LATEST NEWS
  దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి  అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది. కేంద్రంలోని అధికార ఎన్డీఏ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తు కార్యాచరణను మరింత బలోపేతం చేసేందుకు విపక్షాలు సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నాయి. న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జరిగిన తాజా సమావేశంలో ఇండియా బ్లాక్ నేతలు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో మారుతున్న రాజకీయ పరిణామాలు, ప్రజల సమస్యలపై నిరంతరం అప్రమత్తంగా ఉండేందుకు గాను ఇకపై ప్రతి రెండు నెలలకు ఒకసారి తప్పనిసరిగా సమావేశం కావాలని కూటమి ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ క్రమంలోనే తమ తదుపరి కీలక భేటీని 2026, ఆగస్టు 8వ తేదీన నిర్వహించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించి రాజకీయ వర్గాల్లో వేడి పుట్టించారు. ఈ చారిత్రాత్మక సమావేశానికి దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 25 రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరై తమ గళాన్ని వినిపించారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సాగిన ఈ సుదీర్ఘ చర్చల్లో దేశాన్ని వేధిస్తున్న ఐదు అత్యంత కీలకమైన అంశాలపై కూటమి నేతలు ఒకే తాటిపైకి వచ్చారు. ముఖ్యంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR) ప్రక్రియలో జరుగుతున్న వ్యూహాత్మక లోపాలు, ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న ఓటర్ల హక్కుల ఉల్లంఘనపై ఇండియా కూటమి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయమై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) కి నేరుగా ఒక సమగ్రమైన లేఖ రాయాలని 25 పార్టీల ప్రతినిధులు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ అధికారిక లేఖను అత్యంత త్వరలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సమర్పించనున్నారు. దేశంలోని విద్యావ్యవస్థను అతలాకుతలం చేస్తున్న నీట్ (NEET) పరీక్ష పేపర్ లీక్‌లు, అలాగే సీబీఎస్ఈ (CBSE) మూల్యంకనంలో వెలుగుచూసిన ఘోరమైన అవకతవకలపై విపక్షాలు నిప్పులు చెరిగాయి. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఈ వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఇండియా కూటమి అత్యున్నత వేదిక నుండి డిమాండ్ చేసింది.  దీనితో పాటు దేశంలో పెరుగుతున్న బంధుప్రీతి పెట్టుబడిదారీ విధానం, బీజేపీయేతర లేదా ఎన్డీఏయేతర రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలపై కేంద్రం చేస్తున్న దాడులు, సమాజంలో అణగారిన వర్గాలపై జరుగుతున్న అఘాయిత్యాలు, మరియు మోదీ ప్రభుత్వ ప్రస్తుత విదేశాంగ విధానంలో లోపాలను ఎండగట్టడమే లక్ష్యంగా ఈ సమావేశం సాగింది. ఈ ఐదు ప్రధాన అంశాలపై దేశవ్యాప్తంగా ఐక్యంగా ఉమ్మడి పోరాటం చేయాలని నిర్ణయించారు.  అయితే, ఈ కీలక భేటీకి ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), డీఎంకే (DMK) దూరంగా ఉండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ వైఖరిపై అసంతృప్తితో ఉన్న డీఎంకే ఈ భేటీకి డుమ్మా కొట్టగా, ఆప్ వ్యూహాత్మకంగా దూరంగా నిలిచింది. అయినప్పటికీ, మిగిలిన భాగస్వామ్య పక్షాలు ఆగస్టు 8 భేటీ కోసం ఇప్పటి నుంచే సమరశంఖం పూరిస్తున్నాయి.  
  రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు. సోమవారం అమరావతి అసెంబ్లీ భవనంలో సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్. వనితా రాణికి అందచేశారు. ఈ నామినేషన్ల దాఖలు ప్రక్రియలో కూటమి పార్టీ నేతలు పాల్గొని ప్రతిపాదకులుగా సంతకాలు చేశారు.రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా సానా సతీష్ రెండు సెట్ ల నామినేషన్ లను సమర్పించారు. ప్రతిపాదకులుగా చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీ నారాయణ,పంతం వెంకటేశ్వరరావు(నానాజి), తంగిరాల సౌమ్య సంతకాలు చేశారు. రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా భాష్యం రామకృష్ణ రెండు సెట్ ల నామినేషన్ లను సమర్పించారు. ప్రతిపాదకులుగా మంత్రి అచ్చెన్నాయుడు,ఎమ్మెల్యేలు బి.రామాంజనేయులు,కొలిశెట్టి శ్రీనివాస్, శ్రీరాం తాతయ్యలు సంతకాలు చేశారు. రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా చింతకాయల విజయ్ రెండు సెట్లు నామినేషన్లు సమర్పించారు. ప్రతిపాదకులుగా మంత్రి కొలుసు పార్థసారథి,ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్,సుందరపు విజయ్ కుమార్,బోడే ప్రసాద్ లు సంతకాలు చేశారు.  ఈకార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఎం. అఖిల్ కుమార్, పి.విజయ కుమారి తోపాటు కూటమి నేతలు జ్యోతుల వెంకట అప్పారావు(నెహ్రూ),వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు)వరుపుల సత్య ప్రభ,బండారు సత్యానంద రావు పాల్గొన్నారు. ఇంకా 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ తదతర నేతలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువయ్యేలా సరికొత్త  కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుంది. వైసీసీ హయాంలో జగన్  ప్రజలకు అందుబాటులో ఉండకుండా, కేవలం  కోటరీకే పరిమితమై దెబ్బ తిన్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలకు ముందు ప్రజలతో మమేకమైన జగన్.. అధికార పగ్గాలు చేపట్టగానే, ప్రజలకు చేరువయ్యే అన్ని మార్గాలనూ మూసేసుకున్నారు. కేవలం తన కోటరీ  మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది.  ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.   ఈ ప్రజాబాటలో  భాగంగా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ  సంయుక్తంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లనున్నాయి. జూన్ 9న సంక్షేమ పథకాలపై కేంద్రీకరిస్తూ భారీ ఎత్తున తొలి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. లబ్ధిదారులకు పథకాలు అందుతున్న తీరు, అందులో మార్పుల వంటి పలు అంశాలపై  ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తారు. ఆ తర్వాత జూన్ 12న అమరావతి వేదికగా ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా పాలనాపరమైన ఇబ్బందులు, ప్రజల సమస్యలపై వినతులను స్వీకరిస్తారు. ఇక జూన్ 15న విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి, పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పనపై స్థానిక ప్రజలు, మేధావుల నుండి నేరుగా సూచనలు, సలహాలు సేకరించనున్నారు.  వైసీపీ హయాంలో సీఎంగా ఉన్న జగన్  ప్రజలతో నేరుగా  కలిసే అవకాశాలకు తాళం వేసేశారు.   ప్రజల నుండి క్షేత్రస్థాయి ఫీడ్‌బ్యాక్ తీసుకోకపోవడంతోనే  2024 ఎన్నికల్లో వైసీపీ  కేవలం 11 స్థానాలకే  పరిమితమైందన్నది పరిశీలకుల విశ్లేషణ. ఆ రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలించిన ఎన్డీఏ కూటమి, అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ  ప్రజలతో మమేకం అయ్యే వ్యూహాలనే అనుసరిస్తున్నది. తాజాగా చేపట్టిన ప్రజాబాట. ద్వారా సామాన్య ప్రజలు తమ ప్రాంత ప్రతినిధులను, ప్రభుత్వాన్ని నేరుగా కలిసి అభిప్రాయాలను పంచుకునే అవకాశం ఏర్పడుతుంది. ఈ ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే ప్రభుత్వం భవిష్యత్తులో తన పరిపాలనను మరింత మెరుగుపరుచుకుంటూ, ప్రజామోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకునేందుకు వీలవుతుందని తెలుగుదేశం కూటమి సర్కరా్  భావిస్తోంది.  
తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) అధినేత్రి  కల్వకుంట్ల కవిత.. మాటలతో గారడీ చేసే విద్యను తండ్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) నుంచి పుణికి పుచ్చుకున్నట్లుగా కనిపిస్తారు. తెలంగాణ రాజకీయాలలో ఆమె శైలి ఒకింత భిన్నంగా ఉంటుంది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ స్థాపించిన కల్వకుంట్ల కవిత రాజకీయ ఉనికి కోసం వివాదాస్పద విమర్శల దారి ఎంచుకున్నట్లుగా కనిపిస్తున్నది. అందులో భాగంగానే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు.  ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.   వర్షాల కారణంగా అమరావతి సచివాలయంలోని ముఖ్యమంత్రి కుర్చీ నీరు కారుతోందని, అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రజలు పడవల్లో తిరుగుతున్నారని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   పవన్ కళ్యాణ్‌తో కవితకు ఏవైనా రాజకీయ విభేదాలు ఉంటే, ఆమె రాజకీయ స్థాయిలో ఆయనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడాన్ని ఎవరూ తప్పుపట్టరు కానీ..  ఆమె అమరావతిపై విమర్శలు చేయడంపై ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ ఆగ్రహం వ్యక్తం అవుతంది.   రాజకీయాల్లోని విభజన, ప్రాంతీయత అంశాన్ని  గతంలో కేసీఆర్   వీలైనంతగా వాడుకున్నారు. ఇప్పుడు కవిత మళ్లీ అదే పద్ధతిని అనుసరిస్తున్నారు. అయితే ఆమె అమరావతి లక్ష్యంగా చేస్తున్న వ్యాఖ్యల పట్ల తెలుగు రాష్ట్రాలలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది.  తన రాజకీయ ఉనికి కోసం కవిత అమరావతిపై విషం కక్కడం వ్యర్థ ప్రయత్నంగా పరిశీలకులు అభివర్ణిస్తుననారు. 
  ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముగ్గురు నేతల పేర్లను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ కోసం కష్టపడిన విధేయత, సామాజిక సమీకరణాలు, యువ నాయకత్వానికి పెద్దపీట వేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ దఫా పెద్దల సభకు వెళ్లే అభ్యర్థుల జాబితాలో ప్రముఖ విద్యావేత్త భాష్యం రామకృష్ణ, ప్రస్తుత ఎంపీ సానా సతీష్ బాబు, యువ నాయకుడు చింతకాయల విజయ్ స్థానం దక్కించుకున్నారు. శనివారం రాత్రి వీరందరికీ చంద్రబాబు స్వయంగా పార్టీ తరఫున బీ-ఫామ్‌లను అందజేశారు. దీంతో గత కొన్ని రోజులుగా అభ్యర్థుల ఎంపికపై సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ముఖ్యంగా మూడో స్థానం ఎంపికలో పార్టీ అధిష్ఠానం తీవ్ర కసరత్తు చేసింది. సీనియర్ నాయకుడు వర్ల రామయ్య పేరు చివరి నిమిషం వరకు పరిశీలనలో ఉన్నప్పటికీ, బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో చింతకాయల విజయ్ వైపు మొగ్గు చూపారు. ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడి కుమారుడైన విజయ్, గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఐటీడీపీ ఇన్‌ఛార్జిగా సాంకేతిక విభాగంలో పార్టీ బలోపేతానికి, కార్యకర్తలపై నమోదైన కేసుల ఉపశమనానికి విశేషంగా శ్రమించారు. గత ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటు ఆశించినా పొత్తుల వల్ల త్యాగం చేయాల్సి రావడంతో ఇప్పుడు పెద్దల సభకు పంపుతున్నారు. మరో అభ్యర్థి, భాష్యం విద్యాసంస్థల అధినేత రామకృష్ణ పార్టీ విపక్షంలో ఉన్న కష్టకాలంలో ఆర్థికంగా, నైతికంగా అండగా నిలిచారు. గత ఎన్నికల్లో గుంటూరు లోక్‌సభ టికెట్ దక్కకపోయినా పార్టీ శిక్షణా కార్యక్రమాల్లో క్రియాశీలంగా వ్యవహరించినందుకు గుర్తింపుగా ఆయనకు ఈ పదవి దక్కింది. ఇక కాకినాడకు చెందిన సానా సతీష్ బాబు గత ఉప ఎన్నికల్లో కేవలం ఏడాదిన్నర కాలానికే ఎన్నికవ్వడంతో, సామాజిక సమతూకం దృష్ట్యా ఆయనకు చంద్రబాబు మరోసారి పూర్తి కాలానికి అవకాశం కల్పించారు. మొత్తంగా ఏపీలో ఖాళీ అయిన నాలుగు స్థానాలలో కూటమి ఒప్పందం ప్రకారం మూడు టీడీపీ, ఒకటి జనసేన పంచుకున్నాయి. జనసేన తరఫున ఇప్పటికే లింగమనేని రమేష్ నామినేషన్ వేయగా, టీడీపీ అభ్యర్థులు సోమవారం తమ పత్రాలను దాఖలు చేయనున్నారు. అసెంబ్లీలో కూటమికి ఉన్న భారీ మెజారిటీ నేపథ్యంలో ఈ నలుగురి ఎన్నిక కేవలం ఏకగ్రీవంగా పూర్తి కావడం లాంఛనంగానే కనిపిస్తోంది. రాష్ట్రంలో యువతకు, సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంపై పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో పార్లమెంట్‌లో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ ముగ్గురు నేతలు గళం విప్పుతారని విశ్లేషకులు భావిస్తున్నారు.
ALSO ON TELUGUONE N E W S
  మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్(Ram Charan)వన్ మాన్ షో  మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది'(Peddi)బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులని సృష్టిస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 292 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లని  సాధించింది. ఐదో రోజు నాటికి విజయవంతంగా . 300 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈ రోజు సాయంత్రం  హైదరాబాద్‌లో చిత్ర బృందం  'థాంక్యూ ప్రెస్ మీట్' నిర్వహించింది. ఈ వేడుకలో రామ్ చరణ్ మాట్లాడిన మాటలు, ఆయన చూపించిన ఎనర్జీ ఇప్పుడు సోషల్ మీడియాలో  ట్రెండ్ అవుతున్నాయి. చరణ్ మాట్లాడుతు అసలు ఎక్కడి నుంచి మాట్లాడాలో అర్థం కావడం లేదు. నిన్న రాత్రి థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూడకపోయి ఉంటే, ఈరోజు ప్రెస్ మీట్‌లో ఇంకా బెటర్ గా మాట్లాడేవాడిని. థియేటర్‌లో ప్రేక్షకులు హంగామా చూశాక మాటలు రావడం లేదు. ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ అంటే సాధారణంగా ఆడియన్స్ సైలెంట్‌గా ఉంటారని అనుకున్నాను. కానీ అక్కడ కూడా ప్రేక్షకులు మాస్ థియేటర్లయిన శ్రీరాములు, భ్రమరాంబ థియేటర్ల తరహాలో ఈలలు, గోలలతో పండగ చేసుకున్నారు. పెద్దిని ఇంతలా ఆదరించినందుకు మీడియా మిత్రులకి ,ప్రేక్షకులకి, అభిమానులందరికీ శిరస్సు వంచి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నప్పటికీ, 'పెద్ది' సినిమా తన లైబ్రరీలోనే నెం. 1 లేదా నెం. 2 స్థానంలో నిలిచిపోయే చిత్రం.ఈ కథ చాలా రిస్క్‌తో కూడుకున్నదని మొదటి రోజే నాకు అర్థమైంది. అయితే మనస్ఫూర్తిగా, సిన్సియారిటీతో పని చేస్తే ఖ  చ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మాను. అదే నిజమైంది. ఈ సినిమా చేయడానికి నన్ను  ఎవరూ బలవంతం చేయలేదు. నేనే  స్వతహాగా కథని ఇష్టపడి, దర్శకుడు బుచ్చిబాబు ప్రతిభని  నమ్మి  చేశాను. అందుకే ఈ సక్సెస్ నాకు  ఎంతో సంతృప్తిని ఇచ్చింది.  Also read: Peddi: పెద్దికి నెగిటివ్ రివ్యూస్ రాసిన వాళ్ళకి థాంక్స్.. వైరల్ అవుతున్న జగపతిబాబు వ్యాఖ్యలు  జగపతిబాబు గారి పెర్ఫార్మ్ చూసి నా కంట్లో నీళ్లొచ్చాయి. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ గారి సపోర్ట్‌తో పాటు తోటి నటీనటులకి థాంక్స్. దాదాపు 185 రోజుల షూటింగ్‌లో ఆల్మోస్ట్ అన్ని రోజులూ సెట్‌లోనే ఉండి సినిమాని  ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించిన నిర్మాత సతీష్ కిలారు, మైత్రీ రవిశంకర్‌కి  ప్రత్యేక ధన్యవాదాలు. లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ రాసిన అద్భుతమైన పాటలు ఎప్పటికీ తన పర్సనల్ లైబ్రరీలో ఉంటాయి. 'పెద్ది'కి  సిన్సియారిటీ చాలా అవసరం  ప్రేక్షకులు కూడా అంతే సిన్సియారిటీతో థియేటర్లకి  వచ్చి  300 కోట్ల బ్లాక్‌బస్టర్‌గా మార్చడం ఇండస్ట్రీకి ఎంతో గర్వకారణమని రామ్ చరణ్ తన ప్రసంగాన్ని ముగించారు. యాంకర్ స్రవంతి కోరిక మేరకు చరణ్ మీసం మెలేసి అభిమానులని  ఊర్రూతలూగించారు.  
