటా విష‌యానికి వ‌స్తే.. విజయ్ తన మంత్రివర్గంలో మహిళలకు సముచిత స్థానం కల్పించాలని భావిస్తున్నట్లు, ఇందులో భాగంగా విజయలక్ష్మి వంటి మహిళా నేతల పేర్లు వినిపిస్తున్నాయి. కేవలం అనుభవం ఉన్నవారినే కాకుండా, చదువుకున్న యువతను కూడా తన కేబినెట్‌లోకి తీసుకోవాలని విజయ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పేర్లు కేవలం రాజకీయ విశ్లేషకులు, పార్టీ వర్గాల నుంచి అందుతున్న లీకుల ఆధారంగానే ప్రచారంలో ఉన్నాయి. మే 4వ తేదీన వెలువడే ఫలితాల తర్వాతే ఈ జాబితాపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే తొంద‌ర ప‌డి ముందే కూసిన కోయిల‌లు త‌ర్వాత బొక్క బోర్లా ప‌డ్డం  కూడా ఉంది. గ‌త ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైయ‌స్ జ‌గ‌న్ త‌న పార్టీ వ‌ర్గాల వారిని ఒక హైప్ లో ఉంచ‌డానికిగానూ.. ప్ర‌మాణ స్వీకార వేదిక‌, హోట‌ళ్ల బుకింగ్ వంటి ఎన్నో ముంద‌స్తు ఏర్పాట్లు చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. కానీ, అది కాస్తా తుస్సు మ‌న‌డంతో వైసీపీ కార్య వ‌ర్గ‌మంతా  డీలా ప‌డిపోయింది.  అన్న‌ట్టు ఎన్డీయే కూట‌మి చంద్ర‌బాబును త‌మ తెలుగు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా చూపితే, విజ‌య్ తాను జ‌గ‌న్ తో క‌ల‌సి దిగిన ఫోటోల‌ను ప్ర‌ద‌ర్శించారు. ఇప్పుడు చూస్తే ఆయ‌న‌లా ముంద‌స్తు జాబితాలు సిద్ధం చేయ‌డం వంటి హంగామా చూస్తుంటే ఇదేదో తేడాగా ఉందే అన్న అనుమానాలు కూడా వ‌స్తున్నాయ్. ఎందుకంటే ఏ స‌ర్వే కూడా విజ‌య్ కి 10- ప‌దిహేను సీట్ల కంటే ఎక్కువ వ‌చ్చేలా చెప్ప‌లేదు. అందుకే ఈ హంగామా చూస్తుంటే డౌట్ గా ఉందంటున్నారు కొంద‌రు.
ALSO ON TELUGUONE N E W S
భారతీయ చలనచిత్ర చరిత్రలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'నాయకుడు' ఒక మైలురాయి వంటి సినిమా. ముంబై మురికివాడల్లోని ప్రజల కోసం పోరాడే ఒక సామాన్యుడు డాన్‌గా ఎలా ఎదిగాడు అనే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం, నటనకు కొత్త అర్థాన్ని ఇచ్చింది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో, కమల్ హాసన్ పోషించిన శక్తివంతుడైన పాత్ర వేలప్ప నాయకర్, సామాన్యుల భూములను ఆక్రమించుకోవాలని చూసే భూస్వాములు మరియు అక్రమార్కులకు బుద్ధి చెప్పే అద్భుతమైన యాక్షన్ సన్నివేశాన్ని మనం చూడవచ్చు. ఈ వీడియో క్లిప్‌లో ఒక ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించి వివాదం తలెత్తుతుంది. 10 లక్షల పెట్టుబడితో నిర్మిస్తున్న ఫ్యాక్టరీ అని, సామాన్యులకు ఇక్కడ సంబంధం లేదని ధనవంతులు మరియు అధికారులు హెచ్చరిస్తుంటారు. పేదల భూములను అక్రమంగా దక్కించుకుని, అక్కడ నిర్మాణాలు చేపడుతున్న క్రమంలో సేఠ్‌.. అనుచరులతో కలిసి రంగంలోకి దిగుతారు. ప్రభుత్వ పత్రాలను, సీళ్ళను లెక్కచేయకుండా అక్రమంగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని నాయకర్ తనదైన శైలిలో అడ్డుకుంటారు. ఈ సన్నివేశంలో కమల్ హాసన్ నటన అత్యంత సహజంగా ఉంటుంది. మాటల కన్నా ముందే తన చూపులతో, నడకతో గంభీరత్వాన్ని ప్రదర్శిస్తారు. అక్రమ నిర్మాణాలు చేస్తున్న చోటకి చేరుకుని, అక్కడ ఉన్న వస్తువులను ధ్వంసం చేస్తూ, అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తారు. ముఖ్యంగా సెట్ ప్రాపర్టీలను పగలగొడుతూ, అధికారులను నిలదీసే క్రమంలో ఆయన బాడీ లాంగ్వేజ్ అద్భుతంగా ఉంటుంది. ఢిల్లీ గణేష్ మరియు జనగరాజ్ వంటి దిగ్గజ నటులు కమల్ హాసన్ పాత్రకు తోడుగా ఉంటూ ఈ సన్నివేశాన్ని మరింత రక్తికట్టించారు. నాయకర్ చేసే ఈ పోరాటం కేవలం హింస కోసం కాదు, న్యాయం కోసం. భూమిని కోల్పోతున్న పేదల ఆవేదనను చూసి ఆయన స్పందిస్తారు. ఫ్యాక్టరీ యజమాని భయపడుతూ తన పిల్లల మీద ఒట్టు వేసి, తనకు ఆ భూమి వద్దని వేడుకునే స్థాయికి నాయకర్ భయం పుట్టిస్తారు. అక్రమ డాక్యుమెంట్లను బయటకు తీయించి, చెడును అంతం చేసే దిశగా ఈ సీన్ సాగుతుంది. మొత్తానికి, 'నాయకుడు' సినిమాలోని ఈ చిన్న క్లిప్ నేటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఒక నాయకుడు ప్రజల కోసం ఎలా నిలబడాలి అనే దానికి ఈ సన్నివేశం ఒక నిదర్శనం. ఇళయరాజా సంగీతం, మణిరత్నం మేకింగ్ మరియు కమల్ హాసన్ విశ్వరూపం వెరసి ఈ యాక్షన్ సీన్ ఎప్పటికీ మర్చిపోలేనిదిగా నిలిచిపోయింది. క్లాసిక్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ వీడియో ఒక కనువిందు. ఇలాంటి అద్భుత‌మైన వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి. 
