LATEST NEWS
  ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలల్లో తీవ్రంగా మండిపడ్డారు వసంత కృష్ణ ప్రసాద్. వల్లభనేని వంశీ ఎపిసోడ్ పై.. ఆయన ప్రసంగిస్తూ.. " సభలో ఒక సభ్యుడిగా కొన్ని విషయాలను స్పీకర్ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నించిన ఒక సొంత పార్టీ సభ్యుడిని అమానుషంగా సస్పెండ్ చేయించడం కరెక్ట్ కాదని.. అది కూడా ఎంతో అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు చేయడం సమంజసమే కాదన్నారు వసంత కృష్ణ ప్రసాద్. అంతేకాక తనకు చంద్రబాబులో రెండు లక్షణాలు కనిపిస్తున్నాయని.. ఒకటి ఛాదస్తపు మొగుడు , మరొకటి అనుమానపు మొగుడని ఎద్దేవా చేశాడు. అనుమానపు మొగుడు ఎందుకంటే.. తన సొంత పార్టీ సభ్యుడు తన నియోజక వర్గ సమస్యలు చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి గారి దగ్గరకొస్తే బాధపడిపోయి సొంత పార్టీ సభ్యుని అనుమానించి బయటికి గెంటేశారన్నారు. అదే విధంగా   ఛాదస్తపు మొగుడు ఎందుకంటే.. ఆయన తన బాధని ఈ రోజు సభలో చెప్పుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఆ బాధను కూడా చెప్పుకోనివ్వకుండా చేశారని వసంత కృష్ణ ప్రసాద్ ఆవేదనను వ్యక్తపరిచారు. తమ ప్రియతమ ముఖ్యమంత్రి జగన్ గారి గురించి.. వారు తీసుకున్న విధాన నిర్ణయాలు బాగున్నాయని.. ఆయన పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్పించటం కరెక్టని ప్రతి ప్రతిపక్ష సభ్యుడు నాలుగు మంచి మాటలు చెప్పాలి కానీ ఇలా చెయ్యకూడదన్నారు. అవన్నీ పక్కకి పెట్టి అనవసరపు విషయాల పట్ల, ఉత్తుత్తి విషయాల పట్ల, రాష్ట్రంలో లేని కొరతను వీళ్లు సృష్టించి వేరే విషయాల పట్ల ధర్నాలు చేసి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారన్నారు. అలా చేయొద్దని.. అనవసర విషయాల పై జోక్యం వద్దని సూచించిన సభ్యుడని  భరించలేక వాళ్ళు దూరం పెట్టటం ఎంతో దురదృష్టం అన్నారు. ఏదేమైనా ఈ రాష్ట్ర చరిత్రలో ప్రతిపక్షానికి చెందిన సభ్యుడు కూడా ముఖ్యమంత్రిని చేసిన మంచి పనులు పొగుడుతుండటం చూడలేక బయటికెళ్లిన సంఘటన 40 ఏళ్ళలో ఎన్నడూ చూడలేదని వసంత కృష్ణ ప్రసాద్ వ్యక్తపరిచారు.
  అసెంబ్లీలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష నేత చంద్రబాబు సవాల్‌ విసిరారు. అసెంబ్లీ సమావేశాలలో మొదటి రోజు నుండి 'హెరిటేజ్ ఫ్రెష్’ సంస్థ పేరుని ప్రస్తావిస్తూ అధికార పార్టీ చంద్రబాబుపై విమర్శలు చేస్తుండగా.. వాటిని చంద్రబాబు తిప్పికొట్టారు. గుడివాడలో ఉల్లి పంపిణీ క్యూలైన్లో ఒక వ్యక్తి మరణించారని చంద్రబాబు చెప్పినప్పుడు.. హెరిటేజ్‌లో కిలో ఉల్లి రూ.135కు అమ్ముతున్నారని వైసీపీ సభ్యులు ఎదురుదాడికి దిగారు. దీనికి చంద్రబాబు బదులిస్తూ.. హెరిటేజ్ ఫ్రెష్ కి, హెరిటేజ్ ఫుడ్స్ కి తేడా తెలుసుకొని మాట్లాడాలని ఎద్దేవా చేసారు. హెరిటేజ్‌ ఫ్రెష్‌ తమది కాదని దానిని ప్యూచర్‌ గ్రూప్‌ సంస్థకి అమ్మేశామని స్పష్టం చేసారు. అయినా అధికార పార్టీ నుండి విమర్శలు ఆగకపోవడంతో ఈరోజు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు.. జగన్ కి సవాల్ విసిరారు. హెరిటేజ్ ఫ్రెష్ మాదికాదని చెప్పామని.. అయినా హెరిటేజ్ మాదే అని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సంస్థ మాదే అని రుజువు చేస్తే.. తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చంద్రబాబు సవాల్ చేశారు. అలా రుజువు చేయలేకపోతే సీఎం జగన్ తన సీఎం పదవికి రాజీనామా చేస్తారా? అని చంద్రబాబు ఛాలెంజ్ విసిరారు. తాను చేసిన సవాల్‌ను సీఎం జగన్, వైసీపీ నేతలు స్వీకరించాలని లేదా ఆరోపణలు చేయడం మానుకోవాలని ఆయన వైసీపీ నేతలకు చంద్రబాబు హితవు పలికారు.
ప్రకాశం జిల్లా కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూ రావు.. తొలి నుంచి టిడిపి నాయకుడుగా, నందమూరి బాలకృష్ణకు మంచి ఆప్తమిత్రుడిగా పేరు సంపాదించుకున్నారు. తనకు సీటు ఇచ్చే విషయంలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు కాదన్నా బాలయ్య దగ్గర చక్రం తిప్పి తాను తలుచుకున్న చోట సీటును సాధించడంలో కదిరి బాబు నేర్పరి కావడంతో టిడిపిలో ఆయనకు తిరుగులేకుండా పోయింది. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీని వీడి బీజేపీలో గానీ వైసిపిలో చేరే ఆలోచనలో ఉన్నారని జనాలు అనుకుంటున్నారు.  15 ఏళ్ల క్రితం 2004 లో టిడిపిలో చేరి నందమూరి బాలకృష్ణ ఆశీస్సులతో టిడిపి అభ్యర్థిగా సీటు సాధించి దర్శి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు కదిరి బాబూరావు. అనంతరం 2009 లో తన రాజకీయ మకాంని సొంత నియోజకవర్గమైన కనిగిరికి మార్చి 2009 లో మరోసారి బరిలో నిలిచేందుకు ప్రయత్నించారు. ఎన్నికల అఫిడవిట్ లో సాంకేతిక కారణాలు తలెత్తడంతో డిస్ క్వాలిఫై కావడంతో చేసేదేమీ లేక సైలెంట్ అయిపోయారు. 2014  లో మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడి విజయం సాధించి తన చిరకాల కోరికను తీర్చుకున్నారు ఆయన. 2019 లో కనిగిరి నుంచి మరోసారి పోటీ చేసేందుకు ప్రయత్నించగా చంద్రబాబు నో చెప్పడంతో దర్శి నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. ఈ ఎన్నికలలో టిడిపి ఘోరపరాజయంపాలైంది.  తాను ఆశించిన కనిగిరి కాకుండా తనకు ఇష్టం లేని పెళ్లి చేసినట్టు దర్శిని కట్టబెట్టడంతో అధినేత చంద్రబాబుపై బాబురావు గుర్రుగా ఉన్నారు. అందుకే అటు బీజేపీ గానీ ఇటు వైసీపీలోకి గాని వెళ్లాలని నిర్ణయించుకొని ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారంటున్నారు. ఇప్పుడు ఆకస్మాత్తుగా తాడేపల్లిగూడెంలో తన సామాజిక వర్గానికి చెందిన కొందరు కీలక నేతలు భేటీ కావడంతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అక్కడికి వెళ్లారు. ఏమైందో ఏమో తెలీదు గానీ ఇప్పుడు జంక్షన్ లో నిలబడిపోయి దిక్కుల చూస్తున్నారు. అటు బీజేపీ లోకి వెళ్లలేక ఇటు వైసిపి లోకి వెళ్లే ఛాన్స్ లేక పోవడంతో ఏం చేయాలో తేల్చుకోలేక పోతున్నారు బాబూ రావు. కనిగిరిలో మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి ఉండగా తాను మనుగడ సాధించడం కష్టమని భావిస్తున్నారు. మరోవైపు టిడిపిలో కూడా తన పదవికి ఎసరు తెచ్చుకొని ఎటెళ్లాలో తెలియక జంక్షన్ లో జామ్ అయిపోయారంటున్నారు. ఇప్పుడు ఉన్న పార్టీ లోనే తన క్లియర్ చేసుకునేందుకు నానా పాట్లు పడుతున్నారనే ప్రచారం సాగుతోంది.  పార్టీకి సమాచారం ఇవ్వకుండా తాడేపల్లిగూడెంలో కాపు నాయకులతో భేటీ కావడంతో పార్టీ మార్పుపై చర్చ జరుగుతోంది. ఆయన మీద గుర్రుగా ఉన్న టిడిపి మరోసారి దర్శి బాధ్యతలనూ చూసుకునే బాధ్యతను అనధికారికంగా శిద్ధా రాఘవరావుకూ అప్పగించారు. శిద్దా రాఘవరావు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉండటంతో తన స్థానానికి ఎసరొచ్చేలా ఉందని కదిరి బాబురావు ఆందోళనలో పడ్డారు. నియోజక వర్గ కార్యకర్తలతో జరిగిన సమావేశాల్లో తానే ఇన్చార్జినని శిద్దా కాదని చెప్పుకుంటున్నారు. ఇక పై తాను చెప్పినట్లే కార్యకర్తలు నడవాలని తెలుగు తమ్ముళ్లకు హుకుం కూడా జారీ చేశారు. దీంతో ఇప్పుడు దర్శిలో శిద్దా కదిరిల మధ్య వార్ మొదలైందని తమ్ముళ్లు అనుకుంటున్నారు. మొత్తానికి ఇలా కంటిన్యూ అయిపోతూ అవకాశం వచ్చినప్పుడు బీజేపీలో చేరేందుకు ప్రయత్నించాలనీ కదిరి భావిస్తున్నారు. ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో చూడాలని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
విశాఖ తూర్పు నియోజక వర్గాల్లో వైసీపీ పరిస్థితి గందరగోళంగా ఉంది. ఈ నియోజక వర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా పరిగణిస్తారు. వరుసగా 3 సార్లు టిడిపి అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు అక్కడ విజయం సాధించారు. ఆయనకి ప్రత్యర్థి ఎవరని అడిగితే వంశీకృష్ణ శ్రీనివాస్ అని టక్కున సమాధానం వినిపిస్తుంది. వంశీకృష్ణ శ్రీనివాస్ మొదట్లో ప్రజారాజ్యంలో ఉన్నారు. ఒక్కసారి ఆ పార్టీ పక్షాన పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీ తరపున పోటీ చేసి కూడా ఓటమి పాలయ్యారు. తర్వాతి కాలంలో ఆయనకు తెలుగుదేశం పార్టీ నుంచి ఆఫర్ లు వచ్చినా జగన్ కి ఇచ్చిన మాటకు కట్టుబడి వైసిపి లోనే ఉండిపోయారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ అధిష్టానం వంశీకృష్ణ శ్రీనివాస్ కి షాకిచ్చింది. ఆయనకు కాదని  విజయనిర్మలకు టికెట్ కేటాయించింది వైసీపీ. దీంతో స్థానిక వైసీపీ కార్యకర్తల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకొని హడావుడి చేశారు. చివరకు జగన్ ఇచ్చిన హామీతో ఆ చిటపటలు సద్దుమణిగాయి.  మొన్నటి ఎన్నికల్లో విశాఖ తూర్పు నియోజక వర్గంలో విజయనిర్మలకు టికెట్ కేటాయించినప్పటికీ వంశీలాగానే ఓడిపోయారు. తొలుత విజయనిర్మల భీమిలి నియోజక వర్గ వైసీపీ ఇన్ చార్జిగా ఉన్నారు. భీమిలి సీటుని అవంతికి కేటాయించడంతో ఆమెను తూర్పు నియోజకవర్గానికి తీసుకువచ్చారు.ఆర్ధికంగా ఆమె బలంగా వుండటం, యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడం వంటి అంశాలు కలిసి వస్తాయని వైసిపి అధిష్టానం అంచనావేసుకుంది. వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకుడే. అయితే విశాఖ తూర్పులో అప్పటికే వెలగపూడి గెలుస్తారంటూ సర్వే రిపోర్టులు వచ్చాయి. ఇదే సమయంలో ఆయనకు గట్టి పోటీ ఇవ్వాలంటే ఆర్థికంగా బలమైన అభ్యర్థి అయ్యి ఉండాలని వైసిపి పెద్దల భావించారు. దీంతో విజయనిర్మలను రంగంలోకి దింపారు. అయినా ఓటమి పాలయ్యారు. ఇక వంశీకృష్ణ శ్రీనివాస్ కి మేయర్ లేదా ఎమ్మెల్సీ ఇస్తామని పార్టీ హైకమాండ్ బుజ్జగించింది. మరోపక్క వంశీకృష్ణకు వైసిపి నగర అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. ప్రస్తుతం విజయనిర్మల తూర్పు నియోజక వర్గ వైసీపీ ఇన్ చార్జ్ హోదాలో కొనసాగుతున్నారు. వంశీకృష్ణ వర్గీయులు పూర్తిస్థాయిలో సహకరించకపోవటం వల్లే ఓడిపోయినట్టు విజయనిర్మలతో పాటు ఆమె భర్త గట్టిగా భావిస్తున్నారు. ఈ తరుణంలో వీరి మధ్య కోల్డ్ వార్ మొదలయిందంటున్నారు.  ఎన్నికల అనంతరం నియోజకవర్గంలో పట్టు కోసం విజయనిర్మల భర్త తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. వంశీ పేరు రాకుండా ఇక వైసీపీ తూర్పు అంటే ఆమెనే గుర్తుకు రావాలనేలా ప్లాన్లు వేస్తున్నారు. తమకంటూ సొంత వర్గాన్ని తయారు చేసుకునే పనిలో బిజీగా ఉన్నారనీ జనాలంటున్నారు. వార్డు అధ్యక్షులు పార్టీ కమిటీల్లో తాము చెప్పిన వారికే అవకాశం ఇవ్వాలంటూ ఖచ్చితంగా చెబుతున్నారు. నియోజకవర్గాలలో తమకు తెలియకుండా ఏ పనులు చేయవద్దని ఎవరికి ఏం కావాలన్నా తమ వద్దకే రావాలంటూ పెత్తనం చలాయిస్తున్నారని అనుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో వంశీకృష్ణ శ్రీనివాస్ వెనుక నడవాలో లేక విజయనిర్మల వెనుక నడవాలో తెలియక పార్టీ కేడర్ గందరగోళపడుతోంది. పార్టీలో పదవుల విషయంలోనూ వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా సొంత జాబితా తయారు చేసుకుంటున్నారు. మంత్రి అవంతి అండదండలు కూడా విజయ నిర్మలకే ఉన్నాయని చెబుతున్నారు. దీంతో విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ రెండు వర్గాలుగా చీలిపోయిన మాట వాస్తవమేనని అంటున్నారు.
  గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎపిసోడ్ కొత్త మలుపు తిరిగింది. తెలుగుదేశం ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన వంశీపై, ఆ తర్వాత టీడీపీ కూడా సస్పెన్షన్ వేటేసింది. అనంతరం చంద్రబాబు, లోకేష్ పై ఘాటు విమర్శలు చేసి, తెలుగుదేశంలో కాక పుట్టించారు. అయితే, అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్నవేళ వంశీ... ఎటువైపు కూర్చుంటారోనన్న ఆసక్తి ఏర్పడింది. వైసీపీలో చేరతానని వల్లభనేని ప్రకటించిన నేపథ్యంలో అధికారపక్షం వైపు కూర్చుంటారేమోనని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, టీడీపీ వైపే... వెనుక పక్కన కూర్చున్న వంశీ... తెలుగుదేశానికి పక్కలో బల్లెం అనే సామెతను మరిపించారు. అయితే, రెండోరోజు వల్లభనేని వంశీ మాట్లాడేందుకు ప్రయత్నించిగా చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వంశీ మాట్లాడటానికి వీల్లేదంటూ టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు. వంశీ అసలు ఎమ్మెల్యేగా కొనసాగేందుకు అనర్హుడంటూ బాబు నిప్పులు చెరిగారు. అయితే, బాబు కామెంట్స్ పై అంతే ఘాటుగా స్పందించిన వంశీ... తనకు మాట్లాడే హక్కు ఎందుకు లేదని ప్రశ్నించారు. సీఎం జగన్ ను కలిసినంత మాత్రాన తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అంటూ బాబును నిలదీశారు. తాను అనేక ప్రజాసమస్యలపై సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశానని, కానీ తనపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయించారని మండిపడ్డారు. మంచి పనులు ఎవరూ చేసినా తాను అభినందిస్తానన్న వంశీ... అలాగే జగన్ ను కూడా ప్రశంసించానని తెలిపారు. అయితే, పచ్చ బ్యాచ్ తనపై విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. తాను, ఎమ్మెల్యేనని, తనకూ మాట్లాడే హక్కు ఉందన్న వల్లభనేని వంశీ... ఇకపై తాను టీడీపీతో కొనసాగలేనని, తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలంటూ స్పీకర్ ను కోరారు. దాంతో, వంశీని ప్రత్యేక సభ్యుడిగా గుర్తిస్తానంటూ స్పీకర్ ప్రకటించారు. స్పీకర్ ప్రకటనతో పార్టీ ఫిరాయింపులు కొత్త రూటు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. తెలుగుదేశం నుంచి బయటికి వచ్చే ఎమ్మెల్యేలను వైసీపీలో చేర్చుకోకుండానే, అసెంబ్లీలో ప్రత్యేక సభ్యులుగా గుర్తించే అవకాశం కనిపిస్తోంది.
ALSO ON TELUGUONE N E W S
  "సింపుల్‌గా చెప్పాలంటే ఇది ఇద్దరు మేనమామ మేనల్లుళ్ల మధ్య జరిగే లవ్ స్టోరీ. దాంటో అల్లరి, ఏమోషన్, డ్రామా ఉంటుంది. నేను ఈ కథను అలానే చూశాను. ప్రధానంగా ఇది వాళ్ల మధ్య ప్రేమానుబంధానికి సంబంధించిన కథ. మిగతావనీ సపోర్టింగ్ క్యారెక్టర్లే. తొలిసారి మేనమామ చేతుల్లోకి మేనల్లుడు ఎప్పుడొచ్చాడు, తొలిసారి మేనమామ అంటే మేనల్లుడికి గౌరవం కలిగింది.. ఎప్పుడు మేనమామ కోసం ప్రాణం ఇవ్వాలనిపించింది.. వంటివి ఇందులో ఉన్నాయి. ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య లవ్ ఎట్ ఫస్ట్ సైట్ తరహాలోనే వాళ్ల మధ్య ఆ ప్రేమను చూపాం" అని చెప్పారు 'వెంకీమామ' దర్శకుడు బాబీ అలియాస్ కె.ఎస్. రవీంద్ర. ఈ మూవీలో వెంకటేశ్ పేరు వెంకటరత్నం నాయుడు. అందరూ మిలట్రీ నాయుడు అని పిలుస్తుంటారు. "మట్టిలో పనిచేసే రైతు, దేశం కోసం పోరాడే సైనికుడు.. ఈ ఇద్దరే సృష్టిలో చాలా గొప్పవాళ్లు అని నమ్మే వ్యక్తిత్వం అతనిది. మిలటరీలోకి వెళ్లాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాడు. అందుకే ఊళ్లో అందరూ ఆయనను మిలట్రీ నాయుడు అని పిలుస్తుంటారు. వాళ్ల నాన్న నాజర్ ఊరి పెద్దగా కనిపిస్తారు. మిలట్రీ నాయుడి దగ్గరకు ఏ సమస్య తీసుకుపోయినా దానికి పరిష్కారం దొరుకుతుందని అతని దగ్గరకు వస్తూ ఉంటారు. అతను రైస్ మిల్లు నడుపుతుంటాడు. హాస్టల్లో చదువుకొనే పేద పిల్లల కోసం ఉచితంగా బియ్యం పంపిస్తుంటాడు" అని తెలిపారు బాబీ. చైతన్య పేరు కార్తీక్ శివరాం. "నాకు లభించిన ఇంకో సౌలభ్యం ఏమంటే, వాళ్లు సొంత మామా అల్లుళ్లు కావడం వల్ల ఒకరి పాత్రను మరొకరు ఎంజాయ్ చేస్తూ వచ్చారు. ఈ సినిమాతో చైతూకు మంచి పేరు రావాలని అటు సురేశ్‌బాబు గారు, ఇటు వెంకటేశ్ గారు.. ఇద్దరూ కంకణం కట్టుకున్నారు. దాంతో ఫ్రాంక్‌గా చెప్పాలంటే చైతన్య మీదే ఎక్కువ ఫోకస్ పెట్టాం. అంటే ఈ సినిమాలో మేనల్లుడి రోల్ చాలా కీలకం. వెంకటేశ్ గారు కోరుకోవడం వల్లే మాకు ఆ పాత్రను బాగా ఎలివేట్ చేసే స్వేచ్ఛ దొరికింది. ఎవరి పాత్ర పరిధి ఎంత ఉండాలి అనే లెక్కలు వేసుకోకుండా తియ్యగలిగాం. అదే సమయంలో తన మాయ్వయ్య కేరెక్టర్ బాగా రావాలని చైతన్య కూడా తపించాడు. అలా వాళ్లిద్దరి ప్రేమానుబంధాలతో, పాజిటివిటీతో ముందుకెళ్లాం. వెంకటేశ్ గారు ఎమోషన్స్, ఫన్ బాగా చేస్తారని అందరికీ తెలుసు. మాస్ యాక్టర్‌గానూ ఇదివరకు ఆయన చాలా సినిమాల్లో మెప్పించారు. ఈ సినిమాతో చాలా రోజుల తర్వాత ఆయనలోని మాస్ యాంగిల్‌ను చూపించాం. ఇక చైతన్యకు చాలా మంచి పేరొస్తుంది. ఏ ఆర్టిస్టుకైనా టఫెస్ట్ జాబ్ ఏంటంటే ఎమోషన్‌ను పండించడం. వెంకటేశ్ గారితో సమానంగా చైతన్య ఎమోషన్ పండించడం ప్రేక్షకుల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది" అని చెప్పుకొచ్చారు బాబీ.
  'దిశ' ఉదంతంలో నిందితులను ఎన్‌కౌంటర్ చెయ్యడం సరైనదేననీ, అయితే సమస్యకు అది పరిష్కారం కాదనీ అంటున్నాడు యంగ్ హీరో కార్తికేయ. '90ఎంఎల్' మూవీతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన అతను దిశ ఉదంతంపై తన అభిప్రాయాలను 'తెలుగుఒన్'తో పంచుకున్నాడు. "ఎన్‌కౌంటర్ జరగడం మంచిదే. సొసైటీకి అలాంటివాళ్లు చాలా డేంజర్. ఏ రోజుకైనా వాళ్లకు ఆ శిక్షే కరెక్ట్. ఇంకా దారుణంగా చేసినా తప్పులేదు. అయితే ఇలాంటి హత్యాచార ఘటనలు ఆగాలంటే ఇది సొల్యూషన్ కాదనేది నా అభిప్రాయం. చంపడం సమస్యకు పరిక్షారం కాదు. అలాంటి ఘటనలు ఎక్కడా జరక్కుండా చెయ్యడమే పరిష్కారం. అలాంటి వాతావరణం క్రియేట్ అవ్వాలంటే వీళ్లను చంపితే అవ్వదు. ఎన్‌కౌంటర్ జరిగిందని సెలబ్రేట్ చేసుకోకూడదు" అని చెప్పాడు కార్తికేయ. స్త్రీల విషయంలో మగవాళ్లకు చెడు ఆలోచనలు కలగని సమాజం రావాలని అతను ఆకాక్షించాడు. "స్కూల్లోనే దాన్నొక సబ్జెక్టుగా పెట్టాలి. అమ్మాయిల్ని గౌరవంగా చూడాలనే విషయాన్ని అబ్బాయిలకు స్కూలు రోజుల నుంచే నేర్పాలి. అలాగే అమ్మాయిలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి నేర్పించాలి. ప్రాథమిక విద్య నిర్బంధంగా అందరికీ అందేలా చూడాలి. క్షేత్ర స్థాయిలో ఒక తరం నుంచే మార్పు వస్తే సొసైటీలో మార్పు వస్తుంది. దీన్ని ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకొని, అలాంటి ఘటనలు ఎక్కడా జరక్కుండా చూసుకోవాలి" అని అతను సూచించాడు. దిశ ఉదంతంలో ఎన్‌కౌంటర్‌కు గురైన వాళ్లే నేరగాళ్లని అతను నమ్ముతున్నాడు. "వాళ్లు కూడా నేరాన్ని ఒప్పుకున్నారు. ఆమాత్రం చూసుకోకుండా పోలీసులు ఎన్‌కౌంటర్ చెయ్యరు. ఈ ఎన్‌కౌంటర్ వల్ల దిశ వాళ్ల ఫ్యామిలీకి కనీసం బతుకు మీద ఒక హోప్ ఉంటుంది. నిందితులెక్కడో హ్యాపీగా ఉన్నారని తెలిస్తే వాళ్లకు జీవితం మీదే ఆశ పోతుంది. ఎలాంటి నేరం చేసైనా సర్వైవ్ అవ్వచ్చంటే, చాలామందికి జీవితం మీద ఆశ పోతుంది. ఇలాంటిది జరిగితే కనీసం బాధిత కుటుంబాలు కుదుటపడతాయి" అని చెప్పాడు కార్తికేయ.  చదువులేని వాళ్లలోనే కాకుండా  చదువుకున్న వాళ్లలోనూ ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయని అతను బాధను వ్యక్తం చేశాడు. "ఆఫీసులో ఎవరైనా కొత్తమ్మాయో లేదా జూనియరో వచ్చిందంటే, ఆమెకు ఇష్టం లేకపోయినా వెళ్లి మాట్లాడటం, ఏదో గెలకడానికి ట్రై చెయ్యడం.. అలాంటి యాటిట్యూడ్ మన సొసైటీలో ఉంది. అదే మారాలి. దిశ ఆ టైంలో ఎవర్నీ తోడు తీసుకెళ్లలేదు. వెళ్లి టోల్‌గేట్ దగ్గర నిల్చోలేదు. ఎందుకంటే అక్కడ తనను చూస్తుంటారనే ఉద్దేశంతో. అంటే ఆమెకు మనమే అలాంటి స్థితిని క్రియేట్ చేశాం. ఎవర్నీ నమ్మేటట్లు లేని స్థితిని అమ్మాయిలకు మనకు తీసుకొచ్చాం. అది మారాలి" అని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. 
'కొత్త బంగారు లోకం' సినిమా గుర్తుందా? అందులో హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్ గుర్తుందా? తెలుగులో తొలి సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. తర్వాత సరైన ప్లానింగ్ లేక పైకి ఎదగలేదు. మంచి ఆర్టిస్ట్. టాలెంటెడ్ హీరోయినే. కానీ అదృష్టం ఆమెకు కలిసి రాలేదు. వ్యభిచార ఆరోపణలు రావడంతో హీరోయిన్ కెరీర్ నాశనం అయింది. మళ్ళీ కోలుకుని వెబ్ సిరీస్, సినిమాలు చేయడం ప్రారంభించారు. గతేడాది డిసెంబర్ 13న పెళ్లి చేసుకున్నారు. అంతా సంతోషంగా సాగుతుందనుకున్న సమయంలో మళ్ళీ ఆమె జీవితంలో ఓ కుదుపు. తొలి వివాహ వార్షికోత్సవానికి మూడు రోజుల ముందు విడాకులు తీసుకుంటున్నట్టు శ్వేతాబసు ప్రసాద్ ప్రకటించారు.  ప్రేమించి పెళ్లి చేసుకున్న రోహిత్ మిట్టల్, శ్వేతాబసు ప్రసాద్ విడిపోతున్నారు. కొన్ని నెలల క్రితమే తాము వేరుపడాలని నిర్ణయించుకున్నట్టు శ్వేతాబసు ప్రసాద్ తెలిపారు. రోహిత్ కు ఆమె థాంక్స్ చెప్పారు. ఎప్పటికి మరువలేని జ్ఞాపకాలను ఇచ్చినందుకు, ఎప్పుడూ తనలో స్ఫూర్తి నింపినందుకు థాంక్స్ చెప్పారు. ఎప్పటికి రోహిత్ కి తానొక చీర్ లీడర్ లా ఉంటానని ఆమె అన్నారు. ఆమె పోస్ట్ చూసి... పాపం అనుకునే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువుంది.
  మొత్తానికి రాంగోపాల్ వర్మ గట్టెక్కాడు. తన సినిమాలతో ఎవరెవరినో ఇబ్బందులు పెడుతూ వచ్చే ఆయనకు సెన్సార్ బోర్డు చుక్కలు చూపిస్తూ వస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. తాజాగా ఆయన 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' సినిమా కాస్తా సెన్సార్ బోర్డు వల్ల 'అమ్మరాజ్యంలో కడపబిడ్డలు'గా మారిపోయింది. పైగా నవంబర్ 29న రిలీజ్ చెయ్యడానికి ఆయన వేసుకున్న ప్లాన్‌ని కూడా అది డిస్టర్బ్ చేసింది. ఆ మూవీని రివైజింగ్ కమిటీకి సిఫార్సు చేసింది. ఎట్టకేలకు రివైజింగ్ కమిటీ కొన్ని కట్స్‌తో సినిమాకి 'యు/ఎ' సర్టిఫికెట్‌ను జారీ చేసింది. దాంతో డిసెంబర్ 12న సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు వర్మ ప్రకటించాడు. టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై సిద్ధార్థ తాతోలుతో కలిసి ఈ మూవీని ఆయన డైరెక్ట్ చేశాడు. "ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నఈ చిత్రం ట్రైలర్స్ కు, సాంగ్స్ కు విశేషమైన ఆదరణ లభించిన విషయం తెలిసిందే. ఏ వర్గాలను టార్గెట్ చేసి ఈ చిత్రం తీయలేదు. ఫ్యాక్షనిజం, రౌడీయిజమ్, రాజకీయాల నేపథ్యంతో సాగే కమర్షియల్ ఎంటర్టైనర్ ఈ మూవీ" అని మూవీ యూనిట్ ఒకప్రకటనలో తెలిపింది. ఇందులోని పాటల్లో ఏ పాటకు ఆ పాట హైలైట్ గా ఉంటుందని కూడా అది తెలిపింది. మరి చూద్దాం.. ప్రేక్షకులు 'అమ్మరాజ్యంలో కడపబిడ్డలు'ను ఏ రీతిలో ఆదరిస్తారో!