టాలీవుడ్‌లో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తే, మరికొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే నవ్వుల రికార్డులను సృష్టిస్తాయి. అలా కేవలం స్వచ్ఛమైన కామెడీతోనే బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల మైలురాయిని దాటి సంచలనం సృష్టించిన క్లాసిక్ ఎంటర్‌టైనర్ ‘జాతి రత్నాలు’. జోగిపేట శ్రీకాంత్, శేఖర్, రవిల అమాయకత్వం థియేటర్లలో నవ్వుల తుఫాన్ సృష్టించింది. అప్పటి నుండి ఈ క్రేజీ స్టోరీకి మళ్ళీ ఎప్పుడు సీక్వెల్ వస్తుందా అని మూవీ లవర్స్ కళ్ళలో వత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమాను వైజయన్తీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్‌పై నిర్మించిన స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ క్లారిటీ ఇప్పుడు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాకు సీక్వెల్ చేయడంపై ఆయన స్పందిస్తూ ఒక చేదు నిజాన్ని వెల్లడించారు. ‘జాతి రత్నాలు 2’ ప్రాజెక్ట్‌ను కమర్షియల్‌గా నిర్మించడం చాలా సులువైన విషయమేనని, కానీ ఆ బ్రాండ్ వాల్యూని కాపాడాలంటే బలమైన కథ ఉండాలని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి పార్ట్-2 చేయడానికి సరిపోయే పక్కా కథ తమ వద్ద లేదని నాగ్ అశ్విన్ నిజాయితీగా ఒప్పుకోవడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా నిరాశకు గురయ్యారనే చెప్పాలి. ఒక అద్భుతమైన, లాజికల్ వెరైటీ సబ్జెక్ట్‌ను దర్శకుడు అనుదీప్ కే.వి. లైన్‌లోకి తెస్తేనే ఈ ముగ్గురు జోగిపేట రత్నాలు మళ్లీ సెట్స్ పైకి రావడం ఖాయమని తెలుస్తోంది. దాంతో ఈ సాలిడ్ సీక్వెల్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవ్వడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది. గతంలో 2021 మార్చిలో విడుదలైన ‘జాతి రత్నాలు’ చిత్రంలో నవీన్ పొలిశెట్టి టైమింగ్, ప్రియదర్శి నటన, రాహుల్ రామకృష్ణ బాడీ లాంగ్వేజ్ వెండితెరపై ఒక మ్యాజిక్ చేశాయి. వీరికి తోడుగా ‘చిట్టి’ పాత్రలో ఫరియా అబ్దుల్లా కుర్రకారు మనసులను దోచుకుంది. ఎలాంటి భారీ యాక్షన్ సీక్వెన్సులు లేకపోయినా, కేవలం క్లీన్ కామెడీతోనే ఈ సినిమా ట్రేడ్ వర్గాలకు పెద్ద షాక్ ఇచ్చింది.   ప్రస్తుతం నాగ్ అశ్విన్ దృష్టి మొత్తం వచ్చే ఏడాది చివర్లో (డిసెంబర్ 2027) విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్న ‘కల్కి పార్ట్ 2’ పనులపైనే ఉంది. మరోవైపు హీరో నవీన్ పొలిశెట్టి కూడా విభిన్నమైన ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండగా, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలు డిజిటల్ సిరీస్‌లు, విలక్షణమైన పాత్రలతో బిజీ ఆర్టిస్టులుగా మారిపోయారు. జాతి రత్నాలు సీక్వెల్ ప్రాజెక్ట్ పూర్తిగా రద్దు కాలేదనేది ఇక్కడ గమనించాల్సిన అసలు విషయం. కల్కి లాంటి భారీ మైథాలజీ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ కూడా మళ్లీ ఇలాంటి ఒక హిలేరియస్ ఎంటర్‌టైనర్‌ను ప్రొడ్యూస్ చేయడానికి ఆసక్తిగానే ఉన్నారు. కాకపోతే, ప్లాపులతో సావాసం చేస్తున్న అనుదీప్ ఈ సాలిడ్ సీక్వెల్ వెపన్ కి సరిపడా పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను ఎప్పుడు బయటికి తీస్తాడో చూడాలి.
The teaser of Slumdog 33 Temple Street offers a clearer look at the world that Puri Jagannadh and Vijay Sethupathi are building together. Positioned as a Pan-India film, the project had already drawn attention for its unusual title, casting choices and setting. The teaser now shifts the focus toward tone and character. Vijay Sethupathi appears in the role of a visually challenged beggar who seems deeply connected to a larger community of homeless and marginalised people. Rather than presenting him as a conventional underdog, the teaser hints at a character carrying influence, conflict and a larger purpose within that world. Across its runtime, the teaser suggests themes of survival, power and revenge without revealing too much of the central plot. Tabu, Duniya Vijay and Samyuktha appear briefly but their presence indicates that the narrative may rely on strong interpersonal conflict. One noticeable aspect is Puri Jagannadh’s treatment. While retaining his familiar intensity, the visuals appear more restrained and textured than his recent work. Harshavardhan Rameshwar’s background score adds mood and scale, while the teaser largely focuses on establishing atmosphere rather than delivering conventional mass moments. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  అప్పలసూరిగా పెద్ది(Peddi)లో జగపతిబాబు పెర్ఫార్మ్ కి మంచి పేరు వస్తుంది. చరణ్ పెర్ఫార్మ్ తర్వాత జగపతిబాబు పెర్ఫార్మ్ నే పెద్దిని సూపర్ హిట్ చేసిందనే అభిప్రాయాన్ని కూడా మెజారిటీ ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం మీడియాతో  పెద్ది థాంక్ యూ మీట్ జరిగింది. ఈ ఈవెంట్ కి చరణ్ తో జగపతి బాబు, దర్శకుడు బుచ్చిబాబుతో పాటు నిర్మాతలు బాగున్నారు. ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతు మూవీలో పెద్ది గెలవడం కోసం ఎలా ఆడాడో,  పోరాడాడో, రిలీజ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఆడాల్సి వస్తుంది. పోరాడాల్సి వస్తుంది.  కానీ గెలిచాడు. కొంచం అటు ఇటు అయితే పెద్దిని తిప్పి కొట్టేవారు. కానీ కి ఒక మైండ్, హార్ట్, దమ్ము మీద ఆడుతుంది. హీ మాన్  చరణ్ భుజాల మీదనే కాకుండా నెత్తిన పెట్టుకొని మూవీని మోశాడు. పెద్ది నాలుగు రోజులు అయ్యింది పుట్టి. కాబట్టి ఇప్పుడిపుడే పాకుతుంది, నడుస్తుంది. త్వరలోనే ఎగురుతుంది. పెద్దిని మనమందరం ఇంకా పెంచాలి.  నెగిటివ్ రివ్యూస్ రాసిన వాళ్ళకి థాంక్స్. వాళ్ళు అలా రాయడం వల్ల పెద్దికి ఇంకా హైప్ వచ్చింది. Also read: తండ్రి దొంగ అయితే కొడుకు దొంగ అవుతాడా! ఎనిమిదేళ్ళ తర్వాత మళ్ళీ అద్భుతమైన క్యారక్టర్ పెద్దితో  వచ్చింది. అది నాకు ఇష్టమైన చరణ్ తో. చిరంజీవి గారు పెద్ది మూవీ గురించి పొగుడుతూ నన్ను తన బ్రదర్ అని చెప్పినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పాడు.  