    పవన్ కళ్యాణ్(Pawan Kalyan)అభిమాని, బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి చుట్టూ ఇప్పుడు తీవ్రమైన వివాదం ముసురుతోంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి కోట్లాది రూపాయల నగదు, ఆస్తులు వసూలు చేయడమే కాకుండా  ప్రాణహాని తలపెడుతుందంటు ధర్మేంద్ర అనే NRI పోలీసులను ఆశ్రయించడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి తాజాగా కొన్ని ఆడియో క్లిప్పులు బయటకు రావడం మరిన్ని అనుమానాలకి  తావిస్తోంది.   అషు రెడ్డి వాయిస్' నేను తీసుకున్న డబ్బులో కోటిన్నరే ఇస్తాను.  మిగతా డబ్బులు లైఫ్ లో సెటిల్ అవ్వగానే ఇస్తాను. ఈ ప్రాసెస్ కి ఒకే అనకపోతే మా ఇంటికి వచ్చి వేదిస్తున్నావని బెదిరింపుల కేసు పెడతాను. వేణుస్వామి. ప్రవీణ్ అక్క తో కలిసి రాజీ చేసుకుందాం.నీ ముఖం చూడటానికి కూడా నాకు ఇష్టం లేదని వార్నింగ్ లా అషు రెడ్డి మాట్లాడుతున్న మాటలు ఉన్నాయి లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వై.వి. ధర్మేంద్రకు 2018లో అషు రెడ్డితో పరిచయం ఏర్పడింది. అప్పటికే తనకు విడాకులు అయిన విషయాన్ని ఆమెకు చెప్పినప్పటికీ, అషు రెడ్డి అతనితో ప్రేమలో పడిందని, పెళ్లి చేసుకుంటానని నమ్మించిందని బాధితుడు పేర్కొన్నాడు. ఈ క్రమంలో తన వ్యక్తిగత అవసరాలు, విలాసాల కోసం ధర్మేంద్ర నుండి భారీగా డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.  రూ. 9.35 కోట్ల మోసం?ధర్మేంద్ర తండ్రి హైదరాబాద్ సీసీఎస్ (CCS) పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం గత ఐదేళ్లలో సుమారు 5 కిలోల బంగారం, ఖరీదైన కార్లు, నగదు రూపంలో మొత్తం 9.35 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. హైదరాబాద్‌లోని మణికొండ ప్రాంతంలో . 3 కోట్ల విలువైన ఫ్లాట్ కొనుగోలు కోసం ధర్మేంద్రతో రూ. 1.80 కోట్లు కట్టించి, ఆ ఆస్తిని అషు తన పేరు మీద రిజిస్టర్ చేయించుకుందని బాధితుడు ఆరోపిస్తున్నాడు.  బెదిరింపులు మరియు ఆడియో లీక్స్డబ్బులు ఇవ్వడం ఆపివేసి, పెళ్లి గురించి ఒత్తిడి తెచ్చినప్పటి నుండి అషు రెడ్డి ప్రవర్తన మారిందని ధర్మేంద్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తన డబ్బు తిరిగి అడిగితే తప్పుడు కేసులు పెడతానని, ఒక హత్య కేసు నిందితుడితో కలిసి తనను బెదిరిస్తోందని ఆరోపించాడు.  Also read: Toxic: టాక్సిక్ మిస్టరీ.. లేట్ అవ్వడానికి అసలు కారణం ఇదేనా! .అషు రెడ్డి కూడా ధర్మేద్ర ఆరోపణలపై  సోషల్ మీడియావేదికగా స్పందించారు. తనపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని, తన అనుమతి లేకుండా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, నిజం త్వరలోనే బయటకు వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.ముగింపుప్రస్తుతం ఈ హై-ప్రొఫైల్ మోసం కేసును పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. ధర్మేంద్ర సమర్పించిన బ్యాంకు లావాదేవీల రికార్డులు, ఆడియో ఆధారాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఒక సెలబ్రిటీపై ఇంత భారీ మొత్తంలో మోసం ఆరోపణలు రావడం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.   
- గర్భంతో ఉన్నా యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టారు - బాలీవుడ్ బ్యూటీల డెడికేషన్‌కు నెటిజన్లు ఫిదా - అలియా, దీపికా బాటలోనే మెగా కోడలు లావణ్య వెండితెరపై మెరిసే నటీమణులు కేవలం అందచందాలతోనే కాదు, తమ అంకితభావంతోనూ ప్రేక్షకుల మనసు గెలుచుకుంటున్నారు. ఒకప్పుడు హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే లేదా గర్భం దాల్చితే వారి కెరీర్ ముగిసినట్లేనని భావించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. మాతృత్వంలోని మధురిమను ఆస్వాదిస్తూనే, వృత్తి పట్ల తమకున్న బాధ్యతను ఏమాత్రం విస్మరించకుండా షూటింగ్ సెట్స్‌లో చెమటోడుస్తున్నారు నేటి తరం నటీమణులు. దీపికా పదుకొణె నుంచి లావణ్య త్రిపాఠి వరకు ఎంతోమంది భామలు గర్భంతో ఉండి కూడా షూటింగ్‌లలో పాల్గొని తమ డెడికేషన్‌ను చాటుకుంటున్నారు. గ్లోబల్ ఐకాన్ దీపికా పదుకొణె ఈ విషయంలో టాప్ లిస్టులో ఉంటారు. పాన్ ఇండియా వండర్ 'కల్కి 2898 AD' చిత్రంలో ఆమె నటించినప్పుడు గర్భవతి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ సినిమాలో ఆమె పోషించిన సుమతి పాత్ర కూడా గర్భవతిగానే కనిపిస్తుంది. అంటే రీల్ లైఫ్‌లోనూ, రియల్ లైఫ్‌లోనూ ఆమె ఆ అనుభూతిని ఏకకాలంలో అనుభవించారు. తాజాగా అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్టు 'రాక'లో కూడా ఆమె గర్భంతో ఉన్న సమయంలోనే పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఇక బాలీవుడ్ క్యూట్ బ్యూటీ అలియా భట్ సైతం ఏమాత్రం తగ్గలేదు. తన హాలీవుడ్ డెబ్యూ మూవీ 'హార్ట్ ఆఫ్ స్టోన్' షూటింగ్ సమయంలో ఆమె గర్భంతో ఉన్నారు. గర్భిణిగా ఉండి కూడా రిస్క్ ఉన్న యాక్షన్ సీన్లలో పాల్గొని హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్లను సైతం ఆశ్చర్యపరిచారు. అలాగే 'రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ' చిత్రంలోని సాంగ్ షూట్స్ సమయంలో ఆమె చూపిన పట్టుదల నిజంగా ప్రశంసనీయం. తన ప్రొఫెషన్ కోసం ఎంతటి కష్టానికైనా వెనుకాడబోనని అలియా నిరూపించారు. ఈ జాబితాలో మెగా కోడలు లావణ్య త్రిపాఠి కూడా చేరడం విశేషం. టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలైన ఈ అమ్మడు 'సతీ లీలావతి' సినిమా షూటింగ్ సమయంలో గర్భవతిగా ఉన్నారట. సాధారణంగా గర్భం దాల్చిన మొదటి మూడు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తుంటారు. కానీ లావణ్య మాత్రం తన అంకితభావంతో షూటింగ్‌ను పూర్తి చేసి అందరినీ మెప్పించారు. ఈ విషయం తెలిసినప్పటి నుండి మెగా అభిమానులు ఆమె డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. గతంలో కరీనా కపూర్ కూడా ఇదే బాటలో నడిచారు. 'వీరే ది వెడ్డింగ్' మరియు అమీర్ ఖాన్ సరసన నటించిన 'లాల్ సింగ్ చద్దా' సినిమాల షూటింగ్ సమయంలో ఆమె గర్భవతి. అయినప్పటికీ ఆమె వెనకడుగు వేయకుండా తన పార్ట్ షూటింగ్స్ పూర్తి చేశారు. అదేవిధంగా యామీ గౌతమ్ 'ఆర్టికల్ 370' వంటి సీరియస్ సినిమాలో నటిస్తున్నప్పుడే తాను గర్భవతి అనే విషయాన్ని తెలుసుకున్నారు. కానీ షూటింగ్ మధ్యలో ఆపడం ఇష్టం లేక పూర్తి బాధ్యతతో ప్రాజెక్టును కంప్లీట్ చేశారు. ఈ నటీమణులు చేస్తున్న సాహసాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. మాతృత్వం అనేది కెరీర్‌కు బ్రేక్ కాదని, అది ఒక అదనపు బలమని వీరు నిరూపిస్తున్న తీరు పట్ల నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. శారీరక ఇబ్బందులను కూడా లెక్కచేయకుండా వారు ప్రదర్శిస్తున్న ఈ వృత్తి ప్రేమే వారిని నేడు సెలబ్రిటీలుగా నిలబెట్టిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. భవిష్యత్తులో రాబోయే మరిన్ని ప్రాజెక్టులలో వీరిని తెరపై చూడటానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