  "సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరీ కలయికవో సారధివో వారధివో మా ఊపిరీ కన్న కలవో విశ్వమంత ప్రేమ పండించగా పుట్టుకైన రుషివో సాటివారికై నీ వంతుగా ఉద్యమించు కృషివో మా అందరిలో ఒకడైన మనిషివో"..  అంటూ సాగే ఈ పాట సూపర్‌స్టార్ మహేశ్ నటిస్తోన్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలోనిది. సరిగ్గా వారం క్రితం టి-సిరీస్ రిలీజ్ చేసిన మాస్ సాంగ్ 'మైండ్ బ్లాక్' లిరికల్ వీడియో ఇప్పటి దాకా 11 మిలియన్ వ్యూస్ సాధించగా, ఇప్పుడు రెండో పాటను లహరి మ్యూజిక్ యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది. మెలోడియస్‌గా సాగిన 'సూర్యుడివో చంద్రుడివో' పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా, బి. ప్రాక్ పాడాడు. విన్నకొద్దీ బాగున్నట్లనిపించే ఈ పాటకు దేవి శ్రీ ప్రసాద్ అందించిన బాణీలు మొదటి పాటకంటే బాగున్నాయనిపిస్తోంది. మహేశ్ క్యారెక్టరైజేషన్ ఏమిటనేది ఈ పాట సాహిత్యం తెలియజేస్తోంది. ఆ పాత్ర గుణగణాల్నీ, గొప్పదనాన్నీ ఈ పాట తెలియజేస్తోంది. అటు సూర్యుడితోనూ, ఇటు చంద్రుడితోనూ పోలుస్తూ ఆ ఇద్దరి కలయికలా ఉన్నాడని చెప్పడం చూస్తుంటే.. సూర్యుడిలోని తీక్షణత, చంద్రుడిలోని చల్లదనం.. రెండూ ఉన్న అసామాన్యుడిగా మహేశ్ ఈ సినిమాలో కనిపించనున్నాడు. అంటే ప్రేమించేవారికి చల్లదనం పంచే ప్రేమమూర్తిగా, దుషుటుల పాలిట చండ్రనిప్పులు కురిపించే ధీరుడిగా ఆ క్యారెక్టర్‌ను డైరెక్టర్ మలుస్తున్నాడన్న మాట. అంతేనా.. అందరిలో ఒకడిగా ఉంటూనే సాటివారికోసం ఉద్యమించే బాధ్యత ఉన్న యువకుడు కూడా.  "గుండెలోతులో గాయం నువ్వు తాకితే మాయం మండు వేసవిలో పండు వెన్నెలలా కలిసింది నీ సహాయం పొలమారే ఆశల కోసం పొలిమేరలు దాటొచ్చావు తలరాతలు వెలుగయ్యేలా నేనున్నానన్నావు అడగందే అక్కర తీర్చే నీ మంచిని పొగడాలంటే మాలో పలికే మాటలు చాలవు".. అనే పల్లవి ప్రకారం గాయపడ్డ హృదయాలకు ఆపన్న హస్తాన్నందించే మానవతా మూర్తిగా అతను దర్శనమిస్తున్నాడు. ఆశలు వదిలేసుకున్న వాళ్లకు వెలుగులు పంచడానికి పొలిమేరలు దాటి వచ్చాడని, అడగకుండానే వాళ్ల అవసరాలు తీరుస్తున్నాడనీ ఈ పాట తెలియజేస్తోంది. అతడిలోని మంచిని పొగిడేందుకు కూడా వాళ్లకు మాటలు చాలడం లేదని చెప్పడమంటే.. నాయకుడిగా వాళ్ల హృదయాలను అంతగా గెలుచుకున్నాడని అర్థం. "దేవుడెక్కడో లేడూ వెరె కొత్తగా రాడూ మంచి మనుషులలో గొప్ప మనసు తనై ఉంటాడు నీకు లాగా ఏ లోక కల్యాణాన్ని ఆశించి జన్మిచ్చిందో  నిను కన్న తల్లి కడుపు నిండార పండింది నీ లాంటి కొడుకును మోసే ఈ భూమి భారతి సైతం నీ పయనానికి జయహో అన్నదీ".. అనే పల్లవితో మహేశ్ పాత్ర గొప్పదనాన్ని మహోన్నత స్థాయికి తీసుకుపోయాడు రచయిత. దేవుడనే వాడు ఎక్కడో ఉండడనీ, అతడిలాగా గొప్ప మనసున్న మనిషిలాగా దర్శనమిస్తాడనీ చెబుతున్నారు. ఏదో గొప్ప ఉద్దేశంతోనే అతడి తల్లి అతడికి జన్మనిచ్చిందనీ, అలాంటి కొడుకును మోసే భరత భూమి సైతం అతడి జర్నీకి జై కొడుతుందనీ ఈ పాటతో జేజేలు పలికారు. అయితే ఈ పల్లవిలో 'జన్మిచ్చిందో' అనే ప్రయోగం సరైనదేనా? మనకు తెలిసినంతవరకు 'జన్మనిచ్చిందో' అనే ప్రయోగం సరైనది. ట్యూన్‌కు తగ్గట్లు ఆ మాటను అలా కుదించారనుకోవాలి. సాంగ్ స్టార్టింగ్‌లో "మా ఊపిరి కన్న కలవో" అనేటప్పుడు సింగర్ ప్రాంక్ వాయిస్ కాస్త ఇబ్బందిగా అనిపించింది. క్రమేణా తన బేస్ వాయిస్‌తో అతడు ఆకట్టుకున్నాడు. కీబోర్డ్, రిథం, బాస్, గిటార్, షెహనాయి, సితార్, ఫ్లూట్ వంటి వాద్య పరికరాలతో ఈ పాటను కంపోజ్ చేశాడు దేవి. 'రంగస్థలం' తర్వాత ఆ స్థాయిలో ట్యూన్స్ రావట్లేదనే ఫిర్యాదును దేవి ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో 'సూర్యుడివో చంద్రుడివో' సాంగ్ అతడికి ఊరటనివ్వవచ్చని భావించవచ్చు. సాహిత్యపరంగా ఉన్నత స్థాయిలో ఉన్న ఈ పాటను తెలుగు గాయకుడు పాడితే గొంతులో భాషాదోషాలు దొర్లకుండా మరింత న్యాయం జరిగేదనిపించింది.  మొత్తానికి ఈ పాటతో 'సరిలేరు నీకెవ్వరు' అంటే టైటిల్‌కు తగ్గట్లే అతని క్యారెక్టర్ ఒక గొప్ప వ్యక్తిత్వంతో అందర్నీ ఆకట్టుకుంటుందనేది స్పష్టం. ఈ పాటను విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో, పచ్చని పొలాలు, మండువా ఇళ్ల మధ్య, నిండుగా కళకళలాడే పందిమంది మనుషుల మధ్య చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ పాటలో మహేశ్‌తో పాటు విజయశాంతి, రాజేంద్రప్రసాద్ కూడా కనిపించనున్నారు. తొలి పాట తరహాలోనే ఈ పాటలోనూ మనకు హీరోయిన్ దర్శన భాగ్యం లభించలేదు. సెట్స్‌పై దృశ్యాలనూ కలిపి ఈ లిరికల్ సాంగ్ వీడియోను రూపొందించారు. తొలి పాటకంటే మరింత వేగంగా శ్రోతల్ని ఆకట్టుకొనే ఈ పాటకు భాను కొరియోగ్రఫీ అందించాడు. రష్మికా మందన్న నాయికగా నటిస్తోన్న ఈ మూవీని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న విషయం మనకు తెలుసు. జనవరి 11న విడుదలవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని సాధిస్తుందని మహేశ్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
సౌతిండియన్‌ స్టార్‌ డైరెక్టర్‌ తీసిన ‘బాయ్స్‌’ చూశారా? హీరో అండ్‌ ఫ్రెండ్స్‌ కలిసి ఒక రోజు ఆంటీని బుక్‌ చేసుకుంటారు. అప్పట్లో ఆ సన్నివేశంపై చాలామంది విమర్శించారు. మరి, ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’ ట్రైలర్‌ చూస్తే ఏమంటారో? అమ్మాయిలే ఓ అబ్బాయుని బుక్‌ చేసుకున్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కినట్టు ట్రైలర్‌ చూస్తే తెలుస్తుంది. కొంచెం బోల్డ్‌గానే తీసినట్టున్నారు.నలుగురు అమ్మాయిలు... ఒకరు సింగిల్‌గా ఉన్న అమ్మాయి. అబ్బాయి బుగ్గ మీద ముద్ద పెట్టలేదని బాధపడుతుంది. మరొకరు అమ్మాయి ఫ్యాషన్‌ డిజైనర్‌. భర్తతో శృంగార సుఖం లేదని ఫీలయ్యే పెళ్లైన అమ్మాయి ఇంకొకరు. నాలుగో అమ్మాయి జర్నలిస్ట్‌. ఈ నలుగురూ గోవా వెళ్లి ఒక అబ్బాయిని బుక్‌ చేసుకుంటారు. నేను ముందంటే నేను ముందంటూ గొడవ పడతారు. కట్‌ చేస్తే... వీళ్ల హోటల్‌ గదిలో ఉండగా అతడు మరణిస్తాడు. ఆ తర్వాత ఏమైందనే కథతో థ్రిల్లర్‌గా తీసినట్టున్నారు. అసలే ఓ పక్క... ఓ అమ్మాయిని నలుగురు అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటనపై దేశమంతా ఊగిపోతుంటే? శృంగార సుఖం కోసం నలుగురు అమ్మాయిలు అబ్బాయిని బుక్‌ చేసుకునే కాన్సెప్ట్‌తో సినిమా తీయడం ఏంటో? దీనిపై మహిళా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
రీమేక్‌ చేస్తే ఓ తలనొప్పి ఉంటుంది. ఒరిజినల్‌ సినిమాతో కంపేరిజన్స్‌ వస్తాయి. ఒరిజినల్‌లో హీరో ఏం చేశాడు? రీమేక్‌లో హీరో ఎలా చేశాడు? అని సీన్‌ టు సీన్‌, ఎమోషన్‌ టు ఎమోషన్‌ చెక్‌ చేసే విమర్శకులు, విశ్లేషకుల సంఖ్య తక్కువేం కాదు. అటువంటిది సేమ్‌ క్యారెక్టర్‌ ఇద్దరు చేస్తే ఎవరు ఎలా చేశారని విశ్లేషించకుండా ఉంటారా? జయలలితగా కంగనా రనౌత్‌, రమ్యకృష్ణ నటనను విశ్లేషించడం మొదలుపెట్టారు. జయలలితగా కంగనా రనౌత్‌ సినిమా చేస్తున్నారు. ఏఎల్‌ విజయ్‌ డైరెక్టర్‌. ఈ సినిమా టైటిల్‌ ‘తలైవి’. జయలలితగా రమ్యకృష్ణ నటిస్తున్నది వెబ్‌ సిరీస్‌. గౌతమ్‌ మీనన్‌ ఓ డైరెక్టర్‌గా చేస్తున్నారు. టైటిల్‌ ‘క్వీన్‌’. ఆల్రెడీ రెండిటి టీజర్స్‌ విడుదలయ్యాయి. కంగనాకు మైనస్‌ మార్కులు పడితే... రమ్యకృష్ణకు మంచి మార్కులు పడ్డాయి. కంగన సినిమా ముందు వస్తుందా? రమ్యకృష్ణ వెబ్‌ సిరీస్‌ ముందు వస్తుందా? అనే ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. వీటికి రమ్యకృష్ణ ఫుల్‌స్టాప్‌ పెట్టారు. తమదే ముందు వస్తుందని స్పష్టం చేశారు. ‘‘కంపేరిజన్స్‌ వస్తాయని నాకు తెలుసు. కానీ, మా షో ముందు విడుదలవుతుంది’’ అని రమ్యకృష్ణ అన్నారు.  ‘తలైవి’ వచ్చే ఏడాది జనవరి 26న విడుదల కానుంది. అంతకంటే ముందు ‘క్వీన్‌’ ఇంటర్నెట్‌లో విడుదలవుతుందన్నమాట!
మూవీ మోఘల్‌ రామానాయుడిగారికి ఓ కల ఉండేది... అబ్బాయ్‌ వెంకటేశ్‌, మనవళ్లు నాగచైతన్య, రానాతో కలిసి ఓ సినిమా నిర్మించాలని! అది కలగానే మిగిలింది. అయితే... తాజాగా మేనల్లుడు నాగచైతన్యతో కలిసి వెంకటేశ్‌ ‘వెంకీమామ’ చేశారు. పైలోకాల నుండి రామానాయుడుగారు ఈ చిత్రం చూసి తప్పకుండా సంతోషిస్తారని చెప్పవచ్చు. మరి, అన్నయ్య సురేశ్‌బాబు కుమారుడు రానా దగ్గుబాటితో కలిసి వెంకటేశ్‌ ఎప్పుడు సినిమా చేస్తారనేది క్లారిటీ లేదు. ఈలోపు సురేశ్‌బాబు చిన్న కుమారుడు, రానా తమ్ముడు అభిరామ్‌తో వెంకటేశ్‌ కలిసి నటిస్తున్నారని ఓ వార్త బయటకొచ్చింది. తమిళ హిట్‌ ‘అసురన్‌’ను తెలుగు వెంకటేశ్‌ హీరోగా కలైపులి ఎస్‌. థానుతో కలిసి సురేశ్‌బాబు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించనున్నారు. తమిళంలో ధనుష్‌ పోషించిన పాత్రను తెలుగులో వెంకటేశ్‌ పోషిస్తున్నారు. సినిమాలో హీరోకి ఇద్దరు కుమారులు ఉంటారు. ఓ కుమారుడిగా అభిరామ్‌ నటించనున్నారని వార్తలు వచ్చాయి. అటువంటిదేమీ లేదని సురేశ్‌బాబు తెలిపారు. ‘‘అభిరామ్‌ నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు. అది పూర్తవ్వాలి. రావాలి. ‘అసురన్‌’లో అభిరామ్‌ నటించడం లేదు’’ అని ఈ నెల 13న ‘వెంకీమామ’ విడుదల కానున్న సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సురేశ్‌బాబు తెలిపారు.