Peddi team held a Thank You Meet following the film’s strong theatrical run and growing audience response across markets. The event saw director Buchi Babu Sana, Ram Charan, Jagapathi Babu and producer Venkata Satish Kilaru speak about the reception and the journey behind the film. Speaking at the event, Buchi Babu Sana revealed that one of the inspirations for Peddi came from the Khelo India initiative launched in 2017–18. He stated that the idea was to tell a story rooted in discovering talent from marginalised rural backgrounds and showcase how sports create emotional connections that go beyond urban and rural divides. Jagapathi Babu shared that he was initially nervous after seeing mixed reactions to a few portions of the film on day one. However, as word-of-mouth strengthened and audience response improved, he said he felt relieved and thankful. He also called Peddi one of the most rewarding films of his career. Ram Charan stated that he feels thoroughly satisfied with the response to his performance and said he approached Peddi with complete honesty, sincerity and commitment. He added that audience acceptance has reinforced his belief that heartfelt efforts will always find appreciation and thanked the entire team, including AR Rahman, for contributing to the film’s reception. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
డిజిటల్ వినోదాన్ని ఇష్టపడే ఓటీటీ ప్రియులకు ఈ వారం అసలైన పండగ రాబోతోంది. థియేటర్లలో పెద్దగా చెప్పుకోదగ్గ కొత్త సినిమాలు లేకపోవడంతో, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాయి. స్టార్ హీరోల చిత్రాల నుండి యూత్‌ను ఆకట్టుకునే బోల్డ్ వెబ్ సిరీస్‌ల వరకు ఎన్నో రకాల ఆప్షన్లు ఈ వీకెండ్ అలరించడానికి లైనప్‌లో ఉన్నాయి. ముందుగా బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్, కామెడీ కింగ్ పరేష్ రావల్ కాంబినేషన్‌లో వచ్చిన హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘భూత్ బంగ్లా’. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ మార్క్ కామెడీతో థియేటర్లలో నవ్వులు పూయించిన ఈ చిత్రం జూన్ 12 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతోంది. వీకెండ్‌లో సరదాగా నవ్వుకోవాలనుకునే వారికి ఇది పర్‌ఫెక్ట్ ఛాయిస్. మరోవైపు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, ఎవర్ గ్రీన్ బ్యూటీ త్రిష లీడ్ రోల్స్‌లో నటించిన కోర్టు రూమ్ డ్రామా ‘కరుప్పు’. తెలుగులో ‘వీరభద్రుడు’ అనే పేరుతో రాబోతున్న ఈ విలక్షణ చిత్రాన్ని ఆర్జే బాలాజీ తెరకెక్కించారు. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ కూడా జూన్ 12 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు తమిళంలోనూ స్ట్రీమింగ్ కానుంది. ఇక సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ కథలను ఇష్టపడే వారి కోసం మలయాళ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ ‘దృఢం’ లైన్‌లో ఉంది. షేన్ నిగమ్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఒక విలక్షణమైన మర్డర్ మిస్టరీని కేవలం వారం రోజుల్లో ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా ఛేదించాడనేది ఆసక్తికరంగా చూపించారు. ఈ బాక్సాఫీస్ హిట్ చిత్రం జూన్ 12 నుండి జియో హాట్ స్టార్‌లో పలు భాషల్లో అందుబాటులోకి వస్తోంది. అలాగే ‘మీర్జాపూర్’ ఫేమ్ అలీ ఫజల్, సోనాలి బింద్రే ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘రాఖ్’ సైతం అదే రోజు ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానుంది. వీటితో పాటు యూత్‌ను టార్గెట్ చేస్తూ రీజనల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ తమ పాపులర్ అంథాలజీ సిరీస్ ‘ష్..’ సీజన్ 3 ని తీసుకొస్తోంది. మునుపటి సీజన్ల కంటే మరిన్ని రొమాంటిక్, బోల్డ్ సీన్స్‌తో ఈ సిరీస్‌ను జూన్ 12 నుండి స్ట్రీమింగ్ చేయనున్నారు. రొమాంటిక్ డ్రామా ప్రియుల కోసం జూన్ 10న ‘ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్’, కిడ్స్ కోసం జూన్ 16న ‘ఐయామ్ ఫ్రాంకెల్‌డా’ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఈ వీకెండ్ హారర్, సస్పెన్స్, యాక్షన్, రొమాన్స్ ఇలా అన్ని జోనర్ల సినిమాలతో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు సందడిగా మారబోతున్నాయి. సో, మీ టేస్ట్‌కు తగ్గట్టుగా నచ్చిన జోనర్‌ను సెలెక్ట్ చేసుకుని ఇంట్లోనే ప్రశాంతంగా ఈ వీకెండ్ వినోదాన్ని ఆస్వాదించండి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' (Peddi) థియేటర్లలో బాక్సాఫీస్ తుఫాను సృష్టిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచే వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన వీకెండ్‌ను ముగించుకున్న ఈ సినిమా, ఐదో రోజు సోమవారం  కూడా పాజిటివ్ నోట్‌తోనే ప్రారంభం కావడం విశేషం. సాధారణంగా వీకెండ్ ముగిసిన తర్వాత వీక్‌డేస్‌లో పెద్ద సినిమాలకు వసూళ్లు తగ్గడం సహజం, కానీ 'పెద్ది' చిత్రం మాత్రం బాక్సాఫీస్ వద్ద తన పట్టును నిలుపుకుంటూ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ ప్రయాణంలో ఈ వారం రోజులు అత్యంత కీలకంగా మారాయి. పంపిణీదారులు, కొనుగోలుదారులు అందరూ క్లియర్ కట్ బ్రేక్ ఈవెన్ మార్కును చేరుకోవాలంటే ఈ కలెక్షన్ల జోరు ఇలాగే కొనసాగాల్సి ఉంటుంది. ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి చూస్తే, ఈ వారం ముగిసే సమయానికి బయ్యర్లందరూ సేఫ్ జోన్‌లోకి వెళ్లడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ట్రేడ్ లెక్కల ప్రకారం, 'పెద్ది' చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.240 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది.  'రంగస్థలం', 'ఆర్ఆర్ఆర్' చిత్రాల తర్వాత రామ్ చరణ్ కెరీర్‌లో రూ.200 కోట్ల క్లబ్‌లో చేరిన మూడో చిత్రంగా 'పెద్ది' నిలిచింది. ఒక పక్క కథనంపై కొన్ని మిశ్రమ స్పందనలు, హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్ర చిత్రణపై సోషల్ మీడియాలో వివాదాలు నడుస్తున్నప్పటికీ, అవేవీ బాక్సాఫీస్ వసూళ్లపై ప్రభావం చూపించలేకపోయాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ నటన, శారీరక మేకోవర్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ముఖ్యంగా ద్వితీయార్థంలో వచ్చే ఎమోషనల్ సీన్స్ మరియు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్, మిగతా సౌత్ భాషల్లోనూ ఈ చిత్రం భారీ వసూళ్లను సాధిస్తోంది. అయితే హిందీ బెల్ట్‌లో మాత్రం ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేకపోయింది. నాలుగు రోజుల్లో అక్కడ కేవలం రూ.11 నుండి 12 కోట్ల నెట్ మాత్రమే వసూలైంది. అయినప్పటికీ, తెలుగు వెర్షన్ ఇస్తున్న గట్టి మద్దతుతో ఈ చిత్రం త్వరలోనే రూ.300 కోట్ల క్లబ్‌ వైపు అడుగులు వేస్తోంది. బయ్యర్ల నమ్మకాన్ని నిలబెడుతూ ఈ సోమవారం టెస్టును కూడా పెద్ది విజయవంతంగా దాటేలా కనిపిస్తోంది.  
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్లోబల్ రేంజ్‌లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, తన కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యత గురించి అందరికీ తెలిసిందే. షూటింగ్ షెడ్యూల్స్ నుండి కాస్త విరామం దొరికినా చాలు, భార్యాపిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్లడం లేదా ఫ్యామిలీతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయడం బన్నీకి అలవాటు. తాజాగా ఐకాన్ స్టార్ తన ముద్దుల కుటుంబంతో కలిసి దిగిన ఒక అందమైన ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. ఈ క్రేజీ ఫ్యామిలీ పిక్‌లో అల్లు అర్జున్, ఆయన సతీమణి స్నేహారెడ్డి, కుమారుడు అయాన్, కుమార్తె అర్హ కలిసి ఒకే ఫ్రేమ్‌లో మెరిశారు. ఒక ప్రత్యేకమైన నైట్ అవుట్ కోసం ఈ నలుగురూ బ్లాక్ కలర్ కాంబినేషన్ దుస్తులలో ట్రెండీగా తయారయ్యారు. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బన్నీ ఎప్పటిలాగే తన స్టైలిష్ స్వాగ్‌తో అలరించగా, స్నేహారెడ్డి మోడ్రన్ లుక్‌లో ఎంతో అందంగా కనిపించారు. ఇక అల్లు వారసులు అయాన్, అర్హలు తమ క్యూట్ స్మైల్‌తో నెటిజన్ల మనసులను దోచుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియా వేదికలపై విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ ఫోటోను రీట్వీట్లు, షేర్లతో వైరల్ చేస్తున్నారు. "పర్ఫెక్ట్ ఫ్యామిలీ గోల్స్" అంటూ నెటిజన్లు ఈ పిక్‌పై క్రేజీ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా లిటిల్ ప్రిన్సెస్ అల్లు అర్హ ఎక్స్‌ప్రెషన్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్ గతేడాది ‘పుష్ప 2: ది రూల్’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 1800 కోట్ల కలెక్షన్ల ప్రవాహాన్ని సృష్టించి హిస్టరీ క్రియేట్ చేశారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా సంచలన విజయం తర్వాత బన్నీ మార్కెట్ రేంజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం ఆయన కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీతో కలిసి తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌పై దృష్టి సారించారు.   సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ దాదాపు రూ. 800 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో గ్లోబల్ బ్యూటీ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుండటంతో అంచనాలు అప్పుడే ఆకాశాన్ని తాకాయి. ప్రస్తుతం ఈ సినిమా ముంబైలో హై-వోల్టేజ్ యాక్షన్ షెడ్యూల్ జరుపుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అధికారిక అప్‌డేట్స్ త్వరలోనే రానున్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్‌లో ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. తాత్కాలికంగా 'AA23' అని పిలుస్తున్న ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వీడియోతోనే సోషల్ మీడియాను షేక్ చేసింది. ముఖ్యంగా అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో సరికొత్త రికార్డులు సృష్టించింది. అయితే ఈ మధ్య కాలంలో ఈ సినిమా ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ గట్టిగా వినిపించాయి. ఈ పుకార్ల వల్ల బన్నీ అభిమానులు కాస్త ఆందోళనకు గురయ్యారు. కానీ తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక అదిరిపోయే అప్‌డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తోంది. గత 15 రోజుల్లోనే దర్శకుడు లోకేష్ కనగరాజ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను రెండు సార్లు ప్రత్యేకంగా కలిశారని సమాచారం. కేవలం ఇదొక్కటే కాదు, ఈ ప్రాజెక్ట్‌కు రైటర్‌గా పనిచేస్తున్న రత్న కుమార్ కూడా రీసెంట్‌గా 'కాంట్ వెయిట్ ఫర్ AA23' అంటూ ట్వీట్ చేసి సినిమా ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చారు. దీంతో రూమర్స్ అన్నింటికీ ఒక్కసారిగా చెక్ పడినట్లయింది. కథకు సంబంధించిన కీలకమైన మార్పులు, స్క్రిప్ట్ వర్క్ వేగంగా ముందుకు సాగుతున్నాయని టాక్. ఇద్దరి మధ్య జరిగిన ఈ రెండు సిట్టింగ్స్‌లో సినిమాకు సంబంధించిన ముఖ్యమైన విషయాలపై ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో రాబోతున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ 'రాకా' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. 2024 లో విడుదలైన 'పుష్ప 2: ది రూల్' సినిమా 1700 కోట్లకు పైగా గ్లోబల్ కలెక్షన్లు రాబట్టి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తెచ్చిన భారీ సక్సెస్ ఊపుతో అల్లు అర్జున్ తన తదుపరి సినిమాలను మరింత జాగ్రత్తగా, పక్కా ప్లానింగ్‌తో ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే లోకేష్ కనగరాజ్ సినిమా స్క్రిప్ట్ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా పక్కాగా గ్రౌండ్ వర్క్ పూర్తి చేయాలని చూస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను ఎక్కడా బడ్జెట్ పరిమితులు లేకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. 2026 చివర్లో లేదా 2027 లో ఈ సినిమాను పట్టాలెక్కించేలా ప్లాన్ చేస్తున్నారు.  