  ఎంత అర్ధం చేసుకోవాలని అనుకున్నా కొన్ని రహస్యాలు ఎవరకి అర్ధం కానీ పరిస్థితి. యష్ (Yash)వన్ మాన్ షో 'టాక్సిక్'(Toxic)పరిస్థితి కూడా అంతే.కేజీఎఫ్' సిరీస్ తర్వాత యష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో టాక్సిక్ పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే, గత కొంతకాలంగా ఈ సినిమా విడుదల తేదీ విషయంలో జరుగుతున్న మార్పులు అభిమానులకి ఆందోళనకి గురిచేస్తున్నాయి. మొదట మార్చిలో రావాల్సిన ఈ సినిమా, తర్వాత జూన్ 4కి వాయిదా పడింది. ఇప్పుడు మళ్ళీ ఈ చిత్రం వాయిదా పడే అవకాశం ఉందనే వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.   తాజా సమాచారం ప్రకారం, మూవీ లేట్ అవ్వడానికి కేవలం టెక్నికల్ కారణాలే కాకుండా, ఓటీటీ డీల్ కూడా ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోంది. సాధారణంగా ఏ పెద్ద సినిమాకైనా షూటింగ్ దశలోనే డిజిటల్ రైట్స్ అమ్ముడవుతాయి. కానీ, టాక్సిక్ విషయంలో డీల్ ఇంకా క్లోజ్ కాలేదని, అందుకే మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించడానికి తటపటాయిస్తున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు, కేవలం ఓటీటీ మాత్రమే కాకుండా సినిమా అవుట్‌పుట్ విషయంలో కూడా యష్ అంత సంతృప్తిగా లేరని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కొన్ని భారీ VFX సీక్వెన్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో క్వాలిటీ తగ్గకుండా ఉండాలని యష్ పట్టుబడుతున్నారట. ఒకవేళ  మార్చిలోనే విడుదల కావాల్సి ఉంటే, అప్పటికే ఓటీటీ డీల్ పూర్తి కావాలి. కానీ ఏప్రిల్ చివరలో ఉన్నా ఇంకా దీనిపై స్పష్టత రాలేదు.   also read: Chiranjeevi: బాక్సాఫీస్ వద్ద మళ్ళీ మెగా విధ్వంసం ఖాయం.. ది సైలెన్స్ బిఫోర్ స్లాటర్ గతంలో సినిమా వాయిదా పడినప్పుడు.. గల్ఫ్ దేశాలలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల ఓవర్సీస్ మార్కెట్ దెబ్బతినకూడదనే ఉద్దేశంతో రిలీజ్ ఆపినట్టుగా వార్తలు వచ్చాయి.  ఇప్పుడు వరుసగా మారుతున్న సమీకరణాలు చూస్తుంటే, కేవలం బాహ్య కారణాలే కాకుండా అంతర్గతంగా నిర్మాణ పనుల్లో  జాప్యం జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఏది ఏమైనా యష్ టాక్సిక్ లేటు కావడం ఫ్యాన్స్, మూవీ లవర్స్ కి రహస్యంగానే ఉంది.     
Actress Faria Abdullah recently spoke about her role in the upcoming film Gayapadda Simham, scheduled for a theatrical release on May 1st. In the movie, she plays a cameo as a vlogger named Shalini, a character she describes as having a heavy comedy element. The film features a multi-layered narrative where every character holds specific importance, and her track includes a romantic storyline with actor-director Tarun Bhascker. She noted that working with Bhascker was an entertaining experience due to his natural comedic timing, which often made her laugh on set. The production environment was unique as the cast featured several individuals who are also established directors, including JD Chakravarthy and presenter Pavan Sadineni.  Faria mentioned that having multiple filmmakers around led to engaging conversations about cinema, discussing everything from classic films like Satya to Pelli Choopulu. The project is directed by Kashyap Srinivas, who also acts in the film. Faria pointed out his peculiar style of comedy that blends action, romance, and humor.  Regarding the rest of the cast, she stated that Sree Vishnu has an interestingly designed role, while co-star Manasa Choudhary plays a character who ditches the hero, contrasting with Faria's character who stays by his side. The film's music is composed by Sweekar Agasthi, with Faria highlighting the tracks 'Bride' and 'Jingala' as her personal favorites.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.    
  టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాయడానికి "మెగా" తుపాను మళ్ళీ సిద్ధమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 158వ చిత్రానికి శ్రీకారం చుట్టారు. 'వాల్తేరు వీరయ్య' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత, మెగాస్టార్ - డైరెక్టర్ బాబీ(Bobby)కాంబినేషన్ మళ్ళీ సెట్స్ పైకి వెళ్లడానికి సర్వసిద్ధమైంది. తాజాగా మేకర్స్ ఇచ్చిన  "The Silence Before Slaughter" అనే అప్ డేట్ మెగా అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. రీసెంట్ గా చిరంజీవి గెటప్ కి సంబంధించిన లుక్ టెస్ట్  విజయవంతంగా పూర్తయింది. అందుకు సంబంధించిన పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరంజీవి మునుపెన్నడూ చూడని విధంగా చాలా వైల్డ్ మరియు పవర్ ఫుల్ లుక్ లో కనిపించబోతున్నారని సమాచారం. దీని కోసమే చిత్ర దర్శకుడు బాబీ గత కొన్ని నెలలుగా ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమయ్యారు. మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా, వింటేజ్ చిరును గుర్తుకు తెచ్చేలా ఒక ఊర మాస్ గెటప్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. గత ఏడాది వచ్చిన 'వాల్తేరు వీరయ్య' సినిమాతో చిరంజీవికి మళ్ళీ మాస్ నీరాజనాలు అందించిన బాబీ, ఈసారి అంతకు మించిన యాక్షన్ ఎంటర్టైనర్‌ను ప్లాన్ చేస్తున్నారు. "స్లాటర్" (Slaughter) అంటేనే ఒక విధ్వంసం.. ఆ పదంతోనే సినిమా రేంజ్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేసినట్లు అయ్యింది. బాబీ స్వతహాగా మెగాస్టార్ కి పెద్ద అభిమాని కావడంతో, ప్రతి సీన్ ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ లా ఉండేలా స్క్రిప్ట్‌ను తీర్చిదిద్దారు. also read:  Lenin: కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్.. డేట్ జంప్ కాబోతుందా! ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. లోహిత్ ఎన్.కె ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి నిమిష్ రవి సినిమాటోగ్రఫీ అందించనున్నారు. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, అతి త్వరలోనే ఈ సినిమా ముహూర్తం షాట్ మరియు రెగ్యులర్ షూటింగ్ అప్‌డేట్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.    