  హిందీ తారలే కాదు, తెలుగు తారలు కూడా ఇప్పుడు వెబ్ సిరీస్ వైపు దృష్టి సారిస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరుగా వెబ్ సిరీస్‌కు సైన్ చేస్తూ మారుతున్న కాలంతో తామూ మారుతున్నామని తెలియజేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగాక జనం యూట్యూబ్‌తో పాటు అమెజాన్ ప్రైం, నెట్‌ఫ్లిక్స్ వంటి ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సైట్లకు అతుక్కుపోతున్న విషయం మనకు తెలుసు. ఆ సైట్లను దృష్టిలో ఉంచుకొని అనేకమంది వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేస్తున్నారు. వాటిపై వచ్చే ఆదాయం అంతకంతకూ పెరుగుతుండటంతో పేరున్న సంస్థలూ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నాయి. 'బ్రీత్', 'లస్ట్ స్టోరీస్', 'సాక్రెడ్ గేమ్స్', 'మిర్జాపూర్', 'ఇన్‌సైడ్ ఎడ్జ్', 'ద ఫ్యామిలీ మ్యాన్' వంటి హిందీ వెబ్ సిరీస్‌లో పేరుపొందిన తారలు సైఫ్ అలీ ఖాన్, మనోజ్ బాజ్‌పేయి, కియారా అద్వానీ, మాధవన్, రాధికా అప్టే, మనీషా కొయిరాలా, వివేక్ ఓబరాయ్, నవాజుద్దీన్ సిద్దిఖీ, పంకజ్ త్రిపాఠి, రిచా చద్దా వంటివాళ్లు నటించడంతో టాలీవుడ్ తారలూ వాటిపై ఆసక్తి చూపిస్తున్నారు.  ఇప్పటికే 'ద ఫ్యామిలీ మ్యాన్'లో మనోజ్ బాజ్‌పేయి భార్యగా కీలక పాత్రలో ప్రియమణి నటించి వీక్షకుల ఆదరణపొందింది. ఇటీవలే 'లస్ట్ స్టోరీస్' తెలుగు వెర్షన్‌లో తెలుగమ్మాయి ఈషా రెబ్బా నటించడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. 'ఘాజి', 'అంతరిక్షం' సినిమాల దర్శకుడు సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న సెగ్మెంట్‌లో ఈషా నటిస్తోంది. ఇప్పటి దాకా పక్కింటమ్మాయి తరహా పాత్రలు చేస్తూ వచ్చిన ఆమె ఈ సిరీస్‌లో 'బోల్డ్'గా కనిపించనుండటం విశేషం. ఆమెకంటే ముందు నాగబాబు కుమార్తె నిహారిక 'ముద్దపప్పు ఆవకాయ', 'నాన్న కూచి' సిరీస్ చేసింది. అలాగే నవదీప్, అదిత్ అరుణ్, తేజస్విని మదివాడ కలిసి 'మన ముగ్గురి లవ్‌స్టోరీ' అనే వెబ్ సిరీస్ చేశారు. మంచు లక్ష్మి 'మిసెస్ సుబ్బలక్ష్మి', అమల అక్కినేని 'హై ప్రీస్టెస్' సిరీస్ చేశారు. ఇప్పుడు పేరుపొందిన హీరోయిన్లు సైతం ఈ వెబ్ సిరీస్‌ ఫార్మట్‌కు ఆకర్షితులవుతున్నారు.  సమంత ఏ స్థాయి నటో మనకు తెలుసు. నాగచైతన్యతో వివాహానికు ముందు టాలీవుడ్‌లోని టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా వెలిగిపోతూ వచ్చిన ఆమె, పెళ్లి తర్వాత మరింతగా ప్రేక్షకులని ఆకట్టుకుంటూ వస్తోంది. 'మెర్సాల్', 'రంగస్థలం', 'మహానటి', 'ఇరుంబు తిరై', ('అభిమన్యుడు'), 'యు టర్న్', 'సూపర్ డీలక్స్' (తమిళం), 'మజిలీ', 'ఓ బేబీ' సినిమాలతో ఆమె ఇమేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం '96' రీమేక్‌లో శర్వానంద్‌తో కలిసి నటిస్తోంది. అలాంటి ఆమె ఇప్పుడు 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా, ఇప్పటికే షూటింగ్‌లో పాల్గొంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేస్తోన్న ఈ సిరీస్ అమెజాన్ ప్రైం వీడియోలో టెలికాస్ట్ కానున్నది. ఇందులో తను ఒక డ్రీం రోల్‌లో నటిస్తున్నానని సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ద్వారా తెలిపింది సమంత. "మై వెబ్ సిరీస్ డెబ్యూ విత్ ద మోస్ట్ కిక్‌యాస్ షో" అంటూ ఆ వెబ్ సిరీస్‌పై తన అభిప్రాయాన్ని ప్రకటించింది. ఈ వెబ్ సిరీస్‌కు గ్లోబల్ రీచ్ ఉండటం, ఇప్పటి దాకా తాను సినిమాల్లో చెయ్యని పలు కోణాలున్న రోల్ కావడం వల్లే ఈ సిరీస్ చేస్తున్నానని తెలిపింది సమంత.  సమంత తరహాలో మరో పాపులర్ హీరోయిన్ సైతం వెబ్ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఆమె 'బాహుబలి'లో అవంతిక పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా అభిమాన గణాన్ని సంపాదించుకున్న తమన్నా. హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్న 'ద నవంబర్ స్టోరీ' అనే తమిళ వెబ్ సిరీస్‌లో ఆమె నటించనున్నది. తండ్రీకూతుళ్ల మధ్య బంధం ప్రధానంగా రూపొందే ఈ సిరీస్‌లో కూతురిగా తమన్నా, తండ్రిగా ప్రముఖ తమిళ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జి.ఎం. కుమార్ నటించనున్నారు. క్రిమినల్ అయిన తండ్రిని మంచి మనిషిగా మార్చే కూతురిగా తమన్నా ఈ సిరీస్‌లో కనిపిస్తుందని సమాచారం. రెండున్నర గంటల సినిమాల్లో కనిపించే రోల్స్ కంటే మరింత చాలెజింగ్ రోల్స్ ఈ వెబ్ సిరీస్‌లో లభిస్తున్నాయనీ, తనలాంటి తారలకు ఈ వెబ్ సిరీస్ బాగా ఉపకరిస్తాయనీ అంటోంది తమన్నా. ఒక వెబ్ సిరీస్ చేయడమంటే ఐదు సినిమాలు చేసిన దానితో సమానమని, కానీ తక్కువ సమయంలోనే వెబ్ సిరీస్‌ను చేసేయవచ్చని ఆమె తెలిపింది.  ఇలా పేరుపొందిన తారలు చేయడానికి ముందుకు వస్తుండటంలో రాబోయే రోజుల్లో వెబ్ సిరీస్ అనేవి ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ప్రధాన పాత్ర వహించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.  
మెగా బ్రదర్‌ నాగబాబు పేరుకు ముందు ‘నవ్వులు’ తీసుకొచ్చింది ‘జబర్దస్త్‌’ కామెడీ షో. ఈ బుల్లితెర కార్యక్రమం ద్వారా నువ్వుకుంటున్న జనాల సంఖ్య ఎక్కువే. ఈ షో ద్వారా నాగబాబు కాస్తా ‘నవ్వుల’ నాగబాబు అయ్యారు. మల్లెమాల సంస్థకు, నాగబాబుకు ఎక్కడ చెడిందో... ఆయన షో నుండి తప్పుకున్నారు. కానీ, షోతో ‘మెగా’ బంధం మాత్రం కొనసాగుతోంది. జబర్దస్త్‌ నుండి నాగబాబు నిష్క్రమణ తర్వాత... షోపై ఎఫెక్ట్‌ ఉంటుందని కొందరు, ఏం ఉండదని మరికొందరు తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నాగబాబు ప్లేస్‌లో జడ్జ్‌ కింద మరొకరు ఇంకా రాలేదు కానీ... ఎవరో ఒకరితో పని కానిస్తున్నారు. ఒక ఎపిసోడ్‌కు రోజా సోలో జడ్జ్‌గా వ్యవహరించారు. తర్వాత నుండి ఎక్ట్సా జబర్దస్త్‌కు అలీ వచ్చారు. జబర్దస్త్‌కు దగ్గరలో రిలీజులు ఉన్న సినిమా హీరోలతో చేస్తున్నారు. ‘అర్జున్‌ సురవరం’ విడుదలకు ముందు ఎక్ట్సా జబర్దస్త్‌కు నిఖిల్‌ వచ్చాడు. ‘90ఎంఎల్‌’ విడుదలకు ముందు జబర్దస్త్‌కు కార్తికేయ వచ్చాడు. వచ్చే వారం మెగా మేనల్లుడు సాయితేజ్‌ జబర్దస్త్‌లో సందడి చేయనున్నాడు. ‘ప్రతిరోజూ పండగే’ ఈ నెల 20న విడుదల కానున్న సందర్భంగా సినిమా ప్రమోషన్‌ కోసం జబర్దస్త్‌కి అతిథిగా వస్తున్నాడు. ఆల్రెడీ ప్రోమో రిలీజైంది. మావయ్య నాగబాబు షో నుండి వచ్చేసినా అతడు వెళ్లడం విశేషమే. అంతకు ముందు నాగబాబు జడ్జ్‌గా ఉన్నప్పుడు షోకి వెళ్లాడు. అప్పటికీ, ఇప్పటికీ తేడా ఉండడంతో చర్చనీయాంశం అవుతోంది.
  తీవ్ర నిరాశా నిస్పృహలు.. ఆవేదన.. కూడకట్టుకున్న ఆర్టీసీ కార్మికులకు ముఖ్య మంత్రి కేసీఆర్ ఎట్టకేలకు తీపి కబురు చెప్పారు. భేషరతుగా ఉద్యోగాల్లో చేరొచ్చని స్పష్టం చేశారు. ప్రభుత్వం తలచుకుంటే సమ్మెను లేబర్ కోర్టుకు పంపగలదని అలా చేస్తే కార్మికుల ఉద్యోగాలు ఊడిపోతాయి కాబట్టి తాము అలా చేయటం లేదని ఊరటనిచ్చారు. ఆర్టీసీ మనుగడకు తక్షణమే రూ.100 కోట్ల రూపాయల ఇస్తున్నారని కూడా ప్రకటించారు. సమ్మె కాలంలో మరణించిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ మనుగడ పేరిట చార్జీలనూ కిలో మీటరుకు 20 పైసల చొప్పున పెంచేశారు. డిసెంబర్ 2 నుంచి పెంచిన చార్జీలు అమలులోకి వస్తాయని ప్రకటించారు. సమ్మె కాలంలో తాత్కాలికంగా పని చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు బెదిరించినా.. అవమానించినా.. భరిస్తూ కష్టకాలంలో పని చేశారని భవిష్యత్తులో తప్పకుండా వారి గురుంచి ప్రభుత్వం ఆలోచిస్తుందని హామీ ఇచ్చారు. క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో కలిసి కేసీఆర్ విలేకరులతో మాట్లాడారు.  ప్రభుత్వం ఎన్నో సంస్థలను కాపాడింది.. ఎంతో మందికి అన్నం పెట్టింది.. అలాంటిది ఆర్టీసీ కార్మికులను బజారున పడేస్తే ప్రభుత్వానికి వచ్చేది ఏముందని..చివరిగా ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దాం అని కేబినెట్ చర్చల్లో మంత్రులు తెలిపినట్లుగా కేసీఆర్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున.. ఆర్టీసీ సంస్థ తరుపున.. సదరు కార్మికుడికి చెబుతున్నా.. " ఇక ఇప్పటికైనా మీరు తెలుసుకోండి.. అందరి మాటలు నమ్మి మీరు మోసపోకండి.. ఇప్పుడే ఆదేశాలు ఇస్తున్నాను వెళ్లి ఉద్యోగాల్లో చేరి మంచిగ బ్రతకండి.. మీ సంస్థను బ్రతికించుకోండి " అని పిలుపునిచ్చారు కేసీఆర్. మీరు మా బిడ్డలని ఎన్నడో చెప్పాము అలానే చూసుకుంటాము. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్మికుల పొట్టనింపామే కానీ పొట్టలు కొట్టిన దాఖలాలు లేవని అన్నారు. దేశ వ్యాప్తంగా ఆశా వర్కర్లకు,హోమ్ గార్డులకు ఇలా చాలా మందికి ఎక్కువ వేతనం ఇస్తుంది కేవలం తెలంగాణలోనే అని స్పష్టం చేశారు. ట్రాఫిక్ పోలీసులకు 30% శాతం రిస్క్ అలవెన్సు ఇస్తున్నామని.. ఇండియాలో తెలంగాణ ఒక్కటే దీనిని ఇస్తోందన్నారు. ఒంటరి మహిళలకు పింఛన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారు. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా వారికి పింఛను ఇవ్వట్లేదని, ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఇవ్వడం లేదని వివరించారు. యూనియన్ల మాటలు నమ్మి కార్మికులు పెడదారి పట్టారని సంస్థను దెబ్బతీస్తున్నారని వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని కేసీఆర్ మండిపడ్డారు.