సీనియర్ మరియు వింటేజ్ హీరోలను తన సినిమాల్లో పవర్‌ఫుల్ పాత్రల ద్వారా మళ్లీ ట్రాక్‌లోకి తీసుకురావడంలో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) రూటే వేరు. గతంలో డైరెక్టర్ బోయిపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన 'లెజెండ్' సినిమాతో జగపతి బాబును విలన్‌గా మార్చి ఆయన సెకండ్ ఇన్నింగ్స్‌కు ఒక అద్భుతమైన పునాది వేశారు బాలకృష్ణ. ఆ తర్వాత అదే బాటలో 'అఖండ' సినిమా ద్వారా ఫ్యామిలీ హీరో శ్రీకాంత్‌ను క్రూరమైన విలన్‌గా పరిచయం చేసి బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్ సృష్టించారు. ఇప్పుడు ఇదే సక్సెస్ ఫార్ములాను మరోసారి రిపీట్ చేస్తూ టాలీవుడ్‌లో ఒక సంచలన వార్త విపరీతంగా హల్‌చల్ చేస్తోంది. బాలకృష్ణ, కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ లో టాలీవుడ్ యాంగ్రీ మ్యాన్, విలక్షణ నటుడు రాజశేఖర్ (Rajasekhar) విలన్‌గా నటించబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలి కాలంలో హీరోగా కంటే క్యారెక్టర్ రోల్స్ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ రాజశేఖర్ పరిశ్రమకు కొన్ని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. శర్వానంద్, నితిన్ సినిమాల్లో ఆయన చేసిన వైవిధ్యమైన పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. ముఖ్యంగా శర్వానంద్ 'బైకర్' సినిమాలో ఆయన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఈ నేపథ్యంలో కొరటాల శివ, బాలకృష్ణ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో రాజశేఖర్‌ను ఒక అత్యంత పవర్‌ఫుల్ మరియు స్టైలిష్ విలన్‌గా ప్రెజెంట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ సినిమాల్లో విలన్ పాత్రలు కేవలం శారీరక బలానికి మాత్రమే పరిమితం కాకుండా, హీరోతో సమానంగా మైండ్ గేమ్ ఆడే విధంగా చాలా పాలిష్‌డ్‌గా మరియు కార్పొరేట్ తరహాలో ఉంటాయనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. ఈ సినిమా కథాంశం కూడా అత్యంత ఆసక్తికరంగా ఉండబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. అధికారంలో ఉన్న ఒక ఉన్నత వ్యక్తి సమాజంలోని ఒక పెద్ద ఈవిల్ ఫోర్స్‌పై ప్రజలతో కలిసి ఎలాంటి పోరాటం చేశాడు అనే కోణంలో కొరటాల శివ ఈ లైన్‌ను సిద్ధం చేశారు. సమాజం మొత్తం సఫర్ అవుతున్న తరుణంలో, అధికారంలో ఉన్నవాళ్లు మరియు లేనివాళ్లు అంతా కలిసి ఒక ఐక్య సంఘటనగా ఏర్పడి ఎదుర్కోవాల్సిన ఆ దుష్టశక్తి వెనుక ఉండే ప్రధాన సూత్రధారిగా రాజశేఖర్ పాత్ర ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ పాత్ర కోసం రాజశేఖర్ గెటప్, డైలాగ్ డెలివరీ మరియు స్క్రీన్ ప్రెజెన్స్ పూర్తిగా సరికొత్తగా, విచిత్రంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కేవలం మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో మాత్రమే కాకుండా మైండ్ గేమ్ చుట్టూ తిరిగే కథ కావడంతో, బాలయ్య రౌద్రానికి మరియు రాజశేఖర్ ఇంటెలిజెంట్ విలనిజానికి మధ్య జరిగే ఘర్షణ థియేటర్లలో ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వార్త గనుక నిజమైతే, రాజశేఖర్ కెరీర్‌కు ఇదొక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్‌గా నిలవడం ఖాయం.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రతి వ్యక్తికి నేటికాలంలో ఇల్లు, ఆఫీసు అంటూ రెండు ప్రదేశాలు ముఖ్యంగా మారాయి.  ఒకటి కుటుంబ సభ్యులతో కలసి ఉండేది అయితే రెండవది కుటుంబ సభ్యులను పోషించడానికి మరొక ప్రదేశంలో విభిన్న వ్యక్తులతో కలిసి పనిచేసే స్థలం. చాలామంది ఆఫీసులో ఒత్తిడి ఎదుర్కుంటున్నామని చెబుతూ ఉంటారు. ఆఫీసులో గనుక పని ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటే అది మానసిక ఆరోగ్యాన్ని, వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అయితే కొన్ని చిన్న చిన్న మార్పులు, చిట్కాలతో ఒత్తిడి నుండి బయట పడవచ్చు. ఇవి నేరుగా ఆఫీసుకు వెళ్లి పని చేసే వారికి అయినా,  లేక వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి అయినా చాలా చక్కగా పని చేస్తాయి.  అవేంటో తెలుసుకుంటే.. పనుల జాబితా.. ఈ చిట్కా ఖచ్చితంగా  సహాయపడుతుంది. ఉదయాన్నే డైరీలో రోజు పనులను రాసుకోవాలి. పైన తేలికైన పనులను,  దిగువన ఎక్కువ సమయం,  శ్రద్ధ అవసరమయ్యే పనులను లిస్ట్  చేయాలి. ఇది  మనస్సు గందరగోళం లేకుండా క్లారిటీగా  ఉంచడానికి సహాయపడుతుంది.  రోజులో ఆ పనులు చేయాలి, ఈ పనులు చేయాలి.. వాటిని ఎప్పుడు చేయాలో అనుకుంటూ  అతిగా ఆలోచించడాన్ని తగ్గిస్తుంది. బ్రేక్ ముఖ్యం..  ఎంత పని ఉన్నా సరే.. గంటల తరబడి కూర్చుని పని చేయడం తప్పు. ప్రతి 25-30 నిమిషాల పని తర్వాత 5 నిమిషాల విరామం తీసుకోవాలి. నీరు త్రాగడం,  కళ్ళు మూసుకోవడం  లేదా కొద్దిగా శరీరాన్ని రిలాక్స్ చేసుకోవడం.. ఇవన్నీ  మనసు అలసిపోకుండా  విశ్రాంతిని ఇస్తాయి.   ఒత్తిడిని తగ్గిస్తాయి. నో చెప్పడం నేర్చుకోండి.. ఇది అతి ముఖ్యమైన చిట్కా ఏమిటంటే.. ప్రతి పనినీ, మీటింగ్‌నీ లేదా పనిని.. ఇట్లా ఏదైనా సరే.. ఆఫీసులో  అదనపు బాధ్యతను ఎప్పుడూ తీసుకోకూడదు. చాలా మంది కాస్త మంచిగా మాట్లాడుతూ,  కాస్త పొగుడుతూ ఏదైనా పని చేసిపెట్టమని అడుగుతూ ఉంటారు.  అలాంటి సందర్భాలలో  మర్యాదగా తిరస్కరించాలి.  ఇది  మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎందుకంటే అదనపు పని భారం ఒత్తిడికి దారి తీస్తుంది.  ప్రతి ఒక్కరూ నో చెప్పడం నేర్చుకోవాలి. ఇది ఎంతో సహాయపడుతుంది. శారీరక శ్రమ..  పనిలో బిజీగా ఉన్నప్పటికీ, ప్రతిరోజూ 15-30 నిమిషాలు నడవడం, యోగా చేయడం లేదా తేలికపాటి వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. ఇది సహజ ఒత్తిడిని తగ్గించే మార్గం.  ఒత్తిడి హార్మోన్లు వ్యాయామం వల్ల తగ్గుతాయి. వ్యాయమం మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఇది  ఫిట్‌గా ఉంచుతుంది. డెస్క్ దగ్గరే కూర్చుని చేయగల యోగా భంగిమలు కొన్ని ఉంటాయి.  అలాంటివి చేసినా బాగుంటుంది.                          *రూపశ్రీ.