Megastar Chiranjeevi is gearing up for his next major cinematic outing with director Bobby Kolli, bringing relief to fans after a period of uncertainty. The pre-production of the much-awaited film, temporarily known as Mega 158, recently hit a milestone with the successful completion of Chiranjeevi's look test.   The project had experienced a brief delay earlier this year. The official pooja ceremony was originally postponed due to piracy issues surrounding KVN Productions' other major release, Jana Nayagan. This unexpected hurdle left fans concerned about the timeline of the Chiranjeevi-Bobby collaboration.  However, the completion of the look test signals positive momentum and confirms that the film is finally back on track. Following the massive success of their previous work together, expectations are high for this new venture. Reports suggest that principal photography and the formal launch event will commence shortly.  The film marks the Tollywood debut for the production banner, which remains fully committed to backing the project despite their recent scheduling challenges. With the look test locked in, the team is now steadily moving forward with the final stages of pre-production.     Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.    
  - టాలీవుడ్ రికార్డులను తిరగరాసిన పండుగాడి ప్రభంజనం! - మహేష్ బాబు మేనియాతో దద్దరిల్లిన థియేటర్లు! - ‘పోకిరి’ సృష్టించిన అరుదైన రికార్డులు ఇవే! టాలీవుడ్ సినిమా చరిత్రను 'పోకిరి'కి ముందు.. 'పోకిరి'కి తర్వాత అని విభజించవచ్చంటే అతిశయోక్తి కాదు. సూపర్ స్టార్ మహేష్ బాబు, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. నేటికి ఈ చిత్రం విడుదలై 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియాలో మహేష్ బాబు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు. ఒక సాదాసీదా రౌడీ నుంచి పవర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్‌గా మహేష్ బాబు చూపించిన వేరియేషన్స్ ప్రేక్షకులను ఇప్పటికీ మంత్రముగ్ధులను చేస్తూనే ఉన్నాయి. 2006 ఏప్రిల్ 28న విడుదలైన ఈ సినిమా అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను తుడిచిపెట్టేసింది. "ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో.. ఆడే పండుగాడు" అంటూ మహేష్ బాబు చెప్పిన డైలాగ్స్ ఒక ఊపు ఊపేశాయి. అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ హిట్ రికార్డులను దాటేసి, సుమారు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన తొలి తెలుగు చిత్రంగా 'పోకిరి' చరిత్ర సృష్టించింది. కేవలం వసూళ్ల పరంగానే కాకుండా, సుదీర్ఘ కాలం పాటు థియేటర్లలో ఆడి, ఆ కాలంలో అతిపెద్ద కమర్షియల్ సక్సెస్‌గా నిలిచింది. ఈ చిత్రం వెనుక ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. తొలుత ఈ కథకు 'ఉత్తమ్ సింగ్' అనే టైటిల్ అనుకున్నారట. కానీ మహేష్ బాబు సూచనతో 'పోకిరి'గా మార్చారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్‌గా మొదట ఇలియానా కాకుండా వేరే వారిని అనుకున్నా, చివరికి ఆమెకే ఆ అవకాశం దక్కింది. ఈ సినిమాతో ఇలియానా రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. మణిశర్మ అందించిన బాణీలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి. ప్రతి పాట ఒక సెన్సేషన్ కావడంతో ఆడియో పరంగా కూడా భారీ విజయాన్ని అందుకుంది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ మేకింగ్ స్టైల్ ఈ సినిమాతో పూర్తిగా మారిపోయింది. హీరో క్యారెక్టరైజేషన్, పంచ్ డైలాగ్స్, గన్ ఫైట్స్.. ఇలా ప్రతిదీ కొత్తగా అనిపించడంతో యువత ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ థియేటర్లలో ఉన్న ఆడియన్స్‌కు షాక్ ఇచ్చింది. ఈ సినిమా తెచ్చిన క్రేజ్ చూసి బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ 'వాంటెడ్' పేరుతో, తమిళంలో విజయ్ 'పోకిరి' పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా ఘనవిజయాలను అందుకున్నారు.  లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే.. పోకిరి చిత్రం 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మరోసారి థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్ట్‌లో వరల్డ్ వైడ్‌గా మరోసారి గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. 20 ఏళ్ల క్రితం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేసిన పోకిరి రీరిలీజ్‌లో కూడా రికార్డులు క్రియేట్ చేస్తుందని అభిమానులు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. 
  కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అని అక్కినేని వారు ఏమంటా చెప్పారో కానీ, ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్ అదే పాటని పాడుకోవాల్సిన పరిస్థితి. అఖిల్(Akhil)లెనిన్ మూవీనే  ఆ సాంగ్ పాడుకునే పరిస్థితిని కల్పిస్తుంది. పూర్తి డీటెయిల్స్ చూద్దాం  లెనిన్(Lenin)జూన్ 26న రిలీజ్ కాబోతుందని మేకర్స్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. కానీ ఈ డేట్ నుంచి కూడా మళ్ళీ వాయిదా పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇందుకు పెద్దినే కారణమని రీసెంట్ గా పెద్ది(Peddi)ని జూన్ 25 న రిలీజ్ చేస్తామని బుచ్చిబాబు ప్రకటించాడు. దీంతో నిను వీడని నీడను నేనే అనే  రీతిలో పెద్ది వెంటపడుతుండటంతో లెనిన్ రిలీజ్ డేట్ మారవచ్చనేది టాక్. నిజానికి  లెనిన్ మే 1న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ పెద్ది ఫస్ట్ రిలీజ్ డేట్ ఏప్రిల్ 30 కావడంతో క్లాష్ వద్దనుకొని  జూన్ 26కి వాయిదా వేశారు. మరి ఇప్పుడు జూన్ 25నే పెద్ది బరిలో దిగబోతుంది. మరి ఒకే రోజు గ్యాప్‌లో రెండు భారీ సినిమాలు విడుదల కావడం అనేది ఇబ్బందే. ట్రేడ్ వర్గాలు సైతం క్లాష్ వద్దని అనుకుంటారు. పైగా అఖిల్ మూడేళ్ళ గ్యాప్ తర్వాత వస్తున్నాడు. హిట్ కూడా కంపల్ సరి దీంతో జూన్ రేసు నుంచి తప్పుకోవాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. Also read: Vandemataram: షార్ట్ ఫిల్మ్ తీస్తే 15 లక్షలు.. కేంద్రం బంపర్ ఆఫర్  ఏది ఏమైనా రిలీజ్ డేట్ వాయిదా పడినా కూడా ఈ సారి అఖిల్ బాక్స్ ఆఫీస్ ని చెడుగుడు ఆడటం ఖాయమనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. అఖిల్ సరసన భాగ్య శ్రీ  భాగ్యశ్రీ బోర్సే జత కడుతుండగా ఇప్పటికే విడుదలైన 'వారేవా వారేవా' సాంగ్ యు ట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది. ఆ ఇద్దరి మధ్య కనపడ్డ కెమిస్ట్రీ  కూడా లెనిన్ పై అంచనాలని పెంచుతుంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న లెనిన్ కి మురళి కిషోర్ అబ్బూరి దర్శకుడు. పక్కా యాక్షన్ డ్రామా.  
తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్యానికి అగ్ర తాంబూలం ఇస్తూ అద్భుతమైన కామెడీ సినిమాలను రూపొందించి హాస్యబ్రహ్మ అనిపించుకున్న డైరెక్టర్ జంధ్యాల. ఆయన కలం నుండి జాలువారిన డైలాగులు, ఆయన సృష్టించిన విలక్షణమైన పాత్రలు ఇప్పటికీ ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తూనే ఉన్నాయి. ఆయన దర్శకత్వంలోనే వచ్చిన చూపులు కలిసిన శుభవేళ చిత్రంలోని కొన్ని హాస్య సన్నివేశాల సమాహారమే ఈ వీడియో. నరేష్, మోహన్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, నూతన్ ప్రసాద్, సుత్తి వీరభద్రరావు తదితరులు నటించిన ఈ సినిమాలోని వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  జంధ్యాల గారి కామెడీలో అతిపెద్ద బలం ఆయన పాత్రల చిత్రణ. ఏదో ఒక విచిత్రమైన అలవాటు లేదా మేనరిజం ఉన్న పాత్రలను సృష్టించి, వాటి ద్వారా సహజమైన హాస్యాన్ని పండించడంలో ఆయన దిట్ట. ఈ వీడియోలో అలాంటి పాత్రల సందడి చూస్తుంటే పాత జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుకు రావడం ఖాయం. ముఖ్యంగా భాష మీద పట్టుతో ఆయన రాసే డైలాగులు ఒక్కోటి ఒక్కో ఆణిముత్యం. ఈ వీడియోలో ప్రముఖ నటులు బ్రహ్మానందం, సుత్తివేలు, సుత్తి వీరభద్రరావు వంటి దిగ్గజాల నటన హైలైట్‌గా నిలిచింది. ఒకరు పద్యాలతో విసిగిస్తుంటే, మరొకరు అర్థం లేని లాజిక్కులతో తలపోటు తెప్పిస్తుంటారు. ఈ సన్నివేశాల్లోని టైమింగ్ మరియు ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే, ఎందుకు వీరిని హాస్య దిగ్గజాలు అంటారో మనకు అర్థమవుతుంది. ప్రతి సన్నివేశం ఒకదానికొకటి పోటీ పడేలా ఉండి ప్రేక్షకులను కట్టేస్తుంది. సాధారణంగా సినిమాల్లో హాస్యం అంటే వెకిలి చేష్టలు అనుకునే రోజుల్లో, స్వచ్ఛమైన తెలుగు పదాలతో, ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించిన ఘనత జంధ్యాల గారిది. ఈ వీడియోలో కూడా మనకు అలాంటి అద్భుతమైన 'జంధ్యాల మార్కు' పంచ్‌లు ఎన్నో కనిపిస్తాయి. సినిమా ఏదైనా, అందులో జంధ్యాల గారి టచ్ ఉంటే అది కచ్చితంగా నవ్వుల పువ్వులు పూయించాల్సిందే అని ఈ వీడియో మరోసారి నిరూపిస్తోంది. ప్రస్తుత కాలంలో ఎంతటి యాక్షన్ సినిమాలు వచ్చినా, ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి ప్రేక్షకులు మళ్ళీ ఇలాంటి పాత కాలపు కామెడీ వైపే మొగ్గు చూపుతున్నారు. అందుకే ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతమైన వ్యూస్‌తో దూసుకుపోతోంది. "ఇలాంటి కామెడీ సీన్స్ మళ్ళీ చూడలేం, జంధ్యాల గారు గ్రేట్" అంటూ నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి. 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యలలో 'ఫ్రోజెన్ షోల్డర్' (Frozen Shoulder) ఒకటి. వైద్య పరిభాషలో 'అడెసివ్ క్యాప్సులైటిస్' అని పిలిచే ఈ సమస్య వల్ల భుజం కీలు బిగుసుకుపోయి, కనీసం చేయి పైకి ఎత్తడానికి కూడా వీలు లేని పరిస్థితి ఏర్పడి దైనందిన జీవితం స్తంభించిపోతుంది. దీనిని కేవలం సాధారణ నొప్పి అని సరిపెట్టుకొని నిర్లక్ష్యం చేస్తే మున్ముందు కదలికలు మరింత కష్టతరంగా మారుతాయి. ఆధునిక వైద్యంలోని పెయిన్ కిల్లర్స్ కేవలం తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తుండగా, ఆయుర్వేదం ఈ వ్యాధిని మూలాల నుండి నయం చేసే అద్భుతమైన మార్గాలను చూపుతోంది. ఈ క్రమంలో ఫ్రోజెన్ షోల్డర్ లక్షణాలు, కారణాలు మరియు దీనిని శాశ్వతంగా నయం చేసే ఆయుర్వేద చికిత్సా పద్ధతుల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రోజెన్ షోల్డర్ అంటే ఏమిటి? మన భుజంలోని కీలు చుట్టూ ఉండే కణజాలం (Capsule) వాపునకు గురై, మందంగా మారడం వల్ల భుజం కదలికలు తగ్గిపోతాయి. దీనివల్ల తీవ్రమైన నొప్పి మరియు బిగుతుగా ఉన్న భావన కలుగుతుంది. ప్రధాన కారణాలు: మధుమేహం (Diabetes): షుగర్ వ్యాధి ఉన్నవారిలో ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.  గాయాలు: భుజానికి తగిలిన పాత గాయాలు లేదా శస్త్రచికిత్సల వల్ల.  థైరాయిడ్ సమస్యలు: హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా భుజం కండరాలు దెబ్బతినవచ్చు.  కదలిక లేకపోవడం: ఎక్కువ కాలం చేతికి పని చెప్పకపోవడం వల్ల కీళ్లు బిగుసుకుపోతాయి. ఆయుర్వేద చికిత్స - సహజ సిద్ధమైన పరిష్కారం: ఆయుర్వేదం ప్రకారం, శరీరంలో 'వాత దోషం' పెరగడం వల్ల కీళ్లలో ద్రవాలు తగ్గి ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. ఆయుర్వేదంలో ఫ్రోజెన్ షోల్డర్‌ను 'అవబాహుక' అని అంటారు. దీనికి అందుబాటులో ఉన్న కొన్ని అద్భుతమైన చికిత్సలు: అభ్యంగనం (Abhyangam): వేడి చేసిన ఆయుర్వేద తైలాలతో (మహానారాయణ తైలం వంటివి) మర్దన చేయడం వల్ల రక్త ప్రసరణ పెరిగి నొప్పి తగ్గుతుంది.   స్వేదనం (Swedanam): మూలికల ఆవిరి పట్టడం ద్వారా బిగుసుకుపోయిన కండరాలు వదులవుతాయి.   గ్రీవ వస్తి / పీచు: నొప్పి ఉన్న భాగంలో ప్రత్యేకమైన నూనెను నిల్వ ఉంచే ప్రక్రియ.   పౌష్టిక ఆహారం: వాతాన్ని తగ్గించే ఆహార పదార్థాలను తీసుకోవడం మరియు శొంఠి, గుగ్గులు వంటి మూలికలను వాడటం. ఫ్రోజెన్ షోల్డర్ సమస్యను ప్రారంభ దశలోనే గుర్తిస్తే ఫిజియోథెరపీ మరియు ఆయుర్వేద చికిత్సలతో సులభంగా నయం చేసుకోవచ్చు. నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో చేతి కదలికలు పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. సరైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం మరియు ఆయుర్వేద జీవనశైలితో మీ భుజం ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి సబ్‌స్క్రైబ్ చేయండి!