# (అక్టోబర్‌ 21)న మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగగా... బీజేపీ-శివసేన ఒక కూటమిగా, కాంగ్రెస్-ఎన్సీపీ మరో కూటమిగా బరిలోకి దిగాయి. # (అక్టోబర్‌ 24)న మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 288 స్థానాలకు బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్ 44 సీట్లు గెలుచుకోవడంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. అయితే, కూటమిగా బరిలోకి దిగిన బీజేపీ-శివసేనకు కలిపి 161 స్థానాలు రావడంతో... ఎప్పటిలాగే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని అంతా భావించారు.  # (అక్టోబర్‌ 25)న బీజేపీ, శివసేన మధ్య విభేదాలు బయటపడ్డాయి. 50-50 ఫార్ములాను తెరపైకి తెచ్చిన శివసేన... ఎన్నికలకు ముందు జరిగిన ఒప్పందం మేరకు ము‌ఖ్యమంత్రి పదవిని చెరి రెండున్నరేళ్లు పంచుకోవాల్సిందేనంటూ పట్టుబట్టింది. అయితే, శివసేన డిమాండ్‌ను బీజేపీ తిరస్కరించడంతో మహా డ్రామా మొదలైంది. ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన శివసేన... ఎన్సీపీ అండ్ కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరిపింది. మరోవైపు, శివసేనను చీల్చి, ఇండిపెండెంట్ల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ పావులు కదిపింది. ఇలా అక్టోబర్ 25నుంచి నవంబర్ 9వరకు మహారాష్ట్రలో నెంబర్ గేమ్ సాగింది. # (నవంబర్ 9) మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియడంతో, ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వానించారు.  # (నవంబర్ 10) తగినంత సంఖ్యాబలం లేనందున తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని బీజేపీ తేల్చిచెప్పడంతో, సెకండ్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన శివసేనను ఆహ్వానిస్తూ, 24గంటల గడువిచ్చారు. # (నవంబర్ 11) అయితే, ఎన్సీపీ-కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయానికొచ్చిన శివసేన... చర్చల ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడంతో, ప్రభుత్వ ఏర్పాటుకు 3రోజులు గడువు ఇవ్వాలని గవర్నర్‌ను కోరింది. శివసేన విజ్ఞప్తిని తిరస్కరించిన గవర్నర్... మూడో అతిపెద్ద పార్టీగా నిలిచిన ‎ఎన్సీపీకి ఆహ్వానం పలికారు.  # (నవంబర్ 12) అయితే, ఎన్సీపీకి ఇచ్చిన గడువు ముగియకముందే, రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫార్సు చేయడంతో... కేంద్రం, రాష్ట్రపతి ఆమోదంతో ఆగమేఘాల మీద, ప్రెసిడెంట్‌ రూల్ విధించారు. # (నవంబర్ 13) గవర్నర్‌ నిర్ణయంపై మండిపడ్డ శివసేన... ప్రభుత్వ ఏర్పాటుకు తాము గడువు కోరినా, ఇవ్వలేదంటూ, సుప్రీంను ఆశ్రయించింది. # (నవంబర్ 13-21) ఒకవైపు సుప్రీంలో కేసు నడుస్తుండగానే... మరోవైపు కాంగ్రెస్‌, ఎన్సీపీలతో శివసేన సంప్రదింపులు సాగించింది. అయితే, శరద్ పవార్‌‌ను మోడీ ప్రశంసించడం... వెంటనే ప్రధానితో పవార్ సమావేశం కావడంతో... బీజేపీ-ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయేమోనంటూ ప్రచారం జరిగింది. # (నవంబర్ 22) శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ మధ్య చర్చలు కొలిక్కిరావడంతో, ఉద్ధవ్‌కు మద్దతిచ్చేందుకు సోనియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మహారాష్ట్ర వికాస్ అఘాడీ పేరుతో కూటమిని ఏర్పాటు చేశారు. # (నవంబర్ 23) అయితే, శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవడంతో... బీజేపీ రాత్రికి రాత్రే వేగంగా పావులు కదిపింది. ఎవరూ ఊహించనివిధంగా ఉదయం 5:47కి రాష్ట్రపతి పాలన ఎత్తేయగా, ఆ కొద్దిసేపటికే ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా... ఎన్సీపీ-శాసనసభాపక్షనేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. దాంతో, దేశం మొత్తం నివ్వెరపోయింది. ఇక, శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ అయితే ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాయి. ఎన్సీపీ-శాసనసభాపక్షనేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయడంతో... ఎన్సీపీలో చీలిక వచ్చిందేమోనని భావించారు. అయితే, అజిత్ వెంట ఒక్క ఎమ్మెల్యే కూడా లేరని శరద్ పవార్ ప్రకటించడంతో మహా డ్రామా మరో కొత్త మలుపు తిరిగింది. అదే సమయంలో, గవర్నర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ సుప్రీంను ఆశ్రయించాయి.  # (నవంబర్ 24) శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పిటిషన్లపై అత్యవసర విచారణ జరిపిన సుప్రీం... గవర్నర్‌కు బీజేపీ సమర్పించిన మద్దతు లేఖలను తమ ముందు పెట్టాలని ఆదేశించింది. # (నవంబర్ 25) శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌లు బల ప్రదర్శనకు దిగాయి. 162మంది ఎమ్మెల్యేలతో మహా పరేడ్ నిర్వహించాయి.  # (నవంబర్ 26) మహారాష్ట్ర వివాదంపై తుది తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు.... బలనిరూపణ చేసుకోవాలంటూ ఫడ్నవిస్ ప్రభుత్వానికి ఒక్కరోజు టైమిచ్చింది. అయితే, సుప్రీం తీర్పు తర్వాత మహారాష్ట్రలో పరిణామాలు వేగంగా మారిపోయాయి. అయితే, బలపరీక్షకు ముందే చేతులెత్తేసిన ఫడ్నవిస్‌... ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.  # (నవంబర్ 26-27) బలపరీక్షకు ముందే బీజేపీ చేతులెత్తేయడంతో... ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ కూటమి ముందడుగు వేసింది. మహారాష్ట్ర వికాస్ అఘాడీ కూటమి నేతగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేను ఎన్నుకున్నారు. అనంతరం గవర్నర్‌ను కలిసి ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన లేఖను అందజేశారు. దాంతో, డిసెంబర్ ఒకటిన శివాజీ పార్క్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే‌.... డిప్యూటీ సీఎంలుగా ఎన్సీపీ నేత జయంత్ పాటిల్... కాంగ్రెస్ లీడర్‌ బాలా సాహెబ్‌ థోరాట్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో పోరుబాట పట్టిన తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమ పోరాటానికి ముగింపు పలికారు. డిమాండ్ల సాధన కోసం 52రోజులుగా చేస్తోన్న సమ్మెను విరమించారు. కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించిన ఆర్టీసీ జేఏసీ కన్వీనర్... విధులకు హాజరవుతామని ప్రకటించింది. ఒకవైపు హైకోర్టులో ఆశించిన న్యాయం జరగకపోవడం... మరోవైపు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో... విధిలేని పరిస్థితుల్లో సమ్మెకు ముగింపు పలికారు. అయితే, లేబర్ కోర్టులో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని అశ్వద్ధామరెడ్డి వ్యక్తంచేశారు. ప్రభుత్వం గెలవలేదు... కార్మికులు ఓడిపోలేదంటోన్న అశ్వద్ధామరెడ్డి.... ఆర్టీసీని కాపాడుకునేందుకే సమ్మె విరమిస్తున్నట్లు తెలిపారు. కార్మికులెవరూ నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదని, ఇప్పటివరకు చరిత్రలో లేనివిధంగా 52రోజులపాటు పోరాటంచేసి కార్మికులు నైతిక విజయం సాధించారని అన్నారు. ఇక, సమ్మె కాలంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు జేఏసీ అండంగా ఉంటుందని, అన్నివిధాలా ఆదుకుంటుందని ప్రకటించారు. అయితే, తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు రేపట్నుంచి విధులకు రావొద్దని కోరిన అశ్వద్ధామరెడ్డి... కార్మికులను అడ్డుకోవద్దని ఆర్టీసీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. అయితే, నాలుగైదు రోజులుగా తిరిగి విధుల్లో చేరేందుకు ఆర్టీసీ కార్మికులు ప్రయత్నిస్తున్నా... అధికారులు మాత్రం తిప్పిపంపుతున్నారు. ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. దాంతో పలు డిపోల దగ్గర ఆర్టీసీ కార్మికులు పడిగాపులు పడుతున్నారు. అయితే, సమ్మె విరమించి విధుల్లోకి చేరతామని ప్రకటించినందున... కార్మికులను అడ్డుకోవద్దని ఆర్టీసీ యాజమాన్యానికి అశ్వద్ధామరెడ్డి విజ్ఞప్తి చేశారు. కానీ, ఇప్పటికిప్పుడు విధుల్లోకి తీసుకునే ప్రసక్తే లేదంటూ ఆర్టీసీ యాజమాన్యం ఊహించని షాక్ ఇచ్చింది.
హైదరాబాద్‌లో ఫ్లైఓవర్స్ ...మృత్యు మార్గాలుగా మారుతున్నాయి. అతివేగం, నిర్లక్ష్యం కారణంగా ఫ్లైఓవర్లు నెత్తుటితో తడుస్తున్నాయి. హైదరాబాద్లోని ప్రతి ఫ్లైఓవర్‌పైనా నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. దాంతో, ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇక, గచ్చిబౌలి బయోడైవర్సిటీ ప్లైఓవర్‌పై... జరిగిన ప్రమాదమైతే.... హైదరాబాదీల్లో వణుకు పుట్టిస్తోంది. అయితే, బయోడైవర్సిటీ ప్లైఓవర్ ను ప్రారంభించిన 20రోజుల్లోనే మూడు ప్రమాదాలు జరగడం... ముగ్గురు మృత్యువాతపడటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. బయోడైవర్సిటీ ప్లైఓవరే కాదు.... బేగంపేట్ - పంజగుట్ట ఫ్లైఓవర్ పై కూడా పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగి ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.ఇక, నల్గొండ క్రాస్ రోడ్ ఫ్లైఓవర్ పైనే తరుచూ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. మలక్ పేట్‌ రైల్వే అండర్ బ్రిడ్జ్ నుంచి సైదాబాద్ వెళ్లే ఫ్లైఓవర్ పైనా కర్వ్ ఉండటంతో నిత్యం ఏదో ఒక యాక్సిడెంట్ అవుతూనే ఉంటుంది. అయితే, హైదరాబాద్ లో బయోడైవర్సిటీ ప్లైఓవరే అత్యంత డేంజర్ అంటున్నారు ఇంజనీరింగ్ నిపుణులు. హైదరాబాద్‌లో నిర్మించిన ఫ్లైఓవర్లలో అత్యంత ఎత్తైనది గచ్చిబౌలి బయోడైవర్సిటీ ప్లైఓవర్. నల్గొండ క్రాస్‌రోడ్‌ ఫ్లైఓవర్‌ రేడియస్‌ 40 మీటర్లు ఉంటే, పంజగుట్టది 60 నుంచి 65 మీటర్లు ఉంటుంది. ఇక, బయోడైవర్సిటీ రేడియస్ మాత్రం 80 నుంచి 120 మీటర్లుగా ఉంది. ఈ ఫ్లైఓవర్‌పై గంటకు ప్రయాణ వేగం  40 కిలోమీటర్లతోనే వెళ్లాలి.. కానీ బోల్తాపడ్డ కారు ప్రమాద సమయంలో 105 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ...సూపర్‌ ఎలివేషన్‌తో క్రాష్‌ బారియర్స్‌ ఉన్నా ...పైకెగిరి కిందపడింది. 80 కిలోమీటర్ల వేగంతో ఢీకొట్టినా తట్టుకునేలా క్రాష్‌ బారియర్స్‌ ఏర్పాటు చేశారు. సాధారణంగా క్రాష్‌ బారియర్స్‌ను ఢీకొంటే.. వాహనం తిరిగి వెనక్కి వస్తుంది. కానీ నియంత్రించలేని అతి వేగం వల్ల క్రాస్‌బారియర్స్‌ ను దాటుకుని పైకెగిరి మరీ కారు కింద పడినట్లు ఇంజినీర్లు చెబుతున్నారు. అయితే, రాయదుర్గం నుంచి హైటెక్ సిటీ, ఇనార్బిట్ మాల్‌ వైపు వెళ్లేందుకు ఎలాంటి ఆటంకాల్లేకపోవడంతో బయోడైవర్సిటీ ప్లైఓవర్ పైనుంచి అతివేగంతో దూసుకుపోతున్నారు. అయితే, వంతెన మధ్య భాగంతో దాదాపు 150 మీటర్ల మేర కర్వ ఉండటంతో... వేగాన్ని నియంత్రించాలని ప్రయత్నించినా సాధ్యంకాకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి కారణంగా డిజైన్ లోపం ఒకటైతే.... జాగ్రత్తలు తీసుకోకపోవడం మరో రీజన్.  బయోడైవర్సిటీ ప్లైఓవర్ ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు. ముఖ్యంగా బయోడైవర్సిటీ ప్లైఓవర్‌ ను ప్రారంభించిన 20రోజుల్లోనే మూడు ప్రమాదాలు జరగడం ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, పౌరుల్లో మార్పు రాకపోతే, ఇలాంటి ప్రమాదాలను అరికట్టలేమంటున్నారు మరికొందరు. ఇదిలా ఉంటే, వాహనదారులు ట్రాఫిక్స్ రూల్స్ తోపాటు స్వీయ క్రమశిక్షణ పాటించాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు. బయోడైవర్సిటీ ప్లైఓవర్‌పై గరిష్ట వేగం 40 కిలోమీటర్లు మించరాదని, అలాగే, రాయదుర్గం నుంచి గచ్చిబౌలి వెళ్లేవాళ్లు ఫ్లైఓవర్ ఎక్కొద్దని, మలుపులు దగ్గర ఓవర్ టేక్ చేయొద్దని సూచిస్తున్నారు. బయోడైవర్సిటీ ప్లైఓవర్‌‌పై సీపీ కెమెరాలు ఉన్నాయంటోన్న పోలీసులు... గరిష్ట వేగం 40 కిలోమీటర్లు మించితే, కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.
పాఠశాలల సంఖ్యను కుదించేందుకు తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకోనుంది. ఒక పాఠశాలకు మరో పాఠశాలకు మధ్య అయిదు కిలోమీటర్ల దూరం వుండేలా చర్యలు తీసుకునున్నట్లు సమాచారం. సర్కారు విద్యా చట్టం సవరణ చేయటంతో పది నుంచి పన్నెండు వేల పాఠశాలలు మూతపడనున్నాయి.కనీస స్థాయిలో విద్యార్థులు లేని సర్కారీ పాఠశాలలను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అవరోధంగా నిలిచిన విద్యా హక్కు చట్టానికి కీలక సవరణలు తలపెట్టింది. ఇందులో భాగంగానే ఊరికి.. పాఠశాలకు మధ్య అనుమతించదగ్గ గరిష్ఠ దూరాన్ని ఐదు కిలోమీటర్లకు పెంచాలని నిర్ణయం తీసుకుంది. దీని పై పరిశీలనకు ప్రత్యేకంగా కమిటీని కూడా ఏర్పాటు చేసింది. కమిటీలో హైదరాబాద్ ఆర్జేడీ,డీఈవో రంగారెడ్డి డీఈవో, రెండు జిల్లాల నుంచి ఒక డిప్యూటీ ఈవో, ఎంఈవోతో పాటు సమగ్ర శిక్షణ ఏఎస్పీడి సభ్యులుగా ఉన్నారు. విద్యా హక్కు చట్టం సవరణల పై పరిశీలన చేయాలని విద్యా శాఖ ఈ కమిటీని ఆదేశించింది.దీని పై ఈ నెల ( నవంబర్ 22న) సమావేశం నిర్వహించనున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక కిలో మీటరు పరిధిలో ప్రాథమిక పాఠశాల మూడు కిలో మీటర్ల పరిధిలో ప్రాథమిక పాఠశాల ఐదు కిలోమీటర్ల పరిధిలో ప్రాధమిక ఉన్నత పాఠశాల ఉండాలి. ఈ నిబంధనను మార్చాలని విద్యాశాఖ నిర్ణయించింది. మార్చిన నిబంధనల ప్రకారం ఏ పాఠశాల అయినా సరే ఐదు కిలో మీటర్ల పరిధిలో ఒకటి ఉంటే సరిపోతుంది. దీనివల్ల రాష్ట్రంలో భారీ సంఖ్యలో పాఠశాలలు మూతపడే అవకాశముంది. ఇప్పటికే సుమారు నాలుగు వేల స్కూళ్ల వరకు మూసివేతకు రంగం సిద్ధం చేసిన అధికారులు ఇప్పుడు ఈ కొత్త నిబంధనతో మరిన్ని స్కూళ్లు మూసివేసే అవకాశం ఉంది. దీని పై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.నిర్ణయం అమలైతే తెలంగాణలో ప్రభుత్వ పాఠశాల విద్య కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సుమారుగా 10,000 నుంచి 12,000 వేల పాఠశాలలు మూతపడే అవకాశం ఉందని ఓ ఉపాధ్యాయుడు అంచనా వేశారు.ఇందులో మెజారిటీ పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలే కావడం గమనార్హం. ఈ పాఠశాలలే కిలో మీటరుకు ఒకటి ఉండటమే ఇందుకు కారణం.  గతంలోనే 15 మంది విద్యార్ధుల లోపు ఉన్న పాఠశాలను దగ్గర లోని పాఠశాలలో విలీనం చేయాలని నిర్ణయించారు. దీంతో 3000 బడులు మూతబడతాయని అంచనా వేశారు. రాష్ట్రంలో మొత్తం  26,050 ప్రభుత్వ పంచాయతీ రాజ్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 18,230 ప్రాథమిక 3,179 ప్రాథమిక ఉన్నత, 4641  యొక్క ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. 916 పాఠశాలల్లొ జీరో అడ్మిషన్ లు ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.విద్యా శాఖ నిర్ణయం అమలయితే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక పాఠశాలలు దాదాపుగా 70% శాతం మూతపడే ప్రమాదముంది. స్కూళ్ల మధ్య దూరాన్ని మార్చుతూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే ఉద్యమం తప్పదని ఈ నిర్ణయం వల్ల భారీగా సర్కారీ బడులు ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలు మూతపడతాయని అంటున్నారు. దీంతో గ్రామీణ తండాల్లోని విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుందని ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
  టీడీపీ అధినేత, అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలతో ఎంఎంటీఎస్ పురుడు పోసుకుంది. పెరుగుతున్న జనాభా, తీవ్రమవుతున్న ట్రాఫిక్, ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు ఆర్టీసీకి ప్రత్యామ్నాయంగా ఈ మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ కు రూపకల్పన చేశారు చంద్రబాబు. కొత్తగా ఎలాంటి రైల్వే ట్రాక్ నిర్మాణం చేపట్టకుండానే... ఉన్న వాటిని వినియోగించుకుంటూ... అద్భుతమైన, సౌకర్యవంతమైన ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ కు శ్రీకారం చుట్టారు చంద్రబాబు. 2003లో ప్రారంభమైన ఎంఎంటీఎస్ కు మొదట్లో ఆశించినంత ఆదరణ లభించకపోయినా, అనంతరం ఎవరూ ఊహించనిస్థాయిలో పుంజుకుంది. ఒక్కో ట్రైన్ లో కోచ్ ల సంఖ్య 12కి పెరగడంతోపాటు అత్యాధునిక టెలిస్కోపిక్ బోగీలు అందుబాటులోకి వచ్చాయి. ప్రారంభంలో 25వేల మంది ప్రయాణికులు, 30 సర్వీసులతో మొదలైన ఎంఎంటీఎస్ సేవలు అంచెలంచెలుగా పెరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ చేరుకునేవారంతా... తమ చివరి గమ్యస్థానాలకు చేరడానికి ఎంఎంటీఎస్ నే ఆశ్రయించేస్థాయికి చేరింది. ఇక, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులతోపాటు ఐటీ ఎంప్లాయిస్ పెద్దఎత్తున ఈ ఎంఎంటీఎస్ ను వినియోగిస్తున్నారు. దాంతో, ప్రతిరోజూ సుమారు రెండు లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చుతోంది ఈ ఎంఎంటీఎస్. హైదరాబాదీల బిజీ జీవితంలో ఎంఎంటీఎస్ ఒక భాగమైపోయింది. తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ ఎంఎంటీఎస్ సర్వీసులను....రాత్రి 11గంటల వరకు మొత్తం 121 ట్రిప్పులు నడిపిస్తున్నారు. ఫలక్‌నుమా–లింగంపల్లి, నాంపల్లి–ఫలక్‌నుమా, నాంపల్లి–లింగంపల్లి, సికింద్రాబాద్‌–లింగంపల్లి మధ్య ఈ సర్వీసులు నడుస్తున్నాయి. అయితే, పదహారేళ్ల ఎంఎంటీఎస్ చరిత్రలో మొదటిసారి ప్రమాదం చోటు చేసుకోవడంతో హైదరాబాదీలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో కర్నూలు ఎక్స్ ప్రెస్ ను ఎంఎంటీఎస్ ట్రైన్ ఢీకొట్టడంతో 30మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉంది. అయితే, ప్రమాదం జరిగే సమయంలో రెండు రైళ్ల వేగం తక్కువగా ఉండటంతో ప్రాణనష్టం తప్పింది. ఏ కొంచెం వేగం ఉన్నా... ఊహించని ప్రాణనష్టం జరిగి ఉండేదని రైల్వే అధికారులు అంటున్నారు. ఎంఎంటీఎస్ సర్వీసులకు సెపరేట్ ట్రాక్ లేకపోయినప్పటికీ, ఇఫ్పటివరకు ఎలాంటి ప్రమాదాలు చేసుకోలేదు. ఫస్ట్ టైమ్ ఒకే ట్రాక్ పైకి రెండు రైళ్లు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే, ఎంఎంటీఎస్ చరిత్రలో తొలిసారి ప్రమాదం జరగడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు.