ఆదివారం అనే మాట వినగానే మన ముఖాల్లో సంతోషకరమైన చిరునవ్వు వస్తుంది. ఇది కుటుంబంతో సమయం గడపడానికి,  పని నుండి విరామం తీసుకోవడానికి కేటాయించబడిన రోజుగా పరిగణిస్తారు. చిన్నప్పుడు పిల్లలు ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుందా అని ఎదురుచూసేవారు.. కానీ ఇప్పుడు పిల్లలు పెద్దలు కూడా ఆదివారం కోసం ఎదురుచూడటం సాధారణమైపోయింది.  భారతదేశంలో ప్రభుత్వ కార్యాలయాలకు  ఆదివారం వారపు సెలవుదినంగా ఉంటుంది. కానీ ఆదివారం అనేది మొదటి నుండి సెలవు దినంగా ఉన్నది కాదని,  ఆదివారం సెలవు దినం కావడం వెనుక చాలా ఆసక్తికరమైన సంఘటన ఉంది. దాని గురించి తెలుసుకుంటే.. కార్మిక హక్కులు.. బ్రిటిష్ పాలన కాలంలో  ఆదివారంను వారపు సెలవు దినంగా ఎంచుకున్నారు. దీని  వెనుక ఒక  కథ ఉంది. ఆదివారం సెలవు వెనుక కథ.. ప్రస్తుత కాలం ఆదివారంతో చేసే ఎంజాయ్మెంట్ ఎప్పుడూ ఉండేది కాదు.  ఎందుకంటే  బ్రిటిష్ పాలనలో భారతదేశంలోని వస్త్ర మిల్లులలో, ముఖ్యంగా ముంబైలోని కార్మికుల పరిస్థితులు దారుణంగా ఉండేవి. వారు వారానికి ఏడు రోజులు విరామం లేకుండా పని చేయాల్సి వచ్చింది. వారం మొత్తం ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల ఆరోగ్యం చాలా దెబ్బతినేది. ఈ క్లిష్ట సమయంలో నారాయణ్ మేఘాజీ లోఖండే వారి హీరో అయ్యాడు. 7ఏళ్ల పోరాటం.. కార్మికుల దుస్థితిని చూసి లోఖండే వారి హక్కుల కోసం గొంతు విప్పాడు. 1881,  1884 మధ్య ఎన్నో నిరసనలు నిర్వహించి బ్రిటిష్ పరిపాలకులకు చాలా సందేశాలను పంపాడు. అతని విజ్ఞప్తిపై వేలాది మంది కార్మికులు ఏకమయ్యారు. కానీ అది చిన్న పోరాటం కాదు. ఈ ఉద్యమం ఏడు సంవత్సరాలు కొనసాగింది. చివరికి కార్మికుల సంఘీభావం,  లోఖండే ప్రయత్నాలకు బ్రిటిష్ ప్రభుత్వం లొంగిపోయింది.   జూన్ 10, 1890న, భారతదేశంలో  ఆదివారం అధికారికంగా వారపు సెలవు దినంగా ప్రకటించబడింది. ఆదివారం సెలవు వెనుక అసలు కారణం.. ఆదివారం సెలవు దినంగా ఎంచుకోవడం వెనుక మతపరమైన,  ఆచరణాత్మక కారణాలు రెండూ ఉన్నాయి. ఆ సమయంలోభారతదేశాన్ని క్రైస్తవ మతాన్ని ఆచరించే బ్రిటిష్ వారు పరిపాలించారు. వారికి ఆదివారం చర్చికి వెళ్లడానికి సరైన రోజు. అందువల్ల ఆదివారం సెలవు దినంగా ఎంచుకున్నారు. భారతీయ సంస్కృతి,  హిందూ మతంతో అనుసంధానిస్తూ ఆదివారం సూర్యభగవానుడికి,  కొన్ని ప్రాంతాలలో ఖండోబాకు అంకితం చేయబడిందని ఒక వాదన ముందుకు వచ్చింది. బ్రిటిష్ వారిలాగే భారతీయ కార్మికులు కూడా విశ్రాంతి,  పూజ కోసం ఒక రోజును కలిగి ఉండాలి. 1700 సంవత్సరాల చరిత్ర.. ఆదివారాన్ని విశ్రాంతి దినంగా చేయడం అనేది  భారతదేశంలో పుట్టినది కాదు. దీని చరిత్ర చాలా కాలం నాటిది. 321 ADలో, రోమన్ చక్రవర్తి కాన్‌స్టాంటైన్ ది గ్రేట్ మొదట ఆదివారాన్ని రోమన్ సామ్రాజ్యం అంతటా విశ్రాంతి దినంగా ప్రకటించాడు. క్రమంగా ఈ సంప్రదాయం యూరప్,  తరువాత బ్రిటన్ పరిపాలనా వ్యవస్థలో భాగమైంది.  వారు దానిని భారతదేశానికి తీసుకువచ్చారు. అంతే తప్ప భారతీయులకు ప్రత్యేకంగా ఈ ఆదివారం సెలవు వెనుక ఎలాంటి ప్రాధాన్యత లేదు.                                        *రూపశ్రీ.
 భారతదేశ  పరిమళం ఇప్పుడు సప్త సముద్రాల ఆవలి దేశాల వాతావరణంతో మేళవిస్తోంది. ఆ దేశాల సంస్కృతులు, సంప్రదాయాలు మనకంటే పూర్తిగా భిన్నమైనవి. మనం మన పెరటి మొక్కగా అంతకంటే ఎక్కువ ఇంటి దేవతగా  భావించి, ప్రతి ఉదయం, సాయంత్రం నీళ్ళు పోసి పూజించే  తులసి, ఇప్పుడు ప్రపంచంలోని ప్రధాన ముస్లిం దేశాల మొదటి ఎంపికగా మారింది. ఈ మాట తెలియగానే చాలామందికి ఆశ్చర్యం వేస్తుంది.  కానీ  ఇటీవలి డేటా , వాణిజ్య నివేదికలు ఒక ఆశ్చర్యకరమైన నిజాన్ని వెల్లడించాయి. బంగ్లాదేశ్, మలేషియా , ఇండోనేషియా వంటి దేశాలలో భారతీయ తులసికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇది కేవలం వాణిజ్యానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, భారతీయులుగా తెలుసుకోవాల్సిన విషయం. తులసిని కేవలం మొక్కగా బావించే ఎంతోమంది విదేశీయులు కూడా తులసికి ఎందుకంత గొప్ప ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. విదేశాలలో తులసి.. సనాతన ధర్మంలో, తులసిని కేవలం ఒక మొక్కగా మాత్రమే కాకుండా, "సాక్షాత్తు లక్ష్మీదేవి" స్వరూపంగా భావిస్తారు. పెరట్లో తులసి ఉన్న ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశించలేదని శాస్త్రాలు చెబుతున్నాయి. కానీ నేడు, ఈ నమ్మకం అన్ని హద్దులను దాటింది. ఇటీవలి నివేదికల ప్రకారం, తులసి,  దాని సారాలు భారతదేశం నుండి పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ , మలేషియా వంటి ఆగ్నేయాసియా దేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతి అవుతున్నాయి. ఆశ్చర్యకరంగా, ఈ దేశాలు దీనిని కేవలం ఒక మొక్కగా మాత్రమే కాకుండా, ఒక "దివ్య ఔషధం"గా స్వీకరిస్తున్నాయి. విదేశాలలో తులసికి ఆదరణ.. విదేశాలలో తులసి ఆదరణ  వెనుక విజ్ఞానం  ఆధ్యాత్మికతల కలయికను ప్రతిబింబించే అనేక లోతైన , తార్కిక కారణాలు ఉన్నాయి. నయంకాని వ్యాధులకు సర్వరోగ నివారిణిగా తులసి పనిచేస్తుంది. ఈ దేశాలలో ఆయుర్వేదంపై నమ్మకం పెరిగింది. అక్కడి శాస్త్రవేత్తలు కూడా క్యాన్సర్, మధుమేహం , శ్వాసకోశ వ్యాధుల చికిత్సలో తులసి ప్రభావవంతంగా పనిచేస్తుందని గుర్తించి దాన్ని వైద్యంలో భాగం చేస్తున్నారట. హలాల్ గుర్తించిన మూలిక.. మలేషియా , ఇండోనేషియా వంటి దేశాలలో, "హలాల్" ఉత్పత్తులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తులసి ఉత్పత్తులు సహజమైనవి , స్వచ్ఛమైనవి, వీటిలో నిషేధిత రసాయనాలు ఏవీ ఉండవు. ఈ కారణంగానే అక్కడి ముస్లిం సమాజంలో వీటికి ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. తులసి టీ.. భారతీయ "తులసి టీ" కి ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రజలు కెఫిన్‌ను వదిలిపెట్టి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి , రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి తులసి సారాన్ని ఆశ్రయిస్తున్నారు. తులసితో టీ తయారు చేసుకుని తాగుతున్నారు. మతపరమైన దృక్కోణం నుండి చూస్తే ప్రతి భారతీయుడు దీన్ని  గర్వంగా భావించాలి. మనం విష్ణువుకు ఎంతో ప్రతీకరమైనదిగా  పిలుచుకునే మొక్క పరిమళం ఇప్పుడు విభిన్నమైన ప్రార్థనా పద్ధతులున్న ఇళ్లకు చేరుతోంది. సనాతన సంస్కృతి పూజించే ప్రకృతిలోని ప్రతి అంశం మానవులకు ఎంతో మేలు చేసేది, ఆరోగ్యం చేకూర్చేది అనేటువంటి దానికి ఇదొక నిదర్శనం.   ప్రపంచ మార్కెట్లో తులసికి ప్రాధాన్యత.. భవిష్యత్తులో తులసి ప్రపంచ మూలికా మార్కెట్‌కు బిలియన్ల డాలర్ల మేర దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. గత మూడేళ్లలో గల్ఫ్ దేశాలకు తులసి ఎగుమతులు 30-40% పెరిగాయట. దుబాయ్ , సౌదీ అరేబియాలోని విలాసవంతమైన స్పా మరియు బ్యూటీ పార్లర్లలో ఇప్పుడు తులసి ఆధారిత ఫేస్ మాస్క్‌లు , నూనెలను ప్రీమియం ట్రీట్మెంట్ లో భాగంగా గా అందిస్తున్నారట. భారతీయులకు ఎంతో పవిత్రమైన,  ఆయుర్వేదంలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నట్టు పేర్కొన్న తులసిని భారతీయులు చిన్నతనం చేయకుండా ఉపయోగించుకోవాలి.                                      *రూపశ్రీ.