ప్రేమ ఒక అందమైన భావన, కానీ చాలా మందికి ఇది పదే పదే బాధ కలిగిస్తూ ఉంటుంది. ప్రేమ మొదట్లో అద్బుతంగా ఉంటుంది,  ఇష్టంగా అనిపిస్తుంది,  తమ చుట్టూ ఒక కొత్త ప్రపంచం ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ కాలంతో పాటు ప్రేమ కూడా మారుతూ ఉంటుంది.  ముఖ్యంగా పరీక్షలు పెడుతూ ఉంటుంది.  ఇద్దరు వ్యక్తులు సిన్సియర్ గా ఉన్నారా లేదా అనేది కూడా కాలమే డిసైడ్ చేస్తుంది. అయితే ప్రేమించిన చాలా మంది సంతోషం కంటే ఎక్కువ బాధపడిన సందర్బాలే ఉంటాయి.  పదే పదే మనోవేదనకు గురవుతూ ఉంటారు.  ప్రేమ అనేది కేవలం ఒక్కరితో అగేది కూడా కాదు.. చాలామంది ప్రేమలో ఫెయిల్యూర్ వచ్చాక లేదా బ్రేకప్ అయ్యాక.. మళ్లీ ఇంకొకరితో ప్రేమలో పడతారు. కానీ అక్కడ కూడా మళ్లీ బాధ.. పదే పదే మానసిక వేధన బహుమానంలా లభిస్తాయి.  అసలు ప్రేమించేవారికి పదే పదే మానసిక వేధన ఎందుకు ఎదురవుతోంది? ఇందులో తప్పు ఎవరిది? తెలుసుకుంటే.. బాధ కలిగినా అదే మార్గంలో ప్రయాణం.. చాలామంది ప్రేమలో ఉన్నప్పుడు అయినా జీవితంలో వేరే బంధంలో అయినా.. తమకు బాధ కలిగినా సరే.. అదే జోన్ లోనే ఉండటానికి ఇష్టపడతారు. చిన్నతనంలోని అనుభవాలు,  పెరిగిన వాతావరణం,  గతంలో ఏర్పడిన బందాల వల్ల కలిగిన బాధ.. బందంలో గౌరవం లేకపోవడం వంటివి మనిషిని మారేలా చేయాలి. కానీ చాలామంది కొత్తగా ఏర్పడే ప్రతి బందంలోనూ అవే తప్పులు పదే పదే చేస్తుంటారు. అందుకే పదే పదే మనోవేధన కూడా ఎదురవుతూ ఉంటుంది. ఎమోషన్స్ నుండి బయట పడలేకపోవడం.. చాలా మంది తమకు తెలియకుండానే తమలాంటి భాగస్వాములనే ఎంచుకుంటారు. ఇది వారి సబ్ కాన్షియస్ మైండ్  చేసే ఒక ప్రయోగం.  గతంలో విషపూరితమైన సంబంధాలను అనుభవించి ఉంటే  మనస్సు వాటిని సాధారణమైనవిగా అంగీకరిస్తుంది. అందుకే పదే పదే అలాంటి రిలేషన్స్ వైపుకే  ఆకర్షితులు అవుతుంటారు. తమను తాము తక్కువగా  అంచనా వేసుకోవడం.. ఒక వ్యక్తి తమను తాము తక్కువగా అంచనా వేసుకున్నప్పుడు, వారు తరచుగా సంబంధాలలో తాము తక్కువ అన్నట్టు ఉంటారు. అలాంటి వ్యక్తులు ఎదుటి మనిషి వ్యక్తిత్వం గురించి పెద్దగా పట్టించుకోకుండా  పదే పదే తప్పుడు భాగస్వామిని ఎంచుకుంటారు. మార్పు పట్ల భయం.. చాలా మంది తాము తప్పులు చేస్తున్నామని తెలిసినా, మారడం వల్ల ఎదురయ్యే నష్టాలు,  ప్రమాదాలను చూసుకుని మారడానికి భయపడతారు.  అందుకే వారు అవే పాత పద్ధతులలో చిక్కుకుపోయి ఉంటారు. గత గాయాల ప్రబావం.. గత సంబంధాల వల్ల కలిగిన గాయం, పూర్తిగా మానకపోవడం వంటివి చాలామంది పదే పదే అవే తప్పులు చేసేలా చేస్తాయి.  ఇలాంటి వారు  భావోద్వేగపరంగా కోలుకునేంత వరకు, సరైన నిర్ణయాలు తీసుకోలేరు. గందరగోళం.. చాలా మంది ప్రేమకు , భావోద్వేగ అనుబంధానికి మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోరు. వారు తప్పుడు వ్యక్తికి దగ్గరై, దానినే ప్రేమగా పొరబడతారు, తద్వారా అవే తప్పులను రిపీట్ చేస్తూ ఉంటారు.   ప్రేమలో లేదా రిలేషన్ లో  అవే తప్పులను పదే పదే చేయడం అనేది విధి రాసే రాత కాదు.. అది మనిషి  అలవాట్లు,  ఆలోచనా విధానం ఇచ్చే  ఫలితం. ప్రతి వ్యక్తి తన  పద్ధతులను గుర్తించి, తమను తాము  సరిదిద్దుకున్నప్పుడు మాత్రమే ఇలా పదే పదే బాధపడే బంధంలో చిక్కుకోవడాన్ని నివారించగలుగుతారు. సింపుల్ గా చెప్పాలంటే.. ప్రతి మనిషి ప్రేమలో లేదా రెలేషన్ లో.. పదే పదే మానసిక వేదనకు అనుభవించడానికి అక్షరాలా ఆ మనిషి చేతులారా చేసుకునే తప్పులు,  పరిస్థితులకు అనుగుణంగా మారకపోవడం,  పాత ఆలోచనలు, సిద్దాంతాలలో  చిక్కుకుని ఉండటం వంటివి కారణం అవుతాయి.                                    *రూపశ్రీ.