  అయోధ్య వివాదం 1822లో మొదలైంది. ఫైజాబాద్ కోర్టు అధికారి హఫీజుల్లా... ఓ కేసు సందర్భంగా దీన్ని వివాదంగా పేర్కొన్నారు. కానీ, 1957లో తొలి వ్యాజ్యం పడింది. బాబ్రీ మసీదులో పనిచేసే మౌల్వీ మహ్మద్ అస్ఘర్ ఈ వ్యాజ్యం వేశారు. అయోధ్యలోని బాబ్రీ మసీదు ప్రాంతాన్ని హనుమాన్ గఢీ మహంత్ బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. దాంతో, హనుమాన్ గఢీ మహంత్ లో ఉండే వైష్ణవ బైరాగులు ప్రతి కేసు దాఖలు చేశారు. బాబ్రీ మసీదు స్థలం... రాముడు పుట్టిన చోటు అంటూ వైష్ణవ బైరాగులకు చెందిన నిర్మోహీ అఖాడా 1857లో కోర్టును ఆశ్రయించింది. ఇరువర్గాల వాదనలు విన్న ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వం... వివాదాస్పద స్థలంలో అడ్డుగోడ కట్టించి, హిందువులంతా తూర్పువైపు నుంచి.... ముస్లింలు ఉత్తరం వైపు నుంచి వెళ్లాలని ఆదేశించింది. ఇక, 1860-84 మధ్య అయోధ్య స్థలంపై అనేక కేసులు దాఖలు అయ్యాయి. కానీ అతిముఖ్యమైన కేసు 1885లో పడింది. వివాదాస్పద స్థలానికి(రామజన్మస్థానం) తానే మహంత్ నని, అక్కడ రామాలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటూ ధార్మిక నేత రఘువర్ దాస్ పిటిషన్ వేశారు. అయితే, దాన్ని 1986లో కోర్టు కొట్టివేసింది. అయితే, వివాదాస్పద ప్రాంతాన్ని హిందువులు రామజన్మభూమి అని బలంగా నమ్మడానికి దోహడపడింది. దాంతో అప్పట్నుంచి 1923వరకు అనేక వ్యాఖ్యాలు నమోదయ్యాయి.  అయితే, 1949లో అయోధ్య బాబ్రీ మసీదు లోపల... కొందరు బలవంతంగా సీతారామలక్ష్మణుల విగ్రహాలు పెట్టడంతో... దేశ చరిత్రలోనే అతిపెద్ద వివాదంగా రూపుదాల్చింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలి నాళ్లలోనే ఈ వివాదం పురుడు పోసుకుంది. అయితే, 1949 డిసెంబర్ 29న బాబ్రీ మసీదు ఉన్న వివాదాస్పద ప్రాంతంలో యథాతధ స్థితిని కొనసాగించాలని ఫైజాబాద్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. దాంతో, ఆ ప్రాంతాన్ని మూసివేసి, ముస్లింలకు అనుమతి నిరాకరించారు. అయితే హిందూ పూజల నిమిత్తం నలుగురు పూజారులకు మాత్రం అనుమతి ఇచ్చారు. అనంతరం 1950 జనవరి 16న హిందూమహాసభ కార్యకర్త గోపాల్ సింగ్ విశారద్ కేసు వేశారు. వివాదాస్పద ప్రాంతంలో ఉన్న హిందూ విగ్రహాలను ఎప్పటికీ తొలగించరాదని, పూజలు చేసుకోనివ్వాలని కోరారు. ఇక, 1959లో నిర్మోహీ అఖాడా మరో పిటిషన్ వేసింది. అది రాముడు పుట్టిన చోటని, ఆ స్థలాన్ని తమకు అప్పగించాలని కోరింది. దాంతో, 1961 డిసెంబర్ 18న సున్నీ వక్ఫ్ బోర్డు కౌంటర్ పిటిసన్ వేసింది. అక్కడున్న బాబ్రీ మసీదును బాబర్ కట్టించాడని, ఆ ప్రాంతం తమకే చెందుతుందని, దాన్ని తమకు అప్పగించాలని కోరింది. ఇక, 1990ల్లో ఈ వివాదం పతాకస్థాయికి చేరింది. 1992 డిసెంబర్ 6న లక్షల మంది కరసేవకులు బాబ్రీ మసీదును నేలమట్టం చేశారు. ఈ ఘటన వివాదాన్ని మరో మలుపు తిప్పింది.  అనంతరం, ఈ వివాదంపై 1992 నుంచి 2002వరకు అలహాబాద్ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే, 2010 జులై 26న తీర్పు ప్రకటించిన అలహాబాద్ హైకోర్టు... వివాదాస్పద ప్రాంతాన్ని మూడు పక్షాలకు సమానంగా పంచుతూ నిర్ణయం ప్రకటించింది. అయితే, అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ, సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. దాంతో, అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే విధించింది. ఇక, 2019 ఆగస్ట్ 6 నుంచి అక్టోబర్ 16వరకు ఏకధాటిగా 40రోజులపాటు విచారణ జరిపిన సుప్రీంకోర్టు... 2019 నవంబర్ 9న చారిత్రాత్మక తీర్పు ప్రకటించింది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని హిందువులకు అప్పగిస్తూ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సంచలన నిర్ణయం ప్రకటించింది.
తహశీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యకు భూవివాదమే కారణమని తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా గౌరెల్లి గ్రామానికి చెందిన రైతు సురేష్‌... ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే, లంచం కోసం వేధించినందుకే సురేష్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అబ్దుల్లాపూర్‌మెట్‌లోని సర్వే నెంబర్ 90, 101లో గల 20 ఎకరాలకు సంబంధించిన భూవివాదమే విజయారెడ్డి హత్యకు కారణంగా తెలుస్తోంది. తన వ్యవసాయ భూమిని ఓ రియల్టర్‌కు కట్టబెట్టేలా రిపోర్ట్ ఇవ్వడంతో... కొద్దిరోజులుగా సురేష్‌....  అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్లు చెబుతున్నారు. అన్యాయంగా తన భూమిని రియల్టర్‌కు కట్టబెట్టేలా వ్యవహరించినందుకే... మనోవేదనకు గురై... ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. హయత్‌నగర్ మండలం గౌరెల్లి గ్రామానికి చెందిన సురేష్‌... ల్యాండ్ మ్యుటేషన్ కోసం తహశీల్దార్ విజయారెడ్డికి దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, ఎంతకీ తన పని కాకపోవడంతో.... విజయారెడ్డిపై కోపం పెంచుకున్న సురేష్‌.... ఈ హత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. ఇక, నిందితుడు సురేష్‌కి కూడా తీవ్ర గాయాలు కావడంతో... కొంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. తహశీల్దార్ విజయారెడ్డి హత్యపై ప్రాథమిక సమాచారంతో కేసు నమోదు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. అసలు, విజయారెడ్డి కార్యాలయంలోకి దుండగుడిని ఎవరు అనుమతించారు... హత్యకు అసలు కారణమేంటనే సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, భూవివాదంలో... విజయారెడ్డి మర్డర్ జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామన్న సీపీ.... దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తామని తెలిపారు. తహశీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యతో రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సిబ్బంది భయాందోళనలకు గురవుతున్నారు. విజయారెడ్డి హత్యను ఖండిస్తూ రెవెన్యూ సిబ్బంది ఎక్కడికక్కడ ఆందోళనకు దిగారు. విధులను బహిష్కరించిన రెవెన్యూ ఉద్యోగులు.... పెద్దఎత్తున ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.
  ప్రస్తుతం మనం జనాలకి పెద్దగా తెలియదు కదా అని నోటికి ఏదొస్తే అది వాగకూడదు. ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చి ఏదో ఉద్దరించాలి అనుకునేవారైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కొందరు.. అబ్బే, ఇప్పుడు మనం పెద్దగా ఎవ్వరికి తెలీదు కదా అని రెచ్చిపోయి.. వారి కులపోళ్ళని పొగుడుతూ ఓ నాలుగు ట్వీట్లు.. మిగతా వ్యక్తుల్ని, మిగతా కులాల్ని నీచంగా కించపరుస్తూ మరో నాలుగు ట్వీట్లు చేస్తారు. కట్ చేస్తే.. కొన్నేళ్ల తర్వాత ఓ రాజకీయ పార్టీలో చెప్పుకోదగ్గ స్థానంలో ఉంటారు. ఎవరైనా.. అయ్యా అప్పట్లో మీరు ఇలా వాగారంటూ సాక్ష్యాలతో సహా బయటపడితే.. దాన్ని ఎలా కవర్ చేసుకోవాలో అర్థంగాక ఆకులు పట్టుకుంటారు. ఇప్పుడు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి పరిస్థితి ఇదే.     ప్రస్తుతం ఏపీలో ఇసుక కొరతపై విపక్షాలు ఉద్యమిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ వేదికగా లాంగ్ మార్చ్ కి పిలుపునిచ్చారు. ఈ మార్చ్ కి టీడీపీ, బీజేపీ మద్దతు కూడా కోరారు. పవన్ తలపెట్టిన ఈ మార్చ్ కి ఇరు పార్టీల అధినేతలు సానుకూలంగా స్పందించినట్లు వార్తలొచ్చాయి. అయితే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ సానుకూలంగా స్పందించడం.. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డికి అస్సలు నచ్చలేదంట. ఇంకేముంది పవన్ తలపెట్టిన ఆందోళనలో కన్నా పాల్గొనాల్సిన అవసరంలేదంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో విష్ణు పేరుకి బీజేపీలో ఉన్నా.. ఆయన కులానికి చెందిన జగన్ మోహన్ రెడ్డి పార్టీకి మద్దతుగా మాట్లాడతారని, ఆయనకు కులపిచ్చి అని విమర్శలు మొదలయ్యాయి. అయితే ఇవేవో సాధారణ రాజకీయ విమర్శలు కాదు. జనసైనికులు ఎంతో శ్రమించి దాదాపు పదేళ్ల క్రితం నాటి సాక్ష్యాలను వెలికి తీసి.. విష్ణుకి కులపిచ్చి ఉందని రుజువుచేసారు.     దాదాపు పదేళ్ల క్రితం.. విష్ణువర్ధన్ రెడ్డి పెద్దగా ఎవ్వరికీ తెలీదు. అయితే అప్పట్లో ఆయన చేసిన ట్వీట్లు చూస్తే తెలియకపోవడమే మంచిది అనుకుంటారు. ఆయన ట్వీట్లు చూస్తే ఆయనకు ఎంత కులపిచ్చి ఉందో అర్ధమవుతుంది. ఆయన కులానికి చెందిన వారిని పేరుపేరునా పొగుడుతూ ట్వీట్ చేయడం. మిగతా కులాల్ని కించపరచడం. అంతేకాదు ఆడవారి అందాల గురించి సంస్కారం లేకుండా మాట్లాడటం. ఇలా ఆయన పదేళ్ల క్రితం చేసిన ఏ ట్వీట్ చూసినా చండాలమే. ఛీ ఛీ ఈయన ఓ జాతీయ పార్టీ నాయకుడా అనుకునేలా ఉన్నాయి ఆయన ట్వీట్స్. రాజకీయ నాయకుడు కులాలు, మతాలతో సంబంధం లేకుండా.. అందర్నీ కలుపుకొని పోతూ ప్రజలకి మంచి చేయాలి. కానీ ఈయన నరనరాల్లో కులపిచ్చి నింపుకొని ప్రజాసేవ అర్థాన్నే మార్చేశారు. దీంతో ప్రస్తుతం విష్ణుపై సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురుస్తోంది.     కాగా, పదేళ్ల క్రితం ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవ్వడం, విమర్శలు రావడంతో.. విష్ణు మొదట ఆ ట్వీట్లను డిలీట్ చేసే ప్రయత్నం చేసారు. ఆ ట్వీట్లు వందల్లో ఉండటంతో ఇక చేసేది లేక అకౌంట్ నే తీసేసారు. అయినా స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తుండటంతో.. ఇక చేసేదేమి లేక.. అబ్బే ఆ ట్వీట్లకు నాకేం సంబంధం లేదు, అప్పట్లో ఆ అకౌంట్ ని థర్డ్ పార్టీ చూసేది అంటూ ఏదో చెప్పుకొచ్చారు. కానీ అవి నమ్మశక్యంగా లేవు. ఎందుకంటే.. ఒకవేళ నిజంగానే ఆయనకు ఆ ట్వీట్లకు సంబంధం లేకపోతే.. విమర్శలు రాగానే కొన్ని ట్వీట్లు ఎలా డిలీట్ అయ్యాయి? తర్వాత ఏకంగా అకౌంటే ఎందుకు డిలీట్ అయింది?. అందుకే అంటారు చేతులు కాలాక ఆకులు పట్టుకోకూడదు.. ముందే చేతులు కాలకుండా చూసుకోవాలి అని. మరి ఇప్పటి ప్రభుత్వాలు.. ఎవరైనా సామాన్యులు చిన్న ట్వీట్ చేస్తే చాలు.. కేసులు, అరెస్ట్ లు అంటున్నాయి.. మరి ఈయన గారు కులాల్ని కించపరుస్తూ చేసిన ట్వీట్లపై ఎలా స్పందిస్తాయి?. వీటిపై విచారణ చేసి, చర్యలు తీసుకునే సాహసం చేస్తాయా? చూడాలి.