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో, మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది శరీరానికి కావలసిన పోషకాలను సరిగ్గా అందజేయలేకపోతున్నారు. ఈ క్రమంలో శరీరంలో విటమిన్లు, ఖనిజాల లోపాన్ని భర్తీ చేయడానికి చాలామంది ఆశ్రయించేది "మల్టీవిటమిన్ టాబ్లెట్లు" (Multivitamin Tablets). అయితే, ఈ టాబ్లెట్లను ఎప్పుడు వాడాలి? ఎలా వాడాలి? ఎక్కువగా వాడితే ఎలాంటి నష్టాలు జరుగుతాయి? అనే విషయాలపై ప్రముఖ వైద్యులు డాక్టర్ లక్ష్మి కోన గారు అందించిన పూర్తి వివరాలు ఈ VIDEO ద్వారా తెలుసుకుందాం. మల్టీవిటమిన్ టాబ్లెట్ల ఉపయోగాలు (Uses of Multivitamins) మన శరీరంలో వివిధ అవయవాలు సక్రమంగా పనిచేయడానికి, రోగనిరోధక శక్తి బలంగా ఉండటానికి విటమిన్లు ఎంతగానో తోడ్పడతాయి. మల్టీవిటమిన్ల వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలు: పోషకాహార లోపాన్ని భర్తీ చేయడం: మనం తినే ఆహారంలో లోపించిన ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్‌ను ఇవి శరీరానికి అందిస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుదల (Immunity Boost): విటమిన్ C, D, మరియు జింక్ వంటి పోషకాలు శరీరంలో ఇమ్యూనిటీని పెంచి, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. శక్తిని అందించడం (Energy Levels): విటమిన్ B-కాంప్లెక్స్ శరీరంలో ఆహారాన్ని శక్తి గా మార్చడంలో సహాయపడుతుంది, దీనివల్ల అలసట, నీరసం తగ్గుతాయి. చర్మం, జుట్టు ఆరోగ్యం: విటమిన్ E, బయోటిన్ వంటివి చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఎముకల బలం: క్యాల్షియం మరియు విటమిన్ D కలిసిన మల్టీవిటమిన్లు ఎముకలను, దంతాలను దృఢంగా ఉంచుతాయి. సరైన డోసేజ్ మరియు వేసుకునే విధానం (Correct Dosage & Guidelines) మల్టీవిటమిన్లను ఎప్పుడు పడితే అప్పుడు, ఎన్ని పడితే అన్ని వేసుకోకూడదు. వాటికంటూ ఒక పద్ధతి ఉంటుంది: మల్టీవిటమిన్ టాబ్లెట్లను సాధారణంగా ఉదయం లేదా मధ్యాహ్నం భోజనం తర్వాత వేసుకోవడం మంచిది. పరగడుపున (ఖాళీ కడుపుతో) వేసుకుంటే కొంతమందిలో కడుపులో మంట లేదా వికారం కలగవచ్చు. కొన్ని విటమిన్లు (A, D, E, K) కొవ్వులో కరిగేవి (Fat-soluble vitamins). కాబట్టి, కొద్దిగా కొవ్వు పదార్థాలు ఉన్న ఆహారం తీసుకున్న తర్వాత వీటిని వేసుకుంటే శరీరం బాగా గ్రహిస్తుంది. ఎల్లప్పుడూ డాక్టర్ సూచించిన డోస్ మాత్రమే వాడాలి. సొంత నిర్ణయాలతో రోజుకు ఒకటి కంటే ఎక్కువ టాబ్లెట్లు వేసుకోకూడదు. జాగ్రత్త: మితిమీరిన విటమిన్ల వాడకం  చాలామంది మల్టీవిటమిన్లు ఆరోగ్యానికి మంచిదే కదా అని విపరీతంగా వాడుతుంటారు. కానీ, డాక్టర్ లక్ష్మి కోన గారి ప్రకారం, విటమిన్లు ఎక్కువైతే "విటమిన్ టాక్సిసిటీ" (Vitamin Toxicity / Hypervitaminosis) అనే ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా విటమిన్ A, D, E, K లు శరీరంలో పేరుకుపోయి కాలేయం (Liver) మరియు మూత్రపిండాల (Kidneys) పై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు, విటమిన్ D ఎక్కువైతే శరీరంలో క్యాల్షియం పెరిగిపోయి కిడ్నీలో రాళ్లు (Kidney Stones) ఏర్పడే అవకాశం ఉంది. అలాగే విటమిన్ A ఎక్కువైతే తలనొప్పి, వాంతులు మరియు కాలేయ సమస్యలు రావచ్చు. దుష్ప్రభావాలు (Side Effects) సాధారణంగా పరిమితికి లోబడి వాడినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ కొంతమందిలో క్రింది లక్షణాలు కనిపించవచ్చు: కడుపులో అశాంతి, వికారం లేదా వాంతులు. మలబద్ధకం (Constipation) లేదా విరేచనాలు (Diarrhea) - ముఖ్యంగా ఐరన్ (Iron) ఎక్కువగా ఉన్న మల్టీవిటమిన్ల వల్ల మలం నల్లగా రావడం మరియు మలబద్ధకం జరుగుతుంది. నోటిలో వింత రుచి (Metallic Taste). ఇతర మందులతో పరస్పర చర్యలు (Drug Interactions) మీరు ఇప్పటికే ఇతర ఆరోగ్య సమస్యల కోసం మందులు వాడుతుంటే, మల్టీవిటమిన్లు వేసుకునే ముందు జాగ్రత్త వహించాలి: యాంటీబయాటిక్స్: మల్టీవిటమిన్లలో ఉండే క్యాల్షియం, ఐరన్, జింక్ వంటి మినరల్స్ కొన్ని రకాల యాంటీబయాటిక్స్ (ఉదాహరణకు Tetracyclines) శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. కాబట్టి వీటి మధ్య కనీసం 2 గంటల వ్యవధి ఉండాలి. బ్లడ్ థిన్నర్స్ (రక్తాన్ని పలచబరిచే మందులు): విటమిన్ K రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది. ఒకవేళ మీరు రక్తాన్ని పలచబరిచే మందులు (Warfarin వంటివి) వాడుతుంటే, విటమిన్ K ఉన్న మల్టీవిటమిన్లు వాటి పనితీరును దెబ్బతీస్తాయి. చివరిగా:-  మల్టీవిటమిన్ టాబ్లెట్లు అనేవి సమతుల్య ఆహారానికి ప్రత్యామ్నాయం కావు.. సహజసిద్ధమైన పండ్లు, కూరగాయలు, ఆకుకూరల ద్వారా వచ్చే పోషకాలే శరీరానికి అత్యంత శ్రేష్ఠమైనవి.  మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
గుండె మానవ శరీరంలో అత్యంత కీలకమైన అవయవం, ఇది శరీరమంతటికీ ఆక్సిజన్ , పోషకాలను అందించడానికి నిరంతరం రక్తాన్ని పంపింగ్ చేస్తుంది. అయితే, మారుతున్న జీవనశైలి, ఒత్తిడి,  ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం,  శారీరక శ్రమ లేకపోవడం వల్ల గుండె జబ్బుల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గుండె సమస్యలు వచ్చే వారిలో మొదట్లోనే చిన్న చిన్న లక్షణాలుగా కనిపిస్తాయి. కానీ చాలామంది వీటిని పెద్దగా పట్టించుకోరు.  ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ లక్షణాలను ముందుగానే గుర్తించడం వల్ల తీవ్రమైన గుండె జబ్బులను , గుండెపోటు వంటి ప్రాణాంతక పరిస్థితులను నివారించవచ్చు. శరీరంలో ఏ లక్షణాలు గుండె జబ్బులను సూచిస్తాయో.. ఆ లక్షణాలు మీకు ఉన్నాయేమో ఒక్కసారి చెక్ చేస్కోండి.. ఛాతీ నొప్పి.. ఛాతీ నొప్పి, బిగుతుగా అనిపించడం, బరువుగా ఉండటం లేదా ఒత్తిడి వంటివి గుండె జబ్బు  అత్యంత సాధారణ లక్షణాలు. ఈ నొప్పి కొన్ని నిమిషాల పాటు ఉండవచ్చు లేదా పదేపదే రావచ్చు. కొన్నిసార్లు ఈ నొప్పి భుజం, మెడ, వీపు లేదా చేతికి కూడా వ్యాపించవచ్చు. ఇలా పదేపదే జరుగుతుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఊపిరి ఆడకపోవడం.. మెట్లు ఎక్కేటప్పుడు  విపరీతమైన అలసటగా లేదా ఆయాసంగా అనిపిస్తే, అది గుండె బలహీనతకు సంకేతం కావచ్చు. గుండె సరిగ్గా రక్తాన్ని పంప్ చేయలేనప్పుడు, ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరిగి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. అలసట, బలహీనత.. విశ్రాంతి తీసుకున్నప్పటికీ నిరంతరం అలసటగా అనిపిస్తుంటే, దానిని సాధారణ బలహీనతగా భావించి నిర్లక్ష్యం చేయకూడదు.  గుండె పనితీరు తగ్గినప్పుడు, శరీర భాగాలకు తగినంత ఆక్సిజన్ అందదు, దీనివల్ల అలసట , నీరసం ఏర్పడుతుంది. హృదయ స్పందన.. గుండె కొట్టుకునే వేగంలో ఆకస్మిక పెరుగుదల లేదా తగ్గుదల గుండె సమస్యకు సంకేతం కావచ్చు.  ఈ పరిస్థితి పదేపదే ఏర్పడుతుంటే వైద్య పరీక్ష చేయించుకోవడం చాలా అవసరం.                                        *రూపశ్రీ.