వేసవి కాలం వచ్చిందంటే చాలు..  ప్రతి ఇంట్లో చల్లదనం కోసం ఫ్యాన్లతో పాటు కూలర్ల వాడకం  పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, కూలర్లు  తప్పనిసరి అవుతాయి.  రోజంతా కూలర్లు పనిచేస్తూనే ఉంటాయి. అయితే కూలర్లు వాడేవారు దాని శుభ్రత గురించి మాత్రం అంత శ్రద్ద తీసుకోరు. దీని వల్ల నీరు మురికిగా మారి దోమలు పెరగడానికి ఆవాసంగా మారడమే కాకుండా.. . కూలర్‌లోని నీటిని శుభ్రంగా ఉంచకపోతే కూలింగ్ కూడా పెద్దగా రాదు.   అయితే కూలర్ లో నీటిని ప్రతిరోజూ శుభ్రం చేయడం అంత ఈజీ ఏమీ కాదు.. కొన్ని కంపెనీల కూలర్లలో నీటిని నింపడం సులువే.. కానీ వాటిలో నీటిని తొలగించడం, శుభ్రం చేయడం కాస్త శ్రమతో కూడుకున్నదే.. అయితే.. కూలర్లలో నీరు ప్రతిరోజూ శుభ్రం చేయకపోయినా కొన్నిరోజుల పాటు నీరు శుభ్రంగా ఉండాలన్నా, తాజాగా అనిపించాలన్నా కేవలం ఒకే ఒక్క చిట్కా అద్బుతంగా పనిచేస్తుంది. అదేంటో తెలుసుకుంటే.. పటిక.. కూలర్‌లోని నీటిని శుభ్రంగా ఉంచడానికి పటిక చాలా సులభమైన,  ఇంటి చిట్కా. దీనిని నీటిలో వేయడం  వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కూలర్ ట్యాంక్‌లో నీరు తరచుగా ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది, ఇది తొందరగా మురికిగా మారే అవకాశం ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఈ నీటిలో దోమలు  ఆవాసం ఏర్పాటు చేసుకుని  గుడ్లు పెడతాయి. అయితే కూలర్ ఎక్కువ కాలం పనిచేయాలంటే   దానిని శుభ్రపరచడం చాలా ముఖ్యం. నీటిలో ఒక చిన్న పటిక ముక్కను వేయడం వల్ల నీటిని శుభ్రపరచవచ్చు.  పైగా దోమల సమస్య కూడా తగ్గుతుంది. కూలర్ ట్యాంక్ లో పటిక వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు.. నీటి స్వచ్చత.. పటిక నీటిలోని దుమ్ము, ధూళి , చిన్న కణాలను బంధిస్తుంది. ఈ కణాలు బరువెక్కి అడుగుకు చేరుకుంటాయి, దీనివల్ల పైన ఉన్న నీరు స్వచ్ఛంగా ఉంటుంది. దోమలకు చెక్.. పటిక నీటిని శుద్ధి చేయడం వల్ల దోమల గుడ్లు, లార్వాలు సులభంగా వృద్ధి చెందలేవు. దీనివల్ల దోమల సమస్య గణనీయంగా తగ్గుతుంది. దుర్వాసన.. కూలర్ నీటి నుండి ఏదైనా వింత లేదా దుర్వాసన వస్తుంటే, దానిని చాలా వరకు తగ్గించడంలో పటిక సహాయపడుతుంది. బ్యాక్టీరియా..  పటికకు తేలికపాటి యాంటీసెప్టిక్ గుణాలు ఉన్నాయి, ఇవి నీటిలో ఉండే  హానికరమైన బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడతాయి. నీటి నాణ్యత.. పటిక నీటిని ఎక్కువ సేపు శుభ్రంగా ఉంచడానికి సహాయపడుతుంది, దీనివల్ల కూలర్ ప్యాడ్‌లు త్వరగా పాడవకుండా ఉంటాయి , గాలి చల్లగా ఉంటుంది. పటికను ఉపయోగించేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు.. పటికను ఎక్కువ పరిమాణంలో వాడకూడదు. ఒక చిన్న ముక్క సరిపోతుంది. ఎక్కువ పటిక కలపడం వల్ల నీటి నాణ్యత దెబ్బతింటుంది. అంతేకాకుండా కూలర్‌లోని నీటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచకుండా అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి.                                 *రూపశ్రీ.
బ్రేక్ ఫాస్ట్ లేదా అల్పాహారం నేటికాలపు జీవనశైలికి చాలా ముఖ్యంగా మారింది.  ఉదయాన్నే అల్పాహారం తప్పకుండా తినాలని వైద్యుల నుండి ఆహార నిపుణుల వరకు ప్రతి ఒక్కరూ చెబుతారు.  అయితే చాలామంది అల్పాహారంలో తీసుకునే ఆహారాలు కేవలం కడుపు నిండినట్టు లేదా రుచి కోసం తీసుకుంటూ ఉంటారు. కానీ శరీరంలో ఎంతో ముఖ్యమైన భాగమైన పేగు ఆరోగ్యం బాగుండటం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలో చాలామందికి తెలియదు. ఉదయాన్నే తీసుకునే ఆహారమే పేగు ఆరోగ్యాన్ని, రోజు మొత్తం జీర్ణ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.  పేగు ఆరోగ్యాన్ని ఎంతో సేఫ్ గా ఉంచే కొన్ని బ్రేక్ ఫాస్ట్ లు ఉన్నాయి.  ఫైబర్ పుష్కలంగా ఉండే ఈ ఆహారాలు తీసుకుంటే రోజు మొత్తం హాయిగా గడిచిపోతుంది. అవేంటో తెలుసుకుంటే.. ఓట్స్, చియా సీడ్స్ స్మూతీ.. ఓట్స్‌లో బీటా-గ్లూకాన్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది,  మెరుగుపరుస్తుంది. ఓట్స్ ను  చియా విత్తనాలతో కలిపితే, ఫైబర్ కంటెంట్ రెట్టింపు అవుతుంది. చియా విత్తనాలు నీటిని గ్రహిస్తాయి,  జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తాయి, ఇది ప్రేగులను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. వెజిటబుల్ రాగి ఇడ్లీ లేదా దోశ.. రాగులు ఫైబర్,  కాల్షియం పుష్కలంగా కలిగి ఉంటాయి. ఇతర ధాన్యాలతో పోలిస్తే, రాగులలో  ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఇది మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. తురిమిన క్యారెట్లు, బీన్స్,  పాలకూరను రాగి పిండిలో కలపాలి. ఆవిరి మీద ఉడికించి ఇడ్లీగా తినవచ్చు.  లేదంటే దీంతో దోశ కూడా ట్రై చేయవచ్చు. . ఇది తేలికగా ఉంటూనే  జీర్ణవ్యవస్థకు అనుకూలంగా ఉంటుంది. మొలకెత్తిన ధాన్యాలు.. పెసలు, శనగలు లేదా బొబ్బర్లు వంటివి  మొలకెత్తడం వల్ల వాటి ఫైబర్,  ఎంజైమ్ కంటెంట్ పెరుగుతుంది. మొలకెత్తిన ధాన్యాలు ప్రీబయోటిక్స్‌గా పనిచేస్తాయి. మంచి గట్ బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. మొలకెత్తిన పెసలను దోసకాయ, టమోటా, నిమ్మరసం,  కొద్దిగా ఉప్పుతో కలపాలి. ఇది ఫైబర్‌ను అందించడమే కాకుండా ప్రోటీన్ కూడా పుష్కలంగా అందిస్తుంది. మల్టీగ్రెయిన్ వెజిటబుల్ ఉప్మా.. సెమోలినాకు బదులుగా మల్టీగ్రెయిన్ గంజి లేదా ఓట్ ఉప్మా తయారు చేయడం వల్ల ఫైబర్  మరింత మెరుగవుతుంది. బఠానీలు, కాలీఫ్లవర్,  బీన్స్ వంటి కూరగాయలను జోడించడం వల్ల ఫైబర్ కంటెంట్ మరింత పెరుగుతుంది. తక్కువ నూనె,  ఆకుపచ్చ కూరగాయలను పుష్కలంగా జోడిండం వల్ల దీనిలో హెల్తీ బెనిఫిట్స్ మెరుగవుతాయి. జీర్ణక్రియకు ప్రయోజనకరంగా భావించే కరివేపాకును జోడిస్తే మరీ మంచిది. జొన్న రోటీ, పెరుగు.. చిరు ధాన్యాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. చిరు ధాన్యాలు,  జొన్నలు గ్లూటెన్ రహితంగా ఉండటమే కాకుండా పేగు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. పెరుగు అనేది పేగులో మంచి బ్యాక్టీరియాను పెంచే ప్రోబయోటిక్. చిరు ధాన్యాల రోటీతో ఒక గిన్నెడు తాజా పెరుగు కలిపి తింటే చాలా మంచిది. ఈ కాంబో ఫైబర్,  ప్రోబయోటిక్స్ రెండూ కలిగి ఉంటుంది.                            *రూపశ్రీ.  
  కాలంతో పాటు అన్ని అలవాట్లు అప్డేట్ అవుతూ ఉన్నాయి.  మొదట వేప పుల్లలతో పళ్లు తోమేవారు,  తర్వాత పేస్ట్ లు వచ్చాయి.  ఆ తరువాత పేస్ట్ లలో ఉప్పు, బొగ్గు, లవంగం వంటివి చేరాయి.  అవి కూడా అయ్యాక మౌత్ వాష్ లు వచ్చాయి.  చాలా పరిశుభ్రతలో బాగంగా మౌత్ వాష్ లు వాడుతుంటారు.  కొందరు పళ్లు తోమే పని లేకుండా మౌత్ వాష్ వాడితే.. మరికొందరు పళ్లు తోమిన తర్వాత కూడా ఇంకా పళ్లు ఎక్కువగా శుభ్రం అవుతాయని అతి శుభ్రతతో మౌత్ వాష్ కూడా వాడతారు. అయితే.. మౌత్ వాష్ వాడే వారికి డాక్టర్లు ఓ చల్లని చావు కబురు చెబుతున్నారు.  మౌత్ వాష్ వాడితే రక్తపోటు సమస్య వస్తుందని అంటున్నారు.  దీని గురించి వైద్యులు చెప్పిన విషయాలు వివరంగా తెలుసుకుంటే.. మౌత్ వాష్.. నోటి ఆరోగ్యం.. నోటిలోని మంచి బ్యాక్టీరియా మానవ శరీరానికి చాలా అవసరం. ఈ బ్యాక్టీరియా ఆహారంలోని నైట్రేట్‌లను నైట్రైట్‌లుగా మార్చడానికి సహాయపడతాయి, ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. నైట్రిక్ ఆక్సైడ్ అనేది రక్తనాళాలను సడలించడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి , రక్తపోటును నియంత్రించడానికి సహాయపడే ఒక ముఖ్యమైన అంశం. మౌత్ వాష్ వల్ల కలిగే నష్టం.. బలమైన యాంటీసెప్టిక్ మౌత్‌వాష్‌లు నోటిలోని  మంచి బ్యాక్టీరియాను కూడా చంపగలవని నిపుణులు అంటున్నారు. ఇది నైట్రేట్, నైట్రైట్‌గా మారే ప్రక్రియను ప్రభావితం చేస్తుంది , శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలను తగ్గించగలదు. ఇది నేరుగా రక్తనాళాల పనితీరుపై ప్రభావం చూపుతుంది, తద్వారా రక్తపోటును ప్రభావితం చేసే అవకాశం ఉంది. యాంటీ బాక్టీరియల్ మౌత్‌వాష్ వాడకం వల్ల నోటిలోని అవసరమైన బ్యాక్టీరియా 90 శాతం వరకు తగ్గుతుందని కొన్ని అధ్యయనాలలో తేలిందని వైద్యులు కూడా చెబుతున్నారు. కేవలం కొన్ని రోజుల వాడకం కూడా లాలాజలంలో నైట్రేట్ స్థాయిలను తగ్గించగలదని, దీనివల్ల సిస్టోలిక్ రక్తపోటులో స్వల్ప పెరుగుదల ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. మౌత్ వాష్ ఎక్కువ కాలం ఉపయోగిస్తే.. రోజు ఎక్కువగా మౌత్‌వాష్ ఉపయోగించడం వల్ల దీర్ఘకాలంలో అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మంచి బ్యాక్టీరియాను తగ్గించడం, నైట్రిక్ ఆక్సైడ్‌ను తగ్గించడం, , రక్తనాళాల సరైన పనితీరును దెబ్బతీసే ప్రక్రియ వలనే ఇది జరుగుతుందని అంటున్నారు. దీని ప్రభావాలు అందరిపై తీవ్రంగా ఉండనప్పటికీ, రెగ్యులర్ గా అందులోనూ ఎక్కువగా వాడటం వల్ల ప్రమాదం పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. చిగుళ్ల వ్యాధి, దంత చికిత్స తర్వాత, లేదా దంతాలపై అధికంగా పాచి పేరుకుపోయిన వంటి కొన్ని పరిస్థితులలో మౌత్‌వాష్ వాడకం  అవసరం అవుతుంది. అందువల్ల, మౌత్‌వాష్‌ను అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాలని, దానిని రోజువారీ అలవాటుగా చేసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు. నోటి శుభ్రతకు బ్రష్ చేయడమే మంచిదని, దీనికే ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నారు. కాబట్టి మౌత్ వాష్ ఎక్కువగా వాడకూడదు.                                      *రూపశ్రీ.
ఆరోగ్యకరమైన శరీరానికి జింక్ చాలా అవసరం. జింక్ కణజాలాలను బాగుచేస్తుందని చెబుతారు. జింక్ ఒక యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ, కణాలను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడుతుంది. చర్మం,  జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి జింక్ చాలా కీలకం. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు అవసరం అవుతాయి. అలాంటి వాటిలో జింక్ కూడా ఒకటి. అయితే చాలామందికి జింక్ లోపం గురించి పెద్దగా అవగాహన ఉండదు.  జింక్ లోపం వల్ల ఇన్ఫెక్షన్లు సోకుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇది నిజమేనా? జింక్ లోపం గురించి.  జింక్ లోపం వల్ల వచ్చే సమస్యల గురించి వైద్యులు ఏం చెబుతున్నారు తెలుసుకుంటే.. శరీరానికి జింక్ ఎందుకు అవసరం..  జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి , చర్మానికి జింక్ చాలా అవసరం. జింక్ చర్మాన్ని మృదువుగా ఉంచడానికి , కణజాలాలను బాగు చేయడానికి సహాయపడుతుంది. జింక్ లోపం తరచుగా ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చని, చర్మ, కడుపు సమస్యలను కూడా కలిగించవచ్చని వైద్యులు చెబుతున్నారు. జింక్ లోపం వల్ల వచ్చే సమస్యలు.. జింక్ లోపం శరీరంలో అనేక రకాల సమస్యలను కలిగిస్తుంది. జింక్ లోపం పిల్లలలో పెరుగుదలను నిరోధించగలదు , మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఇన్ఫెక్షన్లు.. జింక్ లోపం తరచుగా ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. జింక్ లోపం ఇన్ఫెక్షన్లతో పోరాడే శరీర సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. దీనివల్ల ఫంగస్ , చర్మం ఎర్రబడటం వంటి సమస్యలు తలెత్తవచ్చు. విరేచనాలు.. వైద్యుల ప్రకారం, జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి జింక్ చాలా అవసరం. జింక్ లోపం జీర్ణవ్యవస్థపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. శరీరంలో జింక్ లోపించినప్పుడు, విరేచనాలు అయ్యే అవకాశం ఉంటుంది. గాయాలు.. జింక్ లోపం చర్మం, కడుపునే కాకుండా గాయాలను కూడా ప్రభావితం చేస్తుంది. జింక్ లోపం ఉన్నవారిలో గాయాలు నెమ్మదిగా నయమవుతాయి. జింక్ లోపిస్తే కనిపించే లక్షణాలు.. జింక్ లోపం వేగంగా బరువు తగ్గడం, నీరసం , జుట్టు రాలడం వంటి లక్షణాలు కలిగి ఉంటుంది. జింక్ పుష్కలంగా లభించే ఆహారాలు.. ఆహారంలో జింక్‌ను చేర్చుకోవడానికి,  గుమ్మడి గింజలు, నువ్వులు, ఆవాలు, పొద్దుతిరుగుడు గింజలు , రాగులను చేర్చుకోవచ్చు. ఈ ఆహారాలలో జింక్ ఉంటుంది. అదనంగా,  ఆవాల ఆకుకూర, మాంసం, పప్పుధాన్యాలు, గుమ్మడికాయ, పుట్టగొడుగులు, పెరుగు, వేరుశెనగలు , గుడ్లను కూడా తినవచ్చు. ఈ ఆహారాలలో కూడా జింక్ సమృద్దిగా ఉంటుంది.                                 *రూపశ్రీ.