  అధికారం చేతిలో ఉంటే తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని చేయటం తేలిక. ఒకవేళ ఎవరైనా అభ్యర్థి ఎన్నికల్లో ఓడిపోయినా, వారి పార్టీ అధికారంలో ఉందనుకోండి ఆయా నేతలు తమ తమ నియోజక వర్గాల్లో అనధికార ఎమ్మెల్యేలుగా కూడా చలామణి కావచ్చు. బదిలీలు, పోస్టింగ్లు అభివృద్ధి పనుల్లో జోక్యం చేసుకోవటాలు ఇలా ఒక్కటని కాదు ఇంకా ఎన్నెన్నో చేయొచ్చు. అయితే ఇలాంటి వారికి అన్నివేళల్లో కాలం కలిసి వస్తోందని లేదు ఒక్కోసారి స్వపక్షం లోనే చెక్ పెట్టే వారుండొచ్చు. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇదే జరుగుతోంది. పశ్చిమలో ఉండి నియోజకవర్గానికి ఆంధ్ర ప్రదేశ్ లో ఓ ప్రత్యేక స్థానం ఉంది. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందడం ఎప్పట్నుంచో జరుగుతోంది. రాజకీయంగా చూస్తే తెలుగుదేశం పార్టీకి ఉండి నియోజకవర్గం కంచుకోట. గతంలో రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచినప్పుడు, మొన్నటి ఎన్నికల్లో ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గాలి బలంగా వీచినపుడు కూడా ఇక్కడి ఓటర్లు టిడిపికే పట్టం కట్టారంటే ఆ పార్టీ పట్ల స్థానికులకు ఎంత అభిమానం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం అలా ఉంచితే 2019 ఎన్నికల్లో ఇక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేసిన పీవీఎల్ నరసింహరాజు ఓడిపోయారు కానీ, రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన అనధికార ఎమ్మెల్యేగా చలామణి కావడం మొదలు పెట్టారు. అధికారులు అసలు ఎమ్మెల్యే కంటే కొసరు ఎమ్మెల్యేకి ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. అధికార కార్యక్రమాల్లోనూ పీవీఎల్ హవా చలాయిస్తున్నారు అంటే ఆ సార్ కు అధికార యంత్రాంగం ఏ స్థాయిలో గౌరవిస్తుందో గ్రహించవచ్చు. అటువంటి పీవీఎల్ నరసింహరాజుకి ఇప్పుడు సొంత పార్టీలోనే ఎదురు గాలి మొదలైంది. కొందరు నేతలకు ఆయన వైఖరి రుచించడం లేదు, దీంతో సదరు అనధికార ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా వేరు కుంపటి పెట్టారు. దీనికి ఉండి మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజును పెద్దతలకాయగా పెట్టుకున్నారు. గత ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి విముఖత చూపిన సర్రాజు తమ పార్టీ అధికారంలోకి రావడంతో ప్రస్తుతం యాక్టివ్ రోల్ పోషించడం మొదలు పెట్టారు. ఇదే చివరకు పీవీఎల్ నరసింహరాజు, సర్రాజు మధ్య ఆధిపత్య పోరుగా పరిణమించింది. ఉండిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు మొదటి నుంచి అనేక మలుపులు తిరుగుతూనే ఉన్నాయి. మొదట్లో ఈ నియోజక వర్గం ఇన్ చార్జిగా మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు వ్యవహరించేవారు. గత ఎన్నికలకు ముందు ఆయన పోటీ చేయడానికి ఇష్టపడలేదు. ఈ పరిస్థితుల్లో పారిశ్రామికవేత్తనైన పీవీఎల్ నరసింహరాజును తెరపైకి తెచ్చారు. ఆయనకే ఉండి ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆ తర్వాతి ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ ను కూడా ఇచ్చారు. కానీ నాటి ఎన్నికల్లో ఆయన పరాజయం పాలయ్యారు, అంతటితో ఆయన హుందాగా ఊరుకుంటే బావుండేదేమో కానీ, రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన రూటు మార్చి నియోజక వర్గాల్లో జరిగే అధికార, అనధికార కార్యక్రమాలన్నింటి లోనూ తలదూర్చడం మొదలుపెట్టారు. అన్నింటా తనదే పైచేయిగా ఉండేలా చక్రం తిప్పుతున్నారు, ఆ  మధ్య కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. నాకు పార్టీలోకి రావడం ఇష్టం లేదు వైయస్ జగన్ పిలిచి మరీ టికెట్ ఇవ్వడంతో పోటీ చేశాను, పార్టీ అభ్యర్ధులకు ఎన్నికల్లో పది కోట్లు, ఎనిమిది కోట్ల చొప్పున ఖర్చుల కోసం ఇచ్చారు నేను మాత్రం ఆ సొమ్ము తీసుకోలేదు అంటూ పీవీఎల్ నరసింహరాజు చెప్పుకొచ్చారు. ఆయన అలా మాట్లాడినా కూడా పార్టీ పెద్దలు లైట్ తీసుకున్నారు, దీంతో ఆయన తనకు ఇక తిరుగులేదనుకున్నారేమో మరింత స్పీడు పెంచినట్టు భోగట్టా. ఈ దశలో పీవీఎల్ వ్యవహార శైలి కొందరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు రుచించలేదు. క్రమేపీ వారిలో అసంతృప్తి రాజుకోవడం మొదలైంది, అది కాస్త వర్గపోరుకు దారి తీసింది. మరో వర్గం నేత మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు తెరపైకి తెచ్చారు అసంతృప్తివాదులు. కొన్ని రోజుల క్రితం వారంత పీవీఎల్ తీరుపై బహిరంగం గానే ఆక్రోశం వెళ్లగక్కారు. ఉండి నియోజక వర్గ ఇన్ చార్జిగా ఆయన్ని తప్పించి పాతపాటి సర్రాజుకు ఆ బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ తెరపైకి తెచ్చారు. అంతేగాకుండా పీవీఎల్ వైఖరి గురించి అమరావతి వెళ్లి పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళ్ళాలనే నిర్ణయానికి వచ్చారట. ఉండి వ్యవహారం ఒక్కసారిగా రోడ్డెక్కడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అలర్టైంది. పీవీఎల్ ని, సర్రాజుని కూర్చోబెట్టి విషయాన్ని సెటిల్ చేయాలని పార్టీలో మరో ముఖ్యనేత కొత్తపల్లి సుబ్బరాయుడికి బాధ్యతలు అప్పగించింది. ఆ ఇద్దరినీ అమరావతికి పిలిచిన సుబ్బరాయుడు విషయాన్ని ఇప్పటికైతే సెటిల్ చెయ్యగలిగారు. నియోజకర్గ ఇన్ చార్జిగా పీవీఎల్ కొనసాగుతారు, అదే సమయంలో మిగతా వ్యవహారాలు మీరు చూసుకోండి అంటూ పాతపాటి సర్రాజుకు సూచించారు. ఈ ఒడంబడికకు ఇద్దరు నేతలు అంగీకరించడంతో తాత్కాలికంగా ఉండి వివాదం సద్దుమణిగినట్టయింది. అంతేకాదు అప్పట్నుంచీ ఇద్దరు నేతలు అన్ని కార్యక్రమాలకు కలిసే హాజరవుతున్నారనుకోండి అది వేరే విషయం. అయితే ఇరు వర్గాల్లోనూ అసంతృప్తి మాత్రం చల్లారలేదని అది ఎప్పుడో ఒకప్పుడు బట్టబయలవుతుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు, చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో.
  కొడాలి నాని... వల్లభనేని వంశీ... వంగవీటి రాధాకృష్ణ... ఈ ముగ్గురూ మంచి స్నేహితులంటారు... ఈ ముగ్గురూ పార్టీలో ఉన్నా... పార్టీలకతీతంగా వీరి స్నేహం కొనసాగుతుందని చెప్పుకుంటారు. అయితే, ఇప్పుడో కొత్త సంగతి బయటికొచ్చింది. గన్నవరంలో వైసీపీ తరపున పోటీచేసి వంశీ చేతిలో ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు కూడా... ఈ ముగ్గురికీ చిరకాల మిత్రుడని తెలిసింది. ఈ నలుగురూ మంచి స్నేహితులని, తరచూ కలిసికుని మాట్లాడుకుంటారని సన్నిహితులు చెబుతున్నారు. అయితే కొడాలి నాని... వల్లభనేని వంశీ... వంగవీటి రాధాకృష్ణ... స్నేహితులని అందరికీ తెలిసినా... యార్లగడ్డ సంగతే కొత్తగా ఉంది. అయితే, తన స్నేహితుడైన వల్లభనేని వంశీపై యార్లగడ్డ వెంకట్రావు పోటీకి దిగడానికి కొడాలి నానేయే కారణమనే మాట వినిపిస్తోంది. ప్రవాస భారతీయుడుగా ఉన్న యార్లగడ్డను కొడాలి నానినే... ఆంధ్రాకి రప్పించి... జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లడమే కాకుండా.... వల్లభనేని వంశీపై పోటీకి దింపారని అంటున్నారు. ఈ మాట... వల్లభనేని వంశీ కూడా చాలాసార్లు తన సన్నిహితులతో చెప్పుకొచ్చారు. రాజకీయంగా ఎవరు ఎత్తులు వాళ్లు వేసుకున్నా... వీళ్ల మధ్య మాత్రం స్నేహం... మాత్రం కంటిన్యూ అవుతోంది. అయితే, గన్నవరంలో ముఖాముఖిగా తలపడిన వంశీ, యార్లగడ్డ మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. ఇక, రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. సరిగ్గా ఇప్పుడదే జరిగింది.   తొలుత వల్లభనేని వంశీ, కొడాలి నాని... ఇద్దరూ తెలుగుదేశంలోనే ఉన్నా... ఆ తర్వాత కొడాలి... వైసీపీలో చేరారు. వంశీ మాత్రం టీడీపీలో కొనసాగారు. వంగవీటి రాధా కూడా కొన్నాళ్లూ వైసీపీలోనే ఉన్నారు. ఈ ముగ్గురూ వేర్వేరు పార్టీల్లోనే ఉన్నా... వీళ్ల మధ్య స్నేహం మాత్రం కొనసాగింది. అయితే, మొన్నటివరకు అమెరికాలో ఉన్న యార్లగడ్డ వెంకట్రావు సరిగ్గా ఎన్నికల ముందు ఏపీకి ఎంట్రీ ఇచ్చి... గన్నవరం నుంచి బరిలోకి దిగి ఏకంగా స్నేహితుడైన వంశీనే ఢీకొట్టారు. అయితే స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇక ఎన్నికల టైమ్ లో ఈ ఇద్దరికి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. అది వ్యక్తిగత వైరంగానూ మారింది. అయితే, గెలిచిన తర్వాత కూడా వల్లభనేని వంశీని ఆర్ధిక సమస్యలు, కేసులు చుట్టుముట్టడంతో... తన స్నేహితుడైన కొడాలి నానితో పంచుకున్నట్లు తెలుస్తోంది. దాంతో కొడాలి... వల్లభనేని వంశీని జగన్ దగ్గరికి తీసుకెళ్లాడని చెప్పుకుంటున్నారు. ఇదిలాఉంటే, 2014 ఎన్నికల సందర్భంగా బెజవాడ బెంజ్ సర్కిల్ లో జగన్ ను వంశీ ఆలింగనం చేసుకోవడంతో... వీళ్లిదరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయనే చర్చ జరిగింది. అంతేకాదు వంశీ వైసీపీలో చేరతానే ప్రచారం కూడా జరిగింది. అయితే, ఈ నలుగురు చిరకాల స్నేహితుల్లో వంగవీటి రాధాకృష్ణ... మొన్నటి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండగా... కొడాలి నాని సూపర్ విక్టరీ కొట్టి జగన్ కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు... ఇక వల్లభనేని వంశీ వైసీపీ గూటికి చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఇంతవరకూ బాగానే ఉన్నా, ఎన్నికల ముందు స్నేహితుడినే ఢీకొట్టి వ్యక్తిగత వైరం తెచ్చుకున్న యార్లగడ్డ వెంకట్రావు పరిస్థితే ఇరకాటంలో పడిందని మాట్లాడుకుంటున్నారు. మరి, నలుగురి స్నేహితుల రాజకీయ అడుగులు ఎప్పుడు ఎటువైపు వెళ్తాయోనన్న చర్చ కృష్ణాజిల్లాలో జరుగుతోంది.  
కచ్చులూరు బోటు ప్రమాద బాధిత కుటుంబాల వేదన హృదయవిదారంగా ఉంది. ప్రమాదం జరిగాక దఫాదఫాలుగా 39 మృతదేహాలను వెలికితీసి బంధువులకు అప్పగించిన అధికారులు.... ఇంకా 13మంది ఆచూకీ కోసం 39రోజులు ఆగాల్సి వచ్చింది. 38రోజుల తర్వాత ఎట్టకేలకు బోటును బయటికి తీయడంతో తమవాళ్ల మృతదేహాలు దొరుకుతాయని ఆశపడ్డ బాధిత కుటుంబాల్లో కొందరికి నిరాశే ఎదురైంది. తమవారిని కనీసం చివరి చూపు అయినా చూసుకోవచ్చని ఆశపడ్డ ఆత్మీయులు ఆశలు గల్లంతయ్యాయి. బోటు నుంచి 8మృతదేహాలు వెలికితీయగా... ఐదుగురిని మాత్రమే గుర్తించారు. అయితే, బోటు నుంచి వెలికితీసిన మృతదేహాలన్నీ కుళ్లిపోయి ఛిద్రమై ఉండటంతో గుర్తించడం కష్టతరంగా మారింది. అయితే, వాళ్లు ధరించిన బట్టలు, జేబుల్లో ఉన్న గుర్తింపు కార్డులు ఆధారంగా ఐదుగురిని గుర్తించగలిగారు. ఇంకా మూడు మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. అయితే, రాయల్ వశిష్ట బోటును శుభ్రం చేయడంతో మరికొన్ని ఎముకులు, అవయవాలు, వస్త్రాలు దొరికాయి. దాంతో వాటిని కూడా మూటలుగా కట్టి రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దాంతో మొత్తం మృతదేహాలు దొరికినట్లేనని అంటున్నారు. అయితే, పలువురి మృతదేహాలు ఛిద్రమైపోవడం... అలాగే అవయవాలు తెగిపోయి కొన్ని భాగాలు మాత్రమే దొరకడంతో వాళ్లను గుర్తుపట్టడం కష్టంగా మారిందని రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ అంటున్నారు. మృతదేహాలన్నీ మట్టితో నిండిపోయి ఉండటం... అలాగే కొన్ని డెడ్ బాడీస్ కు కాళ్లూచేతులు తెగిపోయి ఉండటం... మరికొన్ని మృతదేహాలైతే కేవలం ఎముకలు, మాంసపు ముద్దలు మాత్రం దొరకడంతో... డీఎన్‌ఏ పరీక్షల కోసం శాంపిల్స్ ను హైదరాబాద్ పంపుతున్నట్లు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు. రాయల్ వశిష్ట బోటు డ్రైవర్ నూకరాజు మృతదేహాన్ని అతని కుమారుడు గుర్తించాడు. టీషర్ట్ ఆధారంగా గుర్తించినట్లు తెలిపాడు. అలాగే, వరంగల్ వాసులైన కొమ్ముల రవీంద్ర, ధర్మరాజు మృతదేహాలను వాళ్ల జేబుల్లో దొరికిన ఐడీ కార్డుల ఆధారంగా మృతదేహాన్ని ఐడెంటిఫై చేశారు. ఇక, మంచిర్యాల వాసి రమ్యశ్రీ మృతదేహాన్ని ఇంకా గుర్తించాల్సి ఉంది. అయితే, రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో మిగిలిన మూడు మృతదేహాల్లో... ఆ తర్వాత బోటు నుంచి తీసుకొచ్చిన ఎముకలు, మాంసపు ముద్దల్లో రమ్యశ్రీ డెడ్‌బాడీ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అయితే, ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కుమార్తె మృతదేహం ఇంకా దొరక్కపోవడంతో రమ్యశ్రీ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. మంచిర్యాల నుంచి వచ్చిన రమ్యశ్రీ తల్లిదండ్రులు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి దగ్గర పడిగాపులు పడుతున్నారు. మొత్తానికి, తెలుగు రాష్ట్రాల్లో పెను విషాదాన్ని నింపిన రాయల్ వశిష్ట బోటు బయటికొచ్చినా... బాధిత కుటుంబాల్లో కొందరికి మాత్రమే కొంతలో కొంత ఊరట లభించలేదు. కనీసం చివరి చూపు చూసుకునే అవకాశం లభించింది. అయితే, మిగతా మృతదేహాలన్నీ ఏ రకంగానూ గుర్తుపట్టలేనివిధంగా ఉండటంతో ఆయా బాధితుల కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణణాతీతంగా ఉంది. ఇక, ఆచూకీ దొరకాల్సిన, గుర్తించాల్సిన ఆరేడు మంది వివరాలు డీఎన్‌ఏ పరీక్షల తర్వాతే తేలే అవకాశం కనిపిస్తోంది.
  Cell phones have almost become our best friends! Even during flight journeys, most of us use cell phones. Thinking the FLIGHT MODE in the Cell phones is an excuse to keeping our phones from turning off....we can't escape. Our phone has to be switched off during the flight, landing and take off too...     "Even in the Flight Mode, our phone transmits radio signals that have the same frequency as the airplane's communication and navigational systems, which means our phone could interfere with them." There are a few of us who think, 'just one phone will not cause any harm ', but the possibility that it could disrupt the communication is reason enough to play it safe.     After the Pilot has announced that the flight has reached above 10,000 feet or higher and also informs that phones can be used, its safe to turn on the cell phone and only in the Airplane Mode.   - Prathyusha Talluri
      With the onset of summer not too far away, we are busy getting our ACs serviced, buying the earthen pots for the naturally cool water and changing our curtains to something more heavy to block the heat. How many of us remember the old Khus khus mats or the woven vettiver mats which were hung on the doors and windows where water would be sprinkled on to them to let the cool air in? A wonderful option to keep your house naturally cool, these naturally cool shades not only provides cool air but also a pleasant fragrance even though it could get a bit messy with water trickling on your floor. You can hang these khus mats or curtains to cool your home. All you need to is sprinkle water on these curtains till they are completely wet. Leave the windows or doors that it is hung over, open. Let the hot breeze flow into the wet khus curtain and feel the breeze coming into the house catches the wonderful fragrance of khus and diffuses it in the house leaving the house smelling lovely and feeling cool. Khus  which is known as vetiveria zizanioides in the botanical terms and belongs the same family as lemongrass, citronella and palmarosa. It is also commonly used in aroma therapy and perfumes. It is acts like a cooling agent, treating insomnia and stress and also works as a blood purifier.  A grass that grows up to six feet in length and like all grass it has fibrous roots that grow deep in the earth. The woody fragrance comes from the tiny rootlets which are filled with the sweet, deep rich fragrant enzymes. The roots of the khus plant are woven into long mats in different sizes and sold in the markets. A very common item sold till a decade ago this now soon- to- become- extinct natural shade is available in the old parts of the cities. It is also used to make hand –fans sandals, hats, and decorative baskets. The roots are packed up in sachets which can be placed in cupboards also used as loofahs to scrub the body.These can also be obtained in your organic produce stores which are now very popular. You could also  find these in the smaller towns and if you have the opportunity do pick them up, as they stay for a longtime and do not spoil for many years. The mats can be rolled and stored in dry cool places in your attic and reused for the coming summers. And think about the electricity bills you can save!
  కొంతమంది నలుగురిలో మాట్లాడాలన్నా.. ఏదైనా చెయ్యాలన్నా.. తెగ సిగ్గుపడిపోతుంటారు. దీనివల్ల చాలా నష్టపోతుంటారు. ముఖ్యంగా ఇంటర్వ్యూలలో సిగ్గువల్ల వాళ్లు అనుకున్నది చెప్పలేక ఉద్యోగాలు కోల్పోయేవాళ్లు ఉన్నారు. భవిష్యత్తులో ఉన్నత స్ధానాలకు ఎదగాలంటే ముందు మనలో ఉన్న సిగ్గును వదిలిపెట్టాలి. అలాంటి ‘షై’తాన్ ను వదిలిపెట్టినప్పుడే మనం డెవలప్ అవుతాం. దానికోసం కొన్ని సలహాలు... సమస్యను గుర్తించాలి... ముందుగా ఎలాంటి పరిస్థితులకు ఎక్కువ షై ఫీలవుతున్నామో గుర్తించాలి. గుర్తించిన తరువాత ఆ సమస్యను ఎలా అధిగమించాలో చూడాలి. మీరే కోచ్... మనలో ఉన్న టాలెంట్ ని, మనం ఏం చేయగలమో గుర్తుచేసుకోవాలి. వాటిమీద మరింత కసరత్తు చేయాలి. దీనివల్ల మనలో ఉన్న కాన్పిడెన్స్ కనపడుతుంది. ఆ కాన్ఫిడెన్సే మనలో ఉన్న సిగ్గుని పోగొడుతుంది. సౌకర్యం చూసుకోవాలి... మనం ఎవరితో కంఫర్టుగా ఉంటామో వాళ్లే మన చుట్టూ ఉండేలా చూసుకోవాలి. మంచి రిలేషన్ షిప్స్ మెయింటెయిన్ చేసుకోవాలి.  ఇతరులకు సౌకర్యంగా... ముఖ్యంగా సానుకూల శరీర భాష కలిగి ఉండాలి. మనం ఏదైనా మాట్లాడేటప్పుడు ఎదుటివారి ముఖాన్ని సూటిగా చూడాలి. చెప్పాలనుకున్న విషయాన్ని డైరెక్టుగా చెప్పాలి. క్లియర్ గా చెప్పాలి.  సాధన చేయాలి... మనకు మనమే ఎసైన్ మెంట్స్ పెట్టుకోవాలి. గోల్స్ పెట్టుకోవాలి. మనకు తెలియని విషయాలను ఛాలెంజ్ గా తీసుకొని తెలుసుకోవాలి. అది మన కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది. ప్రతిరోజూ పరిచయం లేని వ్యక్తులతో సంభాషించడం కూడా మంచిదే మనం మనలా.. ఎప్పుడు అవతలి వ్యక్తులని అనుసరించే ప్రయత్నం చేయకూడదు. మనం మనలాగే ఉండాలి. ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించకూడదు. ఈ సూత్రాలు పాటించండి.. మీలోని ‘షై’తాన్ మిమ్మల్ని వదిలి పారిపోతుంది చూడండి.
    There are certain foods are having the innate ability to cure some particular illness. By including these to your daily routines you can cure the illness and believe it or not these are the prescribed foods, thus having a full-proof recovery!! Memory loss, for this illness a quarter cup of sunflower seeds daily will be drug. These seeds are loaded with Vitamin-E which protects our neurons from oxidative stress. This memory boosting little ones can make our lives a lot easier! Well, all of us would like to freeze our age at the moment! As that is impossible, we can slow the process by the intake of one full orange a day. Vitamin-C and proteins help in healthy production of collagen and keep our skin youthful and graceful! Puffy Eyes, mostly seen when over-slept! This is due to the retention of fluids around the eye; these can also lead to dark circles! A cup of refreshing Green tea post-meal daily can reduce the puffiness and other unwanted swelling over the body. When you enter a new environment, the first organ to detect is the stomach! Stomach gets upset as it is away from its comfort-zone. Peppermints aid in digestion and also soothe the inflammatory pain through out the gut. One or two post dinner is more than enough! Lacking energy after a long day? Then grab a Banana, this energy rich fruit is packed with potassium and magnesium which are the key for energy production and storage! Instead of popping in the chemically loaded capsule try these! Take Care!! ....SIRI
  The next time you keep your Mobile in your trouser pocket ,think twice! According to a study published in the journal Environment International, radio-frequency electromagnetic radiation (RF-EMR) emitted by mobile phones can have a detrimental effect on male fertility. "This study strongly suggests that being exposed to radio-frequency electromagnetic radiation from carrying mobiles in trouser pockets negatively affects sperm quality," cautioned Fiona Mathews, a professor of biosciences at University of Exeter in Britain. "This could be particularly important for men already on the borderline of infertility, and further research is required to determine the full clinical implications for the general population," he said. Most of the global adult population own mobile phones and around 14 percent of couples in high and middle income countries have difficulty in conceiving. To reach this conclusion, a team led by Mathews conducted a systematic review of the findings from 10 studies, including 1,492 samples. The sperm quality was measured in three different ways: motility, viability and concentration. In control groups, 50-85 percent of sperm have normal movement. The researchers found this proportion fell by an average of eight percentage points when there was exposure to mobile phones. Similar effects were seen for sperm viability. The effects on sperm concentration were less clear. The results were consistent across in vitro studies conducted under controlled conditions, said the study published in the journal Environment International. Given the enormous scale of mobile phone use around the world, the potential role of this environmental exposure needs to be clarified. While the study found an association between cellphone exposure and male infertility, the study was not designed to determine a cause-and-effect relationship.
  ఒంట్లో బాగోలేనప్పుడు యాంటీబయాటిక్స్‌ అవసరాన్ని కాదనలేరు. పంటినొప్పి దగ్గర్నుంచీ కేన్సర్‌ వరకూ యాంటీబయాటిక్స్‌ లేకుండా మన చికిత్సా విధానాలే లేవు. ఒకరకంగా చెప్పాలంటే యాంటీబయాటిక్స్‌ మన వైద్యవిధానాన్నీ, దాంతోపాటు మన జీవితాన్నీ కూడా సమూలంగా మార్చేశాయి. యాంటీబయాటిక్స్‌ లేనిరోజుల్లో చిన్నపాటి చెవిపోటుకే మనుషులు చనిపోయే సందర్భాలు ఉండేవి. అయితే రోజులు మారుతున్న కొద్దీ యాంటీబయాటిక్స వాడకం పెరిగిపోతోంది. అవసరం ఉన్నా లేకున్నా యాంటీబయాటిక్స్‌ను వాడేయడం, ఒకోసారి డాక్టరుని సంప్రదించకుండానే వాటిని పుచ్చుకోవడం సహజం అయిపోతోంది. ఇలా విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్‌ను వాడటం వల్ల లేనిపోని పరిణామాలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. శరీరం తనను తాను బాగుచేసుకునే సహజసిద్ధమైన గుణం ఎలాగూ చెడుతుంది... యాంటీబయాటిక్స్‌ వాడకం వల్ల ఇతరత్రా ప్రమాదాలు కూడా ఉన్నాయంటూ రోజుకో నివేదిక బయటపడుతోంది. యాంటీబయాటిక్స్‌ను తీసుకోవడం వల్ల పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా కూడా నాశనం అవుతుందన్న విషయం తెలియందేమీ కాదు. అయితే ఇలా మంచి బ్యాక్టీరియా నష్టపోవడం వల్ల ఏకంగా మెదడుకే ఎసరు వస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇన్నాళ్లూ శరీరం అనేది ఒక యంత్రం అనీ... అందులో ఈ మూల ఉండే పేగులకీ, ఎక్కడో పైన ఉండే మెదడుకీ అంతగా సంబంధం లేదనీ చాలామంది వైద్యులు సైతం భావిస్తూ వచ్చారు. కానీ జీర్ణవ్యవస్థలో ఉండే కొన్ని పరిస్థితులు మన మెదడుని కూడా ప్రభావితం చేస్తాయని నిదానంగా తేల్తోంది. బహుశా ఈ విషయం రుజువైతే ఆహారానికీ, ఆలోచనకూ సంబంధం ఉందని వేల ఏళ్లుగా ఆయుర్వేద వైద్యులు చెబుతున్న మాట నిజమవుతుందేమో!   యాంటీబయాటిక్స్ వాడిన రోగుల్లో మెదడు పనితీరుని గమనించేందుకు పరిశోధకులు దాదాపు 400 మంది వివరాలను పరిశీలించారు. మనం తరచూ వాడే సిప్రాఫ్లొక్సాసిన్‌ సహా 54 రకాల యాంటీబయాటిక్స్ పనితీరుని వీరు గమనించారు. ఈ యాంటీబయాటిక్స్‌ను తీసుకున్న 47 శాతం మందిలో, మానసికమైన వికారాలు ఏర్పడ్డాయట. వీరిలో ఉద్రేకం, భ్రాంతి, అయోమయం, మూర్ఛ వంటి సమస్యలు కలిగాయంటున్నారు బోస్టన్‌కు చెందిన షమిక్‌ భట్టాచార్య అనే పరిశోధకుడు. ఇక యాంటీబయాటిక్స్‌ను తీసుకున్నాక మెదడు పనితీరు ఎలా ఉంటుందో గ్రహించేందుకు EEG తీసిన వైద్యులకీ ఇలాంటి ఫలితాలే కనిపించాయి. యాంటీబయాటిక్స్‌ వాడిన దాదాపు 70 మంది మెదడులో అసహజమైన మార్పులు చోటు చేసుకుంటున్నట్లు సదరు EEGలు నిర్ధారించాయి. చాలా సందర్భాలలో యాంటీబయాటిక్స్‌ వాడకాన్ని ఆపవేసిన వెంటనే రోగులు తిరిగి మామూలు స్థితికి చేరుకున్నారు. కానీ మరికొందరిలో కిడ్నీలు దెబ్బతినడం వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లు తేలింది. ఈ పరిశోధనలన్నీ గమనించిన తరువాత అసలు యాంటీబయాటిక్స్‌ వాడకం గురించే భయం ఏర్పడం సహజం. కానీ యాంటీబయాటిక్స్‌ నిజంగా మన ప్రాణాల్ని కాపాడే ఆయుధాలని గుర్తుంచుకోవాలి. ఆయుధాలని ఎలాగైతే విచక్షణారహితంగా వాడితే ప్రమాదమో యాంటీబయాటిక్స్‌ కూడా అంతే! దీర్ఘకాలికంగా, వైద్యుని పర్యవేక్షణ లేకుండా, తగిన జాగ్రత్తలు తీసుకోకుండా యాంటీబయాటిక్స్‌ను వాడితే మాత్రం అసలుకే ఎసరు తప్పదు. - నిర్జర.