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం అనేది ఒక సవాలుగా మారింది. ముఖ్యంగా 30-32 ఏళ్ల చిన్న వయసులోనే జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూనో, ఫంక్షన్లలో డ్యాన్స్ చేస్తూనో అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్న వార్తలు మనల్ని కలచివేస్తున్నాయి. ఆసుపత్రికి వెళ్తే స్టెంట్ వేయాలని లేదా డయాలసిస్ చేయాలని చెప్పినప్పుడు ఆ కుటుంబం పడే వేదన వర్ణనాతీతం. కానీ, ప్రకృతి ప్రసాదించిన ఆహార నియమాలతో, ఆపరేషన్లు లేకుండానే గుండె బ్లాకులను తొలగించుకోవచ్చని మరియు కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని డాక్టర్ శ్రీనివాస్ గుప్త గారు ఈ VIDEO లో వివరించారు. మనం ఈ మార్పును ఎందుకు ఎంచుకోవాలి? (Why Should We?) సాధారణంగా గుండెలో బ్లాక్స్ ఉన్నాయని తెలిస్తే వెంటనే సర్జరీ వైపు మొగ్గు చూపుతాము. అయితే, సహజ సిద్ధమైన పద్ధతుల ద్వారా శరీరానికి ఎటువంటి హాని కలగకుండా ఆరోగ్యాన్ని తిరిగి పొందవచ్చు. సర్జరీ భయం లేకుండా: స్టెంట్ లేదా బైపాస్ సర్జరీల అవసరం లేకుండానే 20% నుండి 40% వరకు బ్లాకులను సహజంగా తగ్గించుకోవచ్చు. దుష్ప్రభావాలు లేని వైద్యం: ఎటువంటి ఇంజెక్షన్లు లేదా కెమికల్ మెడిసిన్స్ లేకుండా కేవలం కూరగాయల రసాలు మరియు ఆయుర్వేద పద్ధతులతో చికిత్స పొందవచ్చు. సమగ్ర ఆరోగ్యం: ఇది కేవలం గుండెకే కాదు, షుగర్, బీపీ, మరియు కిడ్నీ సమస్యలను కూడా ఒకేసారి అదుపులోకి తెస్తుంది. ఏమి చేయకూడదు? (What Not to Do?) ఆరోగ్యంగా ఉండాలంటే మందుల కన్నా ముందు కొన్ని అలవాట్లకు దూరంగా ఉండటం ముఖ్యం: నూనె వాడకం: నూనెతో వేయించిన పదార్థాలను (Oil-fried foods) పూర్తిగా పక్కన పెట్టాలి. ప్రిజర్వేటివ్స్ మరియు సాల్ట్: బ్రెడ్, నూడిల్స్, బేకరీ ఫుడ్స్ వంటి వాటిలో ఉప్పు మరియు ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి, ఇవి బీపీని మరియు కిడ్నీ సమస్యలను పెంచుతాయి. తెల్ల అన్నం మరియు గోధుమలు: కనీసం మూడు నెలల పాటు వైట్ రైస్ మరియు గోధుమలను దూరం పెట్టి, సిరిధాన్యాలు లేదా బార్లీ రొట్టెలు తీసుకోవాలి. పొగత్రాగడం: గుండె సమస్యలకు ప్రధాన కారణమైన స్మోకింగ్ వంటి అలవాట్లను తక్షణమే మానేయాలి. ఆరోగ్యాన్ని తిరిగి పొందే మార్గం (How to do?) డాక్టర్ శ్రీనివాస్ గుప్త గారు సూచించిన ఈ చిట్కాలను మీ దైనందిన జీవితంలో భాగం చేసుకోండి: 9 వారాల జ్యూస్ థెరపీ: మొదటి వారం: ఉదయాన్నే ఖాళీ కడుపుతో బూడిద గుమ్మడికాయ జ్యూస్ (200 ml). రెండో వారం: సొరకాయ జ్యూస్. మూడో వారం: కీరా (కుకుంబర్) జ్యూస్. ఈ విధంగా ఈ మూడు వారాల చక్రం 9 వారాల పాటు (మొత్తం 3 సార్లు) కొనసాగించాలి. ఆహార నియమాలు (Plate 1 & Plate 2): మొదటి ప్లేట్‌లో కేవలం పండ్లు (బ్లూబెర్రీస్, ఆపిల్, జామకాయ) మరియు మొలకలు తీసుకోవాలి. రెండవ ప్లేట్‌లో నూనె లేకుండా వండిన కూరలు, బార్లీ లేదా రాగి రొట్టెలు తీసుకోవాలి. కిడ్నీ మరియు బీపీ కోసం సహజ టీలు: కొలెస్ట్రాల్ తగ్గడానికి దాల్చిన చెక్క నీళ్లు తాగాలి. బీపీ అదుపులో ఉండటానికి కరివేపాకు డికాక్షన్ తీసుకోవాలి. కిడ్నీ సమస్యలు ఉన్నవారు 5 వేపాకులు, 3 రావి ఆకులను నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగడం ద్వారా క్రియాటినిన్ స్థాయిలు తగ్గుతాయి. జీవనశైలి మార్పులు: సాయంత్రం 7 గంటల లోపే డిన్నర్ పూర్తి చేయాలి. ప్రతిరోజూ చెప్పులు లేకుండా నడవాలి (Barefoot walking), దీనివల్ల పాదాలలోని ఆక్యుప్రెషర్ పాయింట్లు స్టిమ్యులేట్ అవుతాయి. సాధారణ సందేహాలు (Q&A) ప్ర: డయాలసిస్ ఆపడం సాధ్యమేనా?  జ: అవును, సహజ ఆహారం మరియు వేపాకు, రావి ఆకుల కషాయం వంటి నాచురల్ ట్రీట్‌మెంట్ ద్వారా క్రియాటినిన్ తగ్గించి డయాలసిస్ అవసరం లేకుండా చేయవచ్చని డాక్టర్ గారు అబ్సర్వ్ చేశారు. ప్ర: ఆయిల్ లేకుండా వంటలు రుచిగా ఉంటాయా?  జ: ఖచ్చితంగా! ఇడ్లీ కుక్కర్‌లో స్టీమ్ చేసిన మిర్చి బజ్జీలు లేదా బొండాలు వంటి వాటిని నూనె లేకుండానే ఎంతో రుచిగా చేసుకోవచ్చు. ప్ర: హార్ట్ హెల్త్‌ను ఎలా చెక్ చేసుకోవాలి?  జ: 40 ఏళ్లు దాటిన వారు కనీసం 4-5 ఏళ్లకు ఒకసారి 'సిటీ కరోనరీ యాంజియోగ్రామ్' (CT Coronary Angiogram) చేయించుకోవాలి. AI సాయంతో కేవలం 2 నిమిషాల్లోనే రిపోర్ట్ వస్తుంది.   మరిన్ని వివరాల కోసం మీరు సంప్రదించవలసిన నెంబర్స్ : INDIA : + 917070999313  USA : +1(732)947-4166     మